మైసూరు కళా దివస్‌లో వసుంధరోత్సవ– 2024 పేరుతో 10 రోజుల మెగా క్లాసికల్ డ్యాన్స్‌మహోత్సవం జరిగింది. మెగా క్లాసికల్ డ్యాన్స్ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో 550 మందికి పైగా నృత్యకారులు పాల్గొన్నారు. నృత్యకళాకారిణి వసుంధర దొరస్వామి 75వ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంత మంది నృత్యకళాకారులు పాల్గొన్న ఈ వేడుక ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంది.
ఈ నృత్యరూపకానికి ప్రఖ్యాత నృత్య కళాకారిణి వసుంధర దొరస్వామి నృత్య దర్శకత్వం వహించారు. నృత్యకారులలో ఆమె విద్యార్థులే కాకుండా ఇతర గురువుల వద్ద నృత్యం నేర్చుకున్న వారు కూడా తమ కళను ప్రదర్శించాను. మైసూరు కళా దివస్ పేరుతో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి చెందిన దత్త విజయానంద తీర్థ స్వామి, సుత్తూరు మఠానికి చెందిన శివరాత్రి దేశికేంద్ర స్వామి, మైసూరు ఎంపీ యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్, సంగీత అకాడమీ పీఠాధిపతి సంధ్యా పురేచ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన శివరాత్రి దేశికేంద్ర స్వామి మాట్లాడుతూ ‘యోగా మాదిరిగానే భారతనాట్యం కూడా ఈ దేశం ప్రపంచానికి అందించింది. వసుంధర దొరస్వామి భరతనాట్యానికి చేసిన కృషికి, ప్రపంచ స్థాయిలో గొప్ప, ప్రాచీన నృత్య రూపాన్ని ప్రోత్సహించారు’ అని ప్రశంసించాడు. మైసూరు కళా దివస్ వసుంధర పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్ నిర్వహించిన శాస్త్రీయ నృత్యం ఇది.
వసుంధర దొరస్వామికి భరతనాట్యానికి 50 ఏళ్లుగా చేస్తున్న సేవను పురస్కరించుకొని ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో మైసూరులోని కళాకారులు, నృత్య గురువులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులూ పాల్గొన్నారు. ఈ ఉత్సవం భరతనాట్యానికి అంకితం చేస్తుమన్నామని వివరించారు.
క్లాసికల్ డ్యాన్స్ మహోత్సవ్!
Comments
Please login to add a commentAdd a comment