జై లవకుశలో మరో సర్ప్రైజ్ | Ntr Classical Dance In Jai Lava Kusa | Sakshi
Sakshi News home page

జై లవకుశలో మరో సర్ప్రైజ్

Published Sun, May 14 2017 3:16 PM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

జై లవకుశలో మరో సర్ప్రైజ్

జై లవకుశలో మరో సర్ప్రైజ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జై లవకుశ. జనతా గ్యారేజ్ సినిమాతో కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ సాధించిన ఎన్టీఆర్.. బాబీ దర్శకత్వంలో ఈ సినిమాలో నటిస్తున్నాడు. తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న ఎన్టీఆర్, అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇవ్వనున్నాడట.  స్వతహాగా కూచిపూడి డాన్సర్ అయిన ఎన్టీఆర్, ఇంత వరకు పూర్తి స్థాయి క్లాసికల్ డ్యాన్సర్గా తన టాలెంట్ చూపించలేదు. అయితే జై లవకుశ సినిమాలో ఆ అవకాశం వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాల్లో ఎన్టీఆర్ క్లాసికల్ డ్యాన్సర్గా కనిపించనున్నాడు. చిన్న వయసులో ఎన్నో స్టేజ్ షోస్ చేసిన ఎన్టీఆర్.. జై లవకుశ సినిమా కోసం తెరపై తొలిసారిగా పూర్తి స్థాయి క్లాసికల్ డ్యాన్సర్గా కనిపిస్తున్నాడన్న టాక్ టాలీవుడ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మే 19 సాయంత్రం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement