
సాక్షి, హైదరాబాద్ : ఏపీఐఐసీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అద్భుతమైన నాట్యంతో ఆహుతులను అలరించారు. శనివారం రవీంద్రభారతిలో ఆమె ప్రదర్శించిన ‘నవ జనార్దన పారిజాతం’ నృత్య ప్రదర్శనతో అందర్ని ఆకట్టుకున్నారు. లైఫ్ ఎన్ లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నాట్య గురువు కళాకృష్ణ నేతృత్వంలో ఆర్కే రోజా, సీఎస్ సుభారాజేశ్వరిలచే ప్రదర్శించిన నవ జనాదర్దన పారిజాతం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆంధ్రా నాట్య ప్రదర్శన నయన మనోహరంగా సాగింది.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలతో దైవం ఉంటుందని అన్నారు. ఏపీ సాహిత్య అకాడమి చైర్మన్ లక్ష్మీపార్వతి, తెలంగాణ సంగీత నాటక అకాడమి చైర్మన్ శివకుమార్, సినీ దర్శకుడు సెల్వమణి, ఫౌండేషన్ జనరల్ ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వరి, సంయుక్త కార్యదర్శి టికె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.