సాక్షి, విజయవాడ: చంద్రబాబు అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటారని, ఆయన జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి రోజా అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు జైలుకెళ్లితే ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందన్నారు. ‘‘రూ.118 కోట్ల ముడుపుల కేసులో విచారణ ఎదుర్కోనే దమ్ముందా లేదా..?. విచారణ ఎదుర్కొంటాడా లేక బాలకృష్ణలా మెంటల్ సర్టిఫికెట్ తెచుకుంటాడా..?’’ అంటూ రోజా మండిపడ్డారు.
‘‘విజయ్ మల్యాలా విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు, లోకేష్‌లను జైలులో పెడితేనే ప్రజలకు మేలు. బాబు అడ్డంగా దొరికిపోయినప్పుడు సింపతి డ్రామాలు ఆడటం అలవాటు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి రాష్ట్రానికి పారిపోయి వచ్చాడు. చంద్రబాబు మీద అలిపిరిలో బాంబు పేలినప్పుడే ఆయనకి సింపతి రాలేదు. బాబు అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది.’’ అని మంత్రి పేర్కొన్నారు.
‘‘2019లో ఎన్నికల ముందు మోదీ నన్ను అరెస్ట్ చేస్తారని సింపతి డ్రామా ఆడింది చంద్రబాబు కాదా?. చంద్రబాబుని కచ్చితంగా అరెస్ట్ చేయాలి. బాబుని ముడుపుల కేసులో సీబీఐ, ఈడీ విచారించాలి’’ అని మంత్రి రోజా డిమాండ్ చేశారు.
చదవండి: ఎక్కడి దొంగలు.. అక్కడే!
Comments
Please login to add a commentAdd a comment