కె విశ్వనాథ్ సేవలు వెలకట్టలేనివి: మంత్రి రోజా | AP Minister Roja visit the family of late Tollywood Director K Vishwanath | Sakshi
Sakshi News home page

K Vishwanath: తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు: మంత్రి రోజా

Published Sat, Feb 4 2023 7:56 PM | Last Updated on Sat, Feb 4 2023 9:27 PM

AP Minister Roja visit the family of late Tollywood Director K Vishwanath - Sakshi

దివంగత టాలీవుడ్ కళాతపస్వి కె విశ్వనాథ్ కుటుంబాన్ని ఏపీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని ఆమె కొనియాడారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్బంగా వారికి ధైర్యం చెప్పారు. అనంతరం కె విశ్వనాథ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..' విశ్వనాథ్ లేరంటే ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ఆయన సినిమా పరిశ్రమకు చేసిన సేవలు వెలకట్టలేనివి. తెలుగు సినిమాల ద్వారా ఆయన సాహిత్యానికి చేసిన సేవ ఇంకెవరూ చేయలేరు. ఆయన  సినిమాల్లో తెలుగుదనం, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా చేశారు. ఆయన సినిమాలు ఓ మెసేజ్ అందిస్తాయి. ఒక దర్శకుడిగా, నటుడిగా ఆయన ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. అందరూ ఆదర్శవంతంగా ఆయనను చూసి నేర్చుకునేలా జీవించారు.' అని అన్నారు. 

అనంతరం మాట్లాడుతూ..' ఆయనని చూసిన వెంటనే గురువును చూసినట్టే భయం వేస్తుంది. నిజంగా ఆయన జీవితం పరిపూర్ణం. ఈరోజు ఆయన ఆత్మకు శాంతి కలగాలని అందరూ కోరుకోవాలి. తెలుగు నెల ఉన్నంత వరకు తెలుగు వారంతా అభిమానించే విశ్వనాథ్ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవను గుర్తించి ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించింది. ఆయన కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement