
మన కథాకళికి పాప్ పాట జత చేస్తే ఎలా ఉంటుంది? రెండు కళ్లు చాలనంత అద్బుతంగా ఉంటుందని చెప్పడానికి ఈ వైరల్ వీడియోనే సాక్ష్యం. అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ గోమెజ్, నైజీరియన్ సింగర్, ర్యాపర్ రెమోల ‘బేబీ కామ్‌డౌన్’ పాట సెన్సేషనల్ గ్లోబల్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు తమదైన క్రియేటివ్ ట్విస్ట్ ఇస్తున్నారు కళాకారులు.
మనదేశం విషయానికి వస్తే... ముగ్గురు మహిళా డ్యాన్సర్లు ‘బేబి కామ్‌డౌన్’ పాటకు వేసిన కథాకళీ స్టెప్పులు ‘వారెవా’ అనిపించాయి. ముఖ్యంగా వారి ఎక్స్‌ప్రెషన్స్ ‘అదరహో’ అన్నట్లుగా ఉన్నాయి. డ్యాన్సర్ శెయాలి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 10 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. క్లాసిక్+వెస్ట్రన్ =ఫైర్ అని నెటిజనులు స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment