
ఆ రాష్ట్రంలోని మహిళలకు ఇది నిజంగా పండగలాంటి వార్తే. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ నెలకు రూ.1,250 అందుకుంటున్న మహిళలు ఇకపై నెలకు రూ. 3,000 తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ‘లాడ్లీ బహనోం’ యోజన కింద రాష్ట్రంలోని 1.27 మహిళల ఖాతాల్లోకి రూ. 1553 కోట్ల మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసిన సీఎం ఈ ప్రకటన చేశారు.
మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా పీపల్‌రవా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు ఇక చింతించవసరం లేదన్నారు. తాము ప్రవేశపెట్టిన ‘లాడ్లీ బహనోం’ పథకంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, మహిళల ఖాతాల్లోకి ప్రతీనెలా డబ్బులు వేయరని చెబుతున్నారని ఆరోపించారు. తాము ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని విడిచిపెట్టబోమన్నారు. ఇదేవిధంగా తాము రాష్ట్రంలోని 74 లక్షల సోదరీమణులు ఖాతాల్లోకి గ్యాస్ సిలిండర్ల మొత్తాన్ని నెలకు రూ. 450 చొప్పున జమచేస్తున్నామన్నారు.
ఇప్పటివరకూ రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ.1,250 మొత్తాన్ని ఇస్తూ వచ్చామని, దీనిని రూ. 3000 వరకూ పెంచుతామని ప్రకటించారు. ఇదే కార్యక్రమంలో సీఎం 56 లక్షల సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులు ఖాతాల్లోకి రూ. 337 కోట్లను, 81 మంది రైతుల ఖాతాల్లోకి 1,624 కోట్లను ట్రాన్స్‌ఫర్ చేశారు. రూ. 144.84 కోట్ల విలువైన 53 అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం మోహన్ యాదవ్ శంకుస్థాపన చేశారు.
ఇది కూడా చదవండి: BSNL నుంచి అదిరిపోయే ప్లాన్.. 365 రోజులు.. రోజుకు రూ. 3 మాత్రమే