మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ తండ్రి కన్నుమూత | Poonam Chand Yadav Dies at age of 100 | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ తండ్రి కన్నుమూత

Published Wed, Sep 4 2024 8:42 AM | Last Updated on Wed, Sep 4 2024 9:49 AM

Poonam Chand Yadav Dies at age of 100

భోపాల్‌: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ తండ్రి పూనమ్ చంద్ యాదవ్(100)  కన్నుమూశారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉజ్జయినిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

తన తండ్రి మృతి గురించి సీఎం మోహన్ యాదన్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘పూనంచంద్ యాదవ్ జీ మరణం నా జీవితంలో ఒక పూడ్చలేని నష్టం. నా తండ్రి నేర్పిన నైతిక విలువలు, సూత్రాలతో  నేను గౌరవప్రదమైన మార్గంలో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాను. మీ జ్ఙాపకాలు ఎల్లప్పుడూ మాతో ఉంటాయి’ అని పేర్కొన్నారు.

దీనికి ముందు తన తండ్రి పూనమ్ చంద్ యాదవ్ మరణ వార్త విన్న ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భోపాల్ నుండి ఉజ్జయిని చేరుకున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పూనమ్ చంద్ యాదవ్ అంత్యక్రియలను బుధవారం ఉజ్జయినిలో నిర్వహించనున్నారు. కాగా పూనమ్‌ చంద్‌ యాదవ్‌ మృతికి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement