Mohan Yadav
-
Madhya Pradesh: మహిళలకు నెలకు రూ. 3000.. సీఎం ప్రకటన
ఆ రాష్ట్రంలోని మహిళలకు ఇది నిజంగా పండగలాంటి వార్తే. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ నెలకు రూ.1,250 అందుకుంటున్న మహిళలు ఇకపై నెలకు రూ. 3,000 తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ‘లాడ్లీ బహనోం’ యోజన కింద రాష్ట్రంలోని 1.27 మహిళల ఖాతాల్లోకి రూ. 1553 కోట్ల మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసిన సీఎం ఈ ప్రకటన చేశారు.మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లా పీపల్‌రవా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో సీఎం డాక్టర్ మోహన్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలు ఇక చింతించవసరం లేదన్నారు. తాము ప్రవేశపెట్టిన ‘లాడ్లీ బహనోం’ పథకంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, మహిళల ఖాతాల్లోకి ప్రతీనెలా డబ్బులు వేయరని చెబుతున్నారని ఆరోపించారు. తాము ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని విడిచిపెట్టబోమన్నారు. ఇదేవిధంగా తాము రాష్ట్రంలోని 74 లక్షల సోదరీమణులు ఖాతాల్లోకి గ్యాస్ సిలిండర్ల మొత్తాన్ని నెలకు రూ. 450 చొప్పున జమచేస్తున్నామన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ.1,250 మొత్తాన్ని ఇస్తూ వచ్చామని, దీనిని రూ. 3000 వరకూ పెంచుతామని ప్రకటించారు. ఇదే కార్యక్రమంలో సీఎం 56 లక్షల సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులు ఖాతాల్లోకి రూ. 337 కోట్లను, 81 మంది రైతుల ఖాతాల్లోకి 1,624 కోట్లను ట్రాన్స్ఫర్ చేశారు. రూ. 144.84 కోట్ల విలువైన 53 అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం మోహన్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఇది కూడా చదవండి: BSNL నుంచి అదిరిపోయే ప్లాన్.. 365 రోజులు.. రోజుకు రూ. 3 మాత్రమే -
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తండ్రి కన్నుమూత
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ తండ్రి పూనమ్ చంద్ యాదవ్(100) కన్నుమూశారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉజ్జయినిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.తన తండ్రి మృతి గురించి సీఎం మోహన్ యాదన్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘పూనంచంద్ యాదవ్ జీ మరణం నా జీవితంలో ఒక పూడ్చలేని నష్టం. నా తండ్రి నేర్పిన నైతిక విలువలు, సూత్రాలతో నేను గౌరవప్రదమైన మార్గంలో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాను. మీ జ్ఙాపకాలు ఎల్లప్పుడూ మాతో ఉంటాయి’ అని పేర్కొన్నారు.దీనికి ముందు తన తండ్రి పూనమ్ చంద్ యాదవ్ మరణ వార్త విన్న ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భోపాల్ నుండి ఉజ్జయిని చేరుకున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పూనమ్ చంద్ యాదవ్ అంత్యక్రియలను బుధవారం ఉజ్జయినిలో నిర్వహించనున్నారు. కాగా పూనమ్ చంద్ యాదవ్ మృతికి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం వ్యక్తం చేశారు. -
యూపీ సీఎం బాటలో ఎంపీ సీఎం.. నిందితుని ఇంటిపైకి బుల్డోజర్!
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర పాలనలో అనుసరిస్తున్న విధానాలను ఇప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఫాలో చేస్తున్నారు. ఇందు తాజాగా ఒక ఉదాహరణ మన ముందుకొచ్చింది.మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో మైనర్ బాలిక హత్యకేసులో ప్రధాన నిందితుని ఇంటిపైకి ప్రభుత్వ ఆదేశాలతో బుల్డోజర్ దూసుకెళ్లింది. నిందితుని ఇంటిని బుల్డోజర్ సాయంతో పూర్తి స్థాయిలో కూల్చివేశారు. ఈ ఉదంతం బిర్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని దామోహ్ మేట్లో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు తన స్నేహితునితో కలిసి మేటీ గ్రామానికి చెందిన మైనర్ బాలికను హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని ఒక నర్సరీలో పడేశారు. స్థానికులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. దీనికి ముందు ఆ బాలిక అమ్మమ్మ మృతదేహం అనుమానాస్పద స్థితిలో ఒక బావిలో లభ్యమైంది. ఈ కేసులో ఆ బాలిక (మృతురాలు) కోర్టులో మే 17న సాక్ష్యం చెప్పాల్సి ఉండగా, ఇంతలోనే హత్యకు గురయ్యింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజనాభివృద్ధి మండలి నిందితులను ఉరితీయాలని, వారి ఇంటిని బుల్డోజర్తో కూల్చివేయాలని డిమాండ్ చేసింది.ఈ నేపధ్యంలో నిందితుని తండ్రి యశ్వంత్‌కు చెందిన ఇంటిని అధికారులు కూల్చివేశారని తహసీల్దార్ రాజు నామ్‌దేవ్ తెలిపారు. ఆ ఇంటిని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించారని ఆయన పేర్కొన్నారు. మైనర్ బాలికను వేధించడం, హత్య చేయడం లాంటి దారుణమైన నేరాలకు పాల్పడిన నిందితులు ప్రస్తుతం జైలులో ఉన్నారని, వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని నామ్‌దేవ్ తెలిపారు. -
ప్రియాంక హక్కును రాహుల్ లాక్కున్నారా?
యూపీలోని రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీచేస్తారని భావిస్తున్న తరుణంలో అక్కడి నుంచి రాహుల్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ కూడా దాఖలు చేశారు.ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పలు ఆరోపణలు చేశారు. రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్తకు గల హక్కులను లాక్కున్నారని ఆరోపించారు. గుణ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం మోహన్ యాదవ్ ఈ ఆరోపణలు చేశారు.ఓటమి భయంతో రాహుల్ గాంధీ అమేథీ (ఉత్తరప్రదేశ్) నుంచి వయనాడ్ (కేరళ)కు పారిపోయారని కూడా మోహన్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆ పార్టీ మద్దతుదారులు పోస్టర్లు అంటించారని యాదవ్ గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే రాహుల్ గాంధీ అటు తన సోదరి ప్రియాంక, ఇటు బావ రాబర్ట్ వాద్రాల హక్కులను లాక్కున్నట్లయ్యిందని మోహన్ యాదవ్ పేర్కొన్నారు. -
మధ్యప్రదేశ్ సెక్రటేరియట్లో మంటలు
భోపాల్: మధ్యప్రదేశ్ సెక్రటేరియట్లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. సెక్రటేరియట్ భవన సముదాయం ‘వల్లభ భవన్’లోని మూడో అంతస్తులో మొదలైన మంటలు 4, 5 అంతస్తులకు కూడా వ్యాపించాయి. ఆయా అంతస్తుల్లోని ఫైళ్లు, ఇతర ఫరి్నచర్ పూర్తిగా కాలిపోయాయి. నీళ్ల ట్యాంకర్లతోపాటు సుమారు 50 అగ్ని మాపక శకటాలతో వచ్చిన సిబ్బంది దాదాపు ఏడు గంటలపాటు శ్రమించి మంటలను సాయంత్రం 4 గంటల సమయానికి అదుపులోకి తెచ్చారు. శనివారం సెలవు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతబడి ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో భవన సముదాయంలో దాదాపుగా ఎవరూ లేరని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఘటనపై సవివర దర్యాప్తు కోసం సీఎం మోహన్ యాదవ్ అదనపు చీఫ్ సెక్రటరీ మహ్మద్ సులెమాన్ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో కమిటీ వేశారు. 15 రోజుల్లోగా నివేదిక అందించాలని ఆదేశించారు. 2003లో బీజేపీ అధికారంలోకి వచ్చాక వల్లభ్ భవన్ జరిగిన అయిదో అగ్ని ప్రమాదమని కాంగ్రెస్ ఆరోపించింది. అవినీతి సాక్ష్యాలు బయటపడకుండా చేసేందుకే సెక్రటేరియట్లో అగ్ని ప్రమాదం అంటూ బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శించింది. ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తూ ఆపార్టీ నేతలు సెక్రటేరియట్ వెలుపల రెండు గంటలపాటు నిరసన చేపట్టారు. -
ఎవరికీ అవకాశాలకు కొదువలేదు.. బీజేపీలో చేరండి - మధ్యప్రదేశ్ సీఎం
ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న మధ్యప్రదేశ్ సీఎం 'మోహన్ యాదవ్'.. యాదవ సామాజికవర్గాన్ని బీజేపీలో చేరాలని పిలుపునిచ్చారు. నేను మీ మధ్య మాట్లాడటానికి వచ్చానని, ప్రస్తుతం విజయవంతమైన ప్రధాని నాయకత్వంలో మన సమాజాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ఇది ఒక పెద్ద అవకాశమని ప్రస్తావించారు. యాదవ్ మహాకుంభ్‌లో ఎంపీ సీఎం పరోక్షంగా సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ కుటుంబాన్ని ఉద్దేశించి.. ఒకే కుటుంబం (యాదవ్) సొసైటీకి కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తారని నమ్ముతారు, కానీ ఆ కాంట్రాక్టర్ వ్యవస్థను ప్రజలు వదిలిపెట్టినందుకు నేను సంతోషిస్తున్నానన్నారు. నిరుపేద కుటుంబంలో ఒకరిని, యాదవ్ కుటుంబంలో ఒకరిని ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ. బీజేపీలో ఎవరికీ అవకాశాల కొరత లేదని ఎంపీ సీఎం అన్నారు. యూపీలో తన పర్యటనలు చాలా మందిని కలవరపెడుతున్నాయని, మరోసారి అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి అన్నారు. ఎవరికి సమస్యలు వచ్చినా.. మీరు పిలిస్తే వస్తాను అని మోహన్ యాదవ్ అన్నారు. మోహన్ యాదవ్ లక్నోలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని సందర్శించి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పార్లమెంటరీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో బీజేపీ కమలం వికసిస్తుంది, 400 సీట్లను దాటాలన్న ప్రధాని సంకల్పం నెరవేరుతుందనటానికి మీ ఉత్సాహమే నిదర్శనమని అన్నారు. యాదవ సమాజ ఆరాధ్యదైవం శ్రీకృష్ణుడి జీవిత పోరాటాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. నేడు దేశం మొత్తం సనాతన సంస్కృతిని శ్రీరాముడు, కృష్ణుడి సంస్కృతిగా పరిగణించడం నాకు సంతోషంగా ఉంది. ఎన్ని సవాళ్లు వచ్చినా, ఎన్ని బాధలు ఉన్నా, మన సంస్కృతిని కాపాడుకోవాలని మోహన్ యాదవ్ అన్నారు. -
మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 28 మంది ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం సోమవారం కేబినెట్‌ను విస్తరించింది. సీఎం మోహన్ యాదవ్ తన తన మంత్రి వర్గంలోకి 28 మందిని తీసుకున్నారు. 28 మందితో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ సీ పటేల్ ప్రమాణ స్వీకారం చేయించారు. క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గీయ, ప్రద్యుమన్ సింగ్ తోమర్, విశ్వాస్ సారంగ్ ఉన్నారు. వీరిలో 18 మంది కేబినెట్ మంత్రులుగా, ఆరుగురు స్వతంత్రులుగా, మిగతా నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన మంత్రి వర్గంలో అయిదుగురు మహిళలు ఉన్నారు. మొత్తం 28 మంది మంత్రుల్లో 11 మంది ఓబీసీ వర్గానికి చెందిన వారు ఉన్నారు. అయిదుగురు షెడ్యూల్ కులాలు(ఎస్సీ), ముగ్గురు షెడ్యూల్ తెగల (ఎస్టీ) వర్గానికి చెందినవారు ఉన్నారు. కాగా ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కాకుండా మరో నేత మోహన్ యాదవ్‌కు బీజేపీ అధిష్ఠానం సీఎం పదవి కట్టబెట్టింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ యాదవ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకత్వం ఎంపిక చేసిన రెండు వారాల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగింది. చదవండి: ‘దేశంలో మోదీకి ప్రత్యామ్నయ నేత ఎవరూ లేరు’