యూపీలోని రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీచేస్తారని భావిస్తున్న తరుణంలో అక్కడి నుంచి రాహుల్ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పలు ఆరోపణలు చేశారు. రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్తకు గల హక్కులను లాక్కున్నారని ఆరోపించారు. గుణ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం మోహన్ యాదవ్ ఈ ఆరోపణలు చేశారు.
ఓటమి భయంతో రాహుల్ గాంధీ అమేథీ (ఉత్తరప్రదేశ్) నుంచి వయనాడ్ (కేరళ)కు పారిపోయారని కూడా మోహన్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆ పార్టీ మద్దతుదారులు పోస్టర్లు అంటించారని యాదవ్ గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే రాహుల్ గాంధీ అటు తన సోదరి ప్రియాంక, ఇటు బావ రాబర్ట్ వాద్రాల హక్కులను లాక్కున్నట్లయ్యిందని మోహన్ యాదవ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment