Kathakali dance
-
Srushti Sudhir Jagtap: రికార్డు సృష్టించింది!
సాధించాలంటే కఠోర సాధన ఉండాలి. అంతకు మించిన అంకితభావం ఉండాలి. ఈ రెండూ ఉంటే రికార్డు సాధనకు వయసు అనేది ప్రధానం కాదని నిరూపించింది సృష్టి సుధీర్ జగ్తాప్. పదహారేళ్ల సృష్టి విరామం లేకుండా 127 గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్ (ఇండివిడ్యుయల్ కేటగిరీ)లో గిన్నిస్ రికార్డు సాధించింది. మహారాష్ట్రలోని లాతూర్‌కి చెందిన సృష్టి... లాతూర్‌లోని పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతోంది. ఆమె అమ్మానాన్న సుధీర్, సంజీవని ఇద్దరూ టీచర్లు. వాళ్ల తాతగారు ‘బాబన్ మనే’ స్వయానా నాట్యగురువు. సృష్టికి చిన్నప్పటి నుంచి నాట్యసాధన అలవాటయింది. కానీ ఆమెకు రికార్డు కోసం నాట్యం చేయాలనే ఆకాంక్షకు కారణం బందనా నేపాల్. ఆమె 2018లో 126 గంటల సేపు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్‌లో గిన్నిస్ రికార్డు సాధించింది. అప్పుడు ‘భారతీయ నాట్యరీతులు లెక్కలేనన్ని ఉన్నాయి. మన నాట్యరీతికి ఓ రికార్డు ఉంటే బావుణ్ను. ఆ రికార్డు ద్వారా ప్రపంచదేశాలకు మన శాస్త్రీయ నాట్యం గురించి తెలుస్తుంది’... అనే ఆలోచన సృష్టిలో రేకెత్తింది. ఆమె ఆలోచనకు తల్లిదండ్రులు, తాత అండగా నిలిచారు. గిన్నిస్ రికార్డు కోసం కథక్ నాట్య సాధన చేయాలనుకుంది. తాత పర్యవేక్షణలో 15 నెలల పాటు కఠోరసాధన చేసింది. ధ్యానంలో యోగనిద్ర కూడా సాధన చేయించారు బాబన్ మనే. రోజుకు నాలుగు గంటల సేపు ధ్యానం, మూడు గంటల సేపు వ్యాయామం, ఆరు గంటల సేపు నాట్యసాధన... ఇదీ రికార్డు కోసం ఆమె చేసిన దీక్ష. గంటకు ఐదు నిమిషాల విరామం సృష్టి 127 గంటల నాట్య ప్రద్శన మే నెల 29వ తేదీన పోదార్ స్కూల్ వేదిక మీద మొదలైంది. నాట్యప్రదర్శన ఐదు రోజుల పాటు నిర్విరామంగా సాగింది. ఆహారం అందక దేహం నీరసించి, డీహైడ్రేషన్‌కు లోను కాకుండా ఉండడానికి గంటకోసారి ఐదు నిమిషాల సేపు విరామం తీసుకునేది. ఆ విరామంలో ఎనర్జీ డ్రింక్ తీసుకుంటూ తన నాట్యదీక్షను కొనసాగించింది. సృష్టి నాట్యం చేసినంత సేపూ ఆమె తల్లిదండ్రులు వేదిక పక్కనే ఉండి ఆమెకు కావలసినవి అందిస్తూ వచ్చారు. నాట్య ప్రదర్శనను వీక్షించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి స్వప్నిల్ దంగారికర్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తూ సృష్టిని ప్రశంసల్లో ముంచెత్తారు. ‘‘రికార్డు సాధనలో నా లక్ష్యం నెరవేరింది. ఐదు రోజుల ఐదు గంటల పాటు (విరామంతో కలిపి దాదాపు ఆరు రోజులు) సాగిన నాట్య ప్రదర్శన మధ్యలో అప్పుడప్పుడూ తల, శరీరం తూలిపోతున్న భావన కలిగాయి. నా లక్ష్యం 127 గంటలను పూర్తి చేయడం. లాంగెస్ట్ డాన్స్ మారథాన్‌లో ఇండియాకు రికార్డు సాధించడం. దేహం నిస్సత్తువతో ఇకచాలనే సంకేతాలు జారీ చేసినప్పుడు నా లక్ష్యాన్ని గుర్తు చేసుకుని క్షణాల్లో నన్ను నేను సంబాళించుకున్నాను. మానసికంగా స్థిరంగా ఉంటే దేహం కూడా సహకరిస్తుంది’ అన్నది పదహారేళ్ల సృష్టి. -
క్లాసిక్+వెస్ట్రన్ =ఫైర్
మన కథాకళికి పాప్ పాట జత చేస్తే ఎలా ఉంటుంది? రెండు కళ్లు చాలనంత అద్బుతంగా ఉంటుందని చెప్పడానికి ఈ వైరల్ వీడియోనే సాక్ష్యం. అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ గోమెజ్, నైజీరియన్ సింగర్, ర్యాపర్ రెమోల ‘బేబీ కామ్‌డౌన్’ పాట సెన్సేషనల్ గ్లోబల్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు తమదైన క్రియేటివ్ ట్విస్ట్ ఇస్తున్నారు కళాకారులు. మనదేశం విషయానికి వస్తే... ముగ్గురు మహిళా డ్యాన్సర్లు ‘బేబి కామ్‌డౌన్’ పాటకు వేసిన కథాకళీ స్టెప్పులు ‘వారెవా’ అనిపించాయి. ముఖ్యంగా వారి ఎక్స్ప్రెషన్స్ ‘అదరహో’ అన్నట్లుగా ఉన్నాయి. డ్యాన్సర్ శెయాలి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో 10 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. క్లాసిక్+వెస్ట్రన్ =ఫైర్ అని నెటిజనులు స్పందించారు. -
డాన్స్ స్కూల్లో పోరాడి సీటు.. మరో స్వర్ణకమలం
సంప్రదాయ నృత్యమంటే ఇష్టం లేని అమ్మాయిని ఆ నృత్యంలో లగ్నం చేసే సినిమా కథ ‘స్వర్ణకమలం’. కేరళలో ఇందుకు పూర్తి విరుద్ధమైన కథ జరిగింది. మదరసాలో చదువుకునే ఒక అమ్మాయి కథాకళి పట్ల ఆసక్తితో 80 ఏళ్ల చరిత్ర ఉన్న డాన్స్ స్కూల్లో పోరాడి సీటు సాధించుకుంది. కథాకళిలో ముస్లిం అమ్మాయిల ప్రవేశం ఇప్పటి వరకూ లేదు. ఆ నృత్యం నేర్చుకుంటున్న మొదటి అమ్మాయి సాబ్రి. ‘చిన్నప్పటి నుంచి కథాకళి చూస్తున్నా. దానికి వేసుకునే మేకప్, దాని కాస్ట్యూమ్స్, ఆ నృత్యవిధానం నన్ను ఆకర్షించాయి. ఎలాగైనా ఆ డాన్స్ నేర్చుకోవాలని చెప్పా. నాన్నకు కూడా ఆ డాన్స్ ఇష్టం. సరేనమ్మా అన్నాడు’ అంది సాబ్రి. ఏడవ క్లాసు పూర్తి చేసిన సాబ్రి ఇప్పుడు తండ్రి నిస్సమ్, తల్లి అనీషాల ప్రోత్సాహంతో కథాకళి నృత్యం నేర్చుకోవడానికి పూనుకుంది. కేరళలోనే కాదు బహుశా దేశంలోనే కథాకళి నేర్చుకుంటున్న తొలి ముస్లిం బాలిక సాబ్రి. అందుకే ఈ అమ్మాయిని అందరూ మెచ్చుకుంటున్నారు. కళకు కులం, మతం భేదం లేదని అంటున్నారు. ► దేవుని గుడిలో చూసి.. సాబ్రి కుటుంబం కొళ్లంలో నివసిస్తుంది. తండ్రి నిస్సమ్ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. వీరి ఇంటి సమీపంలోనే శ్రీ మహదేవ కోవెల ఉంది. అక్కడ దాదాపు ప్రతి వారం ఏదో ఒక సాయంత్రం కథాకళి నృత్య ప్రదర్శన ఉంటుంది. వృత్తిలో భాగంగా నిస్సమ్ ఆ నృత్య ప్రదర్శన ఫొటోలు తీయడానికి వెళ్లేవాడు. కాలక్షేపంగా ఉంటుందని సాబ్రిని కూడా తీసుకెళ్లేవాడు. ‘అలా ఏడేళ్ల వయసు నుంచే నేను కథాకళి నృత్యాన్ని చూస్తున్నాను. ఐదో క్లాసు అయ్యాక ఆ డాన్సును ప్రయివేటు టీచర్ దగ్గరి నుంచి నేర్చుకోవాలనుకున్నాను. కాని కోవిడ్ వల్ల క్లాసులు ఆగిపోయాయి. అదీగాక ఒక ఇన్స్టిట్యూట్ నుంచి పరిపూర్ణంగా నేర్చుకోవాలనిపించింది. అందుకే కళామండలంలో చేరాను’ అంది సాబ్రి. ► మగవారికే కథాకళి కథాకళి నృత్యం ఒక తపస్సు. దానికోసం జీవితాన్ని అంకితం చేయాలి. స్త్రీల శరీర ధర్మాలు, గృహ ధర్మాలు వారిని పరిపూర్ణంగా ఈ నృత్యంలో నిమగ్నం కానివ్వవు అనే ఉద్దేశ్యంతో ఈ నృత్యాన్ని ఆది నుంచి పురుషులకే పరిమితం చేశారు. పురుష కళాకారులే కథాకళిలోని స్త్రీల వేషాలను కూడా ధరిస్తారు. ప్రదర్శనను రక్తి కట్టిస్తారు. కథాకళిని పరిరక్షించడానికి కేరళలో ప్రతిష్టాత్మకమైన డాన్స్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది త్రిసూర్‌కు దగ్గరగా ఉన్న చెరుతురితి అనే ఊరిలోని ‘కళామండలం’. ఇది కథాకళిని బాల్యం నుంచి రెసిడెన్షియల్ పద్ధతిలో నేర్పుతుంది. అంటే ఇక్కడ మామూలు స్కూలు, కథాకళి స్కూలు కలిసి నడుస్తాయి. 90 ఏళ్లుగా నడుస్తున్న ఈ సంస్థలో పూర్తిగా అబ్బాయిలకే ప్రవేశం. అయితే గత సంవత్సరమే అమ్మాయిలు కూడా చేరొచ్చు అని అనుమతి ఇచ్చారు. ఎవరూ చేరలేదు. ఈ సంవత్సరం పది మంది అమ్మాయిలు చేరితే వారిలో ఒకమ్మాయి సాబ్రి. ► కఠిన శిక్షణ కళామండలంలో 8 వతరగతిలో చేరిన సాబ్రి ఇక అక్కడే హాస్టల్లో ఉండిపోవాలి. ఉదయం 4.30 నుంచి లేచి కథాకళి పాఠాలు నేర్చుకోవాలి. 9.30 నుంచి మళ్లీ స్కూలు పాఠాలు నేర్చుకోవాలి. సాయంత్రం ఊళ్లో ఎక్కడ కథాకళి ప్రదర్శన జరుగుతుంటే అక్కడకు తీసుకెళ్లి చూపిస్తారు. ‘కథాకళిలోని ప్రదర్శనలన్నీ హిందూ పురాణాల ఆధారంగా ఉంటాయి. మరి నీకు ఆ పాత్రలు పోషించడంలో ఇబ్బంది ఏమీ లేదా’ అంటే ‘అలా ఏమీ లేదు’ అంటుంది సాబ్రి. తండ్రి నిస్సమ్ కూడా ‘మా అమ్మాయి డాన్స్ నేర్చుకోవడంలో కళ అందరూ నేర్చుకునే హక్కు నిరూపితం అయ్యింది. ఈ నృత్యం నేర్చుకోవడంలో మా మతస్తుల నుంచి ఎటువంటి అభ్యంతరం లేదు’ అని తెలిపాడు. -
పన్జతన్.. ‘ఫన్’రతన్
ఆయన పేరు ఇర్షాద్ పన్జతన్.. మూకాభినయ కళలో మాత్రం ఆయన తిరుగులేని ‘ఫన్’రతన్. దాదాపు యాభయ్యేళ్ల కిందట భారత్‌కు మూకాభినయాన్ని పరిచయం చేసి, ప్రాచుర్యం కల్పించిన ఘనత పన్జతన్కే దక్కుతుంది. హైదరాబాద్‌లో 1931, సెప్టెంబర్ 7న పుట్టిన పన్జతన్ ఇక్కడే పెరిగారు. ఏవియేషన్ ఇంజనీరింగ్ చదువుకున్నా, రంగస్థలంపై మక్కువతో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడే రాఘవన్ నాయర్, నరేంద్ర శర్మల వద్ద కథాకళి నృత్యం నేర్చుకున్నారు. బేగం ఖుద్సియా జైదీ ఆధ్వర్యంలోని ‘హిందుస్థానీ థియేటర్’ గ్రూపు ద్వారా 1957లో నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు. ఆ గ్రూపు ప్రదర్శించిన ‘చారుదత్త’ నాటకంలో చోరీ సన్నివేశాన్ని ఎలాంటి సంభాషణలు లేకుండానే పండించి, ప్రేక్షకులను ‘మైమ్’మరపించారు. అక్కడి నుంచి మూకాభినయం వైపు మళ్లారు. ఢిల్లీ వీధుల్లో ఒక స్థానిక కళాకారుడికి మూకాభినయ ప్రదర్శన తిలకించిన పన్జతన్, ఆ కళలో తన సాధన ప్రారంభించారు. తొలిసారిగా ఢిల్లీలో 1962లో రంగస్థల వేదికపై పూర్తిస్థాయి మైమ్ ప్రదర్శన చేశారు. తొలి ప్రదర్శనతోనే బాగా గుర్తింపు పొందారు. ఈలోగా హిందుస్థానీ థియేటర్ గ్రూపు మూతబడింది. సరిగా అలాంటి క్లిష్ట సమయంలోనే బాలీవుడ్ అవకాశాలు తలుపు తట్టాయి. తొలిసారిగా ‘ఆస్మాన్ వుహల్’ (1965) చిత్రంలో నటించారు. ఆ తర్వాత బంబై రాత్ కీ బాహోం మే, సాత్ హిందుస్థానీ, బిఖ్రే మోతీ, ఛోటీ బహు వంటి బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు. అదే సమయంలో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖకు చెందిన ఫిలిమ్స్ డివిజన్ మత సామరస్యంపై రూపొందించిన ‘ఖిలోనేవాలా’, కుటుంబ నియంత్రణపై రూపొందించిన ‘సిక్స్, ఫైవ్, ఫోర్, త్రీ, టూ’ వంటి డాక్యుమెంటరీల్లో నటించారు. నటరాజే గురువుగా.. మనసంతా మైమ్పైనే ఉండటంతో సినీ అవకాశాలు పన్జతన్కు ఏవూత్రం సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఇంట గెలిచింది ఇక చాలనుకున్నారు. రచ్చ గెలిచి తనను తాను నిరూపించుకునేందుకు విదేశీయూత్రకు బయులుదేరారు. పశ్చివూసియూ, యూరోపియన్ దేశాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రదర్శనలు ఇచ్చారు. చివరకు బెర్లిన్‌లో స్థిరపడ్డారు. విదేశీ వనిత ఇంగ్రిడ్ సాట్లర్ను పెళ్లాడిన పన్జతన్, బెర్లిన్‌లో మైమ్ స్కూల్‌ను ప్రారంభించారు. ఇప్పుడాయున బెర్లిన్లోనే ఉంటున్నారు. ద్రోణాచార్యుడిని గురువుగా భావించుకుని ఏకలవ్యుడు ధనుర్విద్యా సాధన చేసిన విధంగానే, సాక్షాత్తు నటరాజునే గురువుగా భావించి అభినయు సాధన చేశారు పన్జతన్. ఈ విషయాన్ని ఆయునే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మూకాభినయూన్ని నేర్పే గురువులెవరూ దొరకకపోవడంతో నటరాజు విగ్రహాన్ని కొనుక్కుని తెచ్చి, ఇంట్లో దాని ఎదుటే సాధన చేసేవారు. స్వయుం సాధనతోనే అంతర్జాతీయు స్థాయిఎదిగారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమోల్ పాలేకర్ ముంబైలో ‘ఫెస్టివల్ ఆఫ్ నో వర్డ్స్’ పేరిట ఐదేళ్ల కిందట నిర్వహించిన మూకాభినయు కార్యక్రవుంలో పాల్గొనేందుకు పన్జతన్ భారత్ వచ్చారు. చిన్నారులే వివుర్శకులు.. మూకాభినయం అంటే హాస్య ప్రదర్శన వూత్రమే కాదు, అది నవరసాభినయం. సంభాషణల్లేని అభినయంతో మెప్పించడం ఆషామాషీ విద్య కాదు. ఇందులో రాణించేందుకు పన్జతన్ ఎంచుకున్న మార్గాలు చాలా విలక్షణమైనవి. చిన్నారులనే ఆయన తన విమర్శకులుగా పరిగణించేవారు. నిర్మొహమాటంగా చిన్నారులు వెలిబుచ్చే అభిప్రాయాలనే విమర్శలుగా పరిగణించి తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కేవలం జేబులో ఐదు రూపాయులతో దేశం విడిచి విదేశీయూత్రకు బయులుదేరిన పన్జతన్ తొలుత లాహోర్ చేరుకున్నారు. లాహోర్ విమెన్స్ కాలేజీలో ఇచ్చిన ప్రదర్శన ద్వారా రూ.350 సంపాదించారు. దేశదేశాలు పర్యటిస్తూ జర్మనీ చేరుకునే నాటికి కారు కొనగలిగే స్థాయి కి చేరుకున్నారు. జర్మనీలో మైమ్ స్కూల్ నడుపుతూనే కొన్ని జర్మన్, హాలీవుడ్ సినివూల్లోనూ నటించారు. ఇంతకీ ఈ పన్జతన్ ఎవరంటే, ప్రముఖ దౌత్యవేత్త, ఆర్థికవేత్త ఆబిద్ హుస్సేన్‌కు స్వయూనా తమ్ముడు. - పన్యాల జగన్నాథదాసు ఇర్షాద్ పన్జతన్