పన్‌జతన్.. ‘ఫన్’రతన్
ఆయన పేరు ఇర్షాద్ పన్‌జతన్.. మూకాభినయ కళలో మాత్రం ఆయన తిరుగులేని ‘ఫన్’రతన్. దాదాపు యాభయ్యేళ్ల కిందట భారత్‌కు మూకాభినయాన్ని పరిచయం చేసి, ప్రాచుర్యం కల్పించిన ఘనత పన్‌జతన్‌కే దక్కుతుంది. హైదరాబాద్‌లో 1931, సెప్టెంబర్ 7న పుట్టిన పన్‌జతన్ ఇక్కడే పెరిగారు. ఏవియేషన్ ఇంజనీరింగ్ చదువుకున్నా, రంగస్థలంపై మక్కువతో ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడే రాఘవన్ నాయర్, నరేంద్ర శర్మల వద్ద కథాకళి నృత్యం నేర్చుకున్నారు. బేగం ఖుద్సియా జైదీ ఆధ్వర్యంలోని ‘హిందుస్థానీ థియేటర్’ గ్రూపు ద్వారా 1957లో నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు.
ఆ గ్రూపు ప్రదర్శించిన ‘చారుదత్త’ నాటకంలో చోరీ సన్నివేశాన్ని ఎలాంటి సంభాషణలు లేకుండానే పండించి, ప్రేక్షకులను ‘మైమ్’మరపించారు. అక్కడి నుంచి మూకాభినయం వైపు మళ్లారు. ఢిల్లీ వీధుల్లో ఒక స్థానిక కళాకారుడికి మూకాభినయ ప్రదర్శన తిలకించిన పన్‌జతన్, ఆ కళలో తన సాధన ప్రారంభించారు. తొలిసారిగా ఢిల్లీలో 1962లో రంగస్థల వేదికపై పూర్తిస్థాయి మైమ్ ప్రదర్శన చేశారు. తొలి ప్రదర్శనతోనే బాగా గుర్తింపు పొందారు. ఈలోగా హిందుస్థానీ థియేటర్ గ్రూపు మూతబడింది. సరిగా అలాంటి క్లిష్ట సమయంలోనే బాలీవుడ్ అవకాశాలు తలుపు తట్టాయి. తొలిసారిగా ‘ఆస్మాన్ వుహల్’ (1965) చిత్రంలో నటించారు. ఆ తర్వాత బంబై రాత్ కీ బాహోం మే, సాత్ హిందుస్థానీ, బిఖ్రే మోతీ, ఛోటీ బహు వంటి బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు. అదే సమయంలో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖకు చెందిన ఫిలిమ్స్ డివిజన్ మత సామరస్యంపై రూపొందించిన ‘ఖిలోనేవాలా’, కుటుంబ నియంత్రణపై రూపొందించిన ‘సిక్స్, ఫైవ్, ఫోర్, త్రీ, టూ’ వంటి డాక్యుమెంటరీల్లో నటించారు.
నటరాజే గురువుగా..
మనసంతా మైమ్‌పైనే ఉండటంతో సినీ అవకాశాలు పన్‌జతన్‌కు ఏవూత్రం సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. ఇంట గెలిచింది ఇక చాలనుకున్నారు. రచ్చ గెలిచి తనను తాను నిరూపించుకునేందుకు విదేశీయూత్రకు బయులుదేరారు. పశ్చివూసియూ, యూరోపియన్ దేశాల్లో విస్తృతంగా పర్యటించి, ప్రదర్శనలు ఇచ్చారు. చివరకు బెర్లిన్‌లో స్థిరపడ్డారు. విదేశీ వనిత ఇంగ్రిడ్ సాట్లర్‌ను పెళ్లాడిన పన్‌జతన్, బెర్లిన్‌లో మైమ్ స్కూల్‌ను ప్రారంభించారు. ఇప్పుడాయున బెర్లిన్‌లోనే ఉంటున్నారు. ద్రోణాచార్యుడిని గురువుగా భావించుకుని ఏకలవ్యుడు ధనుర్విద్యా సాధన చేసిన విధంగానే, సాక్షాత్తు నటరాజునే గురువుగా భావించి అభినయు సాధన చేశారు పన్‌జతన్. ఈ విషయాన్ని ఆయునే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మూకాభినయూన్ని నేర్పే గురువులెవరూ దొరకకపోవడంతో నటరాజు విగ్రహాన్ని కొనుక్కుని తెచ్చి, ఇంట్లో దాని ఎదుటే సాధన చేసేవారు. స్వయుం సాధనతోనే అంతర్జాతీయు స్థాయిఎదిగారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమోల్ పాలేకర్ ముంబైలో ‘ఫెస్టివల్ ఆఫ్ నో వర్డ్స్’ పేరిట ఐదేళ్ల కిందట నిర్వహించిన మూకాభినయు కార్యక్రవుంలో పాల్గొనేందుకు పన్‌జతన్ భారత్ వచ్చారు.
చిన్నారులే వివుర్శకులు..
మూకాభినయం అంటే హాస్య ప్రదర్శన వూత్రమే కాదు, అది నవరసాభినయం. సంభాషణల్లేని అభినయంతో మెప్పించడం ఆషామాషీ విద్య కాదు. ఇందులో రాణించేందుకు పన్‌జతన్ ఎంచుకున్న మార్గాలు చాలా విలక్షణమైనవి. చిన్నారులనే ఆయన తన విమర్శకులుగా పరిగణించేవారు. నిర్మొహమాటంగా చిన్నారులు వెలిబుచ్చే అభిప్రాయాలనే విమర్శలుగా పరిగణించి తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కేవలం జేబులో ఐదు రూపాయులతో దేశం విడిచి విదేశీయూత్రకు బయులుదేరిన పన్‌జతన్ తొలుత లాహోర్ చేరుకున్నారు. లాహోర్ విమెన్స్ కాలేజీలో ఇచ్చిన ప్రదర్శన ద్వారా రూ.350 సంపాదించారు. దేశదేశాలు పర్యటిస్తూ జర్మనీ చేరుకునే నాటికి కారు కొనగలిగే స్థాయి
కి చేరుకున్నారు. జర్మనీలో మైమ్ స్కూల్ నడుపుతూనే కొన్ని జర్మన్, హాలీవుడ్ సినివూల్లోనూ నటించారు. ఇంతకీ ఈ పన్‌జతన్ ఎవరంటే, ప్రముఖ దౌత్యవేత్త, ఆర్థికవేత్త ఆబిద్ హుస్సేన్‌కు స్వయూనా తమ్ముడు.
- పన్యాల జగన్నాథదాసు
ఇర్షాద్ పన్‌జతన్