హేమ అడుగుల్లో హెగ్డే | Hema Malini inspires Pooja Hegde to dance | Sakshi
Sakshi News home page

హేమ అడుగుల్లో హెగ్డే

Jan 27 2019 2:08 AM | Updated on Aug 22 2019 9:35 AM

Hema Malini inspires Pooja Hegde to dance - Sakshi

పూజా హెగ్డే

ఆ తరం ప్రేక్షకులను తన నటనతో అలరించి డ్రీమ్‌గాళ్‌గా పేరు సంపాదించారు హేమ మాలిని. ప్రస్తుత తరం హీరోయిన్స్‌ కూడా హేమ డ్యాన్స్‌ నుంచి ప్రేరణ పొందుతున్నారనడంలో ఆశ్చర్యం ఏం లేదు. తాజాగా పూజా హెగ్డే కూడా ఈ లిస్ట్‌లోనే ఉన్నానంటున్నారు. పూజా ప్రస్తుతం నటిస్తున్న ఓ సినిమాకి క్లాసికల్‌ డ్యాన్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాంగ్‌ షూట్‌ చేయాలనుకున్నారట. దాంతో గంటల తరబడి ఆ డ్యాన్స్‌ను నేర్చుకుంటూ శ్రమించడమే కాకుండా హేమ మాలిని పాత సినిమాలను చూస్తున్నారట పూజా.

ఈ విషయం గురించి పూజా మాట్లాడుతూ – ‘‘తొలిసారి క్లాసికల్‌ డ్యాన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాట చేయబోతున్నాను. ఇలాంటి పాటలకు ప్రేరణ అంటే హేమాజీని మించి ఎవరున్నారు? చిన్నప్పటి నుంచి ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆమె డ్యాన్స్‌ మూమెంట్స్‌ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా అనిపిస్తుంటాయి. ప్రతి ఎక్స్‌ప్రెషన్‌ను కరెక్ట్‌గా స్క్రీన్‌ మీద చూపిస్తారామె’’ అన్నారు. ఇంతకీ ఏ సినిమాలో ఈ సాంగ్‌కు నర్తిస్తున్నారో మాత్రం పూజా హెగ్డే పేర్కొలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో మహేశ్‌ ‘మహర్షి’, ప్రభాస్‌ ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలున్నాయి.  ఈ రెండింటిలో ఏదో ఒక సినిమాలో ఈ పాట ఉంటుందా? వెయిట్‌ అండ్‌ సీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement