Hemamalini
-
వినేశ్ ఫొగట్‌పై హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు
సెమీ ఫైనల్లో విజయం.. ఫైనల్లో పతకం సాధించడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో భారతీయ క్రీడాభిమానులకు ఊహించని షాక్.. భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు. 50 కిలోల విభాగంలో 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందంటూ ఒలంపిక్ సంఘం ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది.కష్టమంతా వృథాపతకం ఖాయమనుకున్న అభిమానుల మనసు ముక్కలైంది. బరువు నియంత్రణ కోసం వినేశ్ ఎంతగానో కష్టపడింది. నీళ్లు తాగకుండా నిద్రను త్యాగం చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. విజయానికి అడుగు దూరంలో ఉన్న ఆమెను 100 గ్రాముల కోసం రేసులోనే లేకుండా చేయడమేంటని యావత్ భారత క్రీడాభిమానులు విచారం వ్యక్తం చేశారు.ఇదొక గుణపాఠంకానీ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని మాత్రం ఈ అంశంపై విభిన్నంగా స్పందించారు. 100 గ్రాముల అధిక బరువు వల్ల అనర్హతకు గురవడం వింతగా ఉంది. అందుకే ఎప్పటికప్పుడు బరువు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనందరికీ ఓ గుణపాఠం. ఆమె త్వరగా 100 గ్రాముల బరువు తగ్గాలని ఆశిస్తున్నాను. అయినా ఇప్పుడు ఒలంపిక్ పతకమైతే రాదు కదా అని చివర్లో సెటైరికల్‌గా ఓ నవ్వు విసిరింది.సంతోషం?ఆమె రియాక్షన్ చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'ఒక క్రీడాకారిణి మీద అలాంటి కామెంట్లు చేయడమేంటి? పైగా చివర్లో ఆ నవ్వు చూశారా?', 'బరువు తగ్గడం గురించి లెక్చర్ ఇవ్వాల్సిన సమయమా ఇది', 'ఒక ఛాంపియన్ వైఫల్యాన్ని చూసి తను ఎలా నవ్వుతుందో చూశారా?', 'వినేశ్‌పై వేటు వేసినందుకు తెగ సంతోషిస్తున్నట్లు ఉంది' అని ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు. Her last reaction "milega nhin" 🤔😡#GOLD #OlympicGames #HemaMalini pic.twitter.com/dcQHS6Sdus— Ateeque Ahmad عتیق احمد (@AteekSyd) August 7, 2024 -
ఎన్నికల సిత్రాలు : మండుటెండలో హేమమాలిని జోరు
ప్రముఖ నటి బీజేపీ ఎంపీ హేమమాలిని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మథురలో ఎన్నికల ప్రచారంలో రైతులను కలిసిన హేమమాలిని గోధుమ పొలంలో గడ్డికోసి సందడి చేశారు. పొలాల్లో పని చేసే మహిళలతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. ఈ పదేళ్లుగా తాను క్రమం తప్పకుండా కలుస్తున్న రైతులతో మరోసారి మమేకమయ్యేందుకు వారిని కలిసానని, వారి మధ్యలో ఉండటం వారికి కూడా సంతోషాన్నిచ్చిందని, రైతు మహిళలతో కలిసి ఫోటోలకు పోజులివ్వాలని పట్టుబట్టారంటూ ఆమె రాసుకొచ్చింది. మథుర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ వరుసగా మూడోసారి హేమమాలిని బరిలోకి దిగింది. 1991 నుండి 1999 వరకు, మధుర నాలుగు సార్లు బీజేపీకి కంచుకోటగా ఉంది. అయితే 2004లో మధుర కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. 2009లో ఆర్ఎల్డీకి చెందిన జయంత్ చౌదరి మధుర నుంచి ఎంపీ అయ్యారు. ఇక ఆ తరువాత 2014లో హేమమాలినిని బీజేపీ రంగంలోకి దించింది. 2019 ఎన్నికల్లో, హేమ భర్త, నటుడు ధర్మేంద్ర కూడా ఆమె కోసం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. Today I went into the farms to interact with the farmers who I have been meeting regularly these 10 years. They loved having me in their midst and insisted I pose with them which I did❤️ pic.twitter.com/iRD4y9DH4k — Hema Malini (@dreamgirlhema) April 11, 2024 తిరిగి ఇదే స్థానం బీజేపీ తరఫున 2024 ఎన్నికల్లో హేమమాలిని నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 26న మధురలో రెండో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. 80 మంది పార్లమెంటు స్థానాలున్న యూపీలో మొత్తం ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 19, 26 మే 7, మే 13, మే 20, మే 23 , జూన్ 1 ఏడు దశల్లో ఓటింగ్ జరుగుతుంది. -
స్వర్గం కొత్త కాంతులతో వెలుగుతుంది
భారత గానకోకిల, దిగ్గజ గాయని లతా దీదీ ఇక లేరు. ఆమె లేని లోటు ఎవరూ పూడ్చలేరు. సంగీతం సజీవంగా ఉన్నంత వరకు ఆమె పాటలు వినిపిస్తూనే ఉంటాయి. – చిరంజీవి లతాగారి మరణం దేశానికే కాదు.. సంగీత ప్రపంచానికే తీరని లోటు. దేశంలో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందారామె. విదేశాలు కూడా పురస్కారాలతో ఆమెను గౌరవించడం గర్వకారణం. – బాలకృష్ణ నైటింగేల్ ఇక లేరని తెలిసి నా హృదయం ముక్కలయింది. లతాగారు ఎందరికో స్ఫూర్తి ఇచ్చారు. ఆమె లేని లోటు ఎప్పటికీ శూన్యాన్ని సృష్టిస్తుంది. – వెంకటేశ్ లతాజీ మరణం తీరని లోటు. భారతదేశ నైటింగేల్‌కి నా హృదయపూర్వక నివాళులు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. – రాజమౌళి, డైరెక్టర్ భారతీయ సినీ సంగీత లోకంలో ధ్రువతార, గాన కోకిల లతా మంగేష్కర్‌గారు తుదిశ్వాస విడి చారన్న విషయం ఆవేదనను కలిగించింది. లతాజీ అస్తమయం భారతీయ సినీ సంగీతానికే తీరని లోటు. బాల్యం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆమె నిలిచి, గెలిచిన తీరు స్ఫూర్తిదాయకం. – పవన్ కల్యాణ్ మా గానకోకిల మూగబోయింది. మా మధ్య భౌతికంగా మీరు లేకపోవచ్చేమో కానీ మీ పాటలు మాత్రం ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. పాటలో ఒకే ఒక్క లైన్‌తో మమ్మల్ని ఎన్నో అనుభూతులకు గురి చేశారు. – మహేశ్‌బాబు పాకిస్తాన్–బర్మా యుద్ధంలో బర్మా తరఫున యుద్ధం చేస్తున్న మన దేశ సైనికులు చాలామంది అమరులయ్యారు. కొంతమంది గాయాలపాలయ్యారు. ఆ సమయంలో లతా మంగేష్కర్తో పాటు చాలామంది ప్రముఖులు సైనికులను పరామర్శించడానికి బర్మా వెళ్లారు. గాయపడ్డ ఓ సైనికుడు ‘లతాగారిని చూడాలని, ఆమె పాట వినాలని ఉంది’ అని డాక్టర్‌కి చెప్పాడు. లతగారు అతన్ని ఆలింగనం చేసుకుని, ‘ఆరాధన’ సినిమాలోని పాట పాడారు. ఆ పాటతో అతనిలో ఊపిరి వచ్చి కోలుకొని బతికాడు.. దటీజ్ లతా మంగేష్కర్. – ఆర్. నారాయణమూర్తి భారతీయ సినిమా నైటింగేల్ లతా మంగేష్కర్‌ను కోల్పోయినందుకు మాకు చాలా బాధగా ఉంది. మా సంస్థ నిర్మించిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘తెల్ల చీరకు..’ పాటకు మీరు (లతా మంగేష్కర్) ఇచ్చిన వాయిస్ మీతో మాకు ప్రత్యేక అనుబంధాన్ని కలగజేసింది. – వైజయంతి మూవీస్ భారతీయ సంగీతంలో ఆరేడు దశాబ్దాలుగా తన అద్భుత స్వరంతో సంగీత శ్రోతలను మైమరచిపోయేలా చేశారు లతా మంగేష్కర్‌గారు. ఆమె మరణం నాలో ఓ శూన్యతను నెలకొల్పింది. ఈ శోకం నుంచి నేను ఎలా బయటకు రావాలో అర్థం కావడం లేదు. ఒక్క మ్యూజిక్ ఇండస్ట్రీకే కాదు.. ఆమె మరణం ప్రపంచానికే తీరని లోటు. కానీ ఆమెతో కలిసి పని చేశాననే భావన నన్ను కాస్త ఓదార్చుతోంది. మనందరి హృదయాల్లోని లతా మంగేష్కర్ స్థానం ఎవరూ భర్తీ చేయలేనిది. – ఇళయరాజా మా నాన్నగారితో (సంగీతదర్శకుడు ఆర్కే శేఖర్) లతా మంగేష్కర్‌గారు వర్క్ చేశారు. అప్పట్లో నేను ఆమె రికార్డింగ్స్‌ను చూస్తూ ఎంతో స్ఫూర్తి పొందాను. ప్రతి లిరిక్‌ను ఎంతో స్పష్టంగా, ఎంతో బాగా పాడతారామె. భారతీయ సంగీతంలో ఆమె ఓ భాగం. లతగారు పాడిన పాటలకు నేను సంగీతం అందించడం, ఆమెతో కలిసి పాటలు పాడటం, కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం వంటివాటిని నేను మర్చిపోలేను. ఆమె నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. – ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇండస్ట్రీకి బ్లాక్ డే. లతాగారిలాంటి సింగర్ వస్తారా? అనేది నాకో క్వశ్చన్ మార్క్. లతా మంగేష్కర్గారిని రెండుసార్లు కలిసే అవకాశం నాకు లభించింది. ముంబైలోని ఉన్నప్పుడు ఆమె స్టూడియోలో వర్క్ చేసేవాడిని. ఓ సందర్భంలో ఆవిడ అక్కడకు వచ్చారు. అప్పుడు అక్కడి వారు నన్ను ఆవిడకు పరిచయం చేశారు. అంత పెద్ద గాయని అయ్యుండి ‘నమస్తే.. అనూప్ జీ’ అని ఎంతో గౌరవంగా మాట్లాడారు. – అనూప్ రూబెన్స్ భారతదేశం పాటలు పాడుతున్నంత కాలం లతా మంగేష్కర్ జీవించే ఉంటారు. ఆమె అద్భుతమైన సింగరే కాదు. మంచి మానవతావాది కూడా. నా దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం ‘లేకిన్’ (1991)కు లతా మంగేష్కర్ ఓ నిర్మాత. ఆ సినిమా షూటింగ్ సమయంలో చిత్రయూనిట్ సభ్యులకు ఆమె బహుమతులు ఇచ్చారు. ‘లేకిన్’ సినిమాలోని పాటకు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌గా లతా మంగేష్కర్‌కు జాతీయ అవార్డు రావడం హ్యాపీగా ఉంది. గౌతమ బుద్ధుని ప్రతిమలను సేకరించే అలవాటు నాకు ఉందని తెలుసుకున్న ఆమె నాకు నాలుగు బుద్ధుని ప్రతిమలను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆరు నెలల క్రితం కూడా ఆవిడ నాకు ఓ గౌతమ బుద్ధుని ప్రతిమను బహుమతిగా పంపారు. ఆమె వ్యక్తిత్వానికి ఇదో నిదర్శనం. – గుల్జార్ లతా మంగేష్కర్‌గారి మరణం తీరని లోటు. ఆమె పాటలతో పాటు ఆమె వ్యక్తిత్వం కూడా ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. – శత్రుఘ్న సిన్హా కొన్ని రోజుల క్రితం లతా మంగేష్కర్గారితో హాస్పిటల్లో మాట్లాడాను. లతా మంగేష్కర్‌గారు తిరిగి కోలుకుంటారని డాక్టర్స్ చెప్పేవారు. కానీ ఊహించనిది జరిగింది. నా జీవితంలో నన్ను ఎన్నోసార్లు మోటివేట్ చేశారు. ఆవిడతో నాకు మంచి అనుబంధం ఉంది. – ధర్మేంద్ర ఆమె మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఎన్నో శతాబ్దాలు నిలిచి ఉండగల స్వరం మనకు దూరమైపోయింది. ఆ స్వరం ఇప్పుడు స్వర్గంలో ప్రతిధ్వనిస్తోంది. – అమితాబ్ బచ్చన్ లతా మంగేష్కర్‌గారు ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం ఉన్నవారు. ఆమె పాడిన ఎన్నో హిట్ సాంగ్స్‌లో నా పెర్ఫార్మెన్స్ ఉండటాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఫిబ్రవరి 6 బ్లాక్ డే. వ్యక్తిగతంగా కూడా నాకు తీరని లోటు. లతా స్వరం ఇకపై స్వర్గంలో వినిపిస్తుంది. – హేమమాలిని మన నైటింగేల్‌ను మిస్ అవుతున్నాం. కానీ మీ (లతా మంగేష్కర్) స్వరం మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. – సల్మాన్ ఖాన్ -
రాముడి తల్లి?
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రాలన్నీ ప్యాన్ ఇండియావే. ఓం రౌత్ దర్శకత్వం వహించనున్న ‘ఆదిపురుష్’ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు ప్రభాస్. ఈ చిత్రంలో సీనియర్ నటి హేమమాలిని ఓ కీలక పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల చిత్రబృందం ఆమెను సంప్రదించగా, నటించేందుకు పచ్చజెండా ఊపారని టాక్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. హేమ మాలిని రాముడి తల్లిగా కనిపించనున్నారట. రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్, ఓం రౌత్, కిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని 2022 ఆగస్ట్ 11న విడుదల చేయనున్నారు. -
అందరి ముందు నూతన్‌కు ‘ఐ లవ్ యూ’
విలక్షణ నటుడు సంజీవ్ కుమార్‌కు కెరీర్ కలిసొచ్చినట్టుగా ప్రేమ కలిసిరాలేదు. డ్రీమ్‌గర్ల్ హేమమాలిని మీద మనసు పారేసుకున్నాడు.. ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని ఆరాటపడ్డాడు.. ఆమె కోసం పరితపించాడు.. ఒంటరితనాన్ని తోడెంచుకున్నాడు... దాదాపు ముప్పై ఏళ్లు సినీ రంగంలో ఉన్నా లౌక్యం ఒంటబట్టలేదు సంజీవ్ కుమార్‌కు. ఉన్నదున్నట్టు మాట్లాడ్డం అతని గుణం. వచ్చిన కొత్తలోనే ఆనాటికే పేరు ప్రఖ్యాతులున్న నటి నూతన్ (శోభనా సమర్థ్ కూతురు, తనూజ సోదరి, బాలీవుడ్ నటుడు మొహనీశ్ బెహెల్ తల్లి, కాజోల్కు పెద్దమ్మ)ను ఇష్టపడ్డాడు. షూటింగ్ సెట్లోనే అందరి ముందు నూతన్‌కు ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. అప్పటికే వివాహిత అయిన నూతన్‌కు సంజీవ్ కుమార్‌ది పిల్లచేష్టలా తోచింది. కోపంతో అతని చెంప చెళ్లుమనిపించింది. ఆ దెబ్బతో సంజీవ్ కుమార్ జీవితంలో ఎప్పుడూ నూతన్‌కు ఎదురు పడలేదు. (ఆ రెండు ప్రశ్నలకు రియా సమాధానం?) జితేంద్ర మధ్యవర్తిత్వం.. ‘సీతా ఔర్ గీతా’ షూటింగ్ రోజులవి. తొలి రోజే సంజీవ్ కుమార్ మదిలో స్థిరపడిపోయింది హేమమాలిని. భౌతికంగా షూటింగ్లో ఉంటున్నాడు తప్ప అతని డేట్స్ అన్నీ ఆమె తలపులతోనే నిండిపోయాయి. పెదవి విప్పి చెప్పాలంటే భయం. మొదటిసారి ఎదురైన అనుభవం రిపీట్ అయ్యి, రెండో చెంపా చెళ్లుమంటుందేమోనని. అందుకే తనకు, హేమమాలినికీ సన్నిహితుడైన జితేంద్రతో చెప్పాడు తన ఫీలింగ్స్‌ని.. ఆమెకు చేరవేయమని. ప్రేమలో మధ్యవర్తిత్వం కూడదన్న ఎరుక లేక. అయితే సంజీవ్ కుమార్ ప్రేమకు మెసెంజర్‌గా వెళ్లి తాను హేమను ఇష్టపడ్డం మొదలుపెట్టాడు ఆ సరికే శోభ సిప్పీతో డేటింగ్లో ఉన్న జితేంద్ర. ఓ వైపు ‘సీతా ఔర్ గీతా’ పూర్తి కావస్తున్నా హేమ దగ్గర జితేంద్ర తన జిక్ర్ తేలకపోయేసరికి తనే మనసులో మాటను చెప్పేయలనే నిర్ణయానికి వచ్చేశాడు సంజీవ్ కుమార్. ఓ రోజు చెప్పేశాడు కూడా.. ‘హేమాజీ! మీరంటే నాకిష్టం. మీకూ ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని. ‘ఊ.. సరే’ అంటూ సమాధానమిచ్చింది హేమమాలిని. సంజీవ్ కుమార్ సంతోషానికి అవధుల్లేవు. అదెన్నో రోజులు నిలవలేదు. ఈ విషయం హేమమాలిని వాళ్ల అమ్మకు తెలిసి ‘కుమార్‌తో నీ పెళ్లి కుదరదు’ అంటూ హుకుం జారీ చేసింది. ఆ మాటకూ తలొగ్గి సంజీవ్ కుమార్‌కు ‘నో’ చెప్పింది హేమమాలిని. ఇది తెలిసి .. ‘ఐ లవ్ యూ’ అంటూ హేమ ముందుకొచ్చాడు జితేంద్ర... శోభ సిప్పీతో ఉన్న సంబంధాన్ని దాచి. అయితే ఆ నిజాన్ని శోభ సిప్పీనే బయట పెట్టింది హేమమాలిని దగ్గర. ఊహించని ఈ పరిణామానికి కాస్త భంగపడ్డా కోలుకుంది హేమ. కాని.. సంజీవ్ కుమారే కోలుకోలేకపోయాడు. మందును మచ్చిక చేసుకున్నాడు. 1974– 75.. ‘షోలే’ స్క్రిప్ట్ పట్టుకుని సంజీవ్ కుమార్ దగ్గరకు వెళ్లాడు రమేశ్ సిప్పీ. ‘వీరు’ పాత్రను ఆఫర్ చేశాడు. అన్యమనస్కంగా అటూఇటూ కదిలాడు కుమార్. వీరు జత బసంతిగా హేమమాలిని ఓకే అయినట్టు చెవినేశాడు. ఆమెకు దగ్గర కావడానికి దీన్ని ఇంకో చాన్స్‌గా ఉపయోగించుకోవచ్చంటూ కుమార్లో ఆశ పుట్టించాడు సిప్పీ. పాజిటివ్‌గా కదిలాడు కుమార్. అయితే ఆ సమయానికి ధర్మేంద్ర .. హేమమాలిని చేయి అందుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. షోలే స్క్రిప్ట్ పట్టుకుని ధర్మేంద్ర దగ్గరకూ వెళ్లాడు సిప్పీ. ‘ఠాకూర్’ క్యారెక్టర్‌కు మీరైతే బాగుంటుంది’ అంటూ. ఒప్పుకున్నాడు ధర్మేంద్ర. తర్వాత ‘వీరు’ సంజీవ్ కుమార్ వశమైందని తెలిసి, ఆ పాత్ర ఇస్తేనే ‘షోలే’ చేస్తాను లేకుంటే లేదని సిప్పీకి స్పష్టం చేశాడు ధర్మేంద్ర... కుమార్.. హేమను ఇష్టపడుతున్నాడనే స్పృహాతో. మళ్లీ కుమార్‌ను కలిసి జరిగింది వివరించి ‘హేమను కన్విన్స్ చేయడానికి కావల్సింది ఇంకొక్క అవకాశమే కదా ఠాకూర్ రోల్ తీసుకో’ అని సముదాయించాడు సిప్పీ. ‘కానీయ్’ అన్నట్టుగా తలాడించాడు కుమార్. షూటింగ్ ప్రారంభమైంది. కుమార్ ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. హేమ దగ్గర తన ప్రేమను ప్రస్తావించాడు మళ్లీ. ‘కాదన్నాను కదా’ అంది ఆమె. ఇదంతా ధర్మేంద్రకు చేరింది. ఆ సినిమాలో ఠాకూర్, బసంతిల మధ్య ఒక్క సీన్ కూడా ఉండరాదని శాసించాడు స్టార్ హోదాలో ఉన్న అతను. అందుకే ‘షోలే’లో సంజీవ్ కుమార్, హేమమాలినిల మధ్య ఒక్క సీన్ కూడా ఉండదు. రెండోసారీ హేమమాలినితో ‘నో ’ అనిపించుకున్నాక కుంగిపోయాడు సంజీవ్ కుమార్. ఒకింత డిప్రెషన్‌లోకీ వెళ్లాడు. ఆ షాక్ వల్లే అతనికి హార్ట్ ఎటాక్ వచ్చిందనీ అంటారు సినీ విమర్శకులు. సంజీవ్ కుమార్ నవ్వుకి, నటనకు పడిపోయిన నటీమణులెంతమందో. అతను భోజన ప్రియుడని.. అతనికిష్టమైన వంటలను స్వయంగా వండి, షూటింగ్ స్పాట్స్‌కు తెచ్చిస్తూ అతని మీద తమకున్న ఇష్టాన్ని ప్రకటించుకున్నారు. పెళ్లి చేసుకోమని కోరారు. అందరికీ అతని నవ్వే సమాధానమైంది. గుండె మాత్రం హేమ ప్రేమ కోసం తపిస్తూ.. షోలే (జ్వాల)లా రగులుతూనే ఉండింది. దిగులు ఇంట్లోని సంజీవ్ కుమార్‌కు ఆ సమయంలో దొరికిన సాంత్వన సులక్షణా పండిట్. -
డెబ్భై నిండిన డ్రీమ్ గర్ల్
నిజ జీవితంలోనూ నట జీవితంలోనూ హుందాగా ఉండవచ్చని, ఎనలేని కీర్తినీ గౌరవాన్ని పొందవచ్చని నిరూపించిన అతికొద్దిమంది భారతీయ నటీమణులలో హేమమాలిని ఒకరు. అక్టోబర్ 16కు ఆమె 70 ఏళ్లు పూర్తి చేసుకొని 71వ ఏటలోకి ప్రవేశిస్తున్నారు. దేశంలో కుర్రకారు చాలామందిని తమ డ్రీమ్గ ర్ల్స్గా భావించవచ్చు. కాని ‘డ్రీమ్‌గర్ల్’ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఒక్కటే. హేమ మాలిని. దక్షిణాది నుంచి వెళ్లి హిట్ అయిన హీరోయిన్ల వరుసలో హేమమాలినిది సుదీర్ఘ కెరీర్. నిజానికి ఆమెకు హీరోయిన్ పాత్ర కూడా దక్షిణాది హీరోయిన్ వల్లే వచ్చింది. తమిళ, తెలుగు సినిమాల్లో డాన్స్ పాటలు చేసిన (పాండవ వనవాసం) హేమ మాలిని హిందీలో మొదటిసారి ‘సప్నోంకా సౌదాగర్’లో హీరోయిన్ అయారు. ఆ సినిమా హీరో అయిన రాజ్‌కపూర్ హేమమాలినికి స్క్రీన్ టెస్ట్ కోసం ‘సంగమ్’ సినిమాలోని ఒక సీన్ ఇచ్చి చేసి చూపమన్నాడు. ఆ టెస్ట్‌లో ఆమె పాస్ అయ్యారు. రాజ్ కపూర్ సినిమా ప్రమోషన్లో ఘనాపాటి కాబట్టి కొత్త హీరోయిన్నీ తద్వారా సినిమానీ ప్రమోట్ చేయడానికి హేమమాలినిని ‘బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్’గా ప్రచారం చేశాడు. అలా ఆమె డ్రీమ్‌గర్ల్‌గా ముద్రపడింది. ఎంతగా అంటే కొన్నాళ్ల తర్వాత అదే పేరుతో ఆమె హీరోయిన్గా సినిమా వచ్చేంత. దక్షిణాది కథతో తెలుగులో హిట్ అయిన ఎన్.టి.ఆర్ ‘రాముడు భీముడు’ కథనే హీరోయిన్‌కు రాసి సలీమ్ జావేద్ ఆ స్క్రిప్ట్‌ను రమేష్ సిప్పీకి అమ్మితే రమేష్ సిప్పీ హేమ మాలిని డబుల్ యాక్షన్‌తో ఆ సినిమా తీసి హిట్ కొట్టాడు. అలాగే మన తెలుగు సూపర్ హిట్ సినిమా ‘ప్రేమ్‌నగర్’ హిందీలో రీమేక్ అవుతున్నప్పుడు రాజేష్ ఖన్నా సరసన హీరోయిన్ పాత్ర హేమ మాలినికి దక్కింది. తెలుగులో వాణిశ్రీ గొప్పగా చేసిన ఆ పాత్రను హేమ మాలిని హిందీలో నిలబెట్టారు. ఆ తర్వాత వచ్చిన ‘షోలే’తో హేమ మాలిని పూర్తి స్థాయి స్టార్డమ్కు చేరుకున్నారు. ముగ్గురు హీరోలతో హేమ మాలిని ఎక్కువగా దేవ్ ఆనంద్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర సరసన నటించారు. ‘జానీ మేరా నామ్’,‘అందాజ్’, ‘నసీబ్’, ‘క్రాంతి’, ‘సత్తే పే సత్తా’, ‘అంధా కానూన్’ వంటి ఎన్నో హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. గ్లామర్ హీరోయిన్గా ఉన్నప్పటికీ ‘ఏక్ చాదర్ మైలీసీ’ వంటి బలమైన కథాంశం ఉన్న సినిమాలలో నటించి ఆమె పేరు తెచ్చుకున్నారు. హేమ మాలిని తన స్టార్ డమ్‌ను ఎప్పుడూ పోగొట్టుకోలేదు. కొత్త తరం ఎంత వచ్చినప్పటికీ వారితో సమానంగా అమితాబ్ సరసన ‘బాగ్బన్’లో నటించి ఆ సినిమా విజయానికి కారకులయ్యారు. జబ్ తక్ హై జాన్ హేమ మాలిని క్లాసికల్ డాన్సర్. బాల్యం నుంచే ప్రదర్శనలు ఇచ్చారు. అందువల్ల ‘షోలే’ సినిమా క్లయిమాక్స్‌లో గబ్బర్ సింగ్ ముందు ఆమె డాన్స్ చేసే పాట ‘జబ్ తక్ హై జాన్’ చాలా హిట్ అయ్యింది. ఎండలో బండ రాళ్ల మీద ఆమె గొప్ప నర్తనం చూపారు. కాళ్ల కింద గాజుపెంకులు వేస్తే డాన్స్ చేయడం ఆ తర్వాత పదుల సినిమాలో కాపీ అయ్యింది. మన శ్రీను వైట్ల కామెడీ కోసం కూడా ఈ గాజుపెంకుల డాన్స్‌ను ఉపయోగించుకున్నారు. ప్రేమ కథ హేమ మాలినిని వివాహం చేసుకోవడానికి చాలామంది హీరోలు ప్రయత్నించారు. వారిలో సంజీవ్ కుమార్ ఒకడు. ఆ తర్వాత జితేంద్ర ఆ ప్రయత్నం చేశాడు. వాళ్లిద్దరు మద్రాసులో వివాహం చేసుకోవడానికి దాదాపు తేదీ ఖరారు చేశారు. అయితే అప్పటికే ఆమెతో పీకల్లోతు ప్రేమలో ఉన్న ధర్మేంద్ర ఆ పెళ్లి ఆపించి ఆమె తన భార్య అయ్యేలా సఫలం అయ్యాడు. ధర్మేంద్రకు రెండో భార్యగా ఉన్నప్పటికీ వాళ్లిద్దరి సంసార విషయంలో ఎప్పడూ గొడవలు బయటకు రాలేదు. ఇద్దరూ ఆ బంధంలో కొనసాగి ఆ తర్వాత దూరం దూరంగా ఉంటున్నా విమర్శలకు దిగలేదు. ధర్మేంద్ర మొదటిభార్య కుటుంబం హేమ మాలిని నుంచి ధర్మేంద్రను మెల్లగా దూరం చేయడంలో సఫలం అయ్యిందనే చెప్పాలి. వారిరువురూ కలిసి ప్రయివేట్‌గా కనిపించడం అరుదు. భిన్న రంగాల్లో హేమ మాలిని రాజకీయాల్లో ఉన్నారు. మధుర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2014లో 2019లో విజయం సాధించారు. దూరదర్శన్‌లో ‘నుపుర్’ సీరియర్ నిర్మించి, దర్శకత్వం వహించారు. కుమార్తె ఇషాను హీరోయిన్ చేయడానికి సినిమాలు నిర్మించారు. సినిమాలలో ఉన్నా రాజకీయాలలో ఉన్నా నాట్యం పట్ల ఉన్న మక్కువతో ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. – సాక్షి ఫీచర్స్ డెస్క్ -
అమితాబ్‌గా హృతిక్?
బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటించిన తాజాచిత్రం ‘సూపర్ 30’. బీహార్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. దీంతో హృతిక్ నెక్ట్స్ సినిమా ఏంటి? అనే ప్రశ్న బీటౌన్‌లో మొదలైంది. 1982లో అమితాబ్ బచ్చన్, హేమ మాలిని నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సత్తే పే సత్తా’ (1982) రీమేక్‌లో హృతిక్ రోషన్ నటించబోతున్నారని ఖబర్. ఈ సినిమాకు ఫర్హా ఖాన్ దర్శకత్వం వహిస్తారట. దర్శకుడు రోహిత్ శెట్టి ఈ సినిమాను నిర్మిస్తారట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ సినిమాలో హృతిక్ సరసన దీపికా పదుకోన్ హీరోయిన్గా నటించనున్నారని టాక్. -
ఫేజ్ 2 @96 కూటముల కోలాటం
ఏడు దశల పోలింగ్‌లో రెండో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి ఘట్టంలో 91 స్థానాలకు పోలింగ్ జరగ్గా.. రెండో దశలో అంత కంటే కొంచెం ఎక్కువ అంటే.. 96 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌జరగనుంది. మొన్న 11న జరిగిన తొలిదశ పోలింగ్ శాతాన్ని బట్టి(తెలంగాణలో 8 శాతం, ఉత్తరాఖండ్‌లో నాలుగు శాతం తక్కువ)బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని.. మరోసారి అధికారం చేపట్టడం కల్ల అని కొందరు ఇప్పటికే లెక్కలు వేసినా.. వాస్తవం ఏమిటో తేలేది మే 23న మాత్రమే. ఏదెలా ఉన్నప్పటికీ రెండో దశ ఎన్నికలు మొత్తం కూటముల కుప్ప అని స్పష్టమవుతోంది. రాష్ట్రాల వారీగా ఇదీ పరిస్థితి.. తమిళనాట కుంపట్ల మంట దక్షిణాదిలో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం తమిళనాడు. గత ఎన్నికల్లో నాలుగు కూటములు హోరాహోరీగా తలపడ్డాయిక్కడ. ఏఐఏడీఎంకే ఒకవైపు.. డీఎంకే, ఐయూఎంఎల్, వీసీకే ఒక కూటమి గా, బీజేపీ, డీఎండీకే, పీఎంకే, ఐజేకే, పీఎన్కే మరో కూటమిగా.. కాంగ్రెస్, వామపక్షాలు ఇంకో కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయి. దేశవ్యాప్తంగా వీచిన మోదీ హవాను అడ్డుకుని మరీ ఏఐఏడీఎంకే విజేతగా నిలిచింది. 39 స్థానాల్లో 44 శాతం ఓట్లు పోగేసుకుని 37 సీట్లు సాధించింది. మిగిలిన రెండింటినీ బీజేపీ, పీఎంకే పంచుకున్నాయి. రెండేళ్ల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏఐఏడీఎంకే విజయఢంకా మోగించగా.. ఆ తరువాత కొద్దికాలానికే జయలలిత, కరుణానిధి కన్నుమూశారు. రాజకీయ శక్తుల పునరేకీకరణకూ ఆస్కారం కలిగింది. డీఎంకే పగ్గాలు కరుణ కుమారుడు ఎంకే స్టాలిన్‌కు దక్కగా.. ఏఐఏడీఎంకే వారసత్వం మాత్రం గందరగోళానికి దారితీసి, పార్టీ రెండు ముక్కులయ్యేలా చేసింది. ఎట్టకేలకు అధికార పంపిణీపై రాజీ కుదిరిన తరువాత కె.పళనిస్వామి, ఓపీఎస్ పన్నీర్ సెల్వమ్ వర్గాలు రెండూ ఒక్కటయ్యాయి. మరోవైపు జయలలిత సమీప బంధువు టీటీవీ దినకరన్ 18 మంది ఎమ్మెల్యేలతో అమ్మ మక్కళ్ మున్నేట్ర కజగం పేరుతో సొంత కుంపటి పెట్టారు. ఈ లోక్‌సభ ఎన్నికల తరువాత త్వరలో జరిగే 22 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు అటు దినకరన్ పార్టీకి, ఇటు ఏఐఏడీఎంకే మనుగడకూ కీలకంగా మారాయి. బరిలో నాలుగు కూటములు 2019 ఎన్నికల్లోనూ తమిళనాట చతుర్ముఖ పోటీ నెలకొంది. ఏఐఏడీఎంకే కాస్తా ఎన్డీయే పక్షాన చేరిపోగా.. డీఎంకే యూపీఏ వైపు నిలిచింది. సినీ నటుడు కమల్‌హాసన్ పార్టీ మక్కళ్ నీది మయ్యమ్, దినకరన్ పార్టీ కూడా బరిలో నిలిచాయి. ఏఐఏడీఎంకే 20 స్థానాల్లో పోటీ చేస్తుండగా, భాగస్వామ్య పక్షాలైన పీఎంకే (7), బీజేపీ (5), డీఎండీకే (4), తమిళ మానీల కాంగ్రెస్, తమిజగం కచ్చి, పుదియ నీది కచ్చి ఒక్కో సీటుకు పోటీ పడుతున్నాయి. పుదుచ్చేరి నుంచి మరో భాగస్వామ్య పార్టీ ఏఐఎన్ఆర్సీ పోటీ చేస్తోంది. మరోవైపు యూపీఏ కూటమిలో డీఎంకే 20, కాంగ్రెస్ 9 స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా వీసీకే (2), సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, ఐజేకే, కేఎండీకే, ఐయూఎంఎల్ ఒక్కో స్థానంలో పోటీలో ఉన్నాయి. డీఎంకే, ఏఐఏడీఎంకే 8 చోట్ల ముఖాముఖి తలపడుతున్నాయి. కాగా వేలూరు లోక్‌సభ ఎన్నిక చివరి నిమిషంలో వాయిదా పడింది. స్థానికాంశాలే ప్రచారాస్త్రాలు.. తమిళనాట ఎన్నికలు ప్రధానంగా స్థానిక అంశాల ఆధారంగానే జరుగుతుంటాయి. చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న కావేరీ నదీ జలాల వివాదంతోపాటు తూతుక్కుడిలో స్టెరిలైట్ కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్ మూసివేత ఆందోళనలో జరిగిన కాల్పులు ప్రధానాంశాలుగా మారాయి. సేలమ్ –చెన్నై గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంపై పర్యావరణ వేత్తల నుంచి వస్తున్న అభ్యంతరాలు ఎన్నికలపై ప్రభావం చూపవచ్చు. ఈ ఏడాది జరిగిన ప్రపంచ పెట్టుబడుల సదస్సు, గాజా తుపాను విపత్తును సమర్థంగా ఎదుర్కోవడం, మదురైకు ఎయిమ్స్ రావడాన్ని తమ విజయాలుగా ఏఐఏడీఎంకే చెబుతోంటే.. సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలు. పరిపాలన కుంటుపడటాన్ని డీఎంకే ఎత్తి చూపుతోంది. అధికార పార్టీకి మంచి పట్టున్న దక్షిణ తమిళనాడు ప్రాంతంలో దీపావళి టపాకాయల ఫ్యాక్టరీలపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించడంతో వేలాది మంది ఉపాధి కోల్పోగా 2017లో వచ్చిన ఓఖీ తుపాను కారణంగా 191 మంది జాలర్లు మరణించడం ఏఐఏడీఎంకే వైఫల్యాలుగా చూపుతోంది. అన్నిటినీ పరిశీలించిన తరువాత తమిళనాట ఈ దఫా ఎన్నికల్లో డీఎంకేకు ఎక్కువ సీట్లు దక్కవచ్చునని అంచనా. అయితే ఇవి 2004 నాటి స్థాయిలో ఉండవు. ఏఐఏడీఎంకే ఎన్డీయే కూటమి ప్రభావం ఉంటుంది. ఏఐఏడీఎంకే రెండంకెల స్థానాలు కైవశం చేసుకోవచ్చు. కీలక నియోజకవర్గాలు: చెన్నై సెంట్రల్: దయానిధి మారన్ (డీఎంకే) ధర్మపురి: సిట్టింగ్ ఎంపీ అన్బుమణి రామ్‌దాస్ పోటీ చేస్తున్నారు. నీలగిరీస్ (ఎస్సీ): బడగ (ఎస్టీ), అరుంధరియార్లు, వెల్లలా గౌండర్లు (ఓబీసీ) పెద్దసంఖ్యలో గల ఈ స్థానంలో ఏ.రాజా పోటీ చేస్తున్నారు. కోయంబత్తూరు: బీజేపీ, సీపీఎం మధ్య ఇక్కడ ప్రత్యక్ష పోరు నెలకొంది. శివగంగ: కార్తి (కాంగ్రెస్)–హెచ్.రాజ (బీజేపీ) పోటీలో ఉన్నారు. తూతుక్కుడి: కరుణానిధి కుమార్తె కనిమొళి (డీఎంకే), తమిళసాయి సౌందరరాజన్ (బీజేపీ) పోటీ పడుతున్న స్థానమిది. కన్యాకుమారి: పొన్ రాధాకృష్ణన్ (బీజేపీ), హెచ్.వసంతకుమార్ (కాంగ్రెస్) మధ్య ప్రత్యక్ష పోరు.. హిందువులు, క్రిస్టియన్లు సమానంగా ఉన్నారిక్కడ. మహారాష్ట్రలో ఎవరు ‘పది’లం? మహారాష్ట్రలో పది లోక్‌సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఈ పది స్థానాల్లో.. గత ఎన్నికల్లో బీజేపీ, శివసేన తలో నాలుగు సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజేతగా నిలిచింది. ప్రభావం చూపే అంశాలివే.. ►కరువుకు మారుపేరుగా నిలిచే మరాఠ్వాడ ప్రాంతంలో వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు ఈ ఎన్నికల్లో కీలకాంశాలుగా మారాయి. ►వ్యవసాయ సంక్షోభం, తాగునీటి లభ్యత, నిరుద్యోగం, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటిని కాంగ్రెస్, వీబీఏ ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నాయి. పోటీ.. నువ్వా?నేనా? ►బీజేపీ నేత ప్రీతమ్ ముండే పోటీ చేస్తున్న బీడ్ నియోజకవర్గంలో పోటీ ఉత్కంఠ కలిగిస్తోంది. ►దశాబ్దాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న లాతూర్‌లో మచ్చీంద్ర కామత్.. సుధాకర్ శ్రాంగరే (బీజేపీ) మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. వారానికి ఒక్కసారి మాత్రమే తాగునీరు దొరికే లాతూర్‌లో నీటి లభ్యతే ముఖ్యమైన ఎన్నికల అంశం. ►షోలాపూర్‌లో కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే (కాంగ్రెస్), లింగాయత్ వర్గ మఠాధిపతి మహాస్వామి జై సిద్ధేశ్వర్ శివాచార్య (బీజేపీ), అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ (వీబీఏ) మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. దాదాపు నాలుగు లక్షల ఓట్లు ఉన్న లింగాయత్‌లు తమ విజయానికి అక్కరకొస్తారని బీజేపీ ఆశిస్తుండగా మూడు లక్షల మంది ధంగర్లు, 2.50 లక్షల ముస్లింలను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రకాశ్ అంబేడ్కర్ ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు జరిగే స్థానాలు: విదర్భ ప్రాంతంలోని బుల్దానా, అకోలా, అమ్రావతి (ఎస్సీ), మరాఠ్వాడ ప్రాంతంలోని హింగోలి, నాందేడ్, పర్బని, బీడ్, ఒస్మానాబాద్, లాతూర్, రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలోని షోలాపూర్. ‘ఉత్తరాది’ వస్తాదులెవరో? దేశంలోనే అతి ఎక్కువ లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో గురువారం రెండో దశ పోలింగ్ జరగనుంది. ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరగనుండగా, గత ఎన్నికల్లో ఈ ఎనిమిదింటినీ బీజేపీ గెలుచుకుంది. బాలాకోట్ దాడుల తరువాత జరుగుతున్న ఈ ఎన్నికలు కాషాయ పార్టీకి మేలు చేసే అవకాశాలున్నాయి. అయితే ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ పొత్తు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్న కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో యూపీ ఎన్నికలు మతం రంగు పులుముకున్నాయి. ముస్లింలు అందరూ తమ సెక్యులర్ కూటమికి ఓటేయాలన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి పిలుపు విమర్శలకు తావిచ్చింది. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘అలీ వర్సెస్ బజరంగభళి’ వ్యాఖ్య.. ఎన్నికల కమిషన్ ఆయనపై మూడు రోజుల ప్రచార నిషేధాన్ని ప్రకటించేందుకు కారణమైన విషయం తెలిసిందే. మతాల ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎన్నికలు కూటమి లెక్కలను తారుమారు చేసే అవకాశముంది. అలాగే, ఈ ఎనిమిది స్థానాల్లో బీజేపీ ఈసారి కొన్నిటిని కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల మధ్య పొత్తులు పనిచేస్తే.. బీజేపీకి నష్టమే. ►అలీగఢ్‌లో బీజేపీ ఎంపీ సతీశ్ కుమార్ గౌతమ్, బీఎస్పీ అభ్యర్థి అజిత్ బలియాన్, కాంగ్రెస్ అభ్యర్థి బిజేంద్ర సింగ్ మధ్య ముక్కోణపు పోటీ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో ముస్లింలు దాదాపు 20 శాతం మంది ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి ముస్లింలు ఎప్పుడూ గెలుపొందకపోవడం గమనార్హం. 2014లో దళిత, జాఠ్, లోధ్ సామాజిక వర్గాల మద్దతుతో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. ►ఆగ్రాలోనూ బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండగా.. మథురలో సినీ నటి హేమామాలిని బరిలో ఉన్నారు. ఎన్నికలు జరిగే స్థానాలు: నగీనా (ఎస్సీ), అమ్రోహా, పశ్చిమ యూపీలోని అలీగఢ్, హత్రాస్ (ఎస్సీ), మథుర, ఆగ్రా (ఎస్సీ), ఫతేపూర్ సిక్రీ, బులంద్‌షహర్. అస్సాం, బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్.. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంతోపాటు బిహార్, ఒడిశాలోనూ రెండో దశ ఎన్నికల్లో భాగంగా ఐదేసి స్థానాలకు ఈ నెల 18న పోలింగ్ జరగనుంది. అస్సాంలో.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ రాకతో ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. 2014 డిసెంబర్ 31వ తేదీని కటాఫ్‌గా పెట్టి హిందూ, పార్శీ, బౌద్ధులు, జైన్, సిక్కులను అక్రమ వలసదారులుగా గుర్తించేందుకు ఉద్దేశించిన సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ బిల్ (2016) కూడా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశముంది. అనేక ప్రదర్శనలు, ఆందోళనల తరువాత ఇప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నా ఈ అంశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ►బిహార్ తూర్పు ప్రాంతంలోని కిషన్‌గంజ్, కథిహార్, పూర్ణియా, భగల్పూర్, బంకా స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ►ఒడిశాలో బార్‌బాగ్, సుందర్‌గఢ్ (ఎస్టీ), బోలన్‌గిర్, కాంధమాల్, అస్కా పోలింగ్‌కు సిద్ధమయ్యాయి. 2014లో బీజేడీ నాలుగు, బీజేపీ ఒక స్థానం గెలుచుకున్నాయి. ఈసారి బోలన్‌గిర్, అస్కాలలో బీజేపీ, బీజేడీ మధ్య హోరాహోరీ నడుస్తోంది. 1999 నుంచి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గెలుస్తూ వస్తున్న అస్కా నియోజకవర్గంలో ఈసారి ఆ పార్టీ సీనియర్ రామకృష్ణ పట్నాయక్, కాంగ్రెస్ కార్యకర్తల మద్దతుతో రామకృష్ణ పాండా (సీపీఎం) పోటీ చేస్తున్నారు. ►ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్లో మూడేసి స్థానాలకు, జమ్మూ కశ్మీర్లో రెండు, మణిçపూర్, త్రిపురలో ఒక్కో స్థానం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒక స్థానానికి కూడా గురువారమే పోలింగ్ జరగనుంది. రక్తి కట్టిస్తోన్న‘కర్ణాటక’ం కర్ణాటకలో ఈసారి ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. ఈ నెల 18న జరిగే తొలిదశలో రాష్ట్రంలోని మొత్తం 28 నియోజకవర్గాల్లో సగం స్థానాలకు పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోటీ జరగ్గా మోదీ హవాతో బీజేపీ 17 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ ఎనిమిది, జేడీఎస్ రెండు స్థానాలు గెలుపొందాయి. 2004 నుంచి బీజేపీ ఆధిపత్యం సాధిస్తున్న ఈ రాష్ట్రంలో గత ఏడాది తృటిలో అధికారం కోల్పోయింది. ఫలితాలు వెలువడ్డాక కాంగ్రెస్ జేడీఎస్ జట్టుకట్టడంతో బీజేపీ ప్రతిపక్షంగా నిలవాల్సి వచ్చింది. తాజా ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ 18 స్థానాల్లోనూ, జేడీఎస్ పది స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ –జేడీఎస్ కూటమి.. రైతు రుణమాఫీ, ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు అధిష్టానానికి డబ్బులిచ్చానన్న బీఎస్ యడ్యూరప్ప ఆడియో టేపులు బీజేపీని ఇరుకున పెడుతుండగా.. దేశ భద్రత, దేశభక్తి, నరేంద్ర మోదీ శక్తియుక్తుల ఆధారంగా బీజేపీ ఓట్లు అడుగుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ –జేడీఎస్ ఉమ్మడి ఓట్లు పది శాతం వరకూ ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఈసారి కూటమికి 17–20 స్థానాలు దక్కాలి. అయితే భాగస్వామి పక్షాల్లోని లుకలుకలు, ఓట్ల బదలాయింపు, కార్యకర్తల మధ్య సమన్వయం తదితర అంశాలన్నీ తుది ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. ►18న జరిగే ఎన్నికల్లో చామరాజ నగర... సినీనటి సుమలత పోటీ చేస్తున్న మండ్య స్థానాలు కీలకంగా ఉన్నాయి. ►మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తున్న హాసన్, దేవెగౌడ స్వయంగా బరిలోకి దిగుతున్న తుముకూరు కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. లింగాయతులు, ఒక్కళిగలు సమాన సంఖ్యలో ఉన్న తుముకూరులో సిట్టింగ్ ఎంపీ ఎస్.పి.ముద్ద హనుమేగౌడ (కాంగ్రెస్) తిరుగుబాటు చేయడం దేవెగౌడ గెలుపు అవకాశాలపై ప్రభావం చూపే అవకాశముంది. ఎన్నికలు జరిగే స్థానాలు: బెంగళూరులోని నాలుగు స్థానాలతో పాటు తీర ప్రాంతంలోని ఉడుపి చిక్కమగళూరు, దక్షిణ కన్నడ స్థానాలు, హాసన్, చిత్రదుర్గ, తుముకూరు, మండ్య, మైసూరు, చామరాజనగరలు, రాష్ట్ర దక్షిణ ప్రాంతంలోని చిక్కబళ్లాపుర, కోలార్ స్థానాల్లో పోలింగ్ జరగనుంది. 2014 ఎన్నికల్లో.. ఎవరికెన్ని? ►33 ఎన్డీఏ (బీజేపీ–27, భాగస్వామ్య పార్టీలు–6) ►15యూపీఏ (కాంగ్రెస్–12, భాగస్వామ్య పార్టీలు–3) ►02 వామపక్షాలు ►37ఏఐఏడీఎంకే ►10ఇతరులు -
ఆలయనగరిలో... ఎవరిపైనో దేవుడి దయ
శ్రీకృష్ణుడి జన్మస్థలంగా హిందువులు భావించే, ‘టెంపుల్ టౌన్’గా పేరొందిన ఉత్తరప్రదేశ్‌లోని మథుర పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మథురలో ఈసారి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ హేమమాలిని పోటీ చేస్తుంటే, ఆర్ఎల్డీ నుంచి కున్వర్ నరేంద్రసింగ్, కాంగ్రెస్ నుంచి మహేష్ పట్నాయక్ బరిలోకి దిగారు. జాట్ ఓటర్లకు బాగా పట్టున్న ఈ స్థానంలో రెండోసారి ఎంపీ సీటు దక్కించుకోవడానికి సినీ నటి హేమమాలిని గత ఎన్నికల్లో ‘జాట్ బహూ’గా ఈ నియోజకవర్గం ప్రజల మనసు గెలుచుకున్నారు. ఈసారి సైతం గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో 2014 మోదీ వేవ్‌లో బీజేపీ నుంచి మథుర లోక్‌సభకు పోటీ చేసి, అప్పటి ఆర్ఎల్డీ సిట్టింగ్ అభ్యర్థి జయంత్ చౌధరిని ఓడించి హేమమాలిని విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఇక్కడి గెలుపు ఓటములను ప్రభావితం చేయగల జాట్ సామాజిక వర్గం సెంటిమెంట్‌ని గత ఎన్నికల్లో హేమమాలిని వాడుకున్నారు. ‘జాట్ బహూ’ (జాట్ సామాజికవర్గం కోడలు)గా మీ ముందుకొస్తున్నాను. ఆదరించండం’టూ జోరుగా ప్రచారం చేసి విజయాన్ని సాధించగలిగినా ఇప్పుడా సెంటిమెంటు ఓట్లు రాలుస్తుందా లేదా అన్నది అన్ని వర్గాల్లో చర్చనీయాంశమైంది. గెలుపు అంత ఈజీ కాదు.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యావత్ దేశాన్నీ బీజేపీ స్వీప్ చేసిన సందర్భంలో హేమమాలిని గెలుపు సులువైంది. కానీ ఈసారి ఈ స్థానంలో విజయాన్ని చేజిక్కించుకోవడం నల్లేరు మీద నడక మాత్రం కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో బీజేపీపై జాట్ సామాజిక వర్గంలో నెలకొన్న వ్యతిరేక ప్రవాహానికి ఎదురీదడం అంత తేలికేం కాదన్నది స్థానిక పరిశీలకుల అభిప్రాయం. అందుకే హేమమాలిని ఓటర్లను ఆకట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. మథురలో జాట్ ఓటర్లు 4.5 లక్షల మంది ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానంలో గెలుపును ప్రభావితం చేయగలిగిన ఈ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకే అన్ని పార్టీలూ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. 20 శాతం మందిగా ఉన్న జాట్ సామాజిక వర్గం ఇక్కడి గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో ఉంది. మథుర పార్లమెంటు పరిధిలో 70 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారే. ఠాకూర్లు, బ్రాహ్మణులు, షెడ్యూల్డ్ కులాలు ప్రధాన సామాజిక వర్గాలు. కొంత వరకు ముస్లింలు, వైశ్యులు కూడా ఉన్నారు. ప్రముఖ జాట్ నాయకుడు చౌధరీ చరణ్‌సింగ్ ఈ ప్రాంతం వారే కావడం విశేషం. చౌధరి చరణ్‌సింగ్ భార్య గాయత్రీదేవి 1984 ఎన్నికల్లో మథురలో ఓడిపోయారు. ఆయన కుమార్తె గ్యానవతి 2004లో ఓటమి పాలయ్యారు. ఈ రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి మన్వీర్సింగ్ ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే 2009 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం చరణ్‌సింగ్ మనవడు జయంత్ చౌధరి మథుర నుంచి పార్లమెంటుకి సారథ్యం వహించారు. 2014 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ జయంత్ చౌధరీని ఓడించి హేమమాలిని గెలిచారు. ఆమె గెలుపునకు అనేక కారణాలున్నాయనీ, ‘జాట్ బహూ’ సెంటిమెంట్‌తో హేమమాలిని ఎమోషన్ అందుకు బాగా ఉపయోగపడిందనీ జాట్ సామాజిక వర్గానికే చెందిన స్థానికుడు ముఖేష్ చౌధరి అన్నారు. దీనికి తోడు మోదీ ఛరిష్మాకంటే «భర్త ధర్మేంద్రతో బంధం కూడా గత ఎన్నికల్లో పని చేసిందనీ, అయితే ఈసారి అది పనిచేస్తుందో లేదో దేవుడికే తెలియాలని గోవర్ధన్‌లో నివసించే జాట్ సామాజిక వర్గానికి చెందిన ప్రతిమా సింగ్ అభిప్రాయపడ్డారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకంలో భాగంగా 2014లో మథురలోని రావాల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటికీ ఆ గ్రామానికి హేమమాలిని ఒరగబెట్టిందేమీ లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికీ ఆ గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉంటాయనీ, హేమమాలిని ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పని చేయడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
హేమ అడుగుల్లో హెగ్డే
ఆ తరం ప్రేక్షకులను తన నటనతో అలరించి డ్రీమ్‌గాళ్‌గా పేరు సంపాదించారు హేమ మాలిని. ప్రస్తుత తరం హీరోయిన్స్ కూడా హేమ డ్యాన్స్ నుంచి ప్రేరణ పొందుతున్నారనడంలో ఆశ్చర్యం ఏం లేదు. తాజాగా పూజా హెగ్డే కూడా ఈ లిస్ట్‌లోనే ఉన్నానంటున్నారు. పూజా ప్రస్తుతం నటిస్తున్న ఓ సినిమాకి క్లాసికల్ డ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాంగ్ షూట్ చేయాలనుకున్నారట. దాంతో గంటల తరబడి ఆ డ్యాన్స్‌ను నేర్చుకుంటూ శ్రమించడమే కాకుండా హేమ మాలిని పాత సినిమాలను చూస్తున్నారట పూజా. ఈ విషయం గురించి పూజా మాట్లాడుతూ – ‘‘తొలిసారి క్లాసికల్ డ్యాన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాట చేయబోతున్నాను. ఇలాంటి పాటలకు ప్రేరణ అంటే హేమాజీని మించి ఎవరున్నారు? చిన్నప్పటి నుంచి ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగాను. ఆమె డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తుంటాయి. ప్రతి ఎక్స్ప్రెషన్ను కరెక్ట్‌గా స్క్రీన్ మీద చూపిస్తారామె’’ అన్నారు. ఇంతకీ ఏ సినిమాలో ఈ సాంగ్‌కు నర్తిస్తున్నారో మాత్రం పూజా హెగ్డే పేర్కొలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో మహేశ్ ‘మహర్షి’, ప్రభాస్ ‘జాన్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలున్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒక సినిమాలో ఈ పాట ఉంటుందా? వెయిట్ అండ్ సీ. -
స్క్రీన్ టెస్ట్ శ్రీదేవి స్పెషల్ క్విజ్
► ‘సిరిమల్లె పువ్వా...’ అంటూ శ్రీదేవి సందడి చేసిన ‘పదహారేళ్ల వయసు’ సినిమా దర్శకుడెవరు? ఎ) బాలచందర్ బి) కె. రాఘవేంద్రరావు సి) కె.విశ్వనాథ్ డి) భారతీరాజా ► మా ‘బంగారక్క’ సినిమాలో శ్రీదేవి సరసన నటించిన హీరో ఎవరు? ఎ) చంద్రమోహన్ బి) మురళీమోహన్ సి) మోహన్‌బాబు డి) శోభన్‌బాబు ► శ్రీదేవి కనిపించబోతున్న చివరి సినిమా? ఎ) దబాంగ్ 3 బి) థగ్స్ ఆఫ్ హిందోస్తాన్ సి) గోల్డ్ డి) జీరో ► బాలీవుడ్లో ఏ హీరోతో శ్రీదేవి ఎక్కువ సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) మిథున్ చక్రవర్తి బి) జితేంద్ర సి) రిషీ కపూర్ డి) అమితాబ్ బచ్చన్ ► శ్రీదేవి ఒకప్పటి స్టార్ కమెడియన్ సరసన హీరోయిన్గా నటించారు. ఎవరా హాస్యనటుడు? ఎ) రేలంగి బి) రాజబాబు సి) రమణారెడ్డి డి) పద్మనాభం ► ‘మామ్’ శ్రీదేవికి 300వ చిత్రం. ఆ చిత్రానికి సంగీత దర్శకుడెవరు? ఎ) విశాల్ శేఖర్ బి) ఏ.ఆర్. రెహమాన్ సి) ఇళయరాజా డి) దేవిశ్రీ ప్రసాద్ ► శ్రీదేవి ముద్దు పేరేంటో తెలుసా? ఎ) మున్నీ బి) చిన్ని సి) బుజ్జి డి) పప్పీ ► శ్రీదేవి నటించిన ‘మిస్టర్ ఇండియా’కు నిర్మాత ఎవరు? ఎ) యశ్ రాజ్ బి) బోనీ కపూర్ సి) యశ్ జోహార్ డి) సాజిద్ నడియాడ్వాలా ► శ్రీదేవితో 24 సినిమాలు చేశాను. తను ఒప్పుకుంటే 25వ సినిమా కూడా తీస్తానని ఇటీవల ప్రకటించిన టాలీవుడ్ దర్శకుడెవరు? ఎ) కె.బాపయ్య బి) కె.రాఘవేంద్రరావు సి) కె.యస్.ఆర్. దాస్ డి) కె.చంద్రశేఖర్ రెడ్డి ► ‘2002 వరకు చూడలేదే ఇంత సరుకు..’ అంటూ చిన్న యన్టీఆర్, ఆర్తీ అగర్వాల్ స్టెప్పులేసిన సాంగ్ పెద్ద యన్టీఆర్, శ్రీదేవి నటించిన ఓ సూపర్‌హిట్ సాంగ్‌కు రీమిక్స్. అది ఏ పాటో కనుక్కోండి? ఎ) ఆకుచాటు పిందె తడిచే బి) ఇది ఒకటో నంబర్ బస్సు సి) జాబిలితో చెప్పనా డి) తెల్లా తెల్లని చీరలోని చందమామ ► ‘బాబు’ అనే తమిళ సినిమాలో ఈ నలుగురి నటుల్లో ఒక నటుడికి శ్రీదేవి కూతురిగా నటించింది. ఆ నటుడెవరు? ఎ) రజనీకాంత్ బి) చారుహాసన్ సి) కమల్‌హాసన్ డి) శివాజీగణేశన్ ► తెలుగులో శ్రీదేవితో 31 సినిమాల్లో కలిసి నటించిన హీరో ఎవరో తెలుసా? ఎ) కృష్ణ బి) కృష్ణంరాజు సి) యన్టీఆర్ డి) అక్కినేని నాగేశ్వరరావు ► బాలీవుడ్లో శ్రీదేవి ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారో తెలుసా? ఎ) 5 బి) 4 సి) 11 డి) 7 ► తెలుగు ‘పదహారేళ్ల వయసు’ తమిళ మాతృక ‘పదినారు వయదినిలే’కి శ్రీదేవి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా? (ఇందులో నటించిన రజనీకాంత్ పారితోషికం కంటే ఆమెకు 6 వేల రూపాయలు ఎక్కువ) ఎ) 25,000 బి) 15,000 సి) 12,000 డి) 9,000 ► శ్రీదేవి బాల నటిగా తెరంగేట్రం చేసినప్పుడు ఆమె వయసెంత? ఎ) 3 బి) 2 సి) 6 డి) 4 ► సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేలోపు ఫస్ట్ ఇన్నింగ్స్‌కి ఫుల్స్టాప్ పెట్టిన మధ్యలో శ్రీదేవి కనిపించిన టీవీ షో పేరేంటి? ఎ) బిగ్ బాస్ బి) కౌన్ బనేగా కరోడ్‌పతి సి) మాలినీ అయ్యర్ డి) దస్ కా దమ్ ► శ్రీదేవి నటిగానే మనకు తెలుసు కానీ మనకు తెలియని ఒక అద్భుతమైన టాలెంట్ ఆమెలో దాగి ఉంది. అదేంటో మీకు తెలుసా? ఎ) సింగింగ్ బి) రైటింగ్ సి) పెయింటింగ్ డి) టెన్నిస్ ప్లేయర్ ► శ్రీదేవి హిందీ పరిశ్రమకి వెళ్లిన కొత్తలో ఆమె చేసిన పాత్రకు ఫేమస్ హీరోయిన్ డబ్బింగ్ చెప్పారు. ఎవరా హీరోయిన్? ఎ) హేమ మాలినీ బి) రేఖ సి) జయాబచ్చన్ డి) మీనాక్షి శేషాద్రి ► ఎన్టీఆర్ మనవరాలిగా శ్రీదేవి నటించిన ఈ స్టిల్ ఏ చిత్రంలోనిది? ఎ) తునైవన్ బి) బడిపంతులు సి) నా తమ్ముడు డి) బాబు ► శ్రీదేవి నటించిన సూపర్‌హిట్ సినిమాలోని స్టిల్ ఇది. ఈ సినిమా పేరేంటి? ఎ) ఆఖరి పోరాటం బి) క్షణ క్షణం సి) గోవిందా గోవిందా డి) జగదేక వీరుడు – అతిలోక సుందరి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే...మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) బి 3) డి 4) ఎ 5) బి 6) బి 7) డి 8) బి 9) బి 10) ఎ 11) డి 12) ఎ 13) డి14) డి 15) డి 16) సి 17) సి 18) బి 19) బి20) (డి) -
కుక్క అనుకొని చిరుతపైకి వెళ్లిన ఎంపీ గార్డు
సాక్షి, న్యూఢిల్లీ : అప్పటి వరకు విధుల్లో ఉన్న అటవీశాఖ అధికారులు అలసిపోయి గాఢ నిద్రలోకి వెళ్లారు. అంతలోనే ఫోన్.. చిరుత పులి వచ్చిందని.. వెంటనే రావాలని. అయితే, సామాన్యుల నుంచి ఫోన్ వస్తే కాస్తంత ఆలస్యం చేసేవారేమోగానీ ఫోన్ వెళ్లింది మాత్రం ఓ ఎంపీ ఇంటి నుంచి.. అవును గురువారం రాత్రి ప్రముఖ బాలీవుడ్ నటి, ఎంపీ హేమమాలిని ఇంటి నుంచి చిరుతపులి వచ్చిందంటూ అటవీశాఖ అధికారులకు ఫోన్ వచ్చింది. దాంతో ఉరుకులు పరుగుల మీద వారు అక్కడికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి గుర్గావ్లోని హేమ ఇంటి ముందు వాచ్మెన్ కూర్చొని ఉండగా ఓ చిరుతపులి ఆ వైపుగా వచ్చింది. ఆమె ఉంటున్న కాలనీలో కలియ దిరిగింది. తొలుత కుక్కేమో అనుకొని లాఠీతో తరిమే ప్రయత్నం చేసేందుకు వెళ్లిన వాచ్మెన్ అది చిరుత అని గమనించాడు. వెంటనే ఈ విషయం చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. దీంతో వారంతా అక్కడికి చేరుకొని చిరుతను పట్టుకునే ప్రయత్నం చేయగా అది తప్పించుకుంది. సాధారణంగా తిరమే ప్రయత్నం చేసినప్పుడు, వాటిని బంధించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే చిరుత పులులు దాడులు చేస్తాయని అధికారులు చెప్పారు. చిరుత పులులు వచ్చినప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో వివరించి వెళ్లారు. -
విరబూసిన హేమంతం
బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా ఆవ పొలాలు కనిపిస్తుంటాయి. ఎల్లో, గ్రీన్ మిక్సయి.. హీరో హీరోయిన్ల చిరునవ్వులకు ఆ పొలాలు అందాలను యాడ్ చేస్తుంటాయి. ఆ పొలాలంటే హేమమాలినికి చాలా ఇష్టం. ౖటñ మ్ దొరికితే పక్షిలా ఎగిరిపోతారు! అయితే ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడికీ ఎగిరిపోడానికి లేదు. యు.పి.లోని మధుర నియోజకవర్గం ఎంపీ హేమమాలిని. సభలో మాట్లాడవలసినవి ఎన్నో ఉంటాయి. రూలింగ్ పార్టీ ఎంపీ కూడా కనుక పార్లమెంటుకు డుమ్మా కొడితే సెటైర్లు కొట్టడానికి అపోజిషన్ రెడీగా ఉంటుంది. అయినప్పటికీ.. హేమ సడెన్‌గా ఈ మధ్య ఎక్కడివో ఆవ పొలాల్లోకి వెళ్లొచ్చారు! ఓ ఫొటో కూడా తీయించుకున్నారు. గ్రీన్ కలర్ సిల్క్ శారీలో నవ్వుతూ నిలబడితే పొలం మధ్యలో విరబూసిన పుష్పంలా ఉన్నారు హేమ! ‘మధుర శివార్లలో ఎకరాల కొద్దీ ఉన్న అందమైన ఆవ పొలాల మధ్యన’ అంటూ ట్విట్టర్లో ఆ ఫొటో పెట్టి, కామెంట్ పోస్ట్ చేశారు హేమ. ‘ఉండే పనులు ఉంటూనే ఉంటాయి. ఊహించని ఒత్తిళ్లు వచ్చి పడుతూనే ఉంటాయి. అయినా తీరిక చేసుకోవాలి. ప్రకృతిలో విహరించి రావాలి. ప్రకృతి మనల్ని సేద తీరుస్తుంది. మన చింతల్ని దూరం చేస్తుంది’ అని హేమ తరచూ అంటుంటారు. అంతెందుకు? ఈ ఫొటో చూసి మీరు రిఫ్రెష్ అయ్యారు కదా! అదీ.. పవర్ ఆఫ్ ప్రకృతి. -
హేమామాలినికి షాకిచ్చిన దొంగలు
ముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని ఇంట్లో దొంగలు పడ్డారు. ఆమె వస్తువులను దాచుకునే ప్రత్యేక ఇంటికిలో దాదాపు రూ.90 వేల విలువైన సామాను దోచుకెళ్లారు. ఆ ఇంటికి కాపలా కాస్తున్న వ్యక్తే ఈ పనిచేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. షూటింగ్‌లకు ఉపయోగించే వస్తువులు, షోస్ అన్నీ ఎత్తుకెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటన ఆరు రోజుల కిందటే జరిగినప్పటికీ ఆలస్యంగా నేడు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. పోలీసులు వివరాల ప్రకారం ముంబయిలోని పశ్చిమ అంధేరి ప్రాంతంలోని డీఎన్ నగర్లో హేమమాలిని వస్తువులను భద్రపరుచుకునే గోదాము ఉంది. అందులో కాస్ట్యూమ్స్, షూటింగ్‌లకు ఉపయోగించే జ్యువెలరీ, ప్రాప్స్, ఇతర వస్తువులు అన్నింటిని ఎత్తుకెళ్లిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ గోదాముకు కాపాలకాసే వ్యక్తి కనిపించకుండా పోవడంతో ప్రస్తుతం అతడికోసం లుకౌట్ నోటీసులు అంటించి గాలిస్తున్నారు. -
‘మా రెమ్యూనరేషన్ పల్లీలతో సమానం’
సాక్షి,ముంబయిః బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమమాలిని ఇప్పటి నటుల పారితోషికంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పుడు ప్రముఖ తారనై ఉంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించారు. ‘ ఇప్పుడు పారితోషికాలు భారీగా ఉంటున్నాయి..కానీ తనకు ఇచ్చేవి మాత్రం పల్లీలతో సమానం...20, 30 ఏళ్ల కిందట తాను చేసిన సినిమాలకు తిరిగి చెల్లించా’లని హేమమాలిని చమత్కరించారు. ప్రస్తుత తరం నటులపై మాట్లాడుతూ ఇప్పటి యువతరం తమదైన శైలిలో దూసుకుపోతున్నారని, అంకితభావం అనేది వారికి దానంతటదే అలవడుతుందని చెప్పారు. పరిణితి చెందిన దశలో తామూ సమాజానికి కొంత మేలు చేయాలనే ఆలోచన కలుగుతుందన్నారు. -
‘బాంబ్’ పేల్చిన హేమమాలిని
ముంబై: ‘ఈ రోజుల్లో నా వయస్సున్న తారలతోని బాలివుడ్లో ఎవరూ సినిమాలు తీయాలనుకోవడం లేదు. ఇప్పటికి కూడా మేము మా భుజాలపై సినిమాను మోయగలం. అదీ చాలా సునాయసంగా, నన్ను నమ్మండి! మరీ, పాత తరానికి చెందిన మాకే సినిమాను నడిపించగలం అనే నమ్మకం ఉన్నప్పుడు, మాలాంటి వాళ్లను బాలివుడ్ ఎందుకు తీసుకోవడం లేదు. ప్రముఖ పాత్రల్లో వృద్ధ తారలను చూడడం ప్రేక్షకులకు ఇష్టం లేకనా, దర్శక, నిర్మాతలకే మమ్మల్ని తీసుకోవడం ఇష్టం లేదా ? వృద్ధ తారలను తీసుకోకపోవడానికి సంబంధించి పరిశ్రమలో ఇటీవల వినిపిస్తున్న కథనాలే కారణమా?’ అంటూ అలనాటి డ్రీమ్‌గర్ల్ హేమమాలిని ‘ముంబై మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాంబు పేల్చారు. నర్మగర్భంగా ఆమె మాట్లాడిన ఇటీవల వినిపిస్తున్న కథనాలే అన్న వ్యాఖ్యం వెనక సంచలనాత్మక విషయం ఏమిటో తెల్సిందే. వయస్సులో ఉన్న అందమైన ఆడపిల్లలనే పరిశ్రమ ప్రోత్సహించడానికి కారణం సెక్స్ కోరికలు తీర్చుకోవడానికేనన్న విషయం విదితమే. సెక్స్‌కు ఒప్పుకుంటేనే సినిమా ఛాన్సులిస్తామంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారంటూ బాలివుడ్లోనే కాకుండా టాలీవుడ్ వర్ధమాన తారలు సైతం ఇటీవల బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ‘ఛాన్స్ ఇస్తే ఛాన్స్ ఇస్తామంటున్నారు’ అని టాలీవుడ్లో రాయ్ లక్ష్మీ ఇటీవలనే వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. అనుష్క శర్మ కూడా ఇటీవల ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ‘మగవాళ్లు ముసలోళ్లయినా సరే ఇంకా హీరోలుగానే వస్తారు. అందరూ సూపర్ హీరోలు కూడా ఉన్నారు. మరి మహిళలను ఒక వయస్సు దాటినంకా ఎందుకు తీసుకోరు? అంతర్లీనంగా ఉండే సెక్స్ కోరికలే కారణమా?’ అని ఆమె వ్యాఖ్యానించారు. జూహీ చావ్లా, టబూ, మాధురి దీక్షిత్, ప్రీతి జింటా లాంటి వారు హీరోయిన్గా ఎందుకు సినిమాలు రావడం లేదని బాలివుడ్‌ను కొంత మంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ పైత్యం బాలివుడ్ కన్నా దక్షిణాది సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. శ్రీదేవీ నటించిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’, రాణి ముఖర్జీ నటించిన ‘మర్ధాని’ సినిమాలు అప్పుడప్పుడయినా బాలివుడ్లో కనిపిస్తున్నాయి. దక్షిణాదిలో మచ్చుకైనా కనిపించడం లేదు. -
పాప తండ్రే కారణం..
ముంబై: రోడ్డు ప్రమాదంలో గాయపడి, కోలుకున్న బిజెపి ఎంపి, ప్రముఖ సినీ నటి హేమమాలిని తొలిసారిగా నోరు విప్పారు. శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యి ఇంటికి చేరిన మరునాడు ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. రోడ్డు ప్రమాదంలో చిన్నారి చనిపోవడానికి ఆ పాప తండ్రే కారణమని హేమమాలిని బుధవారం తన ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఆయన ట్రాఫిక్ నిబంధనలు పాటించి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదికాదని ఆరోపించారు. 'చిన్నారి మరణం నన్ను చాలా బాధపెట్టింది. ఆ పాప తండ్రి ట్రాఫిక్ నియమాలను పాటించి ఉంటే ఆ చిన్నారి బతికి ఉండేదని హేమమాలిని ట్విట్ చేశారు. అంతేకాకుండా సెన్సేషన్ కోసం పాకులాడే మీడియా ఈ ఘటనను అనసరంగా రాద్ధాంతం చేసిందని మడిపడ్డారు. మానవత్వాన్ని మరిచి ప్రవర్తించిన అలాంటి వారిపట్ల విచారం వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేనన్నారు. తన క్షేమం కోసం, ఆరోగ్యం కోసం ఆరాటపడిన అభిమానులు, ఆప్తులందరికీ ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రమాదం మూలంగా తనపై అభిమానులకు ఎంత ప్రేమ ఉందో స్పష్టమైంని, ఇందుకు తనకు చాలా సంతోషంగా ఉందని హేమమాలిని పేర్కొన్నారు. కాగా ఆగ్రా నుంచి జైపూర్ వెళుతుండగా రాజస్థాన్‌లోని దౌసా దగ్గర హేమమాలిని ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారును మారుతి ఆల్టో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల పాప చనిపోగా, హేమమాలినితో పాటు ఐదురుగు గాయపడ్డారు . ఈ కేసులో హేమమాలిని డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రమాదం జరిగినపుడు హేమ తమను పట్టించుకోలేదని, సమయానికి పాపను ఆసుపత్రికి తరలించి ఉంటే బతికేదని చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
ఆస్పత్రి నుంచి హేమామాలిని డిశ్చార్జీ
జైపూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్, బీజేపీ ఎంపీ హేమా మాలిని శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాజస్తాన్‌లోనో దౌసా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఓ ఆల్టో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన హేమ మాలినికి....... ఫోర్టిస్ అస్పత్రిలో చికిత్స అందించారు. తర్వాత కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు హేమామాలిని డిశ్చార్జ్ చేసినట్లు ఫోర్టిస్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ప్రమాద సమయంలో హేమామాలిని వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దౌసా వద్ద హేమామాలిని ప్రయాణిస్తున్న బెంజ్ కారు మితిమీరిన వేగంతో ఓ ఆల్టో కారును ఢీకొట్టడంతో కారులోని వ్యక్తులకు గాయాలయ్యాయి. అందులో రెండేళ్ల చిన్నారి సోనమ్ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఐతే ప్రమాదం తర్వాత హేమామాలినిగాయపడినవారిని పట్టించుకోకుండానే వెళ్లిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా గాయపడిన వారి క్షేమసమాచారాల గురించి కానీ, వారికి చికిత్స గురించి కానీ పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. తాను మాత్రం మెరుగైన చికిత్స కోసం ప్రైవేటుకు ఆస్పత్రికి వెళ్లారని, బాధితులను మాత్రం గాలికొదిలేశారని ప్రత్యక్ష్యసాక్షులు ఘాటుగా విమర్శిస్తున్నారు. ప్రమాదంలో హేమామాలినికి కూడా గాయాలైన మాట వాస్తవమే అయినా...... కనీసం బాధితుల గురించి అడిగి ఉండాల్సిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఐతే హేమామాలిని కుమార్తె ఈషాడియోల్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. -
హేమమాలిని కారు డ్రైవర్ అరెస్టు
జైపూర్: సీనీనటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కారు డ్రైవర్ మహేశ్ ఠాకూర్ ను శుక్రవారం ఉదయం రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఐపీసీ సెక్షన్ 304 ఏ ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. గత రాత్రి మధుర నుంచి జైపూర్‌కు వెళుతుండగా... దౌసా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంపీ హేమమాలిని తీవ్రంగా గాయపడగా, ఓ నాలుగేళ్ల బాలిక దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఎంపీ కారును డ్రైవర్ మహేశ్ మితిమీరిన వేగంతో నడపడం వల్లే ప్రమాదం జరిగిందని, చిన్నారి మృతికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన చిన్నారి కుటుంబానికే చెందిన మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్త కూడదనే ఉద్దేశంతోనే పోలీసులు ఎంపీ కారు డ్రైవర్ ను అరెస్టు చేసినట్లు సమాచారం. మధుర నుంచి జైపూర్ వెళుతుండగా ఆమె ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు దౌసా వద్ద ఎదురుగా వస్తున్న ఆల్టో ఢీ కొన్నాయి. నుదుటికి తీవ్ర గాయాలైన హేమమాలినిని జైపూర్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె కనుబొమ్మల వద్ద కుట్లు వేసి, స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించారు. -
హేమామాలిని కనిపించడం లేదు!
"నటి, డ్రీమ్ గర్ల్, ఎంపీ హేమామాలిని కనిపించడం లేదు." ఇప్పుడీ పోస్టర్లు ఆమె నియోజకవర్గం మథుర అంతటా దర్శనమిస్తున్నాయి. మూడు లక్షల ఓట్లతో ఘనవిజయం సాధించిన తరువాత హేమా మాలిని ఒక్కసారి ముఖం చూపించింది. ఆ తరువాత మథుర నియోజకవర్గాన్ని మరిచిపోయింది. దీంతో మథురకి చెందిన వివిధ సంస్థలు నియోజకవర్గ బిజెపి కార్యాలయానికి ఒక మెమొరాండం కూడా ఇచ్చి, మా ఎంపీ అసలెక్కడుందో చెప్పండని డిమాండ్ చేశాయి. ఈమెకన్నా స్మృతి ఇరానీ నయం. ఆమె మంత్రిగా ఉన్నా నెలకో సారి అమేఠీ నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు. కొందరు హేమా మాలిని దిష్టి బొమ్మను కూడా తగలబెట్టారట. -
తారలు హిట్!.. ఫట్!!
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో వివిధ పార్టీల తరఫున ఎంపీ స్థానాల్లో పోటీకి దిగిన సినీతారల్లో కొందరిని విజయం వరించగా, మరి కొందరు అపజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. విజయం వరించిన తారలు: హేమమాలిని, శతృఘ్నసిన్హా, పరేశ్ రావల్, వినోద్ ఖన్నా, కిరణ్‌ఖేర్, మనోజ్ తివారీ(బీజేపీ), మూన్‌మూన్‌సేన్ (తృణమూల్), ఇన్నోసెంట్ (స్వతంత్ర). ఓడినతారలు: నగ్మా, కునాల్‌సింగ్, రాజ్ బబ్బర్(కాంగ్రెస్), స్మృతి ఇరానీ(బీజేపీ), జయప్రద(ఆర్ఎల్డీ), రాఖీసావంత్ (రాష్ట్రీయ ఆమ్ పార్టీ), -
మధురలో హేమమాలినికి పట్టం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బీజేపీ పవనాలు వీస్తున్నాయి. బీజేపీ నాయకులు పలు నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నారు. కాన్పూర్‌లో మురళీ మనోహర్ జోషి 32 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీలో ఉన్నారు. మధురలో హేమమాలిని 56 వేలపైగా ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. లక్నోలో బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ 14 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీలో ఉన్నారు. చాందిని చౌక్‌లో కపిల్ సిబల్పై బీజేపీ అభ్యర్థి హర్షవర్థన్ ఆధిక్యంలో ఉన్నారు.