‘బాంబ్’ పేల్చిన హేమమాలిని
‘బాంబ్’ పేల్చిన హేమమాలిని
Published Fri, May 19 2017 1:32 PM | Last Updated on Tue, Sep 5 2017 11:31 AM
ముంబై: ‘ఈ రోజుల్లో నా వయస్సున్న తారలతోని బాలివుడ్‌లో ఎవరూ సినిమాలు తీయాలనుకోవడం లేదు. ఇప్పటికి కూడా మేము మా భుజాలపై సినిమాను మోయగలం. అదీ చాలా సునాయసంగా, నన్ను నమ్మండి! మరీ, పాత తరానికి చెందిన మాకే సినిమాను నడిపించగలం అనే నమ్మకం ఉన్నప్పుడు, మాలాంటి వాళ్లను బాలివుడ్ ఎందుకు తీసుకోవడం లేదు. ప్రముఖ పాత్రల్లో వృద్ధ తారలను చూడడం ప్రేక్షకులకు ఇష్టం లేకనా, దర్శక, నిర్మాతలకే మమ్మల్ని తీసుకోవడం ఇష్టం లేదా ? వృద్ధ తారలను తీసుకోకపోవడానికి సంబంధించి పరిశ్రమలో ఇటీవల వినిపిస్తున్న కథనాలే కారణమా?’ అంటూ అలనాటి డ్రీమ్‌గర్ల్ హేమమాలిని ‘ముంబై మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాంబు పేల్చారు.
నర్మగర్భంగా ఆమె మాట్లాడిన ఇటీవల వినిపిస్తున్న కథనాలే అన్న వ్యాఖ్యం వెనక సంచలనాత్మక విషయం ఏమిటో తెల్సిందే. వయస్సులో ఉన్న అందమైన ఆడపిల్లలనే పరిశ్రమ ప్రోత్సహించడానికి కారణం సెక్స్ కోరికలు తీర్చుకోవడానికేనన్న విషయం విదితమే. సెక్స్‌కు ఒప్పుకుంటేనే సినిమా ఛాన్సులిస్తామంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారంటూ బాలివుడ్‌లోనే కాకుండా టాలీవుడ్ వర్ధమాన తారలు సైతం ఇటీవల బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ‘ఛాన్స్ ఇస్తే ఛాన్స్ ఇస్తామంటున్నారు’ అని టాలీవుడ్‌లో రాయ్ లక్ష్మీ ఇటీవలనే వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.
అనుష్క శర్మ కూడా ఇటీవల ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ‘మగవాళ్లు ముసలోళ్లయినా సరే ఇంకా హీరోలుగానే వస్తారు. అందరూ సూపర్ హీరోలు కూడా ఉన్నారు. మరి మహిళలను ఒక వయస్సు దాటినంకా ఎందుకు తీసుకోరు? అంతర్లీనంగా ఉండే సెక్స్ కోరికలే కారణమా?’ అని ఆమె వ్యాఖ్యానించారు. జూహీ చావ్లా, టబూ, మాధురి దీక్షిత్, ప్రీతి జింటా లాంటి వారు హీరోయిన్‌గా ఎందుకు సినిమాలు రావడం లేదని బాలివుడ్‌ను కొంత మంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ పైత్యం బాలివుడ్ కన్నా దక్షిణాది సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. శ్రీదేవీ నటించిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’, రాణి ముఖర్జీ నటించిన ‘మర్ధాని’ సినిమాలు అప్పుడప్పుడయినా బాలివుడ్‌లో కనిపిస్తున్నాయి. దక్షిణాదిలో మచ్చుకైనా కనిపించడం లేదు.
Advertisement
Advertisement