mumbai mirror interview
-
గుడ్‌బై చెప్పిన ‘ముంబై మిర్రర్’
సాక్షి, న్యూఢిల్లీ : ఎంతో పాఠకాదరణ పొందిన టాబ్లాయిడ్ దిన పత్రికలు ‘ముంబై మిర్రర్’, ‘పుణే మిర్రర్’ డిసెంబర్ 5వ తేదీ, శనివారం నాటి సంచికతో సెలవు తీసుకున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతినడంతో వీటిని మూసివేయక తప్పలేదని వీటిని ప్రచరిస్తున్న ‘టైమ్స్ గ్రూప్’ ప్రకటించింది. ఇక నుంచి ముంబై మిర్రర్‌ను వార పత్రికగా మారుస్తామని, ఆన్లైన్ పత్రిక ఎప్పటిలాగా కొనసాగుతుందని టైమ్స్ గ్రూప్ తెలిపింది. (పార్టీ ఓ పెద్ద కుటుంబం: సోనియా గాంధీ) కరోనా మహమ్మారి ప్రభావం వల్ల ఏడాది కాలంలోనే ముంబై నగరంలో మూడు ఆంగ్ల పత్రికలు మూత పడ్డాయి. ‘ది ఆఫ్టర్నూన్ డిస్పాచ్ అండ్ కొరియర్’ 2019, జూలై నెలలో మూతపడగా, డీఎన్ఏ పత్రిక 2019, అక్టోబర్ నెలలో మూత పడింది. ఈ పత్రికల మూతతో ఎన్నో మంది పాత్రికేయులు రోడ్డున పడగా, ముంబై మిర్రర్ మూతతో 1.6 కోట్ల మంది పాఠకులు నష్టపోతున్నారు. (పరువు నష్టం: సారీ చెప్పిన సీనియర్ నేత) ‘స్థానిక పౌర సమస్యలను ఎప్పటికప్పుడు పాఠకులతొ పాటు పాలకుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఆ సమస్యలకు ఎవరు బాధ్యులో, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో, ఎలా పరిష్కరించాలో కూడా సూచనలు చేసే ప్రజల పత్రిక మూత పడడం బాధాకరమే’ అని ముంబై మిర్రర్ మూసివేతపై ‘ప్రాజెక్ట్ ముంబై’ ఎన్జీవో వ్యవస్థాపకులు శిశిర్ జ్యోషి వ్యాఖ్యానించారు. ప్రధాన జాతీయ ఆంగ్ల పత్రికలు ఆర్థిక భారం వల్ల తమ సిటీ ఎడిషన్ పేజీలను బాగా తగ్గించగా, మిర్రర్, ఆఫ్టర్నూన్, డీఎన్ఏ పత్రికల మూతతో జర్నలిస్టు మిత్రులకే కాకుండా ప్రజలకు కూడా నష్టం వాటిల్లిందని ప్రముఖ జర్నలిస్ట్ కల్పనా శర్మ వ్యాఖ్యానించారు. -
‘బాంబ్’ పేల్చిన హేమమాలిని
ముంబై: ‘ఈ రోజుల్లో నా వయస్సున్న తారలతోని బాలివుడ్లో ఎవరూ సినిమాలు తీయాలనుకోవడం లేదు. ఇప్పటికి కూడా మేము మా భుజాలపై సినిమాను మోయగలం. అదీ చాలా సునాయసంగా, నన్ను నమ్మండి! మరీ, పాత తరానికి చెందిన మాకే సినిమాను నడిపించగలం అనే నమ్మకం ఉన్నప్పుడు, మాలాంటి వాళ్లను బాలివుడ్ ఎందుకు తీసుకోవడం లేదు. ప్రముఖ పాత్రల్లో వృద్ధ తారలను చూడడం ప్రేక్షకులకు ఇష్టం లేకనా, దర్శక, నిర్మాతలకే మమ్మల్ని తీసుకోవడం ఇష్టం లేదా ? వృద్ధ తారలను తీసుకోకపోవడానికి సంబంధించి పరిశ్రమలో ఇటీవల వినిపిస్తున్న కథనాలే కారణమా?’ అంటూ అలనాటి డ్రీమ్‌గర్ల్ హేమమాలిని ‘ముంబై మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాంబు పేల్చారు. నర్మగర్భంగా ఆమె మాట్లాడిన ఇటీవల వినిపిస్తున్న కథనాలే అన్న వ్యాఖ్యం వెనక సంచలనాత్మక విషయం ఏమిటో తెల్సిందే. వయస్సులో ఉన్న అందమైన ఆడపిల్లలనే పరిశ్రమ ప్రోత్సహించడానికి కారణం సెక్స్ కోరికలు తీర్చుకోవడానికేనన్న విషయం విదితమే. సెక్స్‌కు ఒప్పుకుంటేనే సినిమా ఛాన్సులిస్తామంటున్న వారే ఎక్కువ మంది ఉన్నారంటూ బాలివుడ్లోనే కాకుండా టాలీవుడ్ వర్ధమాన తారలు సైతం ఇటీవల బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ‘ఛాన్స్ ఇస్తే ఛాన్స్ ఇస్తామంటున్నారు’ అని టాలీవుడ్లో రాయ్ లక్ష్మీ ఇటీవలనే వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. అనుష్క శర్మ కూడా ఇటీవల ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ‘మగవాళ్లు ముసలోళ్లయినా సరే ఇంకా హీరోలుగానే వస్తారు. అందరూ సూపర్ హీరోలు కూడా ఉన్నారు. మరి మహిళలను ఒక వయస్సు దాటినంకా ఎందుకు తీసుకోరు? అంతర్లీనంగా ఉండే సెక్స్ కోరికలే కారణమా?’ అని ఆమె వ్యాఖ్యానించారు. జూహీ చావ్లా, టబూ, మాధురి దీక్షిత్, ప్రీతి జింటా లాంటి వారు హీరోయిన్గా ఎందుకు సినిమాలు రావడం లేదని బాలివుడ్‌ను కొంత మంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ పైత్యం బాలివుడ్ కన్నా దక్షిణాది సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. శ్రీదేవీ నటించిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’, రాణి ముఖర్జీ నటించిన ‘మర్ధాని’ సినిమాలు అప్పుడప్పుడయినా బాలివుడ్లో కనిపిస్తున్నాయి. దక్షిణాదిలో మచ్చుకైనా కనిపించడం లేదు.