హృతిక్ రోషన్
బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటించిన తాజాచిత్రం ‘సూపర్ 30’. బీహార్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. దీంతో హృతిక్ నెక్ట్స్ సినిమా ఏంటి? అనే ప్రశ్న బీటౌన్‌లో మొదలైంది. 1982లో అమితాబ్ బచ్చన్, హేమ మాలిని నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ‘సత్తే పే సత్తా’ (1982) రీమేక్‌లో హృతిక్ రోషన్ నటించబోతున్నారని ఖబర్. ఈ సినిమాకు ఫర్హా ఖాన్ దర్శకత్వం వహిస్తారట. దర్శకుడు రోహిత్ శెట్టి ఈ సినిమాను నిర్మిస్తారట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే... ఈ సినిమాలో హృతిక్ సరసన దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటించనున్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment