
ముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని ఇంట్లో దొంగలు పడ్డారు. ఆమె వస్తువులను దాచుకునే ప్రత్యేక ఇంటికిలో దాదాపు రూ.90 వేల విలువైన సామాను దోచుకెళ్లారు. ఆ ఇంటికి కాపలా కాస్తున్న వ్యక్తే ఈ పనిచేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. షూటింగ్‌లకు ఉపయోగించే వస్తువులు, షోస్ అన్నీ ఎత్తుకెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటన ఆరు రోజుల కిందటే జరిగినప్పటికీ ఆలస్యంగా నేడు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.
పోలీసులు వివరాల ప్రకారం ముంబయిలోని పశ్చిమ అంధేరి ప్రాంతంలోని డీఎన్ నగర్‌లో హేమమాలిని వస్తువులను భద్రపరుచుకునే గోదాము ఉంది. అందులో కాస్ట్యూమ్స్, షూటింగ్‌లకు ఉపయోగించే జ్యువెలరీ, ప్రాప్స్, ఇతర వస్తువులు అన్నింటిని ఎత్తుకెళ్లిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ గోదాముకు కాపాలకాసే వ్యక్తి కనిపించకుండా పోవడంతో ప్రస్తుతం అతడికోసం లుకౌట్ నోటీసులు అంటించి గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment