
బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా ఆవ పొలాలు కనిపిస్తుంటాయి. ఎల్లో, గ్రీన్ మిక్సయి.. హీరో హీరోయిన్‌ల చిరునవ్వులకు ఆ పొలాలు అందాలను యాడ్ చేస్తుంటాయి. ఆ పొలాలంటే హేమమాలినికి చాలా ఇష్టం. ౖటñ మ్ దొరికితే పక్షిలా ఎగిరిపోతారు! అయితే ఇప్పుడు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడికీ ఎగిరిపోడానికి లేదు. యు.పి.లోని మధుర నియోజకవర్గం ఎంపీ హేమమాలిని. సభలో మాట్లాడవలసినవి ఎన్నో ఉంటాయి. రూలింగ్ పార్టీ ఎంపీ కూడా కనుక పార్లమెంటుకు డుమ్మా కొడితే సెటైర్లు కొట్టడానికి అపోజిషన్ రెడీగా ఉంటుంది.
అయినప్పటికీ.. హేమ సడెన్‌గా ఈ మధ్య ఎక్కడివో ఆవ పొలాల్లోకి వెళ్లొచ్చారు! ఓ ఫొటో కూడా తీయించుకున్నారు. గ్రీన్ కలర్ సిల్క్ శారీలో నవ్వుతూ నిలబడితే పొలం మధ్యలో విరబూసిన పుష్పంలా ఉన్నారు హేమ! ‘మధుర శివార్లలో ఎకరాల కొద్దీ ఉన్న అందమైన ఆవ పొలాల మధ్యన’ అంటూ ట్విట్టర్‌లో ఆ ఫొటో పెట్టి, కామెంట్ పోస్ట్ చేశారు హేమ. ‘ఉండే పనులు ఉంటూనే ఉంటాయి. ఊహించని ఒత్తిళ్లు వచ్చి పడుతూనే ఉంటాయి. అయినా తీరిక చేసుకోవాలి. ప్రకృతిలో విహరించి రావాలి. ప్రకృతి మనల్ని సేద తీరుస్తుంది. మన చింతల్ని దూరం చేస్తుంది’ అని హేమ తరచూ అంటుంటారు. అంతెందుకు? ఈ ఫొటో చూసి మీరు రిఫ్రెష్ అయ్యారు కదా! అదీ.. పవర్ ఆఫ్ ప్రకృతి.
Comments
Please login to add a commentAdd a comment