హేమామాలిని కనిపించడం లేదు!
"నటి, డ్రీమ్ గర్ల్, ఎంపీ హేమామాలిని కనిపించడం లేదు." ఇప్పుడీ పోస్టర్లు ఆమె నియోజకవర్గం మథుర అంతటా దర్శనమిస్తున్నాయి. మూడు లక్షల ఓట్లతో ఘనవిజయం సాధించిన తరువాత హేమా మాలిని ఒక్కసారి ముఖం చూపించింది. ఆ తరువాత మథుర నియోజకవర్గాన్ని మరిచిపోయింది.
దీంతో మథురకి చెందిన వివిధ సంస్థలు నియోజకవర్గ బిజెపి కార్యాలయానికి ఒక మెమొరాండం కూడా ఇచ్చి, మా ఎంపీ అసలెక్కడుందో చెప్పండని డిమాండ్ చేశాయి. ఈమెకన్నా స్మృతి ఇరానీ నయం. ఆమె మంత్రిగా ఉన్నా నెలకో సారి అమేఠీ నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు. కొందరు హేమా మాలిని దిష్టి బొమ్మను కూడా తగలబెట్టారట.