సాక్షి,ముంబయిః బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమమాలిని ఇప్పటి నటుల పారితోషికంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పుడు ప్రముఖ తారనై ఉంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించారు. ‘ ఇప్పుడు పారితోషికాలు భారీగా ఉంటున్నాయి..కానీ తనకు ఇచ్చేవి మాత్రం పల్లీలతో సమానం...20, 30 ఏళ్ల కిందట తాను చేసిన సినిమాలకు తిరిగి చెల్లించా’లని హేమమాలిని చమత్కరించారు.
ప్రస్తుత తరం నటులపై మాట్లాడుతూ ఇప్పటి యువతరం తమదైన శైలిలో దూసుకుపోతున్నారని, అంకితభావం అనేది వారికి దానంతటదే అలవడుతుందని చెప్పారు. పరిణితి చెందిన దశలో తామూ సమాజానికి కొంత మేలు చేయాలనే ఆలోచన కలుగుతుందన్నారు.