అంధకారంలో ఆదర్శ, కస్తూర్బా పాఠశాల | kasturbha school in dark | Sakshi
Sakshi News home page

అంధకారంలో ఆదర్శ, కస్తూర్బా పాఠశాల

Jul 20 2016 12:34 AM | Updated on Sep 15 2018 4:12 PM

తుర్కపల్లి మండలానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదర్శ, కస్తూరిబా పాఠశాలల్లో 2 రోజుల నుంచి విద్యుత్‌ లేకపోవడంతో విద్యార్థినులు అంధకారంలోనే ఉన్నారు

తుర్కపల్లి : తుర్కపల్లి మండలానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదర్శ, కస్తూరిబా పాఠశాలల్లో 2 రోజుల నుంచి విద్యుత్‌ లేకపోవడంతో విద్యార్థినులు అంధకారంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కరెంట్‌ లేక పోవడంతో ఉదయం నుంచి స్నానాలు కూడా చేయలేదని, రాత్రి పూట దోమలతో పడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్స్‌ అడవిలో ఉండటం వల్ల భయానికి లోనవుతున్నామని రాత్రి వేళల్లో భోజనం చేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని. రెండు రోజుల నుంచి విద్యుత్‌ అధికారులు గానీ ఉపాధ్యాయులుగానీ పట్టించుకోక పోవడంతో ఇబ్బందులెదుర్కుంటున్నామని విద్యార్థునులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో విద్యుత్‌ స్తంభం కూలడంతోనే విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని ట్రాన్‌కో ఏఈ చారి తెలిపారు. సాక్షి సందర్శించిన అనంతరం స్పందించిన విద్యుత్‌ అధికారులు మరమ్మతులు జరిపి విద్యుత్‌ పునరుద్ధరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement