ప్రపంచ ప్రఖ్యాత కట్టడం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడ ఉంది అంటే అమెరికాలోని న్యూయార్క్ సిటీలో అని ఠక్కున సమాధానం వచ్చేస్తుంది కదా. మరి మన ఇండియాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడాలని ఉందా? అయితే మీరు పంజాబ్ వెళ్లాల్సిందే. అవును మీరు చదివింది నిజమే. ఇదేమి చోద్యం అనుకుంటున్నారా? అయితే మీరీ కథనం చదవి తీరాల్సిందే.
ఇండ్లు, భవనాల పైకప్పులపై భిన్నమైన ఆకృతుల్లో నిర్మాణాలు చేపట్టడం, విగ్రహాల్ని ఏర్పాటు చేయడం చాలా చోట్ల, ముఖ్యంగా పంజాబ్‌లో చాలా చోట్ల కనిపిస్తూ ఉంటాయి. తాజాగా పంజాబ్‌లోని ఒక భవనంపై ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ని అచ్చం అమెరికాలో ఉన్నట్టే నిర్మిస్తున్నారు. న్యూయార్క్ నగరంలో ఉన్నంతగా కాకపోయినా తమ గ్రామంలో అత్యంత ఎత్తుగా ఉన్న భవనంపై దీన్ని నిర్మిస్తున్నట్టు స్థానిక గ్రామస్థులు తెలిపారు.
Some where in Punjab the THIRD liberty statue is installed.😂 pic.twitter.com/WZqrXpK9Jb
— Alok Jain ⚡ (@WeekendInvestng) May 26, 2024
పంజాబ్ లోని తర్న్ తరణ్ లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నమూనా లేటెస్ట్ సెస్సేషన్. దీన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. విగ్రహాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందించారు.
‘అది మంచినీళ్ల ట్యాంకు అయ్యుంటుంది అని ఒకరు, పంజాబ్‌లో చాలా మంది ఇళ్లపై మంచి నీళ్ల ట్యాంకులు విమానాలు, ఎస్ యూవీల ఆకారంలోనే కనిపిస్తాయి’ అని పేర్కొన్నాడు. మరొకరేమో ‘నయాగారా ఫాల్స్ ను నిర్మించాల్సింది.. అప్పుడు కెనడాను మిస్ అయ్యే వాళ్లు కాదు’ అని చమత్కరించాడు. ‘ఇక ప్రజలు న్యూయార్క్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.పంజాబ్ లోని ఈ ఇంటిని చూసేందుకు వెళ్తే సరిపోతుందన్నమాట’ అని కామెంట్ చేయడం విశేషం.
మూడో పెద్ద లిబర్టీ విగ్రహం పంజాబ్‌లో అంటూ అలోక్ జైన్‌ఎక్స్‌లోదీన్ని పోస్ల్ చేశారు. ప్రపంచంలోని రెండవ ఎత్తైన విగ్రహం, చైనాలోని స్ప్రింగ్ టెంపుల్ వద్ద ఉన్న అద్భుతమైన వైరోకానా బుద్ధుని విగ్రహం. ఇది తామరపువ్వు ఆకారం ఆసనంలో బుద్ధుడు ఆసీనుడై ఉంటాడు.. ఫోడుషాన్ సీనిక్ ఏరియాలో ఉన్న ఈ విగ్రహ నిర్మాణం 1997లో ప్రారంభమై 2008లో పూర్తి అయిందట.
Comments
Please login to add a commentAdd a comment