లిబర్టీ స్టాట్యూ కంటే పెద్దదిగా సర్దార్ పటేల్ విగ్రహం!
లిబర్టీ స్టాట్యూ కంటే పెద్దదిగా సర్దార్ పటేల్ విగ్రహం!
Published Sun, Sep 15 2013 7:27 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
హర్యానా:
దేశ ప్రజలను ఐక్యతగా ఉంచడానికి స్టాట్యూ ఆఫ్ యూనిటీని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక చిహ్నంగా నిర్మిస్తామని.. ఆ విగ్రహం న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే పెద్దగా ఉంటుంది అని నరేంద్రమోడీ హర్యానాలోని ఓ సభలో తెలిపారు. ఆసభలో మాట్లాడుతూ 'అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతలు పెద్దదిగా సర్ఱార్ పటేల్ ఐక్యత స్మారక చిహ్నం ఉంటుంది' అని బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ అన్నారు.
దేశానికి తొలి హోంమంత్రిగా సేవలందించిన సర్దార్ పటేల్.. దేశ ఐక్యత కోసం పాటు పడ్డారని.. అయితే ఆయన సేవలను ప్రభుత్వాలు మరిచిపోయాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కు దేశంలోని రైతులందరూ తమ నాగళ్ల నుంచి చిన్న ఇనుము ముక్కను పంపించాలని.. ప్రతి గ్రామం నుంచి 200-300 గ్రాముల ఇనుముని సేకరిస్తాం అని తెలిపారు.
న్యూయార్క్ నగరంలోని లిబర్టీస్ అనే రోమన్ దేవత విగ్రహం 1886 సంవత్సరలో అమెరికా దేశానికి ఫ్రాన్స్ ప్రజలు బహుమతిగా ఇచ్చారు.
Advertisement