కిందపడేసి కొడుతూ కాలితో తన్ని.. ఉమ్మేశాడు | Video showing Indian worker being beaten goes viral | Sakshi
Sakshi News home page

కిందపడేసి కొడుతూ కాలితో తన్ని.. ఉమ్మేశాడు

Published Mon, Sep 21 2015 6:55 PM | Last Updated on Mon, Aug 20 2018 3:56 PM

కిందపడేసి కొడుతూ కాలితో తన్ని.. ఉమ్మేశాడు - Sakshi

కిందపడేసి కొడుతూ కాలితో తన్ని.. ఉమ్మేశాడు

రియాద్: సౌదీ అరేబియాలో ఓ భారతీయుడిపై దాడి జరిగింది. విచక్షణ రహితంగా ఓ అరబ్ ఇంజినీర్ చేసిన ఈ దాడిని పలువురు ఖండించగా అతడిపై కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో బయటకు వచ్చి పలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. మక్కా మసీదు ప్రాంతంలో ఓ నిర్మాణం విస్తరణకు సంబంధించిన పనులను అరబ్ దేశానికి చెందిన ఇంజినీర్ భారతీయుడికి అప్పగించాడు. అయితే, తాను నిర్ణయించిన సమయానికి పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఇంజినీర్ ఏమాత్రం కనికరం లేకుండా విచక్షణ రహితంగా భారతీయ యువకుడిపై దాడి చేశాడు. కిందపడేసి కొడుతూ కాలితో తన్ని ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించాడు.

అంతేకాకుండా అతడిపై ఉమ్మి కూడా వేశాడు. రెండు నిమిషాలపాటు రికార్డయిన ఈ వీడియోను ఓ కెనడా జర్నలిస్టు తారేక్ ఫతా తన ఫేస్బుక్ పేజీలో పెట్టాడు. దీంతో ఆ వీడియో బయటకు వచ్చి ఆ ఇంజినీర్ నిర్వాకంపట్ల విమర్శలు వచ్చాయి. సౌదీకి చెందిన కార్మిక శాఖ డైరెక్టర్ జనరల్ ఘటన స్థలికి వెళ్లి వివరాలు సేకరించి దర్యాప్తుకు ఆదేశించారు. అయితే, ఆ ఇంజినీర్ మాత్రం బాధితుడికి క్షమాపణలు చెప్పాడని, దర్యాప్తు మాత్రం చట్ట ప్రకారం జరుగుతుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement