
ఏపీ, అరబ్ దేశాల మధ్య వాణిజ్యాభివృద్ధికి ఎంఓయూ
సాక్షి, విజయవాడ బ్యూరో: టూరిజం, ఆహార ఉత్పత్తులు, విద్యా, వైద్యం తదితర రంగాల్లో వ్యాపార కార్యకలాపాలకు అరబ్ దేశాలు అనువైనవని ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్(ఐబీపీసీఆర్‌ఎకె) సెక్రటరీ జనరల్ లోకేష్ కె వర్మ చెప్పారు. అరబ్ దేశాల్లో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోగలితే ఏపీతోపాటు ఇక్కడి వ్యాపార, పారిశ్రామిక వేత్తలు కూడా అభివృద్ధి చెందవచ్చని సూచించారు. యునెటైడ్ అరబ్ ఎమిరెట్స్(యుఎఇ)కి చెందిన రఫ్ ఆల్‌కైమా స్టేట్‌లో ఐబీపీసీఆర్‌ఎకె సెక్రటరీ జనరల్‌గా ఉన్న లోకేష్ కె వర్మ, ఏపీ చాంబర్ ప్రెసిడెంట్(ఎలక్ట్) ముత్తవరపు మురళీకృష్ణతో బుధవారం ఒప్పందం(ఎంఓయు) కుదుర్చుకున్నారు.
ఈ సందర్బంగా ఏపీ చాంబర్ హాలులో జరిగిన పారిశ్రామిక, వ్యాపారవ్తేతల ముఖాముఖిలో లోకేష్ వర్మ మాట్లాడుతూ అరబ్ దేశాలకు భారత్ నుంచి ఎగుమతి అవుతున్న సరుకులు, పరికరాలు అన్నీ ముంబాయి ఎయిర్‌పోర్టు, పోర్టు నుంచి వెళుతున్నాయని చెప్పారు. అదే గన్నవరం ఎయిర్‌పోర్టు, కృష్ణపట్నం ఓడరేవులను విస్తరించి విదేశాలకు సరుకు రవాణాను ప్రోత్సహిస్తే ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయం పెరగడంతోపాటు ఇక్కడి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు.