Food Stores
-
పునరావాస కేంద్రాల్లో తాత్కాలిక ఉపశమనం
-
థియేటర్లలోకి బయటి ఆహార పదార్థాలను తీసుకెళ్లేలా ఆదేశాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్యాకింగ్ చేయని ఆహార పదార్థాలు, ఇతర పానీయాలను అత్యధిక రేట్లకు విక్రయిస్తున్నారని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో (పిల్) దాఖలైంది. సినిమా థియేటర్లలోకి ప్రేక్షకులు తమ వెంట బయటి నుంచి తినుబండారాలను తెచ్చుకునేందుకు అనుమతినిచ్చేలా చూడాలంటూ న్యాయవాది పి.సతీ‹శ్‌కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విశ్రాంత సమయంలో తాము తెచ్చుకున్న తినుబండారాలను తినేందుకు ఏర్పాటు చేసేలా థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. మల్టీప్లెక్స్‌ల్లో పాప్ కార్న్‌ను రూ.150 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారని తెలిపారు. శీతలపానీయాలను రూ.120 నుంచి రూ.200 వరకు, వాటర్ బాటిల్స్‌కు రూ.60, కాఫీకి రూ.100 వసూలు చేస్తున్నారని వివరించారు. తెలంగాణ సినిమా రెగ్యులేషన్ చట్ట నిబంధనల్లో ఎక్కడా కూడా బయటి తినుబండారాలను ప్రేక్షకులు లోనికి తీసుకెళ్లకుండా నిషేధం ఏదీ లేదన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. -
ఇలా తింటే లావైపోతారు..
లండన్ : బరువు తగ్గి నాజూగ్గా కనిపించాలంటే భిన్న రకాలైన ఆహార పదార్ధాలను తీసుకోవాలని చెబుతుంటారు. అయితే పలు రకాల ఐటెమ్స్‌ను ముందుంచుకుని భోజనానికి సిద్ధమైతే ఎక్కువగా లాగించేసి బరువు పెరిగే ప్రమాదం తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పలు ఆహార పదార్ధాలను ఒకే మీల్లో తీసుకోవడం ద్వారా ఎక్కువ కేలరీలు శరీరంలోకి చేరతాయని హోస్టన్కు చెందిన టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ నివేదిక వెల్లడించింది. ఎక్కువ వెరైటీలను కోరుకుంటే డోనట్స్, కుకీస్, సోడాలు వంటి అనారోగ్యకర ఆహారాన్ని తీసుకుంటామని ఇది ఆరోగ్యానికి ఇబ్బందికరమని నివేదిక స్పష్టం చేసింది. విభిన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉందనేందుకు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పరిశోధకులు పేర్కొన్నారు. ఒకే మీల్లో పలు రకాల ఆహార పదార్థాలను ఆరగిస్తే త్వరగా కడుపునిండిన భావన కలగదని, ఫలితంగా అధిక కేలరీలను తీసుకుంటామని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ సర్కులేషన్లో ప్రచురితమైన అథ్యయనం పేర్కొంది. భిన్న రుచులను ఆస్వాదించే వారిలో ఒబెసిటీ రిస్క్ పొంచిఉందని కూడా అథ్యయనం హెచ్చరించింది. -
12న భీమవరంలో ప్రకృతి సేద్యం–ఆహారోత్పత్తులపై సదస్సు
సేంద్రియ ఆహారాన్ని అందించే ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యతపై ఈనెల 12(ఆదివారం)న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (ఆదివారం బజారు)లోని డా. గొట్టుముక్కల సుందర రామరాజు ఐ.ఎం.ఎ. కాన్ఫరెన్స్ హాలులో జరుగుతుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత, ప్రకృతి వ్యవసాయదారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో భారతీయ కిసాన్ సంఘ్ నేత జె.కుమారస్వామి, ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత, ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షులు బి. రామకృష్ణంరాజు తదితరులు ప్రసంగిస్తారు. వివరాలకు.. డా. పి.బి. ప్రతాప్‌కుమార్ – 94401 24253 -
ఉత్పత్తుల విక్రయాలకు సొంత బ్రాండ్
సాక్షి, హైదరాబాద్: కల్తీలేని పరిశుభ్రమైన ఆహార ఉత్పత్తుల విక్రయాలకు సొంత బ్రాండ్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. రోజు వారీ వినియోగించే బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి, కారం, సుగంధ ద్రవ్యాలు తదితర ఆహార ఉత్పత్తులను ఆ బ్రాండ్‌పై సరఫరా చేయనుంది. వాటిని విక్రయించేలా సొంత ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో పనిచేసేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తోంది. అలాగే పీపీపీ పద్ధతిలో ఫుడ్ పార్కులను ఏర్పాటు చేస్తారు. రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ విధివిధానాలు, రోజువారీ కార్యక్రమాలపై సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రతిపాదనలు తయారుచేసి తాజాగా ప్రభుత్వానికి నివేదించారు. ఆ నివేదికలో కార్పొరేషన్ లక్ష్యాలను, విధివిధానాలను వివరంగా తెలిపారు. ఆహార ఉత్పత్తులు, వాటి అనుబంధ విలువ ఆధారిత ఉత్పత్తుల గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ చేపట్టాలని సమితి నిర్ణయించింది. వాటిని సొంత బ్రాండ్‌పై విక్రయించనుంది. అలాగే రైతులు పండించిన పంటలకు మార్కెట్లో సరైన ధరరాని పక్షంలో జోక్యం చేసుకొని కనీస మద్దతు ధర కల్పించాలని ప్రతిపాదించింది. అందుకు సంబంధించి వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు, మార్క్‌ఫెడ్, ఆగ్రోస్, ఆయిల్‌ఫెడ్ తదితర సంస్థలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. రైతు నుంచి వినియోగదారుని వరకు ఆహార ఉత్పత్తులు అందేలా గోదాములు, ప్యాకింగ్, కోల్డ్స్టోరేజీలన్నింటినీ అందుబాటులోకి తీసుకు వస్తారు. అలాగే ఆహార ఉత్పత్తులను సమీప రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తారు. సమితుల ద్వారానే అమలు.. వ్యవసాయశాఖ చేపట్టే వివిధ పథకాల అమలంతా రైతు సమన్వయ సమితుల ద్వారానే జరగాలని ప్రతిపాదించారు. రైతుబంధు పథకం, రైతుబంధు బీమా పథకం, పంటల బీమా, రుణాలు, రైతు వేదికలుసహా ఇతర వ్యవసాయ పథకాలన్నింటినీ సమితి ద్వారా అమలుచేయాలనేది రైతు కార్పొరేషన్ ఉద్దేశం. ఈ కార్యక్రమాలపై విధానపరమైన నిర్ణయాలను మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) తీసుకుంటారు. ఆ పోస్టును ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇక క్షేత్రస్థాయిలో అమలును పర్యవేక్షించే కీలక బాధ్యతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)కు అప్పగిస్తారు. అందుకోసం ఈడీ పోస్టును మంజూరు చేయాలని ప్రతిపాదించారు. జనరల్ మేనేజర్ పోస్టునే ఈడీగా మార్చాలని కూడా భావిస్తున్నారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టును కూడా ఏర్పాటు చేస్తారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ ఈడీకి సహకరిస్తారు. రైతులు పండించిన పంటల సరఫరా డిమాండ్‌ను పరిశీలించాల్సిన బాధ్యత డిప్యూటీ జనరల్ మేనేజర్‌దే. ఎగుమతులు ఎక్కడికి చేయాలో నిర్ధారించాలి. రైతు కార్పొరేషన్‌కు వ్యవసాయాధికారులను నియమిస్తారు. అలాగే అకౌంట్ ఆఫీసర్‌ను నియమిస్తారు. -
రైళ్లలో వ్యర్థాలకు ట్రాష్ బ్యాగులు!
న్యూఢిల్లీ: ఇక నుంచి విమానాల్లో మాదిరిగా రైళ్లల్లోనూ ప్రయాణికుల నుంచి వ్యర్థాలను ట్రాష్ బ్యాగుల్లో సేకరించేలా చర్యలు చేపట్టాలని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహాని అధికారులను ఆదేశించారు. డివిజన్ లెవల్ ఆఫీసర్లు, బోర్డు సభ్యులతో 17న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైళ్లలో పరిశుభ్రతను పెంచేందుకు ప్రయాణికుల భోజనాల అనంతరం ప్యాంట్రీ సిబ్బంది ఆ ప్లేట్లను బ్యాగుల్లో సేకరించాలని సూచించారు. సాధారణంగా భోజనం తిన్న తర్వాత ప్రయాణికులు ప్లేట్లను బెర్త్‌ల కింద పెడుతుంటారని, సిబ్బంది వాటిని ఒకదాని మీద ఒకటి పేర్చి తీసుకెళ్లడం వల్ల అందులోని వ్యర్థాలు కింద పడి బోగీలు అపరిశుభ్రంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ట్రాష్ బ్యాగును ప్రయాణికుడి వద్దకు తీసుకెళ్లే వ్యర్థాలనూ వారు అందులో వేస్తారని అన్నారు. -
సూపర్మార్కెట్లలో నిషేధిత పదార్థాల వెల్లువ
సాక్షి, న్యూఢిల్లీ : సూపర్ మార్కెట్లలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న జన్యుమార్పిడి ఆహార పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయంటూ ఓ షాకింగ్ రిపోర్ట్ వెలువడింది. నిషేధిత జీఎం(జెనిటికల్లీ మోడిఫైడ్) ఆహార పదార్థాలను ఆకర్షణీయమైన ప్యాకేజీల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్సీ) నివేదించింది. విదేశాలకు చెందిన ఫ్యాన్సీ ఉత్పతులు ముఖ్యంగా శిశువుల ఆహార ఉత్పత్తులు వుండటం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. పాన్ కేక్ సిరప్, మల్టీ గ్రెయిన్ సిరల్స్( సెరిలాక్ లాంటివి) కార్న్ పఫ్స్, నూనెలు లాంటివి అమ్ముతున్నారని తెలిపింది. గుజరాత్, పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల్లో సంస్థ పరిశోధకులు 65 ఆహార నమూనాలను పరీక్షించారు. వీటిల్లో 21 నమూనాల్లో 32 శాతం జీఎం పాజిటివ్ అని కనుగొన్నారు. భారతదేశంలో తయారు చేసిన వాటిల్లో 30 శాంపిల్స్‌లో కేవలం ఐదు లేదా 17 శాతం జీఎం పాజిటివ్‌గా ఉండగా, కెనడా, యుఎఇ, అమెరికా, నెదర్లాండ్స్, థాయ్‌లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న 35శాంపిల్స్‌లో 16-46 శాతం జీఎం పాజిటివ్‌గా ఉన్నాయని నివేదించింది. అలాగే జీఎం పాజిటివ్ అయి వుండి జీఎం ఫ్రీ పేరుతో అక్రమంతా విక్రయిస్తున్న ఉత్పత్తులు దాదాపు 15శాతం ఉన్నట్టు వెల్లడించింది. జన్యుమార్పిడి ఆహారాలకు దేశంలో అనుమతి లేనప్పటికీ , సూపర్ మార్కెట్లో ఇలా అక్రమంగా విక్రయిస్తున్నారని తాజా అధ్యయనంలో సీఎస్ఈ తేల్చింది. పైగా వీటిల్లో కొన్నింటిని జీఎం ఫ్రీ అని తప్పుడు ప్రకటనలతో మోసం చేస్తున్నారని నివేదించింది. ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 లోని సెక్షన్ 22 ప్రకారం జన్యుమార్పిడి ఆహార ఉత్పత్తులను భారతదేశంలో తయారుచేయడం, దిగుమతి లేదా విక్రయించడం నిషేధమని పేర్కొంది. నిఘా విభాగం లోపం వల్లే దేశంలోని అనేక సూపర్మార్కెట్లలో జన్యుమార్పిడి ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయని జీఎస్ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నారెన్ చెప్పారు. ముఖ్యంగా చిన్నపిల్లల ఆహార ఉత్పత్తులు జన్యుమార్పిడివి వుండటం ఆందోళకరమన్నారు.అంతేకాదు జీఎం ఫ్రీ అనే లేబుల్‌తో ఈ ఉత్పత్తులను విక్రయించడం మరింత విచారకరమని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అమెరికా, నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకున్న ఎనిమిదింటిలో రెండు చిన్నారి ఆహార పదార్థాల నమూనాలు జీఎం పాజిటివ్‌గా ఉన్నప్పటికీ, లేబుళ్ళు ఈ విషయాన్ని వెల్లడించలేదని తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ అంటీముట్టనట్టు వ్యవహరిస్తోందని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇందు భూషణ్ వ్యాఖ్యానించారు. జన్యుపరంగా మార్పు చెందిన బిటి పత్తి పెంపకానికి మాత్రమే భారత్‌లో అనుమతి ఉందన్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మ కంపెనీ శిశువుల ఆహార ఉత్పత్తులను (జీఎం, నాన్ జీఎం) విక్రయిస్తుందని కానీ అక్కడి సూపర్మార్కెట్లలో సంబంధిత సూచనలు, తప్పనిసరి హెచ్చరికలుంటాయని సునీతా చెప్పారు. కానీ భారతదేశంలో అలా ఎందుకు కాదు అని ఆమె ప్రశ్నించారు. జన్యుమార్పిడి ఆహార పదార్థాలు హానికరమైనవా, కాదా అనేదానిపై సుదీర్ఘ చర్చ ఉన్నప్పటికీ, వీటి ఎంపికలో వినియోగదారుడికి స్వేచ్ఛ ఉండాలని ఆమె అన్నారు. -
ధరలు ఆకాశం వైపు...
న్యూఢిల్లీ: జూన్ నెలలో రిటైల్ ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం మరోసారి 5 శాతం మార్కును నమోదు చేసింది. ఈ ఏడాది జనవరిలో 5.07 శాతంగా నమోదైన తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం తిరిగి మరోసారి గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆహారోత్పత్తుల విభాగంలో ధరలు కాస్తంత ఉపశమించినా, చమురు ధరలు పెరిగిపోయే సరికి ఆ ప్రభావం రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రతిఫలించింది. దీంతో 5 శాతానికి పెరిగింది. ఇది మే నెలలో 4.87 శాతంగా ఉంది. 2017 జూన్ నెలలో 1.46 శాతంగా ఉండడం గమనార్హం. ఈ మేరకు రిటైల్ ద్రవ్యోల్బణం వివరాలను కేంద్ర గణాంకాల విభాగం (సీఎస్‌వో) గురువారం విడుదల చేసింది. ముఖ్య గణాంకాలు... ఆహార ఉత్పత్తుల విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో ఉన్న 3.1% నుంచి జూన్‌లో 2.91 శాతానికి తగ్గుముఖం పట్టింది. చమురు బాస్కెట్లో ద్రవ్యోల్బణం మే నెలతో పోలిస్తే 5.8% నుంచి 7.14 శాతానికి ఎగిసింది. వస్త్రాలు, పాదరక్షల విభాగంలో ద్రవ్యోల్బణం 5.67 శాతంగా, హౌసింగ్ విభాగంలో 8.45 శాతంగా నమోదైంది. మేతో పోలిస్తే పెరిగాయి. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో పరిమితం చేసేలా చూడాలని కేంద్ర సర్కారు ఆర్బీఐ ముందు లక్ష్యాన్ని ఉంచిన విషయం తెలిసిందే. ఈ నెల 30 నుంచి జరిగే ఆర్బీఐ తదుపరి ద్వైమాసిక మానిటరీ పాలసీ సమీక్షలో రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు కీలకంగా వ్యవహరించనున్నాయి. ఆగస్ట్ 1న పాలసీ నిర్ణయాలను ఎంపీసీ ప్రకటిస్తుంది. ఇకపై తగ్గుతుంది ‘‘ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ రిటైల్ ద్రవ్యోల్బణమే గరిష్టంగా నమోదైంది. అయితే, తర్వాతి నెలల్లో ఇది సగటున 4.5 శాతానికి తగ్గుముఖం పడుతుంది. ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగినందున ఆర్బీఐ దాన్ని అదుపు చేయవచ్చు’’. – శుభదా రావుయస్ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త -
తెలంగాణ ఫుడ్ఫెస్టివెల్
-
చెత్తతో రబ్బరుకు మెరుగైన లక్షణాలు!
ఆహార వ్యర్థాలను ఎరువులుగా మార్చడం గురించి మనకు చాలాకాలంగా తెలుసు. చెత్త నుంచి ఇంతకంటే మేలైన ప్రయోజనాలు చేకూరితే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇదే పని చేస్తోంది ఓ సంస్థ. ఆహార వ్యర్థాలు కుళ్లిపోయే క్రమంలో వెలువడే వాయువులను ఉపయోగించుకుని మెరుగైన ఎలక్ట్రానిక్ సీలెంట్లు, సెన్సర్లను తయారుచేయవచ్చునని కంపెనీ గుర్తించింది. హెవియా బ్రాసిలినిసిస్ అనే చెట్టు కాండానికి గాట్లు పెట్టి సేకరించే పాలను శుద్ధి చేయడం ద్వారా రబ్బరు తయారవుతుందని మనకు తెలుసు. కార్బన్ బ్లాక్‌ను కలిపి రబ్బరును కాళ్లకు తొడుక్కునే బూట్ల నుంచి అనేక ఇతర వస్తువులను తయారుచేస్తారు. ఇలా కలపడం వల్ల దాని లక్షణాలు పెరుగుతాయని అంచనా. కానీ పర్యావరణానికి కొంత నష్టం. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆహార వ్యర్థాల నుంచి వెలువడే మిథేన్‌ను వాడవచ్చునని అలైన్ ప్నికాడ్ అనే శాస్త్రవేత్త అంటున్నారు. మిథేన్ సాయంతో ఉత్పత్తి చేసే నానోగ్రాఫైట్ రేణువులను రబ్బరుతో కలిపినప్పుడు అది విద్యుత్తును బాగా నిరోధిస్తుందని తెలిసింది. అందువల్ల దీన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లో సీలెంట్‌గా వాడవచ్చునని చెబుతున్నారు. -
ఆ హీరోయిన్ను భరించటం వల్ల కావట్లేదు!
సాక్షి, సినిమా : మోడల్ కమ్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. షూటింగ్ సమయంలో ఆమె నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందట. ఆమె మెయింటెనెన్స్ బిల్లు తడిసి మోపెడవుతుండటంతో భరించటం మా వల్ల కాదు బాబోయ్ అని గగ్గోలు పెడుతున్నారు. స్పోర్ట్బాయే కథనం ప్రకారం... ‘సనమ్ రే’ ఫేమ్ ఊర్వశి ప్రస్తుతం భానుప్రియా అనే ఓ చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ ప్రారంభమై కొద్ది రోజులే అవుతోంది. అయినప్పటికీ అప్పుడే ఆమె వ్యవహారంతో యూనిట్ సభ్యులు విసిగిపోతున్నారంట. షూటింగ్ కోసం ఇంటి నుంచి బయలుదేరిన సమయంలోనే ఆమె అసిస్టెంట్లు ఫోన్ ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారంట. అది అంతా ఇంతా కాదు. దాదాపు యూనిట్ సభ్యులకు సరిపడేంత. అందులో ఆమె, సహయక సిబ్బంది కాస్త మాత్రమే తిని.. మిగతాది ఆమె ఇంటికి పంపిచేస్తున్నారంట. ఊర్వశి వ్యవహారం రోజు రోజుకీ శృతి మించిపోతోందని.. షూటింగ్ మీరా రోడ్లో జరిగితే.. ఎక్కడో జూహులో ఉన్న కాస్ట్ లీ రెస్టారెంట్ నుంచి భోజనం ఆర్డర్ చేస్తోందని.. ఈ వ్యవహారంలో ప్రొడక్షన్ మేనేజర్‌తో ఆమె గొడవ పడినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆమెపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. మరీ ఆరోపణలపై హేట్ స్టోరీ-4 బ్యూటీ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
ఆహారధాన్యాలు.. 27.74 కోట్ల టన్నులు
సాక్షి, హైదరాబాద్: ఆహారధాన్యాల ఉత్పత్తి అంచనా భారీగా పెరిగింది. దేశంలో 2017–18 ఖరీఫ్, రబీ సీజన్లో ఆహారధాన్యాలు రికార్డు స్థాయిలో ఉత్పత్తి అవుతాయ ని కేంద్రం అంచనా వేసింది. అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం కేంద్ర వ్యవసాయశాఖ రెండో అంచనా నివేదికను బుధవారం విడుదల చేసింది. 2016–17 సీజన్లో 27.51 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి కాగా, 2017–18 సీజన్లో 27.74 కోట్ల టన్నులు ఉత్పత్తి అవుతాయని తెలిపింది. గతేడాది కంటే 23 లక్షల టన్నులు అధికంగా ఉత్పత్తి కానున్నాయి. అందులో వరి ఉత్పత్తి గతేడాది 10.97 కోట్ల టన్నులు కాగా, ఈసారి 11.10 కోట్ల టన్నులు దిగుబడి రానుంది. పప్పుధాన్యాల ఉత్పత్తి గతేడాది 2.31 కోట్ల టన్నులు కాగా, ఈసారి 2.39 కోట్ల టన్నులు ఉత్పత్తి కానున్నాయి. గతేడాది నూనెగింజల ఉత్పత్తి 3.12 కోట్ల టన్నులు కాగా, ఈసారి 2.98 కోట్ల టన్నులకు పడిపోనున్నాయి. పత్తి ఉత్పత్తి గతేడాది 3.25 కోట్ల బేళ్లు కాగా, ఈసారి 3.39 కోట్ల బేళ్లు ఉత్పత్తి కానుందని కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఖరీఫ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 54.60 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, కేవలం 50.29 లక్షల టన్నులకే పరిమితమైంది. వరి ఉత్పత్తి లక్షం 32.47 లక్షల టన్నులు కాగా, దిగుబడి 30.42 లక్షల టన్నులకు పడిపోయిందని వెల్లడించింది. ఇక పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 2.94 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఉత్పత్తి గణనీయంగా 3.71 లక్షల టన్నులకు చేరింది. అందులో కంది ఉత్పత్తి లక్ష్యం 2.03 లక్షల టన్నులు కాగా, 2.84 లక్షలకు చేరింది. మొక్కజొన్న ఉత్పత్తి లక్ష్యం 18.64 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 15.70 లక్షల టన్నులకు పడిపోయింది. పెసర 64 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా, 59 వేల టన్నులకు పడిపోయింది. మినుముల ఉత్పత్తి లక్ష్యం 26 వేల టన్నులు కాగా, నూటికి నూరు శాతం ఉత్పత్తి అయింది. ఖరీఫ్‌లో నిరాశపరిచిన ఆహారధాన్యాల ఉత్పత్తి, రబీలో పుంజుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం నివేదిక చెబుతోంది. రాష్ట్రంలో రబీలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 36.28 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 44.72 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని అంచనా వేసింది. అందులో వరి ఉత్పత్తి లక్ష్యం 25.64 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 35.16 లక్షల టన్నులు అవుతుందని అంచనా వేసింది. -
రూ.10 కోసం కొట్టి చంపాడు..!
ముంబై: కేవలం రూ.10 అడిగినందుకు ఓ వ్యక్తిని స్నేహితుడే కొట్టిచంపిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పోవైలోని సాయి బన్‌గుర్దా గ్రామానికి చెందిన స్నేహితులు జీవన్ మోరే(35), దినేశ్ లక్ష్మణ్ బుధవారం ఓ షాపులో మద్యం సేవించారు. అనంతరం లక్ష్మణ్ ఓ హోటల్ నుంచి ఇద్దరికీ ఆహార పదార్థాలను తీసుకొచ్చాడు. ఆహారం ఖర్చులో కొంత భరించాలనీ, రూ.10 చెల్లించాలని లక్ష్మణ్ మోరేను కోరాడు. ఇద్దరిమధ్య మాటామాటా పెరగటంతో ఆగ్రహానికి లోనైన మోరే..ఓ కర్రతో లక్ష్మణ్‌పై దాడిచేశాడు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణ్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఐపీసీ సెక్షన్ 302(హత్య) కింద నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. -
మీ ఉప్పులో అయోడిన్ ఉందా?
ఓ నాలుగేళ్ల చిన్నారి..రోజూ మంచి ఆహారమే తినిపిస్తారు కానీ వయసుకు తగిన ఎదుగుదల లేదు..ఆ వయసులోని పిల్లల్లో ఉండే చురుకుదనం లేదు..కంటి చూపు కూడా సరిగా ఉన్నట్టూ లేదు..ఏమిటి సమస్య.. ఉప్పు! అవును ఉప్పే.. అయోడిన్ లేని ఉప్పు..పిల్లలకు ఎదుగుదలకు, వికాసానికి కీలకమైన అయోడిన్ లేని ఉప్పు.. ..ఆహారం ద్వారా తగిన అయోడిన్ అందని దేశం మనది. అందువల్లే ఉప్పులో తగిన మోతాదులో అయోడిన్ కలిపి విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. తద్వారా అయోడిన్ లోపాన్ని ఎదుర్కొనేలా చర్యలు చేపట్టింది. కానీ తయారీదారుల నిర్లక్ష్యం, కొన్ని కంపెనీల కక్కుర్తి, పలు ప్రాంతాల్లో ఉప్పు తయారు చేసి నేరుగా విక్రయిస్తుండటంతో అయోడిన్ లేని ఉప్పు మార్కెట్లోకి వస్తోంది. మార్కెట్లో విక్రయిస్తున్న ఉప్పులో 30 శాతం వరకు అయోడిన్ ఉండటం లేదని, మరో 20 శాతంలో తక్కువ మోతాదులో ఉందని కేంద్ర ప్రభుత్వ సర్వేలోనే వెల్లడైంది. అయోడిన్ లోపం కారణంగా చిన్నారుల్లో ఎదుగుదల లోపం, బుద్ధి మాంద్యం, పెద్ద వయసు వారిలో థైరాయిడ్ సమస్యలు సమస్యలు తలెత్తుతున్నాయి. కేంద్రం చర్యలు చేపట్టినా.. దేశంలో అయోడిన్ లోపాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు దశాబ్దాల కిందే చర్యలు చేపట్టింది. దేశంలో ఆహార వినియోగం కోసం విక్రయించే ఉప్పులో తప్పనిసరిగా అయోడిన్ కలిపేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉప్పును విక్రయించే సంస్థలన్నీ అయోడిన్ కలిపి అమ్ముతున్నాయి. అయితే మన దేశంలో సంప్రదాయ పరిస్థితుల కారణంగా ఇప్పటికీ బస్తాలలో లభ్యమయ్యే ముడి ఉప్పును వినియోగిస్తున్నారు. అందులో తగిన మోతాదులో అయోడిన్ ఉండే అవకాశం లేదు. దీంతో పిల్లల్లో అయోడిన్ లోపం తలెత్తుతోంది. - ఇటీవలి కాలంలో మారిన జీవన శైలి కారణంగా ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దాంతో ఉప్పు వినియోగాన్ని తగ్గిస్తున్నారు. ఇది కూడా అయోడిన్ లోపానికి కారణమవుతోంది. - హోటళ్లు, రెస్టారెంట్లు, వీధుల్లో ఆహార పదార్థాలు విక్రయించేవారు తక్కువ ధరకు దొరికే ఉప్పును కొనుగోలు చేస్తుంటారు. అవి ‘అయోడైజ్డ్’కాకపోవడంతో పిల్లల్లో ఎదుగుదల దెబ్బతింటుంది పిల్లల ఎదుగుదలలో అయోడిన్ పాత్ర ఎంతో కీలకం. ముఖ్యంగా ఐదు నుంచి 13 ఏళ్ల మధ్య వయసు వారికి ఇది చాలా అవసరం. లేకుంటే ఎదుగుదల సరిగా ఉండదు. యుక్త వయసులోనూ అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మహిళల్లో గర్భస్రావం, పురుషుల్లో బుద్ధి మాంద్యం సమస్యలు వస్తాయి. అయోడిన్ ఉప్పును వినియోగిస్తే ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.. – మాగంటి శేషు మాధవ్, పిల్లలవైద్య నిపుణుడు, వరంగల్ కేంద్ర ప్రభుత్వ సర్వే మేరకు.. దేశంలో అయోడిన్ ఉప్పు వినియోగ కార్యక్రమం ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా నివేదికలు రూపొందిస్తుంది. దేశవ్యాప్తంగా విక్రయించే ఉప్పు శాంపిళ్లను సేకరించి అయోడిన్ శాతాన్ని పరిశీలిస్తుంది. ఇదే సమయంలో చిన్నారుల్లో అయోడిన్ లోపాలపై అధ్యయనం చేస్తుంది. ఈ మేరకు తాజాగా నిర్వహించిన సర్వేలో విస్తుపోయే అంశాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలోని చిన్నారుల్లో అయోడిన్ లోపం ఆందోళనకర స్థాయిలో ఉందని తేలింది. 50 శాతం ‘ఉత్త’ఉప్పే! కేంద్ర ప్రభుత్వ సర్వేలో భాగంగా రాష్ట్రంలో పాత జిల్లాల ప్రాతిపదికన మొత్తం 2,050 ఉప్పు నమూనాలను సేకరించి అయోడిన్ శాతాన్ని పరీక్షించారు. వాటిల్లో 30 శాతం నమూనాల్లో అయోడిన్ ఆనవాళ్లు ఏ మాత్రం లేవని తేలింది. మరో 20 శాతం నమూనాల్లో ఉండాల్సిన మోతాదు కంటే తక్కువగా అయోడిన్ ఉన్నట్లుగా నిర్ధారించారు. అంటే మొత్తంగా 50 శాతం ఉప్పు ప్రమాణాల మేరకు లేదని వెల్లడైంది. అయోడిన్ ఉప్పు వినియోగంపై అవగాహన లేకపోవడంతో ఈ సమస్య నెలకొందని గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో అయోడిన్ లేని ఉప్పు తీసుకునేవారి సంఖ్య ఎక్కువగా ఉందని తేల్చారు. లోపిస్తే సమస్యలు ఎన్నో.. అయోడిన్ లోపం వల్ల చిన్నారులలో గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి ఉబ్బడం), హైపోథైరాయిడిజం, కంటి చూపు దెబ్బతినడం, ఎదుగుదల లోపించడం, బుద్ధి మాంద్యం వంటి సమస్యలు తలెత్తుతాయి. మహిళల్లో అయోడిన్ లోపం కారణంగా గర్భస్రావం జరిగే అవకాశా లు ఎక్కువ.రాష్ట్రంలోని చిన్నారుల్లో గాయిటర్, కంటిచూపు సమస్యలతో బాధపడుతున్నవారు తొమ్మిది శాతం వరకు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ సర్వేలో తేలింది. గ్రామీణ ప్రాంత మహిళల్లోనూ అయోడిన్ లోపం ఎక్కువగా ఉందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. – సాక్షి, హైదరాబాద్ -
కల్తీలను నిమిషాల్లో నిగ్గు తేలుస్తుంది
-
నిమిషాల్లో నిగ్గు తేలుస్తుంది
సాక్షి, హైదరాబాద్: పాల ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్ల నుంచి వంటల్లో వాడే మసాలాలు, నూనెల వరకు...కిరాణా కొట్లో కొనే సరుకుల నుంచి కర్రీ పాయింట్లలో విక్రయించే కూరలు, హోటళ్లు, రెస్టారెంట్లలో వడ్డించే వంటకాల వరకు జరుగుతున్న కల్తీలకు ఇకపై నిమిషాల వ్యవధిలోనే అడ్డుకట్ట పడనుంది. ఇప్పటివరకు ఆహార నమూనాలను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లి వాటి నాణ్యతను తేల్చేందుకు ఎక్కువ కాలం పడుతుండగా ఇక నుంచి ఫిర్యాదులు అందిన చోటే పరీక్షలు జరగనున్నాయి. ఆహార పదార్థాల నాణ్యతపై అక్కడికక్కడే ఫలితాలు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా ఆహార కల్తీని నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్’రాష్ట్రంలోనూ అందుబాటులోకి వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) కార్యాలయ ఆవరణలో ఈ వాహనాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి, శాసన మండలి చైర్మన్ వి.స్వామిగౌడ్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్ తదితరులు ప్రారంభించారు. రూ. 50 లక్షలతో రూపొందిన ఈ వాహనంలో కల్తీలను నియంత్రించేందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాహన నిర్వహణ, ఇంధన ఖర్చుల కోసం ఏటా రూ. 5 లక్షలను సైతం కేంద్ర ప్రభుత్వమే ఇవ్వనుంది. ఇకపై ఈ వ్యాన్ నేరుగా హోటళ్లు, కర్రీ పాయింట్లు, ఫిర్యాదులు చేసే వినియోగదారుల ఇళ్ల వద్దకు వచ్చి మరీ పరీక్షలు చేయనుంది. చాలా రకాల నమూనాలపై కేవలం 10 నిమిషాల్లోనే ఫలితాలను వెల్లడించనుంది. ఆహార ఉత్పత్తుల వ్యాపారం ఎక్కువగా జరిగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ వాహనం సేవలను ఎక్కువగా ఉపయోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేక అవగాహన... మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ కేవలం ఆహార పరీక్షలకే పరిమితం కాకుండా గ్రామాల్లోనూ సంచరించనుంది. ఆహారం, తాగునీరు కల్తీ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులు, స్వీయ శుభ్రతలపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించనుంది. వాహనంలోని టీవీ ద్వారా కల్తీకి సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తారు. వాహనంలో డ్రైవర్, ఫుడ్ అనలిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫుడ్ ఇన్స్పెక్టర్, అటెండర్ ఉంటారు. నెలవారీ టార్గెట్ ప్రకారం ఈ వాహనం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో పర్యటిస్తుంది. వెంటనే ఫలితాలు ప్రకటిస్తాం కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం 54 రకాల పదార్థాలపై పరీక్షలు నిర్వహిస్తాం. వెంటనే ఫలితాలను కూడా ప్రకటిస్తాం. ఈ వ్యాన్ అందుబాటులోకి రావడం ఆనందంగా ఉంది. – డాక్టర్ కె.సావిత్రి, చీఫ్ ఫుడ్ ఎనలిస్ట్ (ఐపీఎం) ఇంట్లో వాటినీ పరీక్షించుకోవచ్చు ఇళ్లలో పాల నాణ్యతపై సందేహం ఉన్న వారు నేరుగా ఈ వ్యాన్ వద్దకు వచ్చి పాలను పరీక్షించుకోవచ్చు. – బి.విజయలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ వైరాలజీ స్పాట్‌కు వెళ్తాం సాల్వ్ చేస్తాం మాకు ఫిర్యాదు అందినా..అందకున్నా మేం స్పాట్‌కు వెళ్తాం. పాలు, ఉప్పు, పప్పు, కూరలు, అన్నం, నూనె వంటి వాటిపై తక్షణం పరీక్షలు నిర్వహిస్తాం. అక్కడికక్కడే రిజల్ట్‌ని ప్రకటిస్తాం. – బి.శారద, ఫుడ్ ఎనలిస్ట్ వీటిపై పరీక్షలు.. పాలు, నెయ్యి, పన్నీరు, నూనె, కారం, కారాబూందీ, ఆలూ చిప్స్, తీపిపదార్థాలు, ఉప్పు, మసాలాలతో కూడిన నిల్వ పదార్థాలు, అన్ని రకాల పచ్చళ్లను పరీక్షించి మొబైల్ ల్యాబ్ అప్పటికప్పుడే ఫలితాలను వెల్లడిస్తుంది. ఆహార పదార్థాల్లో నిషేధిత రంగులుంటే వెంటనే పసిగడుతుంది. సందేహాలు ఉన్న కొన్ని నమూనాలను మాత్రం ఐపీఎంకు తరలించి పరీక్షిస్తారు. అలాగే చిన్న దుకాణాలు, బేకరీల్లో విక్రయించే నీళ్ల ప్యాకెట్లు, బాటిళ్లు, పాల ఉత్పత్తుల్లో బ్యాక్టీరియా ఉందో లేదో పరీక్షించేందుకు మొబైల్ ల్యాబ్‌లో 24 గంటల సమయం పట్టనుంది. ఫోన్ కొట్టు భరతం పట్టు.. ఆహార కల్తీలపై 9100107309 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సిబ్బంది వాహనంతో వచ్చి నమూనాలు సేకరించి అక్కడికక్కడే ఫలితాలు ప్రకటిస్తారు. కల్తీ నిజమని తేలితే కల్తీదారుడిని జైలుకు పంపుతారు. వ్యాన్‌లో ఉండేవి ఇవే... వ్యాన్‌లో పరీక్షలు నిర్వహించడానికి ‘మిల్క్ స్క్రీన్, పీహెచ్ మీటర్ (నీరు, ఆయిల్ల అనాలసిస్ కోసం), న్యూమరికల్ బ్యాలెన్స్ పరికరం, కెమికల్ స్టాండ్, బ్యూరెట్, బ్యూరెట్ స్టాండ్, ఎగ్జాస్ట్ ఫ్యాన్, ల్యాడర్, సెటప్ రేడియో, యాంప్లిఫ్లయర్, వర్క్ బెంచ్, జనరేటర్, రిఫ్రిజిరేటర్, గ్యాస్ సిలిండర్, వాటర్ ట్యాంక్, సింక్, ఫైర్ ఎగ్జాస్ట్, కంప్యూటర్, ప్రింటర్, టీవీ ఉన్నాయి. త్వరలో మరో వాహనం: లక్ష్మారెడ్డి ఆహార కల్తీని నియంత్రించేందుకు తొలి దశలో రెండు వాహనాలను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, ప్రస్తుతానికి ఒక వాహనాన్ని పంపారని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. త్వరలోనే మరో వాహనం వస్తుందని చెప్పారు. ఆహార కల్తీ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. హోటళ్లు, ఇతర ఆహార పదార్థాల తయారీదారులు, వ్యాపారులు కల్తీలను అరికట్టడంలో నిజాయితీగా వ్యవహరించాలని కోరారు. ఆహార కల్తీ చట్టాన్ని మరింత కఠినంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. పటిష్టమైన చట్టం రూపొందించాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. -
రిటైల్ పైకి.. టోకు కిందకి
న్యూఢిల్లీ : ఓ వైపు రిటైల్ ద్రవ్యోల్బణం పగ్గాలు తెంచుకుని పరుగులు పెడుతుండగా... మరోవైపు టోకు ధరల ద్రవ్యోల్బణం కాస్త శాంతించింది. డిసెంబర్ నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 3.58 శాతానికి తగ్గినట్టు తెలిసింది. ఆహార పదార్థాల ధరలు తగ్గడంతో గత నెలలో 3.93 శాతంగా ఉన్న డబ్ల్యూపీఏ, ఈ నెలలో 3.58 శాతానికి తగ్గినట్టు ప్రభుత్వం విడుదల చేసిన కేంద్ర గణాంకాల కార్యాలయం డేటాలో వెల్లడైంది. కాగ, రిటైల్ ద్రవ్యోల్బణం మాత్రం ఈ నెలలో ఆర్బీఐ నియంత్రిత లక్ష్యాన్ని దాటేసుకుని ఏకంగా 5.21 శాతానికి ఎగిసిన సంగతి తెలిసిందే. నేడు విడుదలైన డేటాలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలలో 4.72 శాతం తగ్గింది. కూరగాయల ద్రవ్యోల్బణం కూడా వార్షికంగా 56.46 శాతానికి పడిపోయింది. ఇది గత నెలలో 59.80 శాతంగా ఉంది. గుడ్లు, మాంసం, చేపలు ద్రవ్యోల్బణం కూడా 1.67 శాతం క్షీణించింది. కాగ, ఇంధనం, పవర్ సెగ్మెంట్లలో టోకు ద్రవ్యోల్బణం డిసెంబర్ నెలలో 9.16 శాతానికి ఎగిసింది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 2.61 శాతంగా ఉంది. -
ఇక హోటళ్లకూ గ్రేడింగ్!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలకు ఆహార పదార్థాలను సరఫరా చేసే అన్ని రకాల హోటళ్లకు వాటి నాణ్యత ప్రమాణాలను బట్టి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి లక్ష్మా రెడ్డి తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండి యా ఆధ్వర్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఆహార భద్రతా సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాల సరఫరాకు ప్రధానంగా ఏడు అంశాలకు ఆమోదం తెలిపారు. ఆహార పదార్థాల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం, నాణ్యత విషయంలో వర్తకులు, వినియోగదారుల మధ్య భరోసా కలిగించడం, నాణ్యత పరీక్ష కేంద్రాలను పటిష్టపరచడం, పౌష్టికాహారాన్ని తీసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆహారపు అలవాట్లలో మార్పులను ప్రోత్సహిం చడం, వర్తకుల నాణ్యత ప్రమాణాల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడం, నాణ్యత ప్రమాణాల అమలుకు పక్కా వ్యవ స్థను ఏర్పాటు చేయడం.. లాంటి అంశాల అమలుకు అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నాణ్యమైన ఆహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరించామన్నారు. -
మెతుకు పడేస్తే మూడినట్లే..
సాక్షి, బెంగళూరు : ఒక్క పూట భోజనం దొరక్క అల్లాడిపోయే నిరుపేదలు ఒక వైపు.. పెళ్లిళ్లు, విందులు, సంబరాల పేరిట ఆహారాన్ని కుప్పతొట్టిపాలు చేస్తున్న వారు మరో వైపు. రైతన్న ఆరుగాలం శ్రమించి పండించిన పంట అన్నార్తులకు చేరకుండానే చెత్తబుట్టల్లోకి చేరిపోతోంది. ఈ విధంగా ఆహారం వ్యర్థమవుతుండడాన్ని నిరోధించేందుకు కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు పూనుకుంది. ఇది అమల్లోకి వస్తే ఆహారాన్ని వ్యర్థం చేసిన వారికి గరిష్టంగా 6 నెలల వరకు జైలు శిక్ష, రూ.10 వేల వరకు జరిమానా తప్పదు. కళ్లుతిరిగే వృథా దేశ ఐటీ సిటీలో పెళ్లిళ్లు, విందులు, ఇతర కార్యక్రమాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లలో కలుపుకుని భారీగా ఆహారం వృథా అవుతోంది. ఇలా ఏడాదికి వ్యర్థమవుతున్న ఆహారంతో 2.6 కోట్ల మంది ఒక పూట భోజనం చేయవచ్చు. బెంగళూరులోని వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన ఒక అధ్యయనంలో ఏటా 943 టన్నుల ఆహారం చెత్తకుప్పలో చేరుతోందని తేలింది. దీంతో ఇక రాష్ట్ర రాజధాని బెంగళూరుతో పాటు ఏ ప్రాంతంలోనైనా సరే ఆహారాన్ని వృథా చేస్తే జరిమానాతో పాటు జైలు శిక్షను విధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలశాఖ మంత్రి యూటీ ఖాదర్ వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర న్యాయశాఖ ‘కర్ణాటక ఆహార వ్యర్థ నియంత్రణ, వినిమయ చట్టం’ పేరిట ముసాయిదా బిల్లును రూపొందిస్తోంది. కళ్యాణ మండపాలు, హోటళ్లు, సంస్థలు, సమూహాలు ఈ బిల్లు పరిధిలోకి వస్తాయి. కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ముసాయిదాను చట్టంగా చేసిన తర్వాత దీన్ని అమలు చేసేందుకుగాను ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటవుతుంది. ఇందులో ఆహార, పౌర సరఫరాలశాఖ అధికారితో పాటు జిల్లా ఎస్పీ, జిల్లా పంచాయతీ అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు. వీరు ఇతరుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో పాటు తామే సుమోటోగా తీసుకొని కూడా కేసులు నమోదు చేస్తారు. విచారణ కోసం జిల్లాకు ఒక కోర్టును ఏర్పాటు చేస్తారు. ఆహారాన్ని వృథా చేసినట్లు విచారణలో రుజువైతే సంబంధిత రెస్టారెంట్ల యజమానులు, కళ్యాణ మండపాల నిర్వాహకులతో పాటు పెళ్లిళ్లు, విందులు నిర్వహించిన వారికి కూడా శిక్ష విధిస్తారు. -
అసెంబ్లీలో ఇంత నాసిరకం భోజనమా?
సాక్షి, బెంగళూరు(బెళగావి): అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులతో పాటు సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఉత్తర కర్ణాటక శైలి ఆహారం వల్ల అస్వస్థతకు గురవడంపై మంగళవారం విధానసభలో వాడివేడిగా చర్చ జరిగింది. ఉదయమే బీజేపీ సభ్యుడు సోమణ్ణ మాట్లాడుతూ.. ఈసారి సౌకర్యాలు దారుణంగా ఉన్నాయని, గతంలో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదని ఆరోపించారు. తామూ ఉత్తర కర్ణాటక శైలి ఆహారాన్ని ఎన్నోసార్లు తిన్నామని, ఈసారి అత్యంత నాసిరకంగా ఉండడంతోనే ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు అస్వస్థతకు గురయ్యారన్నారు. అందుకు సభాపతులే కారణమంటూ ఆరోపించారు. ఒక్క ప్లేటు భోజనానికి రూ.500 ఖర్చు చేసినట్లు రికార్డుల్లో చూపించారని అయితే ఈ భోజనం చూస్తుంటే కనీసం రూ.50 విలువ కూడా చేసేలా లేదన్నారు. శాసనసభ్యుడు శాణప్ప కూడా సోమణ్ణకు మద్దతుగా మాట్లాడారు. ఇక్కడ ఒక్కసారి భోజనం తింటే కనీసం 12సార్లు వాంతులు అవుతున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలెవరూ శాసనసభ సమావేశాలకు హాజరు కాకూడదనే కుట్రతోనే ఇటువంటి భోజనాలకు ఆర్డర్‌ను అందించారేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. వీరి ఆరోపణలకు కాంగ్రెస్ సభ్యుడు పాటిల్ స్పందిస్తూ.. ఉత్తర కర్ణాటక ప్రాంత అభివృద్ధి కోసం చర్చలు జరగాల్సిన సమావేశాల్లో ఆహారం గురించి చర్చించుకోవడం సబబు కాదన్నారు. అందుకు మిగిలిన కాంగ్రెస్ సభ్యులు కూడా శృతి కలపడంతో అధికార,ప్రతిపక్షాల సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ సాగింది. -
ఐలయ్య మూర్ఖుడు: కృష్ణసాగర్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కులం పేరుతో దూషించిన కంచ ఐలయ్య ఒక మూర్ఖుడు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమిత్ షాను కించపరిచేలా కంచ ఐలయ్య చేసిన వ్యాఖ్యలపై కోర్టులో కేసు వేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌కు ఆర్యవైశ్యులంటే చులకన భావముందని, అందుకే ఆర్యవైశ్యులను అవమానించినా పట్టించుకోవడంలేదని కృష్ణసాగర్‌రావు విమర్శించారు. ఐలయ్యపై ప్రభుత్వమే క్రిమినల్ కేసును ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీలకు సిద్ధాంతాల్లేవని.. ఉనికిని కాపాడుకోవడానికే హింసకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. -
పోలీసుల దుశ్చర్య.. సీసీటీవీలో బుక్కు
థానే: ఓ హోటల్లో పోలీసులు జులుం ప్రదర్శించారు. దర్జాగా బేర్ మంటూ తిని, తాగేసి బిల్లు విషయానికొచ్చేసరికి హోటల్ సిబ్బందిపై దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తూ కిందపడేస్తూ సీసీటీవీ కెమెరాకు చిక్కారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. నెల రోజుల కిందట ముంబయిలో చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 'ఆరోజు మేం చేసిన తప్పేమిటంటే వారు తిన్న ఆహారానికి, తాగిన మద్యానికి బిల్లు వేసి ఇవ్వడమే. వారు ఆ రోజు ఎంత రచ్చ చేశారో సీసీటీవీ ఫుటేజీలో ఉంది. మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. అయిన కేసు పెట్టలేదు' అని హోటల్లోని బాధితులు వాపోతున్నారు. కార్కెరా అనే పోలీసు అధికారి మరికొంతమంది పోలీసులతో తమ రెస్టారెంటుకు వచ్చాడని, అనంతరం మద్యం, ఆహారం ఆర్డర్ చేసి తిన్నారని చెప్పారు. ఎప్పుడు వచ్చినా సగం బిల్లే ఇచ్చి వెళుతుంటారని, అయినా తాము మాట్లాడబోమని, కానీ, ఆ రోజు రెండు వేల రూపాయల బిల్లు వచ్చిందని తమపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. -
టమాటా దెబ్బ: డబ్ల్యుపీఐ 1.88శాతం
న్యూఢిల్లీ: జూలై నెలకు సంబంధించి టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ) ఆందోళనకరంగా నమోదైంది. సోమవారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం ఇది 1.88శాతంగా నిలిచింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2011-12 సంవత్సరానికి సవరించిన బేస్ ఇయర్‌తో టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) జులై 2017 నాటికి 0.88 శాతం నుంచి 1.88 శాతానికి పెరిగింది.ఆహార ధరలు బాగా ప్రియంకావడంతో టోకు ధరల సూచీ కూడా భారీగా పెరిగింది. జూన్ నెలలో ఇది. 0.9శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం 2.15 శాతానికి ఎగిసింది. గత నెలలో-3.4 శాతంగా ఉంది. ఫుడ్ ఇండెక్స్ మంత్ ఆన్‌మంత్ 6.2 శాతానికి ఎగిసింది. ఆ హారేతర వస్తువుల ద్రవ్బోల్బణం-6.32శాతంగా. గత నెలలో ఇది 5.15 శాతం. కూరగాయల ద్రవ్యోల్బణం భారీగా ఎగిసింది. 21.95 శాతంతో ఆందోళనకర నెంబర్స్‌ను రికార్డ్ చేసింది. గత నెల ఇది 21.16 శాతంగా నమోదైంది. ప్రధానంగా టమాటా ధరలు దీన్ని ప్రభావితం చేసినట్టు ఎనలిస్టుల అంచనా. ఫ్యూయల్ అండ్ పవర్ 4.37 శాతంగా నిలిచింది. ఫుడ్ ఇండెక్స్ ఆధారంగా ప్రైమరీ ఆర్టికల్ గ్రూపు , ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణ రేటు జూలై నెలలో 1.25 శాతం నుంచి 2.12 శాతానికి పెరిగింది. దీంతో వచ్చే ఆర్బీఐ రివ్యూలో వడ్డీ రేట్లకోత తప్పదనే అంచనాలను మార్కెట్ వర్గాలు వ్యక్తం చేశాయి. -
బేజారెత్తిస్తున్న రైళ్లు!
రైళ్లలో సరఫరా చేస్తున్న తిండి ఉత్త పనికిమాలినదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక కడిగి పడేసి అయిదారు రోజులు కాకుండానే ఒక ప్రయాణికుడికి సరఫరా చేసిన వెజ్ బిర్యానీలో చచ్చిన బల్లి పడి ఉన్నదంటే అది ఆ శాఖ పనితీరును వెల్లడిస్తుంది. అది తెలుసుకుని వచ్చిన రైల్వే సిబ్బంది చాలా శ్రద్ధగా ఆ బిర్యానీ ప్యాకెట్‌ను వెంటనే బయటకు విసిరేశారు. ప్రయాణికుడికి అవసరమైన వైద్యసాయం మాత్రం నాలుగు గంటల తర్వాత అందింది. జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తున్న పూర్వ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఈ ఘటనపై యధాప్రకారం దర్యాప్తు చేస్తామన్న హామీ మాత్రం వినబడింది. నిజానికి ఇప్పటికే కాగ్ లోతైన దర్యాప్తు జరిపింది. మొత్తంగా 74 స్టేషన్లలో, 80 రైళ్లలో, వివిధ కేటరింగ్ కేంద్రాల్లో తనిఖీ చేసి అపరిశుభ్రత, నిర్లక్ష్యం అక్కడ రాజ్యమేలుతున్నాయని తేల్చింది. పాచిపోయిన ఆహారపదార్ధాలను ఆ మర్నాడు వంటకాల్లో కలగలిపి ప్రయాణికులకు అంటగడుతున్నారని చెప్పింది. కాలం చెల్లిన బిస్కెట్ ప్యాకె ట్లను, ఇతర పదార్ధాలను యధేచ్ఛగా అమ్ముతున్నారని పేర్కొంది. ఇంకా దారు ణమేమంటే పాలు, పండ్ల రసాలు,టీ, కాఫీ వగైరాలన్నిటికీ కలుషిత నీటిని వాడుతున్నారని వివరించింది. పాంట్రీ కారుల్లో, వంట గదుల్లో దేనిపైనా మూతలు లేకపోవడం వల్ల ఎలుకలు, బొద్దింకలు స్వైరవిహారం చేస్తున్నాయని తెలిపింది. ఇవన్నీ గమనించాక పంపిణీ చేసిన తిండిలో చచ్చిన బల్లి కనబడటం అసాధారణమేమీ కాదని అర్ధమవుతుంది. మరి రైల్వే శాఖ ఏం చేస్తున్నట్టు? ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక రైల్వే శాఖపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్టు ప్రక టించింది. వచ్చే అయిదేళ్లలో రూ. 8.5 లక్షల కోట్ల మేర ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు సమీకరించి ఆ శాఖకు జవసత్వాలు కల్పించబోతున్నట్టు చెప్పింది. ప్రయాణికుల సంఖ్యను, సరుకు రవాణాను భారీగా పెంచడం, కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం, అధునాతన రైళ్లను సమకూర్చుకోవడం ఈ ప్రణాళికలో భాగం. ఇవన్నీ చేస్తే రైల్వే ఆదాయం అనేక రెట్లు పెరుగుతుందన్నది అంచనా. గత రెండున్నరేళ్లలో అందులో దాదాపు నాలుగోవంతు... అంటే రూ. 2 లక్షల కోట్ల వరకూ ఖర్చు చేశారని కూడా చెబుతున్నారు. కానీ దానివల్ల ప్రయా ణికులకు ఒరిగిందేమీ లేదు. నిరుడు రూ. 20,000 కోట్ల మేర ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకోగా అది నెరవేరలేదని గణాంకాలు చెబుతున్నాయి. పెట్టు బడులు పెట్టగానే దాని ఫలితాలు కనబడకపోవచ్చు. అందుకు కొంత సమయం పట్టొచ్చు. కానీ ఆహార పదార్థాలను అందించడంలోనే, బోగీల నిర్వహణ లోనే ఇంత ఘోరంగా విఫలమవుతుంటే ఆ శాఖ ఇంకేదో సాధిస్తుందని విశ్వ సించేదెలా? వాస్తవానికి ఆహారపదార్ధాల విషయమై ఎన్నో విషయాలు చెప్పిన కాగ్ అందుకు దోహదపడుతున్న కారణాలను కూడా ప్రస్తావించింది. కేటరింగ్ విధానంలో నిలకడ లేకపోవడం, కేటరింగ్ యూనిట్ల నిర్వహణ బా«ధ్యతలను వెంటవెంటనే మారుస్తుండటం ఈ దుస్థితికి దారితీసి ఉండొచ్చునని అభిప్రాయ పడింది. రైల్వే శాఖ ఒకప్పుడు తానే కేటరింగ్ సేవలను నిర్వహించేది. అయితే ప్రయాణికులనుంచి వస్తున్న ఫిర్యాదుల పర్యవసానంగా దీన్ని ప్రైవేటు రంగానికి అప్పగించడం ఉత్తమమని భావించింది. కానీ అందువల్ల వీసమెత్తు ఉపయోగం కలగలేదని తాజా నివేదిక చూస్తే అర్ధమవుతుంది. ఈ విషయంలో తన వంతుగా తీసుకుంటున్న చర్యలను రైల్వే శాఖ ఏకరువు పెట్టింది. నిరుడు 16 కాంట్రాక్టు సంస్థల్ని బ్లాక్‌లిస్టులో పెట్టామని, మరికొందరిపై లక్షల రూపాయల చొప్పున జరిమానా వేశామని వివరించింది. అయితే మౌలికంగా కేటరింగ్ సంస్థల ఎంపిక ప్రక్రియలోనే లోపముందన్న సంగతి ఆ శాఖ తెలుసుకోవడం లేదు. ఆ విష యంలో పాటిస్తున్న గోప్యతే ఈ అస్తవ్యస్థ స్థితికి దారితీస్తోంది. ఏ సంస్థకు ఏ ప్రాతిపదికన కాంట్రాక్టు ఇస్తున్నారో, దేన్ని ఆధారంగా కొందరిని అనర్హులుగా నిర్ణయిస్తున్నారో ఎవరికీ తెలియదు. ఇందుకోసం వారు ఏర్పరుచుకున్న నిబం ధనలన్నీ పరమ రహస్యం. ఆహార పదార్ధాల ధరల నిర్ణయం కూడా ఇలాగే ఉంటోంది. కాంట్రాక్టుల వ్యవహారం పారదర్శకంగా ఉండి, ప్రయాణికులకు అందించే పదార్ధాల నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే... బయటి తనిఖీలకు కూడా వీలు కల్పిస్తే ఈ పరిస్థితి కాస్తయినా చక్క బడుతుంది. ప్రయాణికులకు సమకూర్చే దుప్పట్లు, రైళ్లలో వాడే తెరలు వగై రాలన్నీ నెలల తరబడి పరిశుభ్రం చేయడం లేదని కూడా కాగ్ బయటపెట్టింది. ఒకసారి ఉపయోగించిన వస్త్రాన్ని ఉతికించాకే తిరిగి ఉపయోగించాలన్న నిబం ధన ఉన్నా దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. సూపర్‌ఫాస్ట్ రైళ్ల ముచ్చట కూడా అంతే. ఆ పేరు చెప్పి ప్రయాణికుల దగ్గరనుంచి అదనంగా రూ. 11.17 కోట్ల మేర వసూలు చేస్తున్నా ఆ రైళ్లు ఎప్పటి మాదిరి నత్తనడకనే తల పిస్తున్నాయి. కాగ్ నివేదిక వివిధ రైల్వే స్టేషన్లలో ఆ రైళ్లు బయల్దేరుతున్న సమయాన్ని, గమ్యాన్ని చేరుకుంటున్న సమయాన్ని పరిశీలించి అందులో 95 శాతం రైళ్లు పాత పద్ధతిలోనే సాగుతున్నాయని బయటపెట్టింది. ఇక రైల్వే విద్యుదీకరణ స్థితి కూడా అలాగే ఉంటున్నది. అనేక ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కావడం, మొదలుపెట్టిన పనులు కూడా ఈసురోమని నడుస్తుండటం వల్ల ఇంధన వ్యయాన్ని తగ్గించుకోవాలన్న ఆ శాఖ లక్ష్యం ఇప్పట్లో నెరవేరే అవ కాశమే కనబడటం లేదు. ఇన్ని లోపాలు సరిదిద్దుకోకుండా విఫలమవుతూ పెద్ద పెద్ద ప్రణాళికలను రచించుకోవడం ఎవరిని వంచించడానికి? బాహాటంగా కనబడుతున్న లోపా లనూ సరిదిద్దుకోక, ఫిర్యాదులొచ్చినప్పుడూ పట్టించుకోలేక రైల్వే యంత్రాంగం ఒరగబెడుతున్నదేమిటి? తాజా ఉదంతంతోనైనా రైళ్ల శాఖ కళ్లు తెరవాలి. రకరకాల పేర్లు చెప్పి ప్రయాణికులను నిలువుదోపిడీ చేయడంలో చూపుతున్న ఉత్సాహాన్ని వారికి సౌకర్యాలను కల్పించడంలో, వారిని సురక్షితంగా గమ్యాన్ని చేర్చడంలో ప్రదర్శిస్తే మంచిదని తెలుసుకోవాలి. -
‘వరి’ంచిన ధాన్య సిరి!
♦ రాష్ట్రంలో రెట్టింపు స్థాయిలో వరి ఉత్పత్తి ♦ 2015–16లో 30 లక్షల టన్నులు.. ♦ ఇప్పుడు 63 లక్షల టన్నులు ♦ పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా రెట్టింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రెట్టింపు స్థాయిలో పెరిగింది. 2015–16 వ్యవసాయ సీజన్లో 51.45 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా, 2016–17 సీజన్లో ఏకంగా 96.36 లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యాయి. అందులో వరి 2015–16లో 30.47 లక్షల టన్నులు ఉత్పత్తి జరగ్గా.. 2016–17లో ఏకంగా రెట్టింపు స్థాయిని మించి 63.57 లక్షల టన్నులు ఉత్పత్తి కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ మూడేళ్లలో ఇంతటి స్థాయిలో వరి పంట చేతికందలేదు 2013–14లో రాష్ట్రం విడిపోక ముందు మాత్రం 66.22 లక్షల టన్నులు, 2014–15లో 45.45 లక్షల టన్నుల వరి పండింది. విచిత్రమేంటంటే ఖరీఫ్ కంటే కూడా రబీలోనే వరి ధాన్యం రాశులు వెల్లువెత్తడం గమనార్హం. 2016 ఖరీఫ్‌లో 29.18 లక్షల టన్నులు మాత్రమే వరి పంట చేతికి రాగా, రబీలో ఏకంగా 34.39 లక్షల టన్నులు పంట చేతికొచ్చింది. మరోవైపు పప్పుధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. 2015–16లో 2.47 లక్షల టన్నుల పప్పుధాన్యాలు పండగా, 2016–17లో ఏకంగా 5.29 లక్షల టన్నులు ఉత్పత్తి జరగడం గమనార్హం. -
∙అమృతాహారం చిన్న రైతుల ‘సహజ ఆహారం’!
♦ 30 సేంద్రియ రైతుల సహకార సంఘాల భాగస్వామ్యంతో ♦ హైదరాబాద్, విశాఖపట్నంలో 10 ‘సహజ ఆహారం’ ఫుడ్ స్టోర్లు ♦ వ్యవసాయేతర ఆస్థులుంటేనే రైతుల సహకార సంఘాలకు రుణాలు ఆపైన 30% ఆదాయపు పన్ను విధింపు.. పేద రైతుల సొసైటీలకన్నా మినహాయింపునివ్వాలంటున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు సాగు చేస్తున్న చిన్న, సన్నకారు రైతులు, వినియోగదారులు కలిసి ఏర్పాటు చేసుకున్న సహకార సంఘాల సమాఖ్య ‘సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీ’. వివిధ రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయ వ్యాప్తికి కృషి చేస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్.ఎ.) ఈ సంస్థను ప్రమోట్ చేస్తోంది. స్థానిక వనరులతో సేంద్రియ వ్యవసాయం చేయడంతోనే చిన్న, సన్నకారు రైతుల జీవితాలు మారిపోవని.. రసాయనిక అవశేషాల్లేని తమ ఆహారోత్పత్తులను తాము నిర్ణయించుకున్న గిట్టుబాటు ధరకు నేరుగా వినియోగదారులకు అమ్ముకోగలిగినప్పుడే వారి నికరాదాయం పెరుగుతుందని సుస్థిర వ్యవసాయ కేంద్రం అనుభవపూర్వకంగా గ్రహించింది. ఆ తర్వాతే ‘సహజాహారం’ ఫుడ్ స్టోర్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలోని 12 జిల్లాలకు చెందిన 30 సేంద్రియ రైతుల సహకార సంఘాలకు ఇందులో భాగస్వామ్యం ఉంది. వీటిలో మహిళా రైతుల సంఘాలు 2, ఆదివాసీ రైతుల సహకార సంఘాలు 2 ఉన్నాయి. అంతేకాదు.. వినియోగదారుల సహకార సంఘం కూడా ఒకటుంది. కనీసం నాలుగేళ్లుగా 882 హెక్టార్లలో సేంద్రియ పంటలు పండిస్తున్న 496 మంది సర్టిఫైడ్ సేంద్రియ రైతులతో సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీ 2014లో ప్రారంభమైంది. 200 రకాల సేంద్రియ ఆహారోత్పత్తులు.. రైతులు సేంద్రియ పద్ధతుల్లో పండించిన ధాన్యాలు, పప్పులు, కూరగాయలు తదితర ఉత్పత్తులను శుద్ధి చేసి, ప్యాక్‌చేసి ‘సహజ ఆహారం’ బ్రాండ్‌తో విక్రయించడం విశేషం. బియ్యం, పప్పులు, గానుగ వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, పండ్లు, శుద్ధిచేసి ప్యాక్ చేసిన ఆహారోత్పత్తులు, సౌందర్య సాధనాలు మొత్తం 200 రకాల సేంద్రియ ఉత్పత్తులను స్వయంగా తయారు చేసి అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకోసం విజయనగరం జిల్లా బొద్దాం, కర్నూలు జిల్లా నాగులదిన్నె, జనగామ జిల్లా కల్లెం, మహారాష్ట్ర వార్దా జిల్లా డోర్లీలో ప్రోసెసింగ్ హబ్‌లను ‘సహజ ఆహారం’ కంపెనీ నెలకొల్పింది. ఈ సేంద్రియ ఉత్పత్తులను హైదరాబాద్, విశాఖపట్నంలలో 10 సహజ ఆహారం స్టోర్ల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. మరో 15 స్టోర్లు త్వరలో తెరవనున్నారు. గరిష్ట ధరలో కనీసం 50% రైతుకు అందుతుంది సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలను అప్పటికప్పుడు మార్కెట్లో అమ్ముకోవడం కన్నా.. నిల్వ చేసి, ప్రోసెస్ చేసి వివిధ ఆహారోత్పత్తులుగా తయారు చేసి, ఒకే బ్రాండ్ పేరుతో విక్రయించడం ద్వారా అధిక నికరాదాయాన్ని పొందడానికి రైతులకు సహకార సంఘాలు, ప్రొడ్యూసర్ కంపెనీలు ఉపకరిస్తాయి. సాధారణంగా మార్కెట్లో అమ్మకానికి పెట్టే ఆహారోత్పత్తుల గరిష్ట విలువలో 22 నుంచి 25% మాత్రమే వాటిని పండించిన రైతులకు చేరుతున్నదని అంచనా. అయితే, ‘సహజ ఆహారం’ స్టోర్లలో సేంద్రియ ఆహారోత్పత్తులకు వినియోగదారులు చెల్లించే గరిష్ట ధరలో కనీసం 50% సొమ్మును పండించిన రైతుకు అందిస్తున్నామని డా. రామాంజనేయులు చెప్పారు. 30% ఆదాయపు పన్ను పోటా? రైతులు తమ ఉత్పత్తులను తమకు తామే నేరుగా వినియోగదారులకు అమ్ముకుంటే ఆదాయపు పన్ను చెల్లించనక్కరలేదు. కానీ, కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటైన ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా అమ్మితే వచ్చిన లాభంపై 30% ఆదాయపు పన్ను చెల్లించాల్సి వస్తున్నది. సేంద్రియ/ సహజ వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించి, నికరాదాయాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేసే చిన్న, సన్నకారు రైతులకు వెన్నుదన్నుగా ఉండాలంటే ఆదాయపు పన్నును వీరి సహకార సంఘాలకైనా మినహాయించాలని డా. రామాంజనేయులు కోరుతున్నారు. సంఘ సభ్యుల వ్యవసాయ భూములు లేదా సంఘం కొని దాచిన వ్యవసాయోత్పత్తుల విలువపై రుణపరపతి కల్పించడం అవసరం. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హితమైన సుస్థిర వ్యవసాయ పద్ధతులు పాటించే రైతుల సహకార సంఘాలను ప్రొత్సహించినట్టవుతుంది. తద్వారా భూమి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడినట్టవుతుంది. అన్నిటికీ మించి గ్రామీణ చిన్న, సన్నకారు రైతుల నికరాదాయాన్ని పెంపొందించడానికి దోహదపడినట్టవుతుంది. (వివరాలకు.. జ్టి్టp://ట్చజ్చ్జి్చ్చజ్చిట్చఝ.జీn 085007 83300) – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ వ్యవసాయేతర ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్థిక వనరులు లేని రైతులు, వినియోగదారుల సహకార సంఘాలు, ప్రొడ్యూసర్ కంపెనీలకు ఉదారంగా బ్యాంకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం మూడేళ్లు బ్యాలన్స్ షీట్‌తోపాటు వ్యవసాయేతర ఆస్తులను పూచీకత్తుగా పెట్టాలని బ్యాంకులు కోరడం అనుచితం. వనరులు తక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతులు సంఘాలుగా ఏర్పడి తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడాన్ని ప్రోత్సహించడానికి క్రెడిట్ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయాలి. ఇవి నిలదొక్కుకోవడానికి శైశవ దశలో తొలి మూడేళ్లలోనే ప్రభుత్వ మద్దతు అవసరం. అంతగా అయితే తొలి మూడేళ్లు పరిమితంగానే బ్యాంకు రుణాలు ఇవ్వాలి. వ్యవసాయేతర ఆస్థులు తనఖా పెట్టాలంటే పేద రైతులు ఎక్కడి నుంచి తేగలుగుతారన్న ఆలోచన పాలకులకు లేదా? అసంబద్ధమైన ఈ నిబంధనల కారణంగా పట్టణాలు, నగరాల్లో మోతుబరుల సహకార సంఘాలే బ్యాంకు రుణాలను ఎక్కువగా పొందగలుగుతున్నాయి. గ్రామీణ పేద రైతుల సహకార సంఘాలు మాత్రం బ్యాంకు రుణం పొందలేకపోతున్నాయి. బ్యాంకు రుణం దొరికితే 11–12% వార్షిక వడ్డీతో సరిపోతుంది. బ్యాంకు రుణం దొరక్కపోవడంతో మైక్రోఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఈ సంస్థల నుంచి రుణం తీసుకుంటే 13.5% వడ్డీ సహా 3 నెలల్లోనే అసలు మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించాల్సి వస్తున్నది. చిన్న, సన్నకారు రైతుల సహకార సంఘాలను సరిగ్గా నడుపుకోగలిగేలా ప్రభుత్వం వసతులు కల్పించడం ఎంతైనా అవసరం. – డా. జీ వీ రామాంజనేయులు (ట్చఝౌౌఃఛిట్చజీnఛీజ్చీ.ౌటజ), డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం, తార్నాక, సికింద్రాబాద్ -
ఈ నగరానికి ఏమైంది..?
కల్తీ క‘మాల్’ ఆరోగ్యం ఢమాల్ సిటీపై కల్తీ కేటుగాళ్ల పంజా ►జోరుగా ఆహారపదార్థాల కల్తీ.. గ్రేటర్ వాసుల్లో ఆందోళన ►నూనె, పాలు, తేనె, బియ్యం, మసాలాలు... దేన్నీ వదలని వైనం ► తొలుత నిత్యావసరాల వ్యాపారం..ఆపై కల్తీ వైపు పయనం ►ఉత్తరాది రాష్ట్రాల నుంచి కల్తీ ముడిసరుకుల దిగుమతి ► ప్రమాదకర పదార్థాలతో ఆరోగ్యానికి తీవ్ర హాని ►తనిఖీలు..పర్యవేక్షణ లేకే పరిస్థితి తీవ్రం ►కోటి మంది జనాభాకు ఇద్దరే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ►ధనదాహంతో విచ్చలవిడిగా కల్తీ చేస్తున్న వ్యాపారులు ► తాజాగా కలకలం రేపుతున్న ప్లాస్టిక్ బియ్యం ►మాఫియాగా సాగుతున్న వ్యవహారంపై పోలీసు నజర్ ► అమలుకు నోచని ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్’ చట్టం సిటీలో ‘కల్తీ’ రాజ్యం నడుస్తోంది. కాలుష్యంతో గాలి..నీరు కలుషితమవుతుండగా..వ్యాపారుల ధనదాహంతో తినే ఆహారమూ కల్తీమయం అవుతోంది. ఆరోగ్యం హరిస్తోంది. నిత్యావసరాలైన వంట నూనెలు, బియ్యం, టీ పొడి నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసుల వంటి ముఖ్యమైన పదార్థాలను పూర్తిగా నకిలీవి సృష్టిస్తున్నారు. ప్రమాదకర..విషపూరిత రసాయనాలు కలిపి అసలు ఏవో.. నకిలీ ఏవో తెలియకుండా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆహార తనిఖీలు, పర్యవేక్షణ చేపట్టి కల్తీకి అడ్డుకట్ట వేయాల్సిన ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్వీర్యంగా మారింది. ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్’ చట్టం అమలుకు నోచడం లేదు. కోటి జనాభా కలిగిన నగరంలో ఇద్దరే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సిటీబ్యూరో: సిటీలో ఆహార కల్తీ దందా మాఫియాగా సాగుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దీన్ని సీరియస్‌గా తీసుకున్న టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ, జోనల్ పోలీసులు వరుస దాడులు చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కల్తీ పాలు, తేనె, అల్లంపేస్ట్ తదితరాలను పట్టుకోగా... బుధవారం రాచకొండ ఎస్ఓటీ అధికారులు నకిలీ సాస్ దందాను గుట్టురట్టు చేశారు. వ్యాపారులే దారితప్పి... ఈ కల్తీ దందాలో చిక్కుతున్న వారిలో అత్యధికం వ్యాపారులే ఉంటున్నారు. తొలుత ఏదో ఒక నిత్యావసర సరుకులు, పప్పుదినుసుల వ్యాపారాన్ని ప్రారంభించి పక్కాగానే చేస్తున్నారు. ఉత్తరాది నుంచి ముడిసరుకులు... ఈ నకిలీ ఆహారపదార్థాలు తయారు చేయడానికి కావాల్సిన ముడిసరుకును ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్, ముంబై, ఢిల్లీల నుంచి ఖరీదు చేస్తున్నారు. వీటన్నింటినీ ఎలాంటి బిల్లులు లేకుండా కొన్ని ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా కిలోకు రూ.5 చొప్పున అదనంగా చెల్లిస్తూ రప్పిస్తున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ముడిసరుకుకు కిలోకు రూ.6 చొప్పున అదనంగా చెల్లిస్తున్నారు. రాయిపూర్, ఉత్తర్‌ప్రదేశ్‌ల నుంచి ఎగుమతి, దిగుమతుల్ని బిల్లులు లేకుండా నిర్వహించే అనేక ట్రాన్స్పోర్ట్ కంపెనీలు సిటీలో ఉన్నాయి. ఇంతటి హేయమైన దందాలు నిర్వహిస్తున్న వీరిపై కఠినం చర్యలు తీసుకోవడానికి అసవరమైన చట్టాలు మాత్రం లేవని చెప్తున్నారు. వీరిపై దాడులు చేసేది పోలీసులైతే... చర్యలు తీసుకోవాల్సింది మాత్రం ఫుడ్ ఇన్స్పెక్టర్లు. ఈ తరహా నేరాలు చేసే వారికి అరెస్టు చేసే అవకాశం లేదు. కేవలం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ యాక్ట్–2006 కింద కేసు నమోదు చేస్తారు. నకిలీ సరుకుల తయారీ ఇలా... మిరియాలు: ఐదు కేజీల సింథటిక్ గమ్, 10 కేజీల మైదా, 3 గ్రాముల రెడ్ ఆక్సైడ్, 5 గ్రాముల ఆర్టిఫీషియల్ రెడ్ ఆక్సైడ్లను 15 లీటర్ల నీటిలో కలుపుతారు. ఈ ద్రావణాన్ని 20 కేజీల బొప్పాయి విత్తనాల్లో (నల్లగా ఉండే భాగం) వేసి కలపడం ద్వారా మిరియాలు తయారు చేస్తున్నారు. మూడో రకం క్వాలిటీ నల్ల మిరియాలను ఫస్ట్ క్వాలిటీగా మార్చడానికి ఇలాంటి ద్రావణాన్నే వినియోగిస్తున్నారు. గసగసాలు: ఐదు కేజీల రాళ్ల పొడి, 30 కేజీల మైదా, 5 గ్రాముల పెయింట్స్ వైటనర్, 30 కేజీల గ్లూకోజ్, 2 కేజీల లిక్విడ్ జాంగ్రీలను 10 లీటర్ల నీటిలో కలిపి ద్రావణం సిద్ధం చేస్తారు. దీన్ని 60 కేజీల బొంబాయి రవ్వలో కలపడం ద్వారా 115 కిలోల గసగసాలను తయారు చేస్తున్నారు. ఫైన్‌క్వాలిటీ కోసం నాసిరకం వాటికి సోడియం హైడ్రోసల్ఫేట్ ఒక కేజీ, పెయింట్స్ వైటనర్ 5 లీటర్ల నీటిలో కలిపి 50 కేజీలు తయారు చేస్తున్నాడు. జీలకర్ర: ఒక కేజీ సోడియం హైడ్రోసల్పేట్, 25 కేజీల కార్వే స్వీట్స్, పెయింట్స్ వైటనర్‌ను వినియోగించి జీలకర్రను తయారు చేస్తున్నారు. చిన్న చిన్న గడ్డి పొరకలు, బొంబాయి చీపురు కట్టల నుంచి రాలిన ముక్కలపై రసాయినాలు జోడించి దీన్ని సిద్ధం చేస్తున్నారు. శొంఠి: పనికిరాని అల్లాన్ని సేకరిస్తున్న నకిలీ రాయుళ్ళు దాన్ని పూర్తిగా ఆరబెడుతున్నారు. ఆ తర్వాత కాంక్రీట్ మిక్సింగ్ చేసే మాదిరి చిన్నపాటి యంత్రంలో దీన్ని వేస్తున్నారు. దీంతోపాటు సున్నం, ఫెవికాల్, నీలం కలిపి మిక్సింగ్ చేసి ఆరబెట్టడం ద్వారా నకిలీ శొంఠి తయారు చేస్తున్నారు. నూనె: కల్తీ సరుకుల తయారీలో నూనెది అత్యంత దారుణమైన విధానం. జంతు వ్యర్థాలతో నూనె తయారు చేస్తున్న అనేక యూనిట్లను పోలీసులు గుర్తించి చర్యలు తీసుకున్నారు. వివిధ రకాలైన జంతువుల ఎముకల్ని సేకరిస్తున్న దుండగులు వాటిని నిర్ణీత పద్ధతిలో వేడి చేయడం ద్వారా నూనె ఉత్పత్తి చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్: కుళ్లిన బంగాళ దుంపలు, అరటి బోదెలు, రసాయనాలు కలిపి అల్లం వెల్లుల్ల పేస్ట్ సిద్ధం చేసేస్తున్నారు. వాసన కోసం మాత్రం అతి తక్కువ పాళ్ళల్లో అల్లం, వెల్లుల్లి వాడుతున్నారు. వనస్పతిని వినియోగించి నెయ్యి, కలర్ కోటింగ్‌తో నాసిరకం సోంపు, గడువు చెల్లిన చాక్లెట్లను రీ–సైకిల్ చేయడం ద్వారా కొత్తవి, గ్లూకోజ్ వాటర్–చెక్కెర పాకంతో తేనె, బోరు నీటితో మినరల్ వాటర్ తయారు చేయడంలోనూ అనేక మంది సిద్ధహస్తులున్నారు. రసాయన పాలు: బోయిన్పల్లి, బేగంబజార్ తదితర ప్రాంతాల నుంచి పాలపొడి, హైడ్రోజన్ పెరాక్సైడ్ రసాయనాన్ని కొనుగోలు చేస్తున్నారు. పది లీటర్ల పాలు తయారు చేయడానికి కేజీ పాలపొడి, తొమ్మిది లీటర్ల నీరు, లీటరు అసలు పాలతో పాటు 15 మిల్లీ లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ వినియోగిస్తున్నారు. ఈ రసాయనం పాలు చిక్కగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అధిక పాల దిగుబడి కోసం నిషేధిత ఇంజక్షన్లు, టానిక్స్ వాడకమూ ఉంది. పాల కల్తీలో మరో తంతు... కొన్ని ముఠాలు వివిధ ప్రాంతాల నుంచి ఖాళీ పాల ప్యాకెట్లు సేకరిస్తున్నాయి. రోజూ తెల్లవారుజామునే కంపెనీల నుంచి డీలర్ల వద్దకు పాల ప్యాకెట్లు వస్తాయి. వాటిని సేకరిస్తున్న దుండగులు తమ డెన్లకు తీసుకువెళ్తున్నారు. అక్కడ ఆ ప్యాకెట్లను కత్తిరించి, వాటిలో ఉన్న పాలను బకెట్లలో పోస్తారు. ఇలా తీసిన ప్రతి 50 లీటర్ల పాలలోనూ 15 లీటర్ల నీరు కలుపుతారు. ఒక్కోసారి కలుషిత నీటినీ కలుపుతున్నారు. అలా కల్తీ చేసిన పాలను తిరిగి అవే ప్యాకెట్లతో పాటు ముందే తెచ్చుకున్న ఖాళీ ప్యాకెట్లలోను నింపి ఎలక్ట్రానిక్ ప్యాకింగ్ మిషన్లతో సీల్ వేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 45 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఆపై ప్యాకెట్లను బట్వాడా చేస్తారు. ఇద్దరు కల్తీరాయుళ్ళ ఆటకట్టు సిటీబ్యూరో: రసాయనాలతో గోవా పేథా స్వీట్, నాసిరకం, గడువు ముగిసిన పదార్థాలతో ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. జియాగూడ ప్రాంతానికి చెందిన రామ్‌సింగ్ జుమ్మేరాత్ బజార్లో ఓ స్వీట్ల తయారీ యూనిట్ నిర్వహిస్తున్నాడు. సున్నం, పటక, సోడియం హైడ్రో సల్ఫేట్, కృత్రిమ రసాయనాలను వినియోగిస్తూ గోవా పేథా అనే స్వీటు తయారు చేస్తున్నాడు. ముషీరాబాద్ బాపూజీనగర్‌కు చెందిన పి.అశోక్ ఐస్ క్రీమ్స్ తయారీ యూనిట్ నిర్వహిస్తున్నాడు. గడువు ముగిసిన, నాశిరకం పాలపొడి, రంగులు తదితరాలను వాడి వివిధ ఫ్లేవర్ల ఐస్‌క్రీమ్స్ తయారు చేస్తున్నాడు. వీటిలో కొన్ని నిషేధిత రసాయనాలను కలుపుతున్నాడు. ఈ రెండు యూనిట్లపై బుధవారం దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీగా రసాయనాలు, నాసిరకమైన/నకిలీ ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు. -
విఫలమైనది విధానకర్తలే
విశ్లేషణ ఆహారధాన్యాల దిగుబడిలో పంజాబ్ ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదకతను సాధించింది. అయినా అక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది విస్మరించి అదే మార్గాన్ని అనుసరించాలనడం విధానపరమైన ఘోర తప్పిదాన్ని సూచిస్తోంది. నేటి మాంద్య పరిస్థి తుల్లో, ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసే శక్తి వ్యవసాయానికే ఉంది. రేటింగ్ సంస్థలు చూపే మార్గాన్ని విడనాడి నూతన ఆర్థిక పంథాను చేపట్టాల్సిందే. వృద్ధికి, సుస్థిరాభివృద్ధికి వ్యవసాయాన్ని ఇరుసుగా చేసే రాజకీయ ధైర్యాన్ని ప్రభుత్వం చూపితేనే అది సాధ్యం. ‘‘భారత వాతావరణ శాఖ ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవు తుందని అంచనా వేసింది. వానలు మంచిగా పడితే, తిరిగి ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగి వృద్ధి రేటు పుంజుకుని, 2016–17లో సాధిం చిన 4.4 శాతం వృద్ధిని మించిపోతుందని విశ్వసిస్తున్నాను’’ అంటూ కేంద్ర వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ గత మూడేళ్ల వ్యవసాయ రంగ విజయాలను వివరించారు. పుష్కలంగా వానలు పడ్డ ప్రతి వానాకాలం ఆర్థిక వ్యవస్థలో సంతోషం వెల్లివిరిసేలా చేస్తుంది. ఆహార ఉత్పత్తి ఈ ఏడాది సర్వ కాలీన రికార్డు స్థాయిలో 27.4 కోట్ల టన్నులకు చేరిందంటే ఆశ్చర్యమేం లేదు. 2014–15, 2015–16లలో వరుసగా రెండేళ్లు దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొ న్నాక వ్యవసాయ ఉత్పత్తి ఊర్ధ్వముఖంగా పయనించి వ్యవసాయాభివృద్ధి రేటు పెరిగింది. అది, దేశ ఆర్థికవృద్ధి రేటును పెంపొందింపజేస్తుందని భావి స్తున్నారు. అయితే, అంతా మంచిగా ఉన్నదని పించేలా చేసే ఈ గణాంక చిత్త రువుల మాటున... వ్యవసాయరంగం ఘోర దురవస్థలో విలవిలలాడుతుం డటం కొనసాగుతూనే ఉంది. దేశంలో ఎక్కడో ఒక చోట రైతులు ఆత్మహత్య లకు పాల్పడ్డారన్న వార్తలు రాకుండా రోజు గడవని దుస్థితి వ్యవసాయరం గంలోని మహా విషాదపు ప్రతిఫలనమే. మార్కెట్ కబంధ హస్తాల్లో రైతు ఈ వారం వెలువడిన ఒక వార్తా కథనం మధ్యప్రదేశ్ రైతుల దయనీయ పరిస్థితిని వెలుగులోకి తెచ్చింది. బంగాళదుంప విరగపండటంతో రైతులు కారు చౌకకు అమ్ముకోలేక పొలాల్లోని పంటనే కాలబెట్టేశారు లేదా పశువులకు మేపారు. ఇండోర్‌లో కేజీ ఉల్లికి 0.50 నుంచి రూ. 3.00 ధర పలుకుతోంది. ఆగ్రహించిన రైతులు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణా టకలో ఉల్లినే కాదు టమాటాలను సైతం ప్రధాన రహదారులపై పారబో శారు. పంట మార్కెట్‌కు ఉధృతంగా వచ్చిన సమయంలో కిలో టమాటాల ధర ఆంధ్రలోని కొన్నిమార్కెట్లలో 30 పైసల నుంచి రూ. 2 వరకు ఉంది. పప్పుధాన్యాల విషయమే చూడండి. పప్పు ధాన్యాల రిటైలు ధరలు విపరీతంగా పెరిగిన తర్వాత ప్రభుత్వం పప్పు «ధాన్యాల లభ్యతను పెంచ డానికి ద్విముఖ వైఖరిని చేపట్టింది. ఒక వంక, పప్పు ధాన్యాలను పండించి, సేకరించి మనకు పంపేలా మొజాంబిక్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మరోవంక, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కనీస మద్దతు ధరపై అద నంగా బోనస్‌ను ప్రకటించింది. కంది సహా పప్పు ధాన్యాల ఉత్పత్తి 2.2 కోట్ల టన్నులకు పెరిగి, మార్కెట్ ధరలు పడిపోయినప్పుడు అది కేవలం తన బఫర్ స్టాక్ అవసరాలకు సరిపడే వరకే సేకరణ జరిపి, ఆత్యధిక రైతాంగాన్ని మార్కెట్ల క్రూరత్వానికి వదిలేసింది. ఆహారపరమైన ఈ అధ్వాన నిర్వహణ కొనసాగుతూనే ఉంది. కేవలం టమాటా అతిగా ఉత్పిత్తి కావడంతో ప్రత్యే కించి ఈ ఏడాదే రైతులకు బాగా దురదృష్టకరమైనదిగా పరిణమించిందను కోవడం పొరపాటు. 2016, 2015, 2014లలో కూడా పరిస్థితి ఇదే. అంతకు ముందు మూడేళ్లూ టమాటా రైతులు నష్టపోయారు. పంటలు సమృద్ధిగా పండటం, రైతులు దుఃఖించాల్సి రావడం అనే క్రమం ఎప్పుడూ కొనసాగు తూనే ఉందనీ, ఇది టమాటాకే కాదు, ఉల్లి, బంగాళదుంప, పప్పుధాన్యాలు, కాలిఫ్లవర్, ఆవ, సోయాబీన్, పత్తి, మిరప, ఆముదాలు, చివరికి గోధుమ, వరి విషయంలో సైతం దేశంలోని చాలా ప్రాంతాల్లో జరుగుతూనే ఉందని గూగూల్లో శోధించి చూస్తే మీకే విశదమవుతుంది. ఎక్కడా రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడమూ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఆగస్టు 2015 నాటి స్టాక్ మార్కెట్ల పతనంతో పోల్చి చూద్దాం. ఆ పతనం తర్వాత కొన్ని గంటలకే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మదు పర్లలో ఆత్మ విశ్వాసాన్ని నింపడానికి పత్రికా సమావేశం నిర్వహించారు. ఆ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలించడానికి కార్యాచరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అదే రైతులు అనూహ్యమైన రీతిలో ధరలు పడిపోయిన పరిస్థితిని ఎదుర్కోవాల్సివస్తే, కోట్లాదిగా చిన్న, సన్నకారు రైతుల జీవనాధా రాలే నాశనం అవుతున్నా... ప్రభుత్వం స్టాక్మార్కెట్లపై చూపిన శ్రద్ధలో ఆవగిం జంతైనా ఎన్నడూ చూపలేదు. మరుసటి రోజునే, వాణిజ్య పరిస్థితిని మెరు గుపరచడానికి దాదాపు 7,000 చిన్నా పెద్ద చర్యలను చేపట్టామని వాణిజ్య మంత్రి చెప్పారు. ప్రధాన ఆర్థిక సలహాదారు అప్పటికే కార్పొరేట్ రంగం మొండి బకాయిలను మాఫీ చేయడం అర్థికంగా అర్థవంతమైన చర్య అన్నారు. వ్యవసాయానికి వస్తే, దాని కోసం చేపట్టిన ప్రభుత్వ రంగ మదు పుల కార్యక్రమాలను వేళ్లమీద లెక్కించవచ్చు. ఐదేళ్లలో రైతుల ఆదాయా లను రెట్టింపు చేయడం, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధాన మంత్రి కృషి సింఛాయీ యోజన, ఈ–నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ (ఈ– నామ్), సాయిల్ హెల్త్ కార్డులు, నీమ్ కోటెడ్ యూరియా, మోర్ క్రాప్ çఫర్ డ్రాప్ వంటివి కొన్నే ఉన్నాయి. ఫెర్టిలైజర్ సబ్సిడీని నేరుగా బదలాయిం చడం, మార్కెట్లో జోక్యం చేసుకోవడం వంటి పలు కార్యక్రమాలూ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ కలిపినా 50కి మించవని పందెం కాయగలను. రుణ మాఫీ కార్పొరేట్ల హక్కు! దాదాపు రూ. 4 లక్షల కోట్ల కార్పొరేట్ మొండి బకాయిలను మాఫీ చేయను న్నట్టు ఇండియా స్పెండ్ సమాచారం. పైగా రిజర్వు బ్యాంకు ఈ కార్పొరేట్ రుణ గ్రస్తులలోని ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల పేర్లను సైతం వెల్లడించే ప్రసక్తే లేదని చెబుతోంది. కేవలం 6,857 కంపెనీలే రూ. 94,649 కోట్లను ఉద్దేశపూర్వకంగా ఎగవేస్తున్నట్టు అంచనా. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని 92 లక్షల రైతులకు మేలు చేసే రూ. 36,359 కోట్ల వ్యవసాయ రుణ మాఫీకి తాము అనుకూలం కాదని ఆర్బీఐ ప్రకటించింది. రైతులు బకాయిలను చెల్లించలేక పోయినప్పుడే ఆర్బీఐకి నిజాయితీ గుర్తుకువస్తుంది. కార్పొరేట్ల మొండి బకా యిల రద్దును మాత్రం వాటి విశేష హక్కుగా భావిస్తుంది. గత ఐదు నెలలుగా రైతు ఆదాయాలను ఐదేళ్లలో రెట్టింపు చేయడం గురించిన చర్చ రెట్టింపు అయిందే తప్ప.. రైతులందరినీ సంక్షోభంలోంచి బయట పడేయడానికి కేంద్రీకరించి చేసిన కృషి మాత్రం కానరాదు. జైట్లీ మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఎక్కడా రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చేసిందేమీ లేదు. ఏటికేడాది లోలోతులకు మునిగిపోతున్న రైతుకు సంక్షోభం నుంచి కొంత ఊపిరి సలిపేలా ఆదాయాన్ని పెంచే చర్యలు చేపట్టాలని ఎప్పుడూ చెబుతున్నాను. ఎన్నికలకు ముందు ప్రధాని వాగ్దానం చేసిన ఉత్పత్తి వ్యయంపై 50 శాతం లాభాన్ని నెరవేర్చడం తక్షణ అవసరం. కానీ ప్రభుత్వమే అది సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించింది. కార్పొరేట్ వ్యవసాయానికి ప్రోత్సాహం రెండు హెక్టార్లకంటే తక్కువ భూమి ఉన్న జీవనాధార రైతులు మొత్తం రైతాం గంలో 83 శాతంగా ఉన్నారు. ప్రభుత్వం వారికి మేలు చేయడం వైదొలగుతూ కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ–నామ్ కార్యక్రమం 585 నియంత్రిత మార్కెట్లను హోల్‌సేల్ మార్కెట్లతో అనుసంధానించడాన్ని ప్రతి పాదించింది. కానీ అది వాస్తవంలో కమోడిటీ ట్రేడింగ్‌లో భాగం. కాంట్రాక్టు సాగుపై నమూనా చట్టాన్ని ఇప్పటికే రాష్ట్రాలకు పంపిణీ చేశారు. భూమిని లీజుకు ఇవ్వడానికి, భూముల సేకరణకు తగిన చట్టపరమైన ఏర్పాట్లు ఇప్ప టికే జరుగుతున్నాయి. నేడు వ్యవసాయంపై ఆధారపడి ఉన్న 58 శాతం జనాభాను 2022 నాటికి 38 శాతానికి తగ్గించాలని నేషనల్ స్కిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ లక్ష్యంగా పెట్టుగకుంది. అంటే కార్పొరేట్ వ్యవసాయం ప్రవే శిస్తోందనేది సుస్పష్టమే. గత మూడేళ్లలో సగటున ఏడాదికి 2.13 లక్షల ఉద్యో గాలను మాత్రమే సృష్టించామని ఇండియా స్పెండ్ వెల్లడించింది. అయినా వ్యవసాయం నుంచి భారీ ఎత్తున రైతాంగాన్ని పట్టణ నిరుద్యోగ శ్రేణులలోకి ¯ð ట్టడంలో ఆర్థికంగా అర్థవంతమైనది ఏమీ కనిపించదు. ఏ ప్రభుత్వానికైనా మూడేళ్లంటే మొత్తంగా పరిస్థితిని సమీక్షించుకుని, సబ్కా సాథ్ సబ్కా వికాస్ లక్ష్యంగా విధానపరమైన దిద్దుబాట్లకు పూనుకోవాల్సిన సమయం. రికార్డు స్థాయి ఆహార ధాన్యాల ఉత్పత్తిని వ్యవసాయరంగ పరిస్థితి అంతా సజావుగా ఉందనడానికి సూచికగా తీసుకోవడాన్ని ముందుగా విడనాడాలి. వ్యవసాయ వృద్ధి రేట్ల వ్యామోహాన్ని వదిలి వ్యవసాయ ఆదాయాలలో గణనీయమైన పెరుగుదలతో రైతు సంక్షేమంపై దృష్టిని కేంద్రీకరించాల్సిన సమయం ఇది. దేశంలోని 17 రాష్ట్రాలలోని రైతాంగ కుటుంబాల అంటే దాదాపు సగం దేశం సగటు వార్షిక ఆదాయం రూ. 20,000 మాత్రమేనని 2016 ఆర్థిక సర్వే సుస్పష్టంగా పేర్కొంది. ఆర్థికంగా ఎదుగుతున్న సగటు పట్టణ పౌరుల వార్షిక మొబైల్ బిల్లు కంటే కూడా అది తక్కువ. దురదృష్టవశాత్తూ నీతి ఆయోగ్, ప్రధాని కార్యాలయం నేటి సంక్షోభానికి కారణమైన విధానాలనే సూచిస్తు న్నాయి. పంట ఉత్పాదకత పెంచి ,ఉత్పత్తి వ్యయాలను తగ్గించి వ్యవసాయ ఉత్పత్తుల ధరలను మార్కెట్లనే నిర్ణయించనివ్వడం అనేది వ్యవసాయాన్ని లోతైన ఊబి లోకి నెట్టేసిన తప్పుడు విధాన నిర్ణయంలో భాగం. అది ఎరు వులు, క్రిమి సంహారక మందులు తదితర ఉత్పత్తి అవసరాల సరఫరాదా రులకు స్థిరంగా దోహదపడేది. నీతి ఆయోగ్ కోరుకుంటున్న అభిలషణీయ సామర్థ్యపు స్థాయిని పంజాబ్ ఇప్పటికే అందుకుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 98 శాతం సాగునీటి సదుపాయంతో ఆ రాష్ట్రం ఆహారధాన్యాల దిగుబడిలో ప్రపంచంలోనే అత్యధిక ఉత్పాదకతను సాధించింది. అయినా పంజాబ్ రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోందో అంతు బట్టదు. పంజాబ్‌లోని ఈ ఘోర వైఫల్యాన్ని విస్మరించి ఇతర రాష్ట్రాలన్నీ అదే మార్గాన్ని అనుసరించాలనడం మన విధాన నిర్ణయంలో ఏదో ఘోర తప్పిదం జరిగిందని స్పష్టం చేస్తోంది. విఫలమైనది రైతులు కాదు. ఆర్థిక వేత్తలు, విధాన నిర్ణేతలే రైతులను విఫలం చేశారు. నేటి మాంద్య పరిస్థితుల్లో, ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనాన్ని ఇవ్వగల శక్తి వ్యవసాయానికే ఉంది. ప్రభుత్వం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు చూపే మార్గాన్ని విడనాడితేనే నూతన ఆర్థిక పథాన్ని పునర్నిర్వచించుకోవడం సాధ్యం. వ్యవసాయాన్ని వృద్ధికి, సుస్థిరాభివృద్ధికి ఇరుసుగా చేయడానికి తగిన రాజకీయ ధైర్యాన్ని ప్రభుత్వం ప్రోది చేసుకోగలిగితేనే అది జరుగుతుంది. ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలకు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రతి రైతు కుటుంబానికి నెలకు రూ. 18,000 ఆదాయ ప్యాకేజీకి హామీనిచ్చే రైతు ఆదాయ కమిషన్ ఏర్పాటుకు సమయం ఆస న్నమైంది. ఈ కనీస ఆదాయ ప్యాకేజీని పొలం ఉత్పత్తి, భౌగోళిక స్థానాలతో ముడిపెట్టాల్సి ఉంటుంది. అదే సబ్కా సాథ్ సబ్కా వికాస్ నిజం. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు hunger55@gmail.com -
హీరోనొమాయ్!
ఇరవై రెండేళ్ల వయసు అంటే అంత పెద్ద వయసేమీ కాదు. ‘జీవితంలో ఎలా స్థిరపడాలి?’ అనే ఆలోచనలే ఒక కొలిక్కి రాని వయసు. హిరోనొమాయ్(అస్సాం) అలాంటి వయసులోనే ఉన్నాడు. 18 సంవత్సరాల వయసులో అతడి తల్లి చనిపోయింది. అంతా శూన్యం. ఏంచేయాలో తెలియని పెద్ద విషాదం. అప్పటి నుంచే తన గ్రామం మోతడంగ్లోని అమ్మలందరిలో తన అమ్మను చూసుకునేవాడు. ‘‘మా అమ్మలాగే ఎంతో మంది అమ్మలు కనీస అవసరాలకు నోచుకోకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారి కోసం నా వంతుగా ఏదైనా చేయాలి’’ అనుకున్నాడు హిరొనొమాయ్. ‘‘వ్యాపారం చేయడానికి డబ్బు మాత్రమే ముఖ్యం కాదు. రైట్ ఐడియా, రైట్ మార్కెట్, రైట్ టైమింగ్ ఉంటే వ్యాపారంలో విజయం సాధించవచ్చు’’ అని నమ్మిన హిరోనొమాయ్ ఆలోచనలో నుంచి పుట్టిందే జీకెకె, గావ్ కా ఖానా(పల్లెభోజనం) అనే ఫుడ్స్టార్టప్. రాష్ట్రంలోని పట్టణ ప్రాంత వినియోగదారులకు ఆన్లైన్ ఆర్డర్ల ద్వారా పసందైన పల్లె భోజనాన్ని అందిస్తుంది జీకెకె.వినియోగదారులకు ఆరోగ్యకరమైన భోజనం, కూరగాయలు పండించే రైతులకు అండగా నిలవడం, స్త్రీలకు ఉపాధి కల్పించడం...మొదలైనవి తన ప్రాధాన్య అంశాలుగా చేసుకున్నాడు హిరోనొమాయ్. తన గదిలో సింగిల్ స్టౌతో మొదలైన ‘జీకెకె’ ఇప్పుడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో విస్తరించింది. శివసాగర్‌లోని సంస్థ కార్యాలయంలో పదిమంది స్త్రీలు ఫుల్‌టైం కుక్లుగా పని చేస్తున్నారు. కార్పొరేట్ క్లయింట్ల నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్లు వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాలలోని స్త్రీలకు ఔట్సోర్సింగ్ ఇస్తుంది జీకెకె. స్త్రీలకు సంబంధించి స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేయడం, వాటి గురించి ప్రచారం చేయడంలో కూడా హిరోనొమాయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.రాబోయే అయిదు సంవత్సరాల కాలంలో మూడు వేల మందికి పైగా స్త్రీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు హిరోనొమాయ్. -
హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ మరో ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సూర్య బ్రాండ్‌తో ఆహారోత్పత్తుల తయారీలో ఉన్న హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు లేదా చిత్తూరులో ఏడాదిలో ఇది రానుంది. ప్లాంటు ఏర్పాటుకు కావాల్సిన మెషినరీకి రూ.10 కోట్ల దాకా వ్యయం చేయనున్నట్టు కంపెనీ ఎండీ రవీంద్ర మోదీ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. 5 ఎకరాల స్థలంలో అత్యాధునిక టెక్నాలజీతో ఫ్యాక్టరీని నిర్మిస్తామని, ముడి పదార్థాల లభ్యత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నామని రవీంద్రమోదీ వివరించారు. ఇప్పటికే కంపెనీకి హైదరాబాద్‌లోని జీడిమెట్లలో 17,000 టన్నుల వార్షిక సామర్థ్యం గల ప్లాంటుంది. 350కి పైగా ఉద్యోగులున్న ఈ సంస్థ... ఉత్పత్తుల అభివృద్ధికి ఆధునిక ల్యాబొరేటరీని సైతం సంస్థ నిర్వహిస్తోంది. ఏడాదిలో దేశవ్యాప్తంగా..: సూర్య బ్రాండ్ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించింది. మసాలాలు, మసాలా మిశ్రమాలు, పచ్చళ్లు, స్నాక్స్, స్వీట్లను విక్రయిస్తోంది. విదేశాలకూ వీటిని ఎగుమతి చేస్తోంది. వచ్చే ఏడాదికల్లా దేశవ్యాప్తంగా విస్తరించనుంది. మూడు నెలల్లో సొంతంగా ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని, త్వరితగతిన ఉత్పత్తులను కస్టమర్లకు సరఫరా చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రవీంద్ర మోదీ తెలియజేశారు. ఏపీ ప్లాంటులో పచ్చళ్లు, మసాలా పొడులను తయారు చేయనున్నట్లు చెప్పారు. 15,000 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఈ యూనిట్‌ను నెలకొల్పుతున్నామని, కొత్త ప్లాంటు ద్వారా 100 మందికి ఉపాధి లభిస్తుందని తెలియజేశారు. -
ఆహార వృధా హోటళ్లలోనేనా?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రేడియోలో ‘మన్ కీ బాత్’ వినిపిస్తూ దేశంలో ఎంతో ఆహారం వృధా అవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆవేదనను అర్థం చేసుకొన్న కేంద్ర ఆహారం, వినిమయ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, దేశవ్యాప్తంగా రెస్టారెంట్లలో ఆహారం వృధా అవుతోందని, దీనిపై తాను తగిన చర్యలు తీసుకుంటానంటూ ఆగమేఘాల మీద స్పందించారు. రెండు ఇడ్లీలు తినే వ్యక్తికి హోటళ్లలో నాలుగు ఇడ్లీలు వడ్డిస్తున్నారని, ఆ వ్యక్తి రెండు ఇడ్లీలను వృధా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని కూడా ఆయన మీడియా వద్ద వాపోయారు. రెస్టారెంట్లలో ఏ టిఫిన్ ఎంతివ్వాలో, ఏ భోజనం ఎంతుండాలో పరిమాణాన్ని నిర్దేశిస్తూ ప్రమాణాలను జారీ చేయడానికి తన ముందు హాజరు కావాల్సిందిగా హోటల్ యాజమాన్య సంఘాలకు హుకుం కూడా జారీ చేశారు. హోటళ్లలోనే ఆహారం వృధానా? సగానికి పైగా జనాభా దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తున్న భారత్ లాంటి దేశంలో సగం ఆహారం వృధా అవడం నరేంద్ర మోదీ, పాశ్వాన్‌లను కలిచివేసే విషయమే కాదు.. సగం భారతీయుల కడుపు తరుక్కుపోయే విషయం కూడా. నిజంగా దేశంలో కేవలం రెస్లారెంట్లు, హోటళ్లలోనే ఆహారం వృధా అవుతోందా? అవి వినియోగదారుడు తినేకన్నా ఎక్కువ వడ్డిస్తున్నాయా? హోటళ్లపై చర్య తీసుకుంటే ఆహార వృధాను అరికట్టవచ్చా? వాస్తవానికి ఆహారం ఎక్కడ వృధా అవుతోంది? ఎప్పుడైనా పాలకులు దీనిపై చిత్తశుద్ధితో ఆలోచించారా? రూ. 92,651 కోట్ల ఆహారం వృధా వాస్తవానికి హోటళ్లలో కన్నా ఉత్పత్తి, సరఫరాలోనే ఎక్కువ మొత్తాల్లో ఆహారం వృధా అవుతోంది. అధికార లెక్కల ప్రకారమే 2013 - 2015 సంవత్సరాల మధ్య, అంటే రెండేళ్లలో భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో రూ. 40 వేల కోట్ల విలువైన ఆహార ధాన్యాలు వృధా అయ్యాయి. దేశంలో చాలినన్ని శీతల గిడ్డంగులు లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని భారత ఆహార సంస్థ పేర్కొంది. పంట దిగుబడి సందర్భంలో, ఆ తర్వాత మార్కెట్‌కు తరలించాక ఏటా దేశంలోని వ్యవసాయోత్పత్తుల్లో 92,651 కోట్ల రూపాయలు విలువైన ఉత్పత్తుల నష్టం వాటిల్లుతోందని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ లెక్కలే తెలియజేస్తున్నాయి. ఈ మొత్తం కొత్తగా వ్యవసాయ రంగానికి ఇచ్చిన బడ్జెట్ కేటాయింపుల కన్నా ఎంతో ఎక్కువ. 2016–2017 సంవత్సరానికి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ. 35,984 కోట్లు కేటాయించిన విషయం తెల్సిందే. రూ. 40,811 కోట్ల పండ్లు, కూరగాయలు వృధా 2012 - 2014 సంవత్సరాల మధ్య దేశంలో ఉత్పత్తయిన పండ్లు, కూరగాయల్లో 16 శాతం, అంటే హోల్‌సేల్ మార్కెట్ లెక్కల ప్రకారం రూ. 40, 811 కోట్ల నష్టం వాటిల్లిందని లూధియానాలోని ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ వెల్లడించింది. ఒక్క కూరగాయల్లోనే ఏటా 5 - 12 శాతం వృధా అవుతోందని 2015లో కేంద్ర ప్రభుత్వం వేసిన అంచనాలు తెలియజేస్తున్నాయి. మాంసం, పాలు, గుడ్లు, పప్పు దినుసులు, తృణధాన్యాలు అన్నీ వృధా అవుతున్నాయి. 2014–2016 సంవత్సరాల మధ్య శీతల గిడ్డంగుల వద్ద రూ. 3,942 కోట్ల విలువైన మాంసం వృధా అయిందని ఆహారశుద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉత్పత్తి దగ్గరి నుంచి వినియోగదారుడికి చేరేలోపు కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆహారం వృధా అవుతోంది. దీన్ని పక్కన పెట్టి హోటళ్లలో వృధా అవుతున్న ఆహారాన్ని అరికడతామని కేంద్ర మంత్రి చెప్పడం అంటే ‘ఏనుగులు పోయే దారిని వదిలేసి చీమలు దూరే దారిని మూసినట్లు’ ఉంది. ప్రజలెంత తినాలో వాళ్లు చెబుతారట వాస్తవానికి ఇప్పుడు హోటళ్లలో, రెస్టారెంట్లలో ఎక్కువ ఆహారం వృధా కావడం లేదు. ఖరీదైన హోటళ్లలో వినియోగదారుడికి చాలా తక్కువనే వడ్డిస్తారు. పలు రకాల డిషెస్ ఆర్డర్ ఇచ్చి, వాటిని తినకపోవడం వల్ల కొంత వృధా అవుతుంది. చిన్న హోటళ్లలో వినియోగదారుడికి తలుపులు మూశాకే సిబ్బంది తింటారు గనుక అక్కడ పెద్దగా వృధా కాదు. హోటళ్లలో వృధా అవుతున్న ఆహారాన్ని కూడా ఎన్నో ఎన్జీవోలు ఇప్పుడు సేకరించి పేదలకు, అనాథలకు, అన్నార్తులకు వడ్డిస్తున్నాయి. తమిళనాడులో పుట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించిన ‘నో ఫుడ్ వేస్ట్’ ఎన్జీవో అలాంటిదే. పెళ్లిళ్లు, పేరంటాల్లో వృధా అవుతున్న ఆహారాన్ని సేకరించి సద్వినియోగం చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సిన ఇలాంటి పనులను పబ్లిక్ చేస్తుంటే పబ్లిక్ ఎంత తినాలన్న ఆహారాన్ని ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయిస్తానంటోంది. -
ఆహారం వృధాపై ఆస్ట్రేలియా యుద్ధం!
సిడ్నీ: ఆహార పదార్థాలు వృథా కావడంపై ఆస్ట్రేలియాలో యుద్ధభేరి మోగింది. ఏటా 15 బిలియన్ డాలర్ల విలువచేసే ఆహార పదార్థాలు వృధా అవుతున్నట్లు ఆస్ట్రేలియా అంచనా వేసింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తున్న కనిపించని సమస్యగా ప్రకటించింది. మెల్బోర్న్లో జరిగిన గ్లోబల్ ఫుడ్ ఫోరమ్ సదస్సులో ఆస్ట్రేలియా వ్యాపారవేత్త ఆంథోనీ ప్రట్ ఈ విషయమై మాట్లాడుతూ... ఆస్ట్రేలియాలో పైకి కనిపించిన సమస్య ఆహారం వృధా కావడమేనని, ఇది వ్యాపారులకే కాకుండా సామాన్యులకు కూడా ఆర్థికంగా ఎంతో నష్టం కలిగిస్తోందన్నారు. ఆహారంపై అధికంగా ఖర్చు చేయడాన్ని ప్రజలంతా తగ్గించుకోవాలని, ఆహార పదార్థాలను ఉత్పత్తి చేసే కంపెనీలు కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థాల ఉత్పత్తిపైనే దృష్టి సారించాలని సూచించారు. ఈయన సూచన మేరకు ఈ ఏడాది నవంబర్‌లో జాతీయ ఆహార వృధా సదస్సును నిర్వహించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ఓ సవాలుగా స్వీకరించి, దేశ ప్రజలందరినీ సమస్య పరిష్కారంవైపు నడిపించాలని ఆ దేశ మంత్రి జోష్ ఫ్రిడెన్బర్గ్ పిలుపునిచ్చారు. -
టోకు, రిటైల్ ధరల మంట..
⇒ ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 6.55 శాతం ⇒ రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 3.65 శాతం ⇒ వేగంగా పెరిగిన నిత్యావసర ఆహార ఉత్పత్తుల ధరలు న్యూఢిల్లీ: నిత్యావసర ఆహార ఉత్పత్తుల ధరల తీవ్రత ప్రభావం ఫిబ్రవరిలో అటు టోకు ధరలు, ఇటు రిటైల్ ధరలు రెండింటిపై ప్రభావం చూపించింది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత టోకు ద్రవ్యోల్బణం 6.55 శాతంగా నమోదుకాగా, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.65 శాతంగా నమోదయ్యింది (2016 ఫిబ్రవరితో పోల్చిచూస్తే). 2017 జనవరిలో టోకు ద్రవ్యోల్బణం రేటు 5.25%గా ఉండగా, రిటైల్ ద్రవ్యోల్బణం 3.17 శాతంగా ఉంది. సూచీలనూ వేర్వేరుగా చూస్తే... టోకు ద్రవ్యోల్బణం 39 నెలల గరిష్టం.. ⇔ ఆహార, ఇంధన ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణం. 2017 జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.25 శాతంగా ఉంది. ఆహార ధరలు ఫిబ్రవరిలో వార్షికంగా 2.69 శాతం పెరిగితే, జనవరిలో ఈ రేటు 0.56 శాతంగా ఉంది. తృణధాన్యాలు, బియ్యం, పండ్ల ధరలు పెరిగాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 8.05 శాతం పెరిగాయి. ⇔ ఇంధన ధరల బాస్కెట్ –7.07 శాతం క్షీణత నుంచి 21.02 శాతానికి పెరిగింది. ⇔ సూచీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం వార్షికంగా క్షీణత –0.52 శాతం నుంచి 3.66 శాతానికి ఎగసింది. రిటైల్ నాలుగు నెలల గరిష్టానికి... జనవరిలో 3.17 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, తరువాతి నెల ఫిబ్రవరిలో నాలుగు నెలల గరిష్ట స్థాయి 3.65 శాతానికి చేరింది. రిటైల్‌గా చూస్తే– ఆహార ఉత్పత్తుల ద్రవ్యో ల్బణం 2.01 శాతంగా నమోదయ్యింది. (జనవరిలో 0.61 శాతం) పండ్ల ధరలు భారీగా 8.33 శాతం పెరిగాయి. ఇంధనం, లైట్ విభాగంలో రేటు 3.9 శాతంగా ఉంది. మాంసం, చేపల ధరలు 3.5 శాతానికి ఎగశాయి. చక్కెర, తీపి పదార్థాల ధరలు 18.83 శాతం పైకి లేచాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 4.22 శాతం పెరిగాయి. గృహోపకరణాలు, సేవల విభాగంలో రేటు 4.09 శాతంగా ఉంది. ఆరోగ్య విభాగంలో ద్రవ్యోల్బణం 4 శాతం ఉంది. రవాణా, కమ్యూనికేషన్ల విభాగంలో ద్రవ్యోల్బణం 5.39 శాతం ఎగసింది. కూరగాయలు, పప్పు దినుసుల ధరలు మాత్రం –8.29 శాతం, –9.02 శాతం చొప్పున తగ్గాయి.దుస్తులు, పాదరక్ష విభాగంలో రేటు 4.38 శాతంగా ఉంది. హౌసింగ్ సెగ్మెంట్లో ఈ రేటు 4.9 శాతంగా ఉంది. మరోవైపు గ్రామీణ ప్రాంత రిటైల్ ద్రవ్యోల్బణం నెలవారీగా ఫిబ్రవరిలో 3.36 శాతం నుంచి 3.67 శాతానికి పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 2.9 శాతం నుంచి 3.55 శాతానికి చేరింది. కాగా ధరల పెరుగుదల కారణంగా 2017 మార్చి నాటికి ద్రవ్యోల్బణం 4.5 శాతంపైకి ఎగసే అవకాశం ఉందని ఇక్రా ప్రిన్షిపల్ ఎకనమిస్ట్ ఆదితి నయ్యర్ అభిప్రాయపడ్డారు. రేట్లు ఇక యథాతథమే..! బ్యాంకులకు తానిచ్చే రుణరేటు– రెపో (ప్రస్తుతం 6.25 శాతం) ఇక తగ్గించడం కష్టమేనని గత పాలసీ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. తాజా ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నేపథ్యంలో ఇదే విధంగా ఆర్బీఐ ఇకముందూ కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 6న ఆర్బీఐ తదుపరి పాలసీ సమీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. -
భారత్‌లో అమెజాన్ సొంత స్టోర్లు..!!
⇒ ఫుడ్ ఔట్లెట్స్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు ⇒ అమెరికా తర్వాత భారత్‌లోనే ఏర్పాటు ⇒ ఆహార ఉత్పత్తుల రిటైల్ వ్యాపారంపై కన్ను మనకు త్వరలో అమెజాన్ స్టోర్లు దర్శనమివ్వనున్నాయి. గ్లోబల్ ఈ–కామర్స్ దిగ్గజ కంపెనీ ‘అమెజాన్’.. భారత్‌లో సొంత స్టోర్లను ఏర్పాటు చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇది ఇప్పటికే ఫుడ్ ఓన్లీ ఔట్లెట్స్ ఏర్పాటు సహా దేశీయంగా తయారుచేసిన ఆహార ఉత్పత్తుల విక్రయానికి సంబంధించిన ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్ కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అమెజాన్ స్థానికంగా తయారైనా లేదా ఉత్పత్తి చేసిన ఫుడ్ ప్రొడక్టులను దేశవ్యాప్తంగా ఏ విధానంలోనైనా (ఆఫ్‌లైన్, ఆన్లైన్) కస్టమర్లకు విక్రయించాలని భావిస్తోంది. అంటే సంస్థ ఫుడ్ ప్రొడక్టుల రిటైల్ వ్యాపారంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. కాగా అమెజాన్ తన తొలి గ్రాసరీ స్టోర్‌ను అమెరికాలో ఏర్పాటు చేసింది. కొత్త వెంచర్ ఏర్పాటు! ఫుడ్ ప్రొడక్టుల రిటైల్ వ్యాపారం కోసం అమెజాన్ భారత్‌లో కొత్త వెంచర్‌ను (అనుబంధ సంస్థ) ఏర్పాటు చేయనుంది. ఇందులో సింగపూర్‌కు చెందిన అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్ కంపెనీకి 99 శాతం వాటా ఉండనుంది. ఇక మిగిలినది అమెజాన్.కామ్‌కు (మారిషస్) సంబంధించినది. కంపెనీ ఈ వెంచర్ ద్వారా వచ్చే ఐదేళ్లలో భారత్‌లో రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తోంది. ఇది స్థానికంగా తయారుచేసి, ప్యాక్ చేసిన ఫుడ్ ప్రొడక్ట్‌లను థర్డ్ పార్టీ లేదా సొంత ప్రైవేట్ లేబుల్స్ ద్వారా మార్కెట్లో విక్రయించనుంది. వెంచర్ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి లభిస్తే ఫుడ్ సప్లై చైన్‌లో మధ్యవర్థుల అవసరం లేకపోవడం, వ్యర్థాలు తగ్గుదల వంటి పలు అంశాల కారణంగా రైతులకు రాబడి పెరిగే అవకాశముంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ముందుగా స్టోర్ల ఏర్పాటు ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే అమెజాన్ తొలిగా కొన్ని కాన్సెప్ట్ స్టోర్లను ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా స్థానికంగా తయారు చేసిన ఫుడ్ ప్రొడక్టులను విక్రయించాలని భావిస్తోంది. ‘మేం ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి అనుమతి కోరాం. లక్ష్యాల కోసం ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం. తొలిగా కొన్ని కాన్సెప్ట్ స్టోర్లను ఏర్పాటు చేసి, ప్రొడక్టులను విక్రయిస్తాం’ అని ఎ.టి.కార్నే పార్ట్నర్ అభిషేక్ మల్హోత్రా తెలిపారు. ఎంపిక చేసిన ప్రాంతాలు, ఎయిర్‌పోర్ట్స్, మాల్స్‌లో స్టోర్లను ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో పటిష్టమైన ఫుడ్ సప్లై చైన్ ఏర్పాటుకు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు. ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణ వంటి అంశాలు తమకు ప్రోత్సాహకంగా ఉన్నాయని అమెజాన్ ఇండియా పేర్కొంది. కేంద్రానికి కొంత ఊరట అమెజాన్ దరఖాస్తు కేంద్ర ప్రభుత్వానికి కొంత ఊరటనిచ్చింది. గ్లోబల్ రిటైలర్లు, తయారీదారులను ఆకర్షించడానికి ప్రభుత్వం చాలానే ప్రయత్నించింది. గతేడాది ప్రభుత్వ ఉన్నతాధికారులు రిటైల్ ఫుడ్ విభాగంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం వాల్‌మార్ట్, నెస్లె, హింజ్, థాయ్‌లాండ్‌కు చెందిన సీపీ ఫుడ్స్ వంటి పలు కంపెనీల ప్రతినిధులను దేశానికి ఆహ్వానించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ నేతృత్వంలో ఒక అధికారుల బృందం లండన్‌కు వెళ్లి, అక్కడ టెస్కో, సైన్స్బరీ, హరోడ్స్, మార్క్స్ అండ్ స్పెన్సర్, కోబ్ర బీర్ వంటి పలు బ్రిటిష్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇన్ని ప్రయత్నాలు చేసిన ప్రభుత్వానికి గతేడాది చివరిలో దేశీ గ్రాసరీ డెలివరీ కంపెనీలైన బిగ్ బాస్కెట్, గ్రోఫర్స్ నుంచి దరఖాస్తులు అందాయి. కాగా తాజాగా అంతర్జాతీయ కంపెనీ అయిన అమెజాన్ నుంచి తొలి దరఖాస్తు వచ్చింది. ఆహార ఉత్పత్తులకు సంబంధించి వ్యవసాయం నుంచి ప్యాకేజింగ్ వరకు గిడ్డంగుల ఏర్పాటు, పంపిణీ సౌకర్యాలు సహా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అమెజాన్.. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ)కి తెలియజేసినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఫుడ్ రిటైల్ విభాగంలో 100 శాతం ఎఫ్డీలకు అనుమతినిచ్చింది. దీంతో గ్లోబల్ కంపెనీలు ఇక్కడ పూర్తిస్థాయి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. 2015లోనే రిటైలోకి అడుగు.. అమెజాన్ కంపెనీ 2015 నవంబర్లోనే రిటైల్ స్టోర్ల విభాగంలోకి అడుగుపెట్టింది. ఇది తొలిగా సీటెల్‌లో బుక్‌స్టోర్‌ను ఏర్పాటు చేసింది. దీని తర్వాత పోర్ట్లాండ్, శాన్ డియాగో ప్రాంతాల్లో కూడా ఔట్‌లెట్స్‌ను ప్రారంభించింది. ఇది తన తొమ్మిదవ బుక్‌స్టోర్‌ను ఈ ఏడాది శాన్ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేయనుంది. అలాగే ఇది తన తొలి గ్రాసరీ స్టోర్‌ను అత్యాధునిక టెక్నాలజీతో ‘అమెజాన్ గో’ పేరుతో సీటెల్లోనే ఏర్పాటు చేసింది. దీని సేవలు ఈ ఏడాది నుంచే ప్రజలకు అందుబాటులోకి రానున్నవి. కాగా 2016లో కంపెనీ నికర అమ్మకాలు 27 శాతం వృద్ధితో 136 బిలియన్ డాలర్లకి ఎగశాయి. -
వైఎస్ జగన్ జన్మదినాన ఫుడ్ కాంపిటీషన్
హిందూపురం అర్బన్ : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని 21వ తేదీ పార్టీ ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు ఫుడ్ కాంపిటీషన్ ఏర్పాటు చేస్తున్నట్లు విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన రహదారిలో బీపీఎల్ షోరూం వద్ద ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు. ఉడికించిన కోడిగుడ్లు పది నిమిషాల్లో నీళ్లు తాగకుండా ఎవరు ఎక్కువగా తింటే వాళ్లు విజేతగా నిలుస్తారన్నారు. వారికి రూ.10,111 బహుమతిగా అందజేస్తామన్నారు. ఆసక్తిగల విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యం పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 77993 30094 నెంబర్లో సంప్రదించాలని కోరారు. -
కలుషిత ఆహారం తిని 50 మందికి అస్వస్థత
గద్వాల: కలుషిత ఆహారం తిని 50 మంది అస్వస్థతకు గురైన సంఘటన గద్వాల జిల్లా శెట్టి ఆత్కూర్ గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సుమారు 50 మంది కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సత్యదేవుని నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
అన్నవరం : సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి కాకినాడ రూరల్ మండలం రాయుడు పాలెం గ్రామానికి చెందిన ఆకుల రామచంద్రరావు రూ.లక్ష విరాళాన్ని దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావుకు సోమవారం అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా ముక్కోటి ఏకాదశి నాడు ఆకుల రామన్న, సూరేకాంతం, న ర్సింహరావు, కృష్ణకుమారి పేర్ల మీదుగా భక్తులకు అన్నదానం చేయమని కోరినట్టు అధికారులు తెలిపారు. దేవాదాయశాఖ డీసీగా రమేష్‌బాబు బోట్‌క్లబ్(కాకినాడ) : దేవాదాయశాఖ డీసీగా(ఎఫ్ఏసీ) రాజమండ్రి ఎసీ డీఎల్వీ రమేష్‌బాబును నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డీసీగా పని చేసిన చందు హనుమంతరావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో రమేష్‌బాబును నియమించారు. రమేష్‌బాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. -
న్యూస్‌పేపర్లు ఇలా వాడుతున్నారా.. జాగ్రత్త!
ఇంట్లో వేసిన మిరపకాయ బజ్జీలు, పుణుగులు, పూరీల లాంటివి బాగా నూనె పీల్చినప్పుడు.. వాటి నుంచి నూనె పోవడానికి న్యూస్పేపర్లలో పెడుతున్నారా? రోడ్డు పక్కన బండ్ల మీద ఏదైనా ఆహారం తిన్న తర్వాత చేతులు తుడుచుకోడానికి పాత న్యూస్‌పేపర్లు ఉపయోగిస్తున్నారా.. అలా అయితే మీరు కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. ఎందుకంటే.. అలా చేశారంటే మీ శరీరంలోకి గ్రాఫైట్ వెళ్తుందట. పేపర్లమీద కథనాలు ప్రింట్ చేయడానికి ఉపయోగించే ఇంకులో గ్రాఫైట్ ఉంటుంది. పత్రిక పొడిగా ఉన్నంతసేపు.. అంటే చదివేటప్పుడు దాంతో ఎలాంటి సమస్య ఉండదు. కానీ, అది ఏమాత్రం తడిగా అయినా.. చాలా ప్రమాదకరంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇళ్లలో ఏవైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు వాటి నుంచి నూనె తీసేయడానికి చాలామంది ఇళ్లలో ఉండే పాత న్యూస్‌పేపర్లు ఉపయోగిస్తారని, అది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అలా ఏయడం వల్ల ఆహారనాళిక ద్వారా నేరుగా గ్రాఫైట్ మన శరీరంలోకి చేరిపోయి, మన మూత్రపిండాలు, కాలేయాలను దెబ్బతీయడంతో పాటు.. ఎముకలు, కణజాలాల ఎదుగుదలను కూడా నిరోధిస్తుంది. సాధారణంగా మన శరీరంలోకి వివిధ మార్గాల ద్వారా చేరే ప్రమాదకరమైన విష పదార్థాలు మలవిసర్జన ద్వారానే వెళ్లిపోతాయి. కానీ గ్రాఫైట్ పరిస్థితి మాత్రం అలా కాదు. అది ఎక్కడికీ పోకుండా అలాగే పేరుకుపోతుంది. దాంతో ప్రమాదం మరింత పెరుగుతుంది. అందువల్ల న్యూస్పేపర్లను కేవలం చదవడానికి మాత్రమే ఉపయోగించడం మంచిది. -
వంటకాల బండి...ఇది మహిళలదండి!
న్యూఢిల్లీ: గాజులు లేని వంట ఘుమ ఘుమ లాడున్....అనే మాట వంటను వృత్తిగా చేసుకొని బతుకుతున్న మగవాళ్ల గురించి స్ఫూర్తిగా చెప్పినదైయుండున్. ఇంటి వంటకు మాత్రమే పరిమితమవుతున్న మగువలు కూడా వంటను వృత్తిగా చేసుకుంటే నలభీములు కూడా వారి ముందు బలదూర్ అని నిరూపిస్తున్నారు బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల అర్చనా సింగ్. సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని వేడివేడిగా అందించడంతోపాటు తోటి మహిళలుకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో అర్చనా సింగ్ ట్రక్కు ద్వారా ఆహారాన్ని సరఫరాచేసే సరికొత్త స్కీమ్‌ను ప్రారంభించారు. చదువు, సంధ్యలు, నైపుణ్యం గల మహిళలు ఎక్కడైనా, ఏపనైనా చేసుకొని బతుకగలరు. ఇటు చదువు, అటు నైపుణ్యంలేని మహిళలు నేటి ఆధునిక సమాజంలో గౌరవప్రదంగా బతకడం కష్టమే. అందుకనే అర్చనా సింగ్ తన టీమ్‌లోకి అలాంటి మహిళలనే ఎక్కువగా తీసుకున్నారు. వారందరనికి ఆమెనే వివిధ ర కాల వంటకాల్లో శిక్షణ ఇచ్చారు. సాధారణ సంప్రదాయ భోజనాలతోపాటు పసందైన బిర్యానీ, చికెన్ టిక్కాలు, ఆలూ టిక్కీ హాట్‌డాగ్స్, చీజ్ కేక్స్ అన్నీ చేస్తారు అర్చనా సింగ్ టీమ్. వీరు తమ వంటకాలను ట్రక్కులో టెకీ సెంటర్లకు, కాలేజీలకు, ట్రాఫిక్ సెంటర్లకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. అర్చనా టీమ్ ఈ వ్యాపారాన్ని చేపట్టి సరిగ్గా రెండు నెలలు కూడా కానప్పటికీ సూపర్ డూపర్ హిట్టయింది. ఘుమఘుమలాడే వంటకాలు అద్భుతం, అమోఘం అని భోజన ప్రియులు కితాబివ్వడమే కాకుండా మరిన్ని ట్రక్కులతో అన్ని వీధులకు వ్యాపారాన్ని విస్తరించాల్సిందిగా అర్చనా టీమ్‌కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వారి సలహామేరకు ఇరుగు, పొరుగు పట్టణాలతోపాటు రాష్ట్రాలకు విస్తరించాలని అర్చనా సింగ్ భావిస్తున్నారు. త్వరలో ఔరంగాబాద్, పాట్నా నగరాల్లో కూడా తమ సర్వీసులను ప్రారంభిస్తున్నామని, మరో ఆరేడు నెలల్లో హైదరాబాద్-చెన్నై నగరాల మధ్య కూడా చేపడతామని చెప్పారు. ‘సెవెన్త్ సిన్’ పేరిట ట్రక్కు ద్వారా ఆహార సరఫరా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న అర్చనా టీమ్ ఏడవ రోజైనా ఆదివారం నాడు విశ్రాంతేమీ తీసుకోవడం లేదు. బిచ్చగాళ్లు, నిరుపేదలు, మురకివాడల ప్రజలకు ఉచితంగా భోజనాలను అందిస్తూ సామాజిక సేవ కూడా చేస్తోంది. ఈ ఫుడ్ ట్రక్ సర్వీసును ప్రారంభించాలనే ఆలోచన తనకు తొలిసారిగా 2015, డిసెంబర్ నెలలోనే వచ్చిందని, నైపుణ్యంలేని మహిళలకు ఉపాధి కల్పించాలని నిర్ణయించుకున్నందున వారికి తగిన శిక్షణ ఇచ్చి ప్రారంభించేందుకు ఇంతకాలం పట్టిందని అర్చన తెలిపారు. వంట చేయడంలో తాను ఎక్కడా శిక్షణ తీసుకోలేదని, తన తండ్రి నౌకాధికారి అవడం వల్ల ఆయనతోపాటు దేశంలోని పలు ప్రాంతాలకు తిరగాల్సి వచ్చిందని, ఆ సందర్భంగా ప్రతి వంటకాన్ని రుచి చూడడమే కాకుండా అది ఎలా చేయాలో నేర్చుకున్నానని, ఇంటి పట్టున ఉండడంకన్నా తన అభిరుచితో వ్యాపారం ఎందుకు చేయకూడదని అనుకొని ఈ వ్యాపారం ప్రారంభించానని చెప్పారు. ఆడవాళ్లే ఎందుకు, నైపుణ్యంగల చెఫ్‌లను తీసుకుంటే తాము కూడా పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన కొంతమంది వ్యాపారులు ఉన్నారని, అయినా తాను మహిళలతో మాత్రమే వ్యాపారాన్ని నిర్వహిస్తాననే కృతనిశ్చయంతో ముందుకు కదిలానని ఆర్చన వివరించారు. టెక్, యూనివర్శిటీ ప్రాంతాలకే కాకుండా ముందుగా ఫోన్ ద్వారా బుక్ చేసుకున్న పార్టీలకు కూడా తమ టీమ్ ఆహారాన్ని సరఫరా చేస్తోందని ఆమె చెప్పారు. ట్రక్కును తాను స్వయంగా నడుపుతుంటే ప్రవీణ్ నందూ ఫుడ్ సర్వీస్ సీఈవోగా, నటాషా పాత్రో చెఫ్‌గా, దీప, ఉషా, హేమ సహాయకులుగా పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. -
ఆహార వృథాను అరికడదాం
భూమి అమితంగా వేడెక్కుతోంది. మంచు పర్వతాలు కరుగుతున్నాయి. సముద్రాల నీటి మట్టం పెరుగుతోంది. కరువు, పెనుతుపానులు, వరదలు సాధారణమే అన్నంత తరచుగా వస్తున్నాయి. ఈ ఉపద్రవాల వల్ల రెండు ముఖ్య పర్యవసానాలు తలెత్తుతున్నాయి: 1. ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజల జీవితాన్ని మరింత దుర్భరం చేస్తున్నాయి. వీరిలో చాలామంది బక్కరైతులే. ఆహారోత్పత్తికి వీరు మరింతగా తిప్పలు పడాల్సి వస్తోంది. 2. మరో 14 ఏళ్ల నాటికి ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ సరిపోయేలా ఆహారం అందించాలన్న లక్ష్యం దెబ్బతింటున్నది. ఆహార వృథాను మనం అరికట్టగలం ఎలాగంటే.. ఆహారం వృథాను తగ్గించేందుకు ప్రయత్నించాలి. అడవులను, నీరు, మట్టి వంటి ప్రకృతి వనరులను పరిరక్షించుకోవాలి. తక్కువ ఇంధనం లేదా తక్కువ కాలుష్యం వదిలే ఇంధనాలు వాడాలి. ఇటువంటి ఇతర పనులు చేయాలి. ఇంతకీ మీరేం చేయగలరు? రోజువారీ అలవాట్లు కొన్నిటిని మార్చుకోవడం, కొన్ని చిన్న నిర్ణయాలు తీసుకుంటే చాలు - వాతావరణ మార్పులను తట్టుకునేందుకు మీరు చేయగలిగింది మీరు చేసినట్టే. ప్రకృతి వనరులను పరిరక్షించుకుందాం.. భూమి, నీరు, పశువులు, మొక్కలు.. ఇవన్నీ ధరిత్రి మనకందిస్తున్న వనరులే. నీరు, నేల లేకుండా మనం పంటలు పండించలేం. మట్టిని సారవంతంగా మార్చే ఖనిజాలు కొరవడి, నీరు కలుషితమైపోతే పోషకాలతో కూడిన ఆహారాన్ని పండించుకోవడం కష్టమౌతుంది. మనందరికీ తగినంత పోషకాహారాన్ని పండించుకోవాలంటే ప్రకృతి వనరులను కంటికిరెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది.. అదెలాగంటే.. నీటిని వృథా చేయకూడదు.. సుదీర్ఘ స్నానానికి బదులు.. కొద్దిసేపట్లో స్నానం ముగించాలి. 5-10 నిమిషాల షవర్ స్నానంతో పోల్చితే బాత్ టబ్ స్నానం వల్ల నీరు ఎక్కువగా వృథా అవుతుంది. పళ్లు తోముకున్నంత సేపూ కుళాయి తిప్పి ఉంచితే కనీసం 6 లీటర్ల నీరు ఖర్చవుతుంది. తోముకున్న తర్వాత నీటిని ఉపయోగిస్తే లీటరుతో సరిపోతుంది. మీ ఇంట్లో ఏదైనా కుళాయి నుంచి నీరు చుక్కలుగా లీకవుతూ ఉంటే వెంటనే ఇంట్లో పెద్ద వారికి చెప్పండి. లీకయ్యే ట్యాప్ ద్వారా ఏడాదికి 11 వేల లీటర్ల నీరు వృథాగా పోతుంది తెలుసా? వర్షపు నీటిని పట్టి ఉంచుకొని లేదా వంట పాత్రలు, చేతులు చేతులు కడుక్కున్న నీటిని మీ పెరట్లో మొక్కలకు పోస్తే నీటి ఖర్చు తగ్గుతుంది కదూ... శాకాహారం మిన్న.. ప్రతి భోజనంలోనూ మాంసాహారం భుజించడం కన్నా. మాంసాహారం తగ్గించి.. పప్పులు వంటి శాకాహారం తీసుకుంటే మంచిది. ఇది అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరం. పప్పులతో కొత్త వంటకాలు ఏమేమి చేయొచ్చో ప్రయత్నిస్తే మంచిది. మాంసం కోసం పెంచే పశువుల పోషణ నిమిత్తం విస్తారమైన అడవులు నరికి పచ్చి మేత వేసి పెంచుతున్నారు. కాబట్టి, మాంసాహారం తగ్గిస్తే మంచిది. చేపలు తరిగిపోకుండా చూడాలి.. సముద్ర జలాల్లో పెరిగే టూనా, కాడ్ వంటి జాతి చేపల మీద మక్కువతో వాటి సంతతి అంతరించిపోయేలా సముద్రాన్ని జల్లెడ పట్టే బదులు.. మన దగ్గర్లో దొరికే ఇతరత్రా జాతుల చేపలను తినడం మంచిది. విద్యుత్ ఆదా మేలు.. పిల్లలూ.. విద్యుత్‌ను పొదుపుగా వాడే గృహోపకరణాలు కొనాల్సిందిగా మీరు పెద్దలకు సూచించండి. గదిలో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఆ గదిలో లైట్లు, ఫ్యాన్లను ఆపేయండి. టీవీ, స్టీరియో లేదా కంప్యూటర్లను స్టాండ్బైలో ఉంచకుండా పూర్తిగా ఆపేయండి. ఇంటిపంటలు పండించండి.. సేంద్రియ సేద్యం వల్ల మట్టి ఆరోగ్యంగా ఉంటుంది. అందుకని.. మీ ప్రాంతంలో రైతు మార్కెట్లలో లేదా స్థానిక సూపర్ మార్కెట్లలో సేంద్రియ ఆహారోత్పత్తులను గుర్తించి కొనుగోలు చేయడంలో మీ తల్లిదండ్రులకు తోడ్పడండి. మేడపైన, బాల్కనీల్లో ఉన్నంతలో వీలైనన్ని కుండీలు/మడుల్లో సేంద్రియ ఇంటిపంటలు సాగు చేద్దామని మీ తల్లిదండ్రులను అడగండి.. నేలను, నీటిని రసాయనాలతో పాడుచేయకండి.. ఇంట్లో గచ్చును శుభ్రం చేయడానికి వాడే క్లీనర్లు, పెయింట్ తదితర ఉత్పత్తులు కొనేటప్పుడు.. ఘాటైన రసాయనాలు కానీ, బ్లీచింగ్ కానీ కలవని వాటిని ఎంపిక చేసుకోమని మీ తల్లిదండ్రులను కోరండి. పర్యావరణానికి హాని చేయని ఉత్పత్తులను వాడటం ద్వారా నీటిని, నేలను పాడు చేయకుండా చూడగలుగుతాం.. సోలార్ ప్యానల్స్... సౌరశక్తిని వినియోగిస్తే వాతావరణ మార్పులను తగ్గించవచ్చు. సోలార్ ప్యానల్స్, ఇతర వాతావరణ అనుకూల ఇంధన వ్యవస్థల వినియోగానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలేమైనా ఉన్నాయేమో శోధించమని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అడగండి. ఆహార ఉద్గారాలను తగ్గించండి... కార్లు, విమానాలు, విద్యుత్ వాహనాలపై మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు కార్బన్ డయాక్సయిడ్ వంటి కర్బన ఉద్గారాలు (కార్బన్ ఎమిషన్స్) విడుదలై వాతావరణాన్ని అమితంగా వేడెక్కిస్తూ.. వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. ఈ ఉద్గారాలను ‘కార్బన్ ఫుట్ ప్రింట్’గా లెక్కిస్తున్నాం. అదేవిధంగా.. మన ఆహారాన్ని బట్టి ‘ఫుడ్ ప్రింట్’ (ఆహార సంబంధమైన కర్బన ఉద్గారాల ముద్ర)ను లెక్కిస్తున్నారు. మనం వాడే కారు పొగ వదులుతూ ఉంటుంది కాబట్టి.. దాని ఉద్గారాల గురించి మనకు ప్రత్యక్షంగా తెలుస్తుంది. అయితే, మనం తినే ఆహారానికి సంబంధించిన ఉద్గారాలు నేరుగా కంటికి కనిపించవు. మన పళ్లెంలోకి వచ్చే ముందు ఈ ఆహారాన్ని ఎక్కడ పండించారు? ఎంత దూరం నుంచి తరలించి, ఎంతకాలం నిల్వ చేశారు? అందుకు ఎంత ఇంధనం ఖర్చయింది? అన్న దాన్ని బట్టి దాని ‘ఫుడ్ ప్రింట్’ ఆధారపడి ఉంటుంది. ఆహార ఉద్గారాలను తగ్గించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అవేమిటంటే... మీకు అవసరమైనంత మాత్రమే కొనండి.. పిల్లలూ.. వీక్లీ షాపింగ్ లిస్ట్‌ను తయారు చేయడం ద్వారా మీ తల్లిదండ్రులకు తోడ్పడండి. ఎంత సరిపోతుందనుకుంటారో అంతే కొనండి. దానితో సరిపెట్టండి! అలా చేస్తే ఆహారమే కాదు, డబ్బు కూడా వృథా కాకుండా ఉంటుంది. లేబుల్స్ చూసి మోసపోకండి.. ‘బెస్ట్ బిఫోర్’.. ‘యూజ్ బై’ అని ఆహారోత్పత్తుల ప్యాకింగ్ పై రాసి ఉంటుంది. వీటి మధ్య వ్యత్యాసాన్ని గమనించండి. ‘బెస్ట్ బిఫోర్’ డేట్ దాటిన తర్వాత కూడా ఆ ఆహారం కొన్నిసార్లు పనికొస్తుంది. అయితే, ‘యూజ్ బై’ డేట్ దాటితే మాత్రం తినడం మంచిది కాదు. ప్లాస్టిక్ వాడకం తగ్గించండి.. ప్లాస్టిక్ ప్యాకెట్లలో ఉండే ఆహారాన్ని తక్కువగా కొనడం, కొనడానికి వెళ్లేటప్పుడు సొంత బ్యాగ్‌లను తీసుకెళ్లడం, తిరిగి వాడదగిన వాటర్ బాటిల్స్ ఉపయోగించడం, వాడి పారేసే ప్లాస్టిక్ కప్పుల వాడకం తగ్గించడం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో మీ తల్లిదండ్రులకు తోడ్పడండి. పునర్వినియోగం వాడిన పేపర్, ప్లాస్టిక్, గ్లాస్, అల్యూమినియంను పారేయకుండా.. పునర్వినియోగించే ప్రయత్నం చేయండి. తద్వారా చెత్త కుప్పలు పెరిగిపోకుండా ఉంటాయి. ఆహార నిల్వలో జాగ్రత్త.. ఆహారోత్పత్తుల నిల్వలో తెలివిగా వ్యవహరించాలి. కప్‌బోర్డులు, ఫ్రిజ్‌లలో ఆహారోత్పత్తుల బాక్స్‌లను నిల్వ చేసేటప్పుడు కొత్త వాటిని వెనుక వైపు, పాత వాటిని ముందు వైపు ఉంచాలి. టిన్నులు, ప్యాకెట్లలో ఆహారాన్ని కొంత ఉపయోగించి, మిగతా దాన్ని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచేటప్పుడు ఎయిర్‌టైట్ కంటెయినర్లు వాడటం ద్వారా ఆహారం తాజాగా ఉండేలా చూడవచ్చు. మిగిలిన ఆహారాన్ని ఇష్టపడండి.. పిల్లలూ.. మీ ఇంట్లో వండిన ఆహారం మిగిలిపోతే.. పారేయకండి! మిగిలిన ఆహారాన్ని ఫ్రీజర్‌లో ఉంచి, తర్వాత ఒక రోజు తీసి తింటే బాగుంటుందని మీ తల్లిదండ్రులకు సూచించండి. మీరు రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు తినగలిగిన దానికన్నా తక్కువగా కొనుగోలు చేయండి. ఫుల్ తినలేమనుకుంటే ఆఫ్ ఇవ్వమని అడగండి. తీసుకున్న ఆహారం మిగిలిపోతే.. ప్యాక్ చేయించి ఇంటికి తీసుకెళ్లండి. ఇలా చేస్తే.. ఆహారాన్ని మాత్రమే కాదు డబ్బునూ ఆదా చేసినట్టే కదూ..! కంపోస్టు చేయండి.. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ఆహారం ఎంతో కొంత మిగిలిపోతుంది. అంతమాత్రాన చెత్తకుప్పలో వేయడం ఒక్కటే మార్గం అనుకోకూడదు. పండ్లు, కూరగాయల తొక్కలు, గుడ్ల పెంకులు చెత్తబుట్టలో వేయడం కన్నా.. కంపోస్టు బిన్లో వేసి సేంద్రియ ఎరువును తయారు చేసి పెరటి మొక్కలకు వాడవచ్చు. మన చేతుల్లోనే పర్యావరణ హితం! మన రోజువారీ జీవితంలో చేసే చిన్న చిన్న పనుల్లో కొద్దిపాటి మార్పులతో వాతావరణ పరిరక్షణకు మన వంతు సహాయ పడవచ్చు. వీటిలో కొన్ని పద్ధతులను మీరు ఇప్పటికే అనుసరిస్తుంటే సంతోషం.. లేకుంటే మాత్రం కొన్నిటినైనా పాటించేందుకు ప్రయత్నించి పర్యావరణ పరిరక్షణలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి. చెత్తబుట్ట దగ్గరకు వెళ్లే ముందు ఒక్కసారి.. చెత్తబుట్ట ఉంది కదా అని దాన్ని నింపటానికి ప్రయత్నించకండి. బ్యాటరీలు, ఫోన్లు, రంగులు, మందులు, రసాయనాలు, టైర్లు వంటివి నీటి వనరులలో కలవటం వల్ల పర్యావరణానికి తీరని నష్టం వాటిల్లుతోంది. ప్రతి వస్తువును పనికిరానిదిగా భావించి చెత్తబుట్టలో వేసే పద్ధతికి స్వస్తి చెప్పి.. వస్తువుల వాడకాన్ని తగ్గించటం, అవకాశం ఉంటే పాత వాటినే మళ్లీ ఉపయోగించటంపై దృష్టి సారించాలి. నడక ముద్దు.. దగ్గరలో ఉన్న ప్రదేశాలకు సైకిల్‌పై వెళ్లటం, వీలయితే తరుచూ ప్రజా రవాణా (బస్సులు/లోకల్ ట్రైన్ల)ను వాడటం ద్వారా పర్యావరణ హితానికి మనవంతు కృషి చేయవచ్చు. స్థానికంగా పండించిన వాటిని కొనండి.. స్థానిక వ్యాపారాన్ని ప్రోత్సహించండి. దగ్గరలోని షాపుల్లో వస్తువులను కొనుగోలు చేయండి. స్థానికంగా పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేయండి. దీనివల్ల వాహనాలు ప్రయాణం చేసే దూరం తగ్గి ఉద్గారాల విడుదల తగ్గుతుంది. పట్టణాలకు పచ్చదనం అద్దండి.. పచ్చదనాన్ని జీవితంలోకి ఆహ్వానించండి. మీ పాఠశాలల్లో, పెరటి తోటలను పెంచండి. ఇంటిలోనే ఇంటి పంటలను సాగుచేయండి. ఇంటిపైన, బాల్కనీలో కూరగాయ మొక్కలను పెంచండి. ఒకవేళ మీ ఇంట్లో చోటు సరిపోదని భావిస్తే ఇరుగుపొరుగును కూడగట్టి ఖాళీ స్థలంలో సామూహిక సాగును చేపట్టండి. అడవులకు మీ అరచేతులే రక్ష రోజువారి వ్యవహారాల్లో సాధ్యమైనంత తక్కువ పేపర్‌ను వాడండి. తప్పనిసరి అనిపిస్తేనే ప్రింట్ తీయండి. ప్రింట్లో పేపర్ రెండువైపులా వాడండి. చిత్రలేఖనం, చిత్తుప్రతికి పాఠశాల నుంచి సేకరించిన పేపర్‌ను వాడండి. పేపర్ టవల్స్, మూత్రశాలలో వాడే పేపర్ ఉత్పత్తుల్లో పునర్వినియోగానికి వీలయిన వాటినే వాడండి. మన్నిక గల కలప లేదా పొరల చెక్క (ప్లైవుడ్)తో చేసిన గృహోపకరణాలను మాత్రమే కొనాలని మీ కుటుంబ సభ్యులకు సలహాలివ్వండి. తాజా పరిణామాలపై ఓ కన్నేయండి.. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎ వో) వారి వాతావరణ మార్పులకు సంబంధించిన వెబ్‌సైట్‌ను లేదా సామాజిక మాధ్యమాలను అనుసరించండి. స్థానిక వార్తావ్యవస్థను గమనికలో ఉంచుకోండి. సందేశాన్ని పంచండి.. స్ఫూర్తిని పెంచండి సామాజిక మాధ్యమాల్లో వాతావరణ మార్పులు వంటి పర్యావరణానికి సంబంధించిన సంబంధించిన ఆసక్తికరమైన వార్తలను చూస్తే లైక్ చేయండి. వాటిని స్నేహితులతో పంచుకోండి. భూమిని రక్షించుకునే లక్ష్యంతో జరిగే స్థానిక, జాతీయ అధికారిక కార్యక్రమాల్లో మీరేం చేయగలరో ఆలోచించుకొని మీ వంతు కృషిచేయండి. పర్యావరణ హితమైన ఉత్పత్తులకే ప్రాథాన్యమివ్వండి మీ చిట్టి చెల్లెలు బుజ్జి పాపాయిల కోసం వస్త్రంతో చేసిన నాపీలు, తువ్వాళ్లను మాత్రమే కొనుగోలు చేయాలని మీ తల్లిదండ్రులకు ప్రేమతో షరతులు విధించండి. పర్యావరణ హితమైన ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వండి. వాటి అవశేషాలు సులభంగా భూమిలో కలిసిపోతాయి. పర్యావరణ ప్రియులుగా మసలుకోండి మీ సెలవు రోజులను ఆనందంగా గడిపేందుకు కుటుంబంతో కలిసి విహార యాత్రకు వె ళ్లే సమయంలో వీలయితే విమాన ప్రయాణాన్ని చేయకండి. విమానాలు అధిక మొత్తంలో బొగ్గుపులుసు వాయువు (కార్బన్ డై ఆక్సైడ్)ను విడుదల చేస్తాయి. తప్పనిసరయితే కర్బన ఉద్గారాల విడుదలను నియంత్రించే వ్యవస్థలు.. మొక్కల పెంపకం వంటి కార్యక్రమాల్లో పాల్గొనే విమాన కంపెనీలను మాత్రమే మీ ప్రయాణానికి ఎంచుకోండి. పునరుత్పాదక శక్తి వనరుల ప్రాజెక్టుకు సహాయం చేయటం ద్వారా మీ వంతు ఉద్గారాల విడుదల నియంత్రించవచ్చు. ఆహార వృథాకు స్వచ్ఛంద సంస్థల చెక్ ఆహార వృథాను అరికట్టడానికి భారత్ సహా వివిధ దేశాల్లోని స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. వేడుకల సందర్భంగా జరిగే విందు భోజనాల్లో, రెస్టారెంట్లలో మిగిలిపోయిన తాజా ఆహారాన్ని సేకరించి నిరుపేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. మన దేశంలో పెళ్లి వేడుకల్లో, ఇతరత్రా విందు వినోదాల్లో, రెస్టారెంట్లలో నిత్యం 20 శాతానికి పైగా ఆహార పదార్థాలు వృథా అవుతున్నట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ అధ్యయనంలో తేలింది. మన దేశంలోని ప్రధాన నగరాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు వేడుకల నిర్వాహకుల నుంచి, రెస్టారెంట్ల నుంచి తినదగిన స్థితిలో ఉండి మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి నిరుపేదలకు పంపిణీ చేస్తున్నాయి. ఇలా సేకరించిన ఆహారాన్ని నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాయి. ఆహార వృథాను అరికట్టడానికి మన దేశంలో కచ్చితమైన చట్టాలేవీ లేవు గాని స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి పలు పాశ్చాత్య దేశాలు ఈ విషయంలో కాస్త కఠినమైన చట్టాలనే అమలు చేస్తున్నాయి. రెస్టారెంట్లలో ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలను తినకుండా వృథా చేస్తే భారీ జరిమానాలనే వడ్డిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన గ్లోటైడ్ సొసైటీతో పాటు దేశవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు ఆహార వృథాను అరికట్టేందుకు కృషి చేస్తున్నాయి. -
ఆహారం, మందులపై పాకిస్థాన్ గుర్తులు!
ల్యాంగేట్ః ఉడీ తరహాలో మళ్ళీ దాడులకు ఉగ్రవాదులు యత్నించారు. గురువారం సైన్య శిబిరాలపై చొరుబాటుకు విఫల యత్నం చేశారు. కాశ్మీర్ ల్యాంగేట్ ప్రాంతంలోని సైనిక శిబిరంపై దాడికి యత్నించిన టెర్రరిస్టులను భారత జవాన్లు విజయవంతంగా తిప్పి కొట్టారు. దాడి సమయంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మిలిటెంట్లు మరణించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. వారివద్ద ఉన్న ఆహారం, మందుల ప్యాకెట్లపై పాకిస్థాన్ గుర్తులు ఉన్నట్లుగా ఆర్మీ అధికారులు గుర్తించారు. -
ఫుడ్ సర్వీసుల్లోకి ఉబర్
క్యాబ్ సర్వీసుల్లో దూసుకెళ్తున్న ఉబర్ టెక్నాలజీస్ మరో సరికొత్త సర్వీసులతో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఉబర్ ఈట్స్ పేరుతో ఫుడ్ డెలివరీ సర్వీసుల్లోకి అరంగేట్రం చేసింది.ఇప్పటికే ఈ సర్వీసులను ఆమ్‌స్టర్‌డామ్‌లో ప్రారంభించిన ఉబర్, జపాన్, టోక్యోల్లో కూడా ఈ సర్వీసులను ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఓ వైపు జపాన్‌లో టాక్సీ డ్రైవర్ల నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఆ దేశంలో ఉబర్ సర్వీసులు ఆగిపోయాయి. కొత్తగా ఆ దేశంలో ఫుడ్ డెలివరీ సర్వీసులను ఆవిష్కరించి లబ్ది పొందాలని ఉబర్ భావిస్తోంది. జపాన్ మార్కెట్ వారికెంతో ప్రముఖమైనదని, ఆ దేశంలో ఫుడ్ డెలివరీ సర్వీసులు విజయవంతమైతే, ఇతర ఆసియా మార్కెట్లో కూడా ఈ సేవలు ఊపందుకుంటాయని శాన్ఫ్రాన్సిస్కోలో ఓ డిజిటల్ విశ్లేషకుడు బ్రియాన్ సోలిస్ తెలిపారు. ఉబర్ ఈట్స్ పేరుతో జపాన్‌లో ఈ సర్వీసులు లాంచ్ అయితే కంపెనీకి 2014లో ఉన్న మార్కెట్ రెండింతలు పెరిగి 19 బిలియన్ డాలర్లుగా నమోదవుతుందని యానో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంటోంది. కొత్త పుంతలు తొక్కుతూ వస్తున్న ఈ సర్వీసులు త్వరలో 22 దేశాల్లో విస్తరించాలని ఉబర్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. వీటిల్లో ఆరు దేశాలు ఉబర్ క్యాబ్సర్వీసులకు ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి.ఉబర్ మేలో తన ప్రధాన వ్యాపార మార్గాలను విస్తరించాలని భావించింది. దీనిలో భాగంగా ఉబర్‌ఈట్స్‌ను ప్రారంభించింది. -
పునరావాస కేంద్రాల ఏర్పాటు
నర్సాపూర్ రూరల్: నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్, తిరుమలాపూర్ గ్రామాల్లో శనివారం అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తుజాల్పూర్లో 10 పూరిగుడిసెలు, 5 పెంకుటిల్లు కూలిపోయాయి. తిరుమలాపూర్లో చెరువు అలుగు నీరు ఇళ్లల్లోకి రావడంతో 15 కుటుంబాలు అవస్థలు పడుతున్నారు. రెవెన్యూ అధికారులు తుజాల్‌పూర్‌లోని పాఠశాల, తిరుమలాపూర్ గ్రామ పంచాయతీలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి వంట చేసి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నా... ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మాజీ మంత్రి సునీతారెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు సంతోష్‌రెడ్డి సీడ్స్ ఆఫ్‌హోప్ సేవాస ంస్థ ద్వారా ఆహార పొట్లాలు, పాలు, బిస్కెట్లు, బ్రెడ్, బెడ్షీట్లు అందజేశారు. రెండు రోజుల పాటు పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి పాలు, బిస్కెట్లు, బ్రెడ్, పులిహోర ప్యాకెట్లు అందేసినట్లు సీడ్స్ఆప్ హోప్ చైర్మన్ అమూల్య తెలిపారు. సునీతారెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్న నాయకులు రెండు గ్రామాల ప్రజలను చూసిన దాఖలాలు లేవన్నారు. అధికారంలో ఉన్న నాయకులు చేయాల్సిన పని తాము చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో నర్సాపూర్ సర్పంచ్ రమణారావు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ అంజనేయులుగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మల్లేశ్, మాజీ సర్పంచ్ అశోక్, రెడ్డిపల్లి సర్పంచ్ భరత్‌గౌడ్, బాబు, రాజేష్, ముజాయిద్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : డీడీ శ్రీధర్ మండలంలోని తిరుమలాపూర్, తుజాల్పూర్ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సాంఘీక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్, తహసీల్దార్ ప్రతాప్‌రెడ్డి, ఎంపీడీఓ శ్రవణ్‌కుమార్ సూచించారు. ఆ గ్రామాలను వారు సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. తిరుమలాపూర్లో చెరువు ప్రమాదంగా ఉండటంతో కట్టకు ఒక వైపు కాలువ తవ్వించి నీటిని దారి మళ్లించారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి రెవెన్యూ సిబ్బంది భోజనంతో పాటు వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. -
ఖరీఫ్ ఆశలు గల్లంతు!
• 42 శాతానికి పైగా తగ్గనున్న ఆహార ధాన్యాల దిగుబడులు • లక్ష్యం 72.64 లక్షల టన్నులు.. దిగుబడి అంచనా 41.88 లక్షల టన్నులే • వరి ఏకంగా 18.26 లక్షల టన్నులు తగ్గుదల • సగానికి మించి పడిపోనున్న పప్పుధాన్యాల దిగుబడి • ఖరీఫ్ మొదటి అంచనాలను విడుదల చేసిన వ్యవసాయ శాఖ సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్ ఆశలు గల్లంతవుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 42 శాతానికిపైగా ఆహార ధాన్యాల దిగుబడి తగ్గిపోనుంది. లక్ష్యంతో పోల్చుకున్నా.. గత రెండేళ్ల దిగుబడితో పోల్చినా ఈసారి దిగుబడి దారుణంగా పడిపోనుంది. వ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసిన తన తొలి అంచనా నివేదికలోనే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రుతుపవనాలు సకాలంలో వచ్చినా.. పూర్తిస్థాయిలో వర్షాలు లేక, జలాశయాల్లో నీరు చేరక, భూగర్భ జలాలు పెరగకపోవడంతో పరిస్థితి మారిపోయింది. మొక్కజొన్న ఎండిపోగా.. వరి నాట్లు 67 శాతానికే పరిమితమయ్యాయి. భారీగా పడిపోనున్న దిగుబడి ఈసారి వర్షాలు బాగా పడతాయని భావిం చిన వ్యవసాయ శాఖ 2016-17 ఖరీఫ్‌లో 72.64 లక్షల టన్నుల ఆహారధాన్యాల దిగుబడి లక్ష్యంగా ప్రకటించింది. కానీ తాజాగా విడుదల చేసిన అంచనా ప్రకారం 41.88 లక్షల టన్నులకు మించి దిగుబడులు రావని పేర్కొంది. అంటే ఏకంగా 30.76 లక్షల టన్నులు తగ్గనుందని స్పష్టం చేసింది. వరి ఉత్పత్తి లక్ష్యం 42.58 లక్షల టన్నులు కాగా.. ఈసారి 24.32 లక్షల టన్నుల దిగుబడే వస్తుం దని అంచనా వేసింది. మొక్కజొన్న లక్ష్యం 21.62 లక్షల టన్నులు కాగా.. 15.72 లక్షల టన్నులే వస్తుందని నివేదికలో పేర్కొంది. ఇక ఖరీఫ్‌లో పప్పుధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 3.7 లక్షల టన్నులు కాగా.. 1.83 లక్షల టన్నులకు తగ్గనుంది. 2014 ఖరీఫ్‌లో 54.14 లక్షల టన్నులు, గతేడాది ఖరీఫ్‌లో 43.58 లక్షల టన్నులు ఆహార ధాన్యాల దిగుబడి వచ్చింది. కానీ ఈసారి అంతకంటే తక్కువగా 41.88 లక్షలకే పరిమితం కానుండటం ఆందోళనకరంగా మారింది. ఇక వరి ఉత్పత్తి 2014లో 37.97 లక్షల టన్నులు, గతేడాది 29.43 లక్షల టన్నులు కాగా.. ఈసారి 24.32 లక్షల టన్నులే వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సోయాబీన్ కూడా మూడో వంతుకు పడిపోవడం గమనార్హం. ఈసారి 7.66 లక్షల టన్నుల సోయా పండించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా... 2.31 లక్షల టన్నులకు మించి పండే అవకాశం లేదని వ్యవసాయశాఖ పేర్కొంది. నాట్లే పూర్తిగా పడలేదు రాష్ట్రంలో ఖరీఫ్ సాధారణ వరి సాగు విస్తీర్ణం 24.35 లక్షల ఎకరాలు కాగా.. బుధవారం నాటికి 16.2లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 12.12 లక్షల ఎకరాలు కాగా.. కొంత అదనంగా 14.15 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ మొక్కజొన్న పీచు దశకు వచ్చిన జూలై నెలాఖరు, ఆగస్టు మధ్య నాటికి వర్షాలు కురవకపోవడంతో 8 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. పప్పుధాన్యాల సాగు కూడా సాధారణంతో పోల్చితే 157 శాతంగా నమోదైనా... వర్షాలు లేక కంది, పెసర్ల దిగుబడి గణనీయంగా పడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం, దిగుబడి అంచనా (టన్నుల్లో) -
ఆకలి మెడలో ఆహారం
నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేందుకు సైతం నోచుకోని నిర్భాగ్యుల కోసం ఏర్పాౖటెందే హైదరాబాద్ ఫుడ్ బ్యాంక్. అదే సమయంలో తిండి ‘కొన’లేని వారికి, ఆహారాన్ని వృథా చేస్తున్న వారికి మధ్య వారధిగా నిలుస్తోంది ఈ సంస్థ. మీకు అవసరం లేని ఆహారం కనీసం మరో ఐదు కడుపులు నింపేందుకు పనికొస్తే.. అంతకు మించి మీకు కావాల్సిందేముంటుంది? అనే ప్రశ్నతో ఆలోచన రేకెత్తిస్తోందీ సంస్థ. అయితే మీరు దానమిచ్చే ఆహారం పరిశుభ్రంగా ఉండేలా చూడమని సూచిస్తోంది. ఇంట్లో తయారైన ఆహారాన్ని మాత్రమే సేకరించి పంపిణీ చేస్తామంటున్నారు వీరు. అవసరమైన వారికి డబ్బు ఇవ్వడం కన్నా నాణ్యమైన ఆహారం అందించడమే సరైందిగా భావిస్తామంటున్నారు. - సాక్షి, వీకెండ్ ప్రతినిధి ఐదుగురు స్నేహితుల ఆలోచన... అబ్దుల్ అజీజ్, దిలీప్, ఇక్బాల్, సత్య, అబ్దుల్ సలాం... అనే ఐదుగురు స్నేహితుల ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ఈ ఫుడ్ బ్యాంక్ గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 8700కి Sపైగా మంది ఫేస్బుక్ పేజీలో వీరికి బాసటగా నిలుస్తున్నారు. కనీసం 60 మంది చురుకైన వలంటీర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మొదటి ఫుడ్ డ్రైవ్‌లో కేవలం 34 ప్యాకెట్ల ఆహారం మాత్రమే సేకరించి అందించగలిగారు. అదే ఇప్పుడు ఒక్కో ఫుడ్ డ్రైవ్‌కి సగటున 500కు పైనే అవసరార్థులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. బంజారాహిల్స్, హిమాయత్‌నగర్, రాణిగంజ్, అత్తాపూర్, దిల్సుఖ్నగర్, చార్మినార్, కూకట్పల్లి, తార్నాక, శ్రీనగర్‌కాలనీ, ఈస్ట్ మారేడ్‌పల్లి, బేగంపేట, హెచ్ఎంటీ నగర్, మలేసియన్ టౌన్షిప్, సోమాజిగూడ, శివం రోడ్, పద్మారావునగర్, ఉప్పల్, నాంపల్లి ప్రాంతాల నుంచి ప్రస్తుతం ఆహారం సేకరిస్తున్నారు. విదేశాల నుంచి కొందరు బ్రెడ్, బిస్కట్స్, లస్సీ ప్యాకెట్స్... వగైరాలను ఆర్డర్ చేసి కొరియర్ ద్వారా వీరికి పంపిస్తున్నారు. వీరు పొరపాటున కూడా డబ్బును స్వీకరిం చరు. వృద్ధులు, నిరాశ్రయులు, వికలాంగులు, ఫుట్‌పాత్‌ల మీద నివసించే వారికి ఈ ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. లక్ష్యం.. హంగర్ ఫ్రీ సిటీ వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు, గృహిణులు, విద్యార్థులు ఈ బృందంలో ఉన్నారు. హైదరాబాద్‌ని హంగర్ ఫ్రీ సిటీ (ఆకలి ఛాయల్లేని నగరం)గా మార్చాలనేదే తమ లక్ష్యం అంటున్నారు వీరు. ప్రస్తుతం ప్రతి ఆదివారం మాత్రమే తమ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్న వీరు.. భవిష్యత్తులో వారానికి మూడు రోజులు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఒక్కో సమయంలో ఆహారం లభిస్తున్నా సరిపడా వలంటీర్లు లేకపోవడంతో సేకరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఒక్కోసారి అనూహ్యంగా భారీ పరిమాణంలో లభిస్తున్న ఆహారాన్ని తీసుకెళ్లడం కూడా కష్టమవుతోందన్నారు. ‘మరింత మంది చురుకైన వలంటీర్ల కోసం చూస్తున్నాం. మాకు ఎవరైనా ఆహారం అందించాలనుకుంటే ఇంట్లో వండిన ఆహార పదార్ధాలు, అవీ తాజాగా ఉన్నవి మాత్రమే చక్కగా ప్యాక్ చేసి అందించాల’ని కోరుతున్నారు. స్థానికంగా ఉన్న కో–ఆర్డినేటర్‌కు అందించడం మాత్రమే కాకుండా అవి పంపిణీ చేసే సమయంలో ఆసక్తి ఉంటే తమతో కలిసి రావచ్చునని చెప్పారు. ఆహారం అందించండి... ఆదుకోండి వరల్డ్ హంగర్ డే సందర్భంగా ఒకే రోజున 4050 మందికి ఆహారం పంపిణీ చేయడం తాము చేసిన కార్యక్రమాల్లో అతి పెద్దదని చెప్పారు. అదే విధంగా చిల్డ్రన్ ఫుడ్ డ్రైవ్ కూడా చేపట్టామన్నారు. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, పండుగల సందర్భంగా కూడా ప్రత్యేకమైన ఫుడ్ డ్రైవ్‌లు చేపడుతున్నామని చెప్పారు. వృథా అయిందే కాకపోయినా.. వారంలో ఒక రోజు సాంబారన్నం లేదా వెజిటబుల్ రైస్, పోహ, పండ్లు, ఇడ్లీలు, దోసెలు... ఇలా ఏదైనా సరే వండి చక్కగా ప్యాక్ చేసి స్థానికంగా ఉన్న కో–ఆర్డినేటర్‌కి అందించాలని కోరారు. సేకరించిన ఆహారాన్ని ఏదో ఒక వాహనంలో తీసుకెళ్లి అవసరార్థులకు అందజేస్తామన్నారు. ఆహారం అందించాలి అనుకున్నా, గ్రూప్‌లో జాయిన్ కావాలన్నా ఈ నంబర్లలో సంప్రదించండి 9160508054, 9700524806 హైదరాబాద్ పుడ్ బ్యాంక్ సంస్థ గ్రూపు సభ్యులు -
రాజన్ ‘వంటకాలు’ ట్రై చేస్తారా!
♦ ఆర్బీఐ గవర్నర్ సేవలకు గుర్తింపుగా 2 ప్రత్యేక వంటకాలు... ♦ బెంగళూరు ఫుడ్ చైన్ ‘జంగ్రీ’ వడ్డింపు... బెంగళూరు: ఆర్బీఐ గవర్నర్‌గా మూడేళ్లపాటు పాలసీ విధానాన్ని వండి ‘వడ్డి’ంచి తనదైన ముద్రవేసిన రఘురామ్ రాజన్‌ను బెంగళూరుకు చెందిన ఫుడ్ చైన్ సంస్థ ‘జంగ్రీ’ వెరైటీ వంటకాలతో గౌరవిస్తోంది. ఆర్బీఐ చీఫ్‌గా రాజన్ విశిష్టసేవలకు గుర్తింపుగా రెండు ప్రత్యేక డిష్(ఒకటి స్వీట్, మరొకటి హాట్)లను వడ్డిస్తోంది. ఉలుందు కోజుకట్టాయ్, కోవా కోజుకట్టాయ్ పేర్లతో లిమిటెడ్ ఎడిషన్‌గా ఈ వంటకాలు అందుబాటులో ఉంటాయని జంగ్రీ తెలిపింది. ‘రాజన్‌తో అనుబంధం ఉన్న రెండు రాష్ట్రాలకు సంబంధించిన వంటకాలివి. ఉలుందు కోజు కట్టాయ్ రేటు రూ.100 కాగా, కోవా కోజు కట్టాయ్ రూ.150కి లభిస్తుంది. నేటి(26) నుంచి సెప్టెంబర్ 2 వరకూ(రాజన్ పదవీకాలం ముగింపు రోజు) మాత్రమే ఈ వంటాకాలు అందుబాటులో ఉంటాయి’ అని జంగ్రీ పేర్కొంది. డాక్టర్ రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా అటు సామాన్య ప్రజలతో పాటు తమలాంటి ఎంట్రప్రెన్యూర్స్‌కు అనుకూలంగా కీలక నిర్ణయాలతో ఎంతగానో ప్రభావితం చేశారని.. దీనికి గౌరవసూచకంగా ఈ ప్రత్యేక వంటకాలను ప్రవేశపెట్టినట్లు జంగ్రీ సహ వ్యవస్థాపకుడు ఆశిష్ కాల్యా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా పాలసీ చర్యలను తీసుకోవడంతోపాటు బ్యాంకుల్లో పేరుకుపోతున్న మొండిబకాయిలకు అడ్డుకట్టవేయడం ఇతరత్రా అనేక కీలక సంస్కరణలను రాజన్ తన పదవీకాలంలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరోపక్క, కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా ఆయన వార్తల్లో నిలిచారు. ‘రాక్‌స్టార్’ రాజన్‌గా పేరొందిన ఆయన స్థానంలో ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను కేంద్రం ఆర్బీఐ చీఫ్‌గా ఎంపిక చేయడం తెలిసిందే. ఇంతకీ ఈ వంటకాల సంగతేంటే... ఉలుందు కోజుకట్టాయ్ అనేది రాజన్ పుట్టిన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వంటకాన్ని నమూనాగా తీసుకొని జంగ్రీ రూపొందించింది. ఇక కోవా కోజుకట్టాయ్ అనేది రాజన్ పూర్వీకులతో సంబంధం ఉన్న తమిళనాడు తీపి వంటకం నుంచి రూపొందించారు. -
మనకూ ఓ ‘జనాహార్’
తాటిచెట్లపాలెం: సగటు ప్రయాణికుడు రైల్వేస్టేషన్లో అల్పాహారం కొనుగోలు చేయాలంటే వెనుకడుగేస్తున్నాడు. విభిన్నరుచులను ఆస్వాదించాలంటే జేబులు ఖాళీఅయ్యే పరిస్థితే మరి.. ఈనేపథ్యంలో సుమారు 55 రుచికరమైన పదార్థాలను అతితక్కువ ధరకే అందించే విధంగా రైల్వేశాఖ రూపొందించిన ప్రణాళిక శ్రావణమాసపు రెండో వారంలో అమలులోకి తీసుకురానుంది. ‘జనాహార్’..కనిష్టంగా రూ.9 కే ఉడికిన గుడ్డు మొదలు గరిష్టంగా రూ.50 లో ఫిష్‌కర్రీ వరకూ విభిన్నరుచులతో ప్రయాణికులకు ఆయా పదార్థాలను అందుబాటులోకి తెస్తోంది. వాల్తేరుడివిజన్ పరిధిలో రైల్వేశాఖ రూ.3.83 కోట్లతో విశాఖరైల్వేస్టేషన్ ఒకటో నెంబరుప్లాట్ఫాంపై ఐఆర్సీటీసీ దీనిని ఏర్పాటుచేయనుంది. గతేడాది టెండర్ వేయగా, మెనూ అమలుతో పాటు స్టాఫ్రిక్రూట్మెంట్, టెండర్ అలాట్మెంట్, మానిటరింగ్, ఇన్స్పెక్షన్ , లైసెన్స్ ల జారీ తదితర విషయాల్లో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎలక్ట్రికల్ కనెక్షన్ మంజూరుచేయగా పనులు ఊపందుకున్నాయి. వాల్తేరుడివిజన్పరిధిలో తొలుతగా 2014 సెప్టెంబర్ లో శ్రీకాకుళం రోడ్డులో జనాహార్‌ను 5 సంవత్సరాల కాలవ్యవధితో రూ.60 లక్షలకు ఐఆర్సీటీసీ సొంతంచేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈనేపథ్యంలో నిత్యం 40వేల పైచిలుకు ప్రయాణికులు విశాఖ నుంచి రాకపోకలు సాగించడంతో జనాహార్ అవశ్యకతను గుర్తించిన రైల్వేశాఖ ఈ మేరకు త్వరిత గతిన పనులు పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేసింది. ఆకర్షణీయంగా..ఆహ్లాదంగా.. పసుపు , ఆకుపచ్చ రంగులతో మిళితమై ఆకర్షణీయమైన డైనింగ్‌తో జనాహార్ స్వాగతిస్తుంది. తక్కువ ధరకే లగ్జరీ తరహాలో వీటిని తీర్చిదిద్దుతారు. ఒకేసారి నలుగురు కూర్చుని కుటుంబ సమేతంగా ఆహారాన్ని స్వీకరించే విధంగా టేబుల్డిజైన్ఉంటుంది. -
కింగ్స్ ఫుడ్‌కోర్టు ప్రారంభం
మంకమ్మతోట : నగరంలోని ఆర్టీసీ బస్డాండ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కింగ్స్ఫుడ్ కోర్డును కరీంనగర్ డీఎస్పీ రామారావు ప్రారంభించారు. స్వయం కృషితో ఎదగాలని టిఫిన్స్ అండ్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకుడు ఎ. చంద్రశేఖర్‌ను అభినందించారు. ఖలీమ్, అజీమ్, తాజ్ తదితరులు పాల్గొన్నారు. -
అలెర్ట్ చేస్తుంది...
కొత్తకొత్తగా... ఫోర్క్స్ గురించి ఎవరికి తెలియదు చెప్పండి.. చిన్నపిల్లాడి నుంచి అమ్మమ్మల వరకు అందరూ వీటిని రోజూ ఉపయోగిస్తుంటారు. అవునా..? కానీ స్మార్ట్ ఫోర్క్ గురించి మాత్రం విని ఉండరు. ఎందుకంటారా...? ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది మామూలు ఫోర్క్ కాదు.. బ్లూటూత్ కనెక్టెడ్ స్మార్ట్ ఫోర్క్. ఇది చాలా తెలివైనది. ఎందుకంటే, ఇది తినే ఆహార పదార్థంలో ఎన్నెన్ని క్యాలరీలున్నాయో మీ ఫోన్లో చూపిస్తుంది. అంతేకాదు, మీరు త్వరత్వరగా తింటున్నారనుకోండి. ఆ ఫోర్క్‌లో అమర్చిన బల్బ్ వెలుగుతూ, వైబ్రేట్ అవుతూ... నెమ్మదిగా తినమంటూ సున్నితంగా హెచ్చరిస్తుంది. అలా ఈ ఫోర్క్ మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నెమ్మదిగా తినడం ద్వారా మీ స్ట్రెస్ లెవల్స్ కూడా తగ్గుతాయి. అలాగే మీరు ఎక్కువ క్యాలరీలను తీసుకోకుండా చేసి, బరువును అదుపులో ఉంచుతుంది. ఇంతగా మిమ్మల్ని కాపాడే ఈ స్మార్ట్ ఫోర్క్‌లు మార్కెట్లో వివిధ రంగుల్లో దొరుకుతున్నాయి. -
ఐటీసీ రూ.4,000 కోట్ల పెట్టుబడులు
♦ 2-3 ఏళ్లలో 8-9 ఫ్యాక్టరీల ఏర్పాటు ♦ ఐటీసీ ఫుడ్స్ సీఈఓ వి. ఎల్. రాజేశ్ వెల్లడి న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ కంపెనీ ఆహార ఉత్పత్తుల తయారీ కోసం దేశవ్యాప్తంగా 8-9 ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నది. ఈ ఫ్యాక్టరీల ఏర్పాటు కోసం 2-3 ఏళ్లలో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని ఐటీసీ తెలిపింది. తాము విక్రయిస్తున్న వివిధ కేటగిరీల ఆహార ఉత్పత్తుల తయారీ కోసం ఈ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీసీ ఫుడ్స్ సీఈఓ వి. ఎల్. రాజేశ్ తెలిపారు. కంపెనీ బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ డివిజన్ టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో 11% వృద్ధి చెంది రూ.7,097.49 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. సిగరెట్ల తర్వాత ఐటీసీ రెండో అతి పెద్ద వ్యాపారం ఆహార ఉత్పత్తులేనని వివరించారు. ఆరోగ్య స్పృహ ఉన్న వినియోగదారులకు కొత్తగా సన్‌ఫీస్ట్ ఫార్మ్లైట్ బిస్కట్స్‌ను మార్కెట్లోకి తెచ్చామని తెలిపారు. సన్‌ఫీస్ట్ ఫార్మ్లైట్ బిస్కట్లలో ఓట్స్ బిస్కట్లను ఆల్మండ్స్, రెజిన్స్, చాకొలెట్ వేరియంట్లలో అందిస్తున్నామన్నారు. బిస్కెట్ మార్కెట్లో హెల్త్ బిస్కట్ మార్కెట్ వాటా 1 శాతమేనని, ఈ కేటగిరి వేగంగా వృద్ధి సాధిస్తోందని వివరించారు. మధుమేహ బాధితుల కోసం గ్లూకోజ్‌ను విడుదలను నియంత్రించే ఆశీర్వాద్ ఆటాను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. -
ఆహారధాన్యాల సాగు 10 శాతం
* పప్పుధాన్యాల సాగు 22% * ఖరీఫ్‌పై వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్‌లో ఇప్పటివరకు అయిన పంటల సాగుపై వ్యవసాయ శాఖ నివేదిక విడుదల చేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు రైతన్న దుక్కులు దున్ని విత్తులు చల్లాడు. సోమవారం సాయంత్రానికి రాష్ట్రంలో మొత్తం 11 శాతం పంటలు సాగయ్యాయి. అందులో ఆహారధాన్యాల సాగు 10 శాతం ఉంది. ఈ విషయంపై వ్యవసాయశాఖ మొదటిసారిగా ఒక నివేదిక విడుదల చేసింది. 48.11 లక్షల ఎకరాల్లో ఆహారధాన్యాల సాగు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 4.66 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని తెలిపింది. అందులో పప్పుధాన్యాల సాగు 2.19 లక్షల ఎకరాల్లో (22%), పత్తి 5.18 లక్షలు, సోయాబీన్ 1.03 లక్షల ఎకరాల్లో విత్తనాలు చల్లారు. వరి 22,230 ఎకరాల్లో (ఒక శాతం) విస్తీర్ణంలో నాట్లు పడ్డాయి. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్ విత్తనాలు చల్లాలని ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా రైతులు మాత్రం పత్తి సాగుపై మక్కువ వదలలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. 15 మీటర్ల లోతుల్లోకి భూగర్భ జలాలు రాష్ట్రంలో భూగర్భ జలాలు 15.62 మీటర్ల లోతుల్లోకి పడిపోయాయని వ్యవసాయ శాఖ వెల్లడించింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో 2.35 మీటర్ల అదనపు లోతుల్లోకి భూగర్భ జలాలు పడిపోయాయి. అత్యధికంగా మెదక్ జిల్లాలో గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో 5.47 మీటర్ల అదనపు లోతుల్లోకి భూగర్భ జలాలు అడుగంటాయి. నిజామాబాద్ జిల్లాలో 5.08 మీటర్ల అదనపు లోతుల్లోకి కూరుకుపోయాయి. -
ఫ్యాప్సీ ప్రెసిడెంట్‌గా రవీంద్ర మోదీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) ప్రెసిడెంట్‌గా 2016-17 సంవత్సరానికిగాను హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎండీ రవీంద్ర మోదీ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగారు. ముంబైలోని యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఆహార పరిశ్రమలో 30 ఏళ్లకుపైగా అనుభవం ఆయన సొంతం. సూర్య బ్రాండ్‌తో మసాలాలు, ఇతర ఆహారోత్పత్తులను హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ విక్రయిస్తోంది. ఇక ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా గౌర పెట్రోకెమ్ ఎండీ గౌర శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఎనిమిదేళ్లుగా ఫ్యాప్సీలో వివిధ హోదాల్లో పనిచేశారు. -
త్వరలో ‘కాకతీయ ఫుడ్స్’
- తెలంగాణ సర్కారు ఆధ్వర్యంలో ఆహార ఉత్పత్తుల విక్రయాలు - ఉద్యానాభివృద్ధి సంస్థ విధివిధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: కల్తీలేని ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది. ‘కాకతీయ ఫుడ్స్’ బ్రాండ్‌తో పండ్లు, కూరగాయలు, కారం, పసుపు, సుగంధ ద్రవ్యాలను విక్రయించాలని నిర్ణయించింది. దేశ విదేశాలకు సేంద్రియ పండ్లు, కూరగాయలు ఎగుమతి చేయాలనీ యోచిస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యానాభివృద్ధి సంస్థ’ విధివిధానాలను ఖరారు చేస్తూ వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ ఉద్యానాభివృద్ధి సంస్థ పేరుతో కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు చేయాలని ఆదేశాలిచ్చారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆహార ఉత్పత్తులు పండిస్తే... రైతులకు లాభసాటిగా మార్చేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఆ ఉత్పత్తులకు అవసరమైన ప్రాసెసింగ్, మార్కెటింగ్ బాధ్యత ఉద్యానాభివృద్ధి సంస్థ చేపడుతుంది. రాష్ట్రంలో ఆహార పదార్థాల్లో పెద్ద ఎత్తున కల్తీ జరుగుతుండటంతో దీన్ని అరికట్టేందుకు సీఎం కేసీఆర్ ఉద్యానాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉద్యానాభివృద్ధి సంస్థ విధివిధానాలివి... ►ఉద్యాన పంటల సాగులో వ్యవసాయ యాంత్రీకరణను విరివిగా ప్రోత్సహించాలి. పంట చేతికి వచ్చాక ఎగుమతులు, స్థానిక అవసరాల కోసం ఆహార ఉత్పత్తులను గ్రేడింగ్, ప్రాసెసింగ్ చేయాలి. ►రుణాలతో సంబంధమున్న సూక్ష్మ సేద్యం, పాలీ హౌస్, కోల్డ్ స్టోరేజ్, రైపనింగ్ చాంబర్స్, ప్యాక్ హౌసెస్, ఔట్లెట్ల వ్యవహారాన్ని సంస్థ పర్యవేక్షిస్తుంది. ►ఉద్యానశాఖ పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, ఉల్లి ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాలి. ప్రాసెస్ చేసి మార్కెటింగ్ చేయాల్సిన బాధ్యతనూ తీసుకోవాలి. ►ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రైవేటు పరిశ్రమలు, ఫుడ్ పార్కుల సహకారం తీసుకునే అవకాశాల్ని అన్వేషించాలి. ►పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలు పండించే రైతులకు పూర్తిస్థాయిలో లాభాలు వచ్చేలా సంస్థ చొరవ చూపాలి. చైర్మన్‌గా పార్థసారథి... ఉద్యానాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి, ఎండీ, వైస్‌చైర్మన్‌గా ఉద్యాన శాఖ కమిషనర్ ఎల్.వెంకట్రామిరెడ్డి ఉంటారు. బోర్డు డెరైక్టర్లుగా ఫుడ్ ప్రాసెసింగ్, ఇండస్ట్రీస్ ముఖ్య కార్యదర్శి, ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ, అగ్రికల్చర్, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (అపెడా) డిప్యూటీ జనరల్ మేనేజర్, వ్యవసాయశాఖ డెరైక్టర్, మార్కెటింగ్ కమిషనర్, ఉద్యాన, వ్యవసాయ వర్సిటీల వైస్ చాన్స్లర్లు, ఆగ్రోస్ ఎండీ, టీఎస్ఐఐసీ ఎండీ, ఫుడ్ సేఫ్టీ అథారిటీ కమిషనర్లుగా ఉంటారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
30 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు
2016-17 ఖరీఫ్, రబీ ఉత్పత్తి లక్ష్యాలను ఖరారు చేసిన కేంద్రం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్, రబీ ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని ప్రకటించింది. ఈసారి రుతు పవనాలు ఆశాజనకంగా ఉంటాయన్న భారత వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల మేరకు లక్ష్యాలను నిర్దేశించింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రెండేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొనడంతో పంటలు ఎండిపోయాయి. ఆహారధాన్యాల దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. అయితే, ఈసారి వరి, గోధుమ, పప్పుధాన్యాల దిగుబడులు మరింత పెంచాలని తాజా గా రాష్ట్రాలకు సూచించింది. 2016-17 ఖరీఫ్, రబీ సీజన్ ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 30.55 కోట్ల టన్నులుగా ప్రకటించింది. అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. వరి ఉత్పత్తి లక్ష్యం 14.35 కోట్ల టన్నులు దేశవ్యాప్తంగా వరి పంటనే అధికంగా సాగు చేస్తారు. గతేడాది వరి ఉత్పత్తి లక్ష్యం 13.98 కోట్ల టన్నులుండగా ఈసారి 14.35 కోట్ల టన్నులు పండించాలని కేంద్ర వ్యవసాయశాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఖరీఫ్‌లో 12.36 కోట్ల టన్నులు, రబీలో 1.99 కోట్ల టన్నుల వరి ధాన్యం పండించాలని సూచించింది. వరి తర్వాత దేశంలో అధికంగా సాగయ్యే గోధుమ ఉత్పత్తి లక్ష్యం రబీలో 9.65 కోట్లుగా నిర్ధారించింది. 60 లక్షల టన్నుల జొన్నలను పండించాలని సూచించింది. దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పడిపోతుండడంపై కేంద్ర వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల భోపాల్‌లో జరిగిన పప్పుధాన్యాల సాగు సదస్సులో కంది విస్తీర్ణాన్ని మరింత పెంచి ఉత్పత్తి పెంచాలని నిర్దేశించిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం వచ్చే సీజన్లో అన్ని రకాల పప్పుధాన్యాలను 2.07 కోట్ల టన్నుల మేరకు ఉత్పత్తి చేయాలని రాష్ట్రాలను కోరింది. గతేడాది కంటే 14 లక్షల టన్నులు అధికంగా పండించాలని సూచించింది. తెలంగాణలో ఐదేళ్ల క్రితం పప్పుధాన్యాల ఉత్పత్తి 4.74 లక్షల మెట్రిక్ టన్నులుండగా, ఈ ఏడాది 2.50 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో కంది సాగు విస్తీర్ణాన్ని 10 శాతం వరకు పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. చెరకు 35.50 కోట్ల టన్నులు, నూనెగింజల ఉత్పత్తి లక్ష్యం 3.5 కోట్లుగా కేంద్రం నిర్ధారించింది. పత్తి సాగు తగ్గించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించినా కేంద్రం మాత్రం గతం కంటే 10 లక్షల బేళ్లు అధికంగా లక్ష్యాన్ని నిర్ణయించింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 3.6 కోట్ల బేళ్లు ఉత్పత్తి చేయాలని ఆదేశించింది. -
ఏపీ, అరబ్ దేశాల మధ్య వాణిజ్యాభివృద్ధికి ఎంఓయూ
సాక్షి, విజయవాడ బ్యూరో: టూరిజం, ఆహార ఉత్పత్తులు, విద్యా, వైద్యం తదితర రంగాల్లో వ్యాపార కార్యకలాపాలకు అరబ్ దేశాలు అనువైనవని ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్(ఐబీపీసీఆర్‌ఎకె) సెక్రటరీ జనరల్ లోకేష్ కె వర్మ చెప్పారు. అరబ్ దేశాల్లో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోగలితే ఏపీతోపాటు ఇక్కడి వ్యాపార, పారిశ్రామిక వేత్తలు కూడా అభివృద్ధి చెందవచ్చని సూచించారు. యునెటైడ్ అరబ్ ఎమిరెట్స్(యుఎఇ)కి చెందిన రఫ్ ఆల్‌కైమా స్టేట్‌లో ఐబీపీసీఆర్‌ఎకె సెక్రటరీ జనరల్‌గా ఉన్న లోకేష్ కె వర్మ, ఏపీ చాంబర్ ప్రెసిడెంట్(ఎలక్ట్) ముత్తవరపు మురళీకృష్ణతో బుధవారం ఒప్పందం(ఎంఓయు) కుదుర్చుకున్నారు. ఈ సందర్బంగా ఏపీ చాంబర్ హాలులో జరిగిన పారిశ్రామిక, వ్యాపారవ్తేతల ముఖాముఖిలో లోకేష్ వర్మ మాట్లాడుతూ అరబ్ దేశాలకు భారత్ నుంచి ఎగుమతి అవుతున్న సరుకులు, పరికరాలు అన్నీ ముంబాయి ఎయిర్‌పోర్టు, పోర్టు నుంచి వెళుతున్నాయని చెప్పారు. అదే గన్నవరం ఎయిర్‌పోర్టు, కృష్ణపట్నం ఓడరేవులను విస్తరించి విదేశాలకు సరుకు రవాణాను ప్రోత్సహిస్తే ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయం పెరగడంతోపాటు ఇక్కడి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు. -
ఫుడ్ స్టార్టప్‌లకు నిధులందక చిక్కులు
హా.. హా.. అనిపించే రుచికరమైన ఆహార పదార్థాలను ఆఫర్ చేస్తున్న ఫుడ్ స్టార్టప్‌లు మూతపడుతున్నాయి. డాజో, స్పూన్ జాయ్, ఈట్లో, ఓలా కేఫ్‌లు వాటి కార్యకలాపాలను పూర్తిగా మూసేశాయి. గుర్గావ్కు చెందిన మరో ఫుడ్ డెలివరీ స్టార్టప్ యుమిస్ట్ బెంగళూరులో తన ఆపరేషన్లను మూసేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. బెంగళూరులో ప్రారంభించిన 10 నెలల్లోనే ఈ కంపెనీ ఫుడ్ డెలివరీ బిజినెస్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చివరి రెండు త్రైమాసికాల నుంచి చాలా ఫుడ్ టెక్ కంపెనీలకు నిధుల రాక సరిగా లేకపోవడంతో పుడ్ స్టార్టప్‌ల నుంచి వైదొలగుతున్నట్టు తెలుస్తోంది. 2015 ప్రథమార్థంలో ఫుడ్ స్టార్టప్‌లకు పెట్టుబడుల వెల్లువ బాగానే ఉన్నా.. తర్వాత మందగించడంతో రికార్డులు సృష్టించిన ఫుడ్ స్టార్టప్‌లకు గడ్డు పరిస్థితి నెలకొంది. ప్రతి ఆర్డర్ మీద 20 శాతం మార్జిన్లతో చాలా స్టార్టప్‌లు ఈ ఫుడ్ విభాగంలోకి ప్రవేశించినా.. నిధుల సేకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఫుడ్ స్టార్టప్లలోకొన్ని కంపెనీలు డెలివరీకి చార్జీలు వసూలు చేస్తుండగా, మరికొన్ని కంపెనీలు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే బెంగళూరులో కంపెనీ కార్యకలాపాలు మూసేసి.. ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలో కార్యకలాపాలను విస్తరిస్తున్నామని యుమిస్ట్ పేర్కొంది. ప్రస్తుతం బెంగళూరులో తమ కార్యకలాపాలకు విశ్రాంతి పలుకుతున్నామని యుమిస్ట్ తమ బ్లాగ్ పోస్ట్ లో పేర్కొంది. 2015 ఆగస్ట్‌లో బెంగళూరులో ప్రారంభించిన దగ్గర్నుంచి యుమిస్ట్ రెంటల్ కిచెన్ ను ఆపరేట్ చేసింది. తమ స్థాయికి తగ్గట్టుగా మెనూలో మార్పులకు అవకాశం లేకపోవడంతో బెంగళూరులో కార్యకలాపాలు మూసేస్తున్నట్టు కంపెనీ పోస్ట్ చేసింది. అయితే 12 వేల మెగా కిచెన్‌తో ఎన్సీఆర్ పరిధిలో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించబోతుందని పేర్కొంది. ఈ ప్రాంతంలో కేటరింగ్ ఎక్కువగా వృద్ధి ఉంటుందని తెలిపింది. జుమాటో మాజీ సీఈవో అలోక్ జైన్, ఎఫ్ అండ్ బి ఎంటర్ ప్రెన్యూర్ అభిమన్యు మహేశ్వరి కలిసి 2014 నవంబర్‌లో యుమిస్ట్ను స్థాపించారు. హోమ్లీ డెలివరీ భోజనాలను అందించడమే లక్ష్యంగా యుమిస్ట్ పనిచేసింది. వేడివేడి తినుబండారాలను 30 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే అందించిన యుమిస్ట్..ఆన్ లైన్ యాప్ మార్కెట్లో తన బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. -
ఈ ట్రేడింగ్
♦ జాతీయ విపణిలో మన ఆహార ఉత్పత్తులు ♦ ఈ-బిడ్డింగ్‌తో విక్రయించుకునే వెసులుబాటు ♦ ప్రయోగాత్మకంగా మూడు మార్కెట్లలో అమలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నిన్నటి వరకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. ఐదు అంకెల జీతం తీసుకునే వాళ్లు మాత్రమే ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవాళ్లు. దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు పలు నగరాల్లోని షేర్మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ సంబరపడిపోయేవారు. అలాంటి వ్యాపారమే అన్నదాతలకు అందుబాటులోకి రానుంది. తాండూరు కందుల రైతులతోపాటు వివిధ ఆహార ఉత్పత్తుల రైతులకు ఈ అరుదైన అవకాశం చిక్కనుంది. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, శంకర్పల్లి మార్కెట్లలో ఆన్లైన్ బిడ్డింగ్ కోసం అన్ని హంగులు కల్పించేందుకు జిల్లా మార్కెటింగ్ అధికారులు కసర త్తు సాగిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను జాతీయ విపణిలో అమ్ముకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నారు. రైతులేమిటి? ఆన్లైన్ ట్రేడింగ్ ఏమిటి అనుకుంటున్నారా? అది ఎలాగో మీరే చదవండి. బషీరాబాద్‌కు చెందిన వెంకటరె డ్డి 30 బస్తాల కందులు పండించారు. సమీపంలోని తాండూరు మార్కెట్లోకి ఆయన లారీ ప్రవేశించగానే కంప్యూటర్లో పంట ఉత్పత్తుల వివరాలు, రైతు సమాచారాన్ని నమోదు చేస్తారు. అక్కడే ఏర్పాటుచేసే అధునాతన ల్యాబ్‌లో కంది నాణ్యతను పరిశీలించి గ్రేడింగ్ నిర్ణయిస్తారు. తద్వారా ధరను ప్రకటిస్తారు. ఈ వివరాలను ఈ- బిడ్డింగ్‌లో ఎంట్రీ చేస్తారు. దీంతో దీనికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ (నామ్)తో అనుసంధానం చేయడం ద్వారా ఏకకాలంలో 500 మార్కెట్ కమిటీలో ఈ- ట్రేడింగ్ జరిపేందుకు వీలు కలుగుతుంది. ఉత్పత్తి, నాణ్యత నచ్చిన వ్యాపారులు ఆ పంటను ఈ -బిడ్డింగ్‌లో కోట్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే నిర్దేశిత మొత్తం రైతు ఖాతాలో జమకానుంది. అదే సమయంలో ప్రస్తుతం క మీషన్ ఏజెంటు కేవలం నిర్దేశిత మార్కెట్లోనే క్రయవిక్రయాలు జరుపుకునేందుకు అనుమతి ఉంది. కొత్త విధానం అమలు చేయడం ద్వారా ఈ ఏజెంటు దేశవ్యాప్తంగా 500 మార్కెట్లలోని ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేసుకునే అవకాశం కలుగనుంది. -
‘ఆహారం’.. ఆందోళనకరం..!
ఐదేళ్లలో 35 లక్షల ఎకరాలు తగ్గిన ఆహారధాన్యాల సాగు తెలంగాణ అర్థగణాంక దర్శిని నివేదికలో వెల్లడైన నిజాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం భారీగా పడిపోతోంది. కరువు పరిస్థితులు... లక్షలాది ఎకరాలు బీళ్లుగా మారడం... పత్తి వంటి వాణిజ్య పంటల వైపు రైతులు తరలిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కేవలం ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం ఏకంగా 34.92 లక్షల ఎకరాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. 2010-11లో రాష్ట్రంలో 86.07 లక్షల ఎకరాల్లో ఆహారధాన్యాల పంటల సాగు జరగ్గా... 2015-16లో 51.15 లక్షల ఎకరాలకు పడిపోయి 34.92 లక్షల ఎకరాలు తగ్గింది. కీలకమైన పప్పుధాన్యాల సాగు 2010-11లో 18.92 లక్షల ఎకరాలు ఉండగా... 2015-16లో అదికాస్తా 11.37 లక్షల ఎకరాలకు దిగింది. అంటే 7.55 లక్షల ఎకరాలు మేర తగ్గాయి. మరో వైపు పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. 2010-11లో పత్తి సాగు విస్తీర్ణం 34.87 లక్షల ఎకరాలు ఉండగా... 2015-16లో 44.45 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇలా 9.58 లక్షల ఎకరాలకు పెరిగింది. తగ్గిన దిగుబడి... ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోవడంతో ఆ ప్రభావం పంటల ఉత్పత్తిపై తీవ్రమైన ప్రభావం చూపింది. 2010-11లో 92.60 లక్షల మెట్రిక్ టన్నులు పండిన ఆహారధాన్యాలు... 2015-16 వచ్చే సరికి 49.35 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయాయి. అందులో కీలకమైన పప్పుధాన్యాల ఉత్పత్తి 4.74 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2.50 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయాయి. ఇక కందిపప్పు ఉత్పత్తి 2010-11లో 1.51 లక్షల మెట్రిక్ టన్నులు ఉం డగా... 1.03 లక్షల మెట్రిక్ టన్నులకు దిగిం ది. అదే సమయంలో పత్తి ఉత్పత్తి 2010-11లో 30.35 లక్షల బేళ్ల నుంచి 2015-16లో 36.08 బేళ్లకు పెరిగింది. సాగు విస్తీర్ణంతో పోలిస్తే పత్తి ఉత్పత్తి పెరగలేదు. బీళ్లుగా 15 లక్షల ఎకరాలు రాష్ట్రంలో 1.63 కోట్ల ఎకరాల భూమి సాగుకు అనుకూలమైనా సాగు విస్తీర్ణం 1.03 కోట్ల ఎకరాలే అవుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు భూములను బీళ్లుగా వదిలేస్తున్నారు. కొందరు వాణిజ్య పంటలవైపు మరలిపోవడంతో ఆహారధాన్యాల సాగు తగ్గింది. పత్తి విస్తీర్ణం పెరిగినా కరువు కారణంగా రైతులు నష్టపోయి, అప్పుల పాలయ్యారు. రాష్ట్రంలో జరిగిన ఆత్మహత్యల్లో దాదాపు 60 శాతానికి పైగా పత్తి రైతులవేనని అంచనా. అందుకే పత్తి పంటను నిరుత్సాహపరచాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. ఆహారధాన్యాల పంటలవైపు రైతులను మరల్చాలని భావిస్తోంది. -
పిల్లల కోసం సాహసం!
ప్రస్తుతం చెన్నై అంతా అల్లక ల్లోలంగా ఉన్న సంగతి తెలిసిందే. తుపాను కారణంగా అక్కడి రహదారులు జలమయమయ్యాయి. జనాలు బయటికి రాలేని పరిస్థితి. కొన్ని ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొంతమంది ఎక్కడికెళ్లాలో తెలియక ఉన్న చోటే ఇరుక్కుపోయారు. అక్కడికి రాకపోకలు కూడా కష్టమవుతున్నాయ్. అలాంటివాటిలో నుంగంబాక్కంలోని ‘లిటిల్ ఫ్లవర్ స్కూల్’ ఒకటి ఉంది. మూగ, చెవిటి, అంధ బాల బాలికలకు చెందిన స్కూల్ అది. అన్నపానీయాలు లేని పరిస్థితిలో అక్కడి పిల్లలు దయనీయ స్థితిలో ఉన్నారు. ఈ విషయం ఫేస్బుక్ ద్వారా, రేడియో ద్వారా బయటికొచ్చింది. ఆ స్కూల్‌కు మోకాళ్లు లోతు నీటిలో కొంతదూరం నడుచుకుంటూ వెళ్లి, ఆ తర్వాత పడవలో వెళ్లాలి. రిస్క్‌తో కూడుకున్నదే. అయినా మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా తెగించారు. ఆహార పదార్థాలు తీసుకుని వ్యయప్రయాసలకోర్చి ఆ స్కూల్‌కి చేరుకున్నారు. పిల్లలందరికీ ఫుడ్ బాక్సులను అందజేశారు. ఆకలి తీరుతోందన్న ఆనందం ఓవైపు, స్వయంగా ఇళయరాజా వచ్చారన్న ఆనందం మరోవైపు.. ఆ పిల్లలను కన్నీటి పర్యంతం చేసింది. చూపు లేని పిల్లలు రాజా సార్‌ని చేతులతో ఆప్యాయంగా తడిమారు. చేతులను ముద్దాడారు. కాళ్లకు నమస్కారం చేశారు. చిన్నారుల స్పర్శకు ఇళయరాజా ఉద్వేగానికి లోనయ్యారు. అప్పటికప్పుడు వాళ్ల కోసం భక్తి పాటలు పాడారు. ‘‘మీ ప్రార్థనలను దేవుడు వింటున్నాడు. భయపడకండి’ అని పిల్లలకూ, ఆ స్కూల్‌కి చెందిన సిస్టర్స్‌కు ధైర్యం చెప్పారు. ఇళయరాజా వయసు 72. ఈ వయసులో మోకాళ్ల లోతు నీళ్లల్లో నడుచుకుంటూ వెళ్లడం, పడవ ప్రయాణాలు చేయడం రిస్కే. పిల్లల కోసం ఆయన ఈ సాహసం చేశారు. రాజా సార్ సో గ్రేట్ కదూ. -
వేస్ట్ చేస్తే.. వేసేస్తారు!
‘తింటున్న దాని కంటే వృథా చేస్తున్నదే ఎక్కువ...’ ఆహారం విషయంలో ఐక్యరాజ్యసమితి వ్యాఖ్య ఇది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ వృథా అవుతున్న ఆహార పరిమాణం గురించి లెక్కగట్టిన ఆ సంస్థ ప్రతి ఏటా 13 లక్షల టన్నుల ఆహార పదార్థాలు మట్టిపాలు అవుతున్నాయని తేల్చింది. విందులు, పెళ్లిళ్లు, ఇతర వేడుకల్లో, ఇళ్లల్లో, హోటళ్లలో వృథా అవుతున్న ఆహార పరిమాణం ఇది. ఈ నేపథ్యంలో తమ వంతుగా ఇలాంటి వృథాను అరికట్టడానికి జర్మనీ చేస్తున్న ఒక ప్రయత్నం ఆసక్తికరంగా ఉంది. - సాక్షి సెంట్రల్ డెస్క్ ఆహారాన్ని వృథా చేస్తే ఫైన్ జర్మన్ రెస్టారెంట్లలో అమలవుతున్న చట్టం వేస్ట్ చేస్తే బిల్లు కన్నా పెరిగిపోయే ఫైన్ కిరాణా స్టోర్లలో పదార్థాలపై కన్నేసిన ఫ్రాన్స్ ప్రభుత్వం వృథా అరికట్టడానికి కఠినమైన చట్టాలు అభినందనలు అందుకుంటున్న వృథా నివారణ యత్నాలు కందిపప్పు కష్టాలు.. కస్టమర్లపై ఫైన్! మనదేశంలోనూ ఫైన్ వేస్తామంటూ వృథా ను నివారించే ప్రయత్నాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. ముంబైలోని ఒక ఉడిపి హోటల్ వాళ్లు తమ హోటల్లో సాంబార్‌ను వృథా చేసే వాళ్లపై ఫైన్ వేస్తున్నారు. ఇడ్లీ తిన్న తర్వాత ఒక్కబొట్టు సాంబార్ కూడా మిగల్చకూడదక్కడ. మిగిలితే పది రూపాయల వరకూ ఫైన్ వేస్తున్నారు. సాంబార్ మిగలకూడదన్న నియమాన్ని కస్టమర్లకు ముందుగానే వివరించి అక్కడ ఇడ్లీ వడ్డిస్తున్నారు. అయితే ఇక్కడ అసలు వ్యవహారం వేరే ఉంది. కందిపప్పు ధర ఆకాశానికంటడంతో సాంబార్ తయారీ ఖర్చు పెరగడంతో ఆ హోటల్ ఈ ఫైన్ నిబంధన పెట్టిందంతే! రెస్టారెంట్ రూల్ ఇది... ‘మీకు కావాల్సినంత తినండి. కొసరి కొసరి వడ్డిస్తాం. కానీ తిన్నాక కంచంలో మెతుకు మిగలకూడదు’ అనేది జర్మనీ దేశంలోని రెస్టారెంట్లలో ఉన్న నియమం. ప్రభుత్వం చట్టంగా చేసిన ఈ నియమాన్ని అక్కడి రెస్టారెంట్ ఓనర్లు కచ్చితంగా అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు దారికి వచ్చారు. తిన్నంత తిని, పడేసినంత పడేసే దగ్గర నుంచి.. సరదాగా హోటల్‌కు వెళ్లినప్పుడు కూడా కొంచెం కొంచెం ఆర్డర్ ఇచ్చుకునే దశకు వచ్చారు. బిల్లు కన్నా ఫైనే ఎక్కువ! ఒక రెస్టారెంట్ లేదా హోటల్లో ఎవరైనా ఆహారాన్ని వృథా చేస్తే అక్కడున్న వేరే వాళ్లు కూడా కంప్లైంట్ చేయవచ్చు. ఆఖరికి కోక్, ఎనర్జీ డ్రింకులను అయినా ఖాళీ చేయకుండా అలాగే వదిలేస్తే ఫైన్ పడుతుంది. కనీస వడ్డన 50 యూరోల వరకూ ఉంటుంది. ఈ మొత్తాన్ని మరోరకంగా చూస్తే... స్నేహి తులతోనో, బంధువులతోనో కలసి భోజనం చేస్తే అయ్యే బిల్లు కన్నా.. ఎక్కువ. అందుకే ఇప్పుడు జర్మన్ రెస్టారెంట్లలో, హోటళ్లకు వెళ్లిన వాళ్లు చాలా పరిమితంగానే ఆర్డర్లు ఇవ్వడాన్ని అలవాటు చేసుకున్నారు. అవ సరం అయితే మారు వడ్డనకు ఆర్డర్ ఇచ్చు కోవచ్చు.. వృథా చేయకుండా బయటికి వస్తే చాలనేది ఇప్పుడు అక్కడి ప్రజల భావన. ఫ్రాన్స్‌లో షాపుల వాళ్లపై... ప్రజలపై కాదు కానీ, కిరాణా సరుకులను అమ్మే గ్రోసరీ షాపుల వాళ్లపై దృష్టి పెట్టింది ఫ్రెంచి ప్రభుత్వం. ఒక ప్రణాళిక లేకుండా సరుకులను షాపుకు తెప్పించుకుని వాటి ఎక్స్పైరీ డేట్ దాటే వరకూ షాపులో ఉంచుకుని.. చివరకు వాటిని మట్టిపాలు చేయడానికి వీలులేదక్కడ. కాలపరిమితి దాటిపోయి వృథా అవుతాయనుకున్న ఆహారపదార్థాలను వీలైనంత ముందుగా ఏ అనాథాశ్రమాలకో డొనేట్ చేయాలి కానీ.. వృథా చేస్తే మాత్రం షాపు యజమానులకు భారీ ఫైన్లు, జైలు శిక్షలు అమల్లో ఉన్నాయి. ఈ విధంగా ఆహార వృథాను అరికట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికాలో కూడా... ఆహారాన్ని వృథా చేయడంలో తొలి వర సలో, తొలిస్థానంలో ఉన్నారు అమెరికన్లు. అక్కడ కూడా రెస్టారెంట్లలో, హోటళ్లలో వృథా చేసే వారిపై ఫైన్ వేయాలనే ప్రతి పాదన ఉంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని నగరాల్లో మాత్రమే అది అమలవుతోంది. ఇక మనదేశం విషయానికి వస్తే... భారతీయులు కూడా తమ వంతుగా ఏటా 58 వేల కోట్ల రూపాయల విలువచేసే ఆహారాన్ని చెత్తకుండీల పాల్జేస్తున్నారు. ప్రధానంగా పెళ్లిళ్లు, విందుల సమయాల్లోనే ఎక్కువ ఆహారం వృథా అవుతోంది. మరి వృథాను అరికట్టడానికి ప్రభుత్వం ఫైన్లే వేయనక్కర్లేదు. వృథా చేయరాదనే స్పృహ ఉంటే చాలు కదా! -
నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు
జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం అనంతపురం అర్బన్ : నిబంధనలు పాటించకుండా మందులు, ఆహార ఉత్పత్తులు, విక్రయించే దుకాణాలపై దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారి, తూనికలు, కొలతల శాఖ అధికారులు, డీఎస్‌ఓతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ వారంలో పది దుకాణాల్లో దాడులు నిర్వహించామని జేసీకి డ్రగ్ ఇన్స్పెక్టర్ చెప్పారు. సెక్షన్ 65-17 కింద నిబంధలను అతిక్రమించిన 42 దుకాణాలపై దాడులు చేసి 19 దుకాణాలపై క్రమ శిక్షణ చర్య సిఫారసు చేశామన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారి మాట్లాడుతూ ఆరు మ్యాగీ, రెండు బిస్కెట్, రెండు సుఫైన్ శ్యాంపిల్స్ తీసి పరీక్షలు నిర్వహించామన్నారు. రిలయన్స్, మోర్ తదితర మార్కెట్లను తనిఖీ చేసి నమూనాలను సేకరించి హైదరాబాద్‌కు పంపామని వివరించారు. తూనిక లు కొలతలకు సంబంధించి ఈ వారంలో 26 కేసులు నమోదు చేశామని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఎనిమిది ఎరువుల దుకాణాలపై దాడులు చేసి రూ.1.10 లక్షల రుసుం వసూలు చేశామన్నారు. మూడు హార్డ్ వేర్ దుకాణాలపై దాడి చేసి రూ.17 వేలు జరి మానా వసూలు చేశామన్నారు. సిలిల్ సప్లైస్‌కి సంబంధించి నార్పల, తాడిపత్రిలో రెండు రైసు మిల్లులను సీజ్ చేశామని డీఎస్ఓ తెలిపారు. ఏడు డొమెస్టిక్ సిలిండర్లు సీజ్ చేశామన్నారు. సమావేశానికి హాజరు కాని ఇద్దరు డ్రగ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్‌మెట్రాలజీకి షోకాజ్ నోటీసులు జారీ చేశామని జేసీ తెలిపారు. 15లోగా సరుకులు తీసుకోవాలి జిల్లాలో ఈ-పాస్ చౌకదుకాణాల ద్వారా ఈ నెల 15లోగా తీసుకోవాలని సరుకులు తీసుకోవాలని వినియోగదారులకు జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం ఓ ప్రకటనలో తెలిపారు. వినియోగదారులకు సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లకు ఆయన సూచించారు. -
కొన్ని ఫ్రిజ్‌లో ఉంచితే ప్రమాదం!
రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్)లో ఉంచిన ఏ వస్తువైనా కొంతకాలం పాటు చెడకుండా ఉంటుందనేది శాస్త్రీయ సిద్ధాంతం. ఇంట్లో రిఫ్రిజిరేటర్ లేని గృహాలు నేడు అరుదుగా కనిపిస్తాయి. అయితే ఫ్రిజ్ ఉంది కదా అని అందులో ఏవి పడితే వాటిని ఉంచడం ఆరోగ్యకరం కాదంటున్నారు న్యూట్రీషనిస్ట్లు.ముఖ్యంగా కాయగూరల్లో ఏవి ఫ్రిజ్‌ల్లో ఉంచకూడదో వారు వివరిస్తున్నారు. ప్రస్తుతం మన ఇళ్లలో ఆహార పదార్థాలు, కూరగాయలు, వంట సరుకులు ఏవి తెచ్చినా గృహిణులు వెంటనే వాటిని ఫ్రిజ్‌లో పెట్టేందుకు అల వాటుపడ్డారు. ముఖ్యంగా వంటకు వాడే పదార్థాలనే కాకుండా వంటలు పాడైపోకుండా ఉం డేందుకు కూడా ఫ్రిజ్‌ల్లో పెట్టడం సర్వసాధారణమైపోయింది. ఐతే ఫ్రిజ్ లో ఏయే పదార్థాలను ఉంచాలి.. ఏవి ఉం చకూడదు.. కొన్ని పదార్థాలు ప్రిజ్‌లో ఉంచితో కలిగే నష్టాలను న్యూట్రీషనిస్టులు వివరిస్తున్నారు. బంగాళాదుంప బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో ఉంచితే దుంపలపై తొక్కలోని తేమ ఆవిరై గట్టిపడిపోతుంది. ముక్కలుగా తరిగేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. లోపల ఉండే పిండి పదార్థంలోని తేమను పూర్తిగా కోల్పోతుంది. ఫలితంగా వాటితో చేసిన పదార్థాలు చప్పగా రుచీ-పచీ లేకుండా ఉండటమే కాకుండా ఉడికించడానికి.. లేదా వేయించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. టమాట టమాటాలను ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉంచరాదు. అలా ఉంచడం వల్ల టమాటాలపై ఉన్న పల్చటి పొర ముడతలు పడి అందులోని సీ-విటమిన్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. దాంతో వీటిద్వారా చేసే ఆహార పదార్థాల రుచి గణనీయంగా తగ్గిపోతుంది. కాబట్టి టమాటాలను గదిలోనే నిల్వ ఉంచాలి. ఉల్లిపాయలు ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచకండి. ఎందుకంటే వాటిలోని అధిక నీటి శాతం ఫ్రిజ్ చల్లదనానికి ఐస్‌లా మారి వాటి పొరలను బాగా దగ్గరకు చేరుస్తుంది. ఇందువల్ల వాటిని వాడే సమయంలో పొరలుగా విడదీయడం కష్టమవుతుంది. వెల్లుల్లి వెల్లుల్లిని కూడా ఫ్రిజ్‌లో ఉంచరాదు. ఎందుకంటే త్వరగా మొలక మొలుస్తుంది. వీటిని ప్లాస్టిక్ కవర్లో ఉంచి రెఫ్రిజిరేట్ చేసినా ఇదే ఫలితం ఉంటుంది. చిల్లీ హాట్‌సాస్ చిల్లీ హాట్‌సాస్ బాటిల్‌ను ఫ్రిజ్‌ల్లో ఉంచకూడదు. బాటిల్‌ను ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే కూడా సాస్ నిల్వ ఉండడానికి వాడిన ఫ్రిజర్వేటివ్లో రసాయన చర్య సంభవించి ఫంగస్ ఏర్పడుతుంది. పుచ్చకాయ పుచ్చకాయలను కానీ, కోసిన పుచ్చ దబ్బ లను కానీ ఫ్రిజ్‌ల్లో పెట్టరాదు. అలాచేస్తే దానిలోని యాంటీ ఆక్సిడెంట్ల న్నీ చనిపోతాయి. ఇందువల్ల తియ్యగా ఉండాల్సిన పుచ్చకాయ మనకు చప్పగా తెలుస్తుంది. మునక్కాడ మునక్కాడలను(మునక్కాయలు) పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకండి. కొయ్య ముక్కల్లా తయారైపోతాయి. వీటిని సాధారణ గది ఉష్ణోగ్రతలోనే నిల్వచేయడం ఉత్తమం. తేనె తేనెను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అది తొందరగా చిక్కబిడిపోవడమే కాకుండా, స్పటికత్వాన్ని పొందుతుంది. ఆ తర్వాత దీనిని బయటకి తీసి వాడుకోవడం కష్టమవుతుంది. బ్రెడ్ బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల పెలుసుగా తయారై అందులోని తేమను కోల్పోతుంది. వీటిని ఫ్రిజ్‌లో ఉంచాలి క్రీం బిస్కెట్లు, ఖరీదైన చాక్లెట్లు, కంటి చుక్కలు, చెవుల్లో వేసుకునే చుక్కలు (ఐ అండ్ ఇయర్ డ్రాప్స్), పండ్లు, ఆకు కూరలు, కొబ్బరి చిప్పలు (ఎండినవి ఉంచకండి), పాలు, పెరుగు, కొబ్బరి నీరు ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. క్రీం బిస్కెట్లు, చాక్లెట్లలో నాలుగు శాతం అల్యూమినియం, నికెల్ వంటి లోహాలుంటాయి. ఇవి గది ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్‌తో త్వరగా చర్య జరిపి అల్యూమినియం ఆక్సైడ్, నికెల్ డయాక్సైడ్లుగా మారుతుంటాయి. ఇలా గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసిన వీటిని తినడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్లు వచ్చే అవకాశముంది కనుక వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది. -
ఆహార సబ్సిడీలకు 'నగదు బదిలీ'!
న్యూఢిల్లీ: ప్రజా పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిచేసేందుకు ఆహార సబ్సిడీ లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది. అందులో భాగంగానే చండీగఢ్, పుదుచ్చేరిల్లో పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని చేపట్టాలనుకుంటోంది. శాంతకుమార్ కమిటీ సిఫారసులపై తన శాఖ అభిప్రాయాలను బుధవారం ప్రధానమంత్రి కార్యాలయంలో అందజేసిన ఆరోగ్యశాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్.. ఆ వివరాలను గురువారం వెల్లడించారు. -
మాకూ పదవులివ్వాల్సిందే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నామినేటెడ్ పదవుల కోసం కమలనాథులు పోటీపడుతున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ నేతలకు మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. అదేవిధంగా జిల్లాలోని నామినేటెడ్ పదవుల్లోనూ టీడీపీ నేతలతో సమానంగా బీజేపీ నేతలకూ ఇవ్వాలని కమలనాథులు పట్టుబడుతున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ, బీజేపీల మధ్య అంతర్గత పోరు తీవ్రమైంది. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో అధికార టీడీపీ వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 11 మార్కెట్ కమిటీలు, 7 దేవాలయ కమిటీలు, ఆర్టీసీ, నూడా, గ్రంథాలయ, ఎమ్మెల్సీలకు నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్లు, సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంది. వీటితో పాటు వెయ్యికిపైగా చిన్న దేవాలయాలు, మహిళా కమిషన్, ఫుడ్ కార్పొరేషన్, చేనేత, జౌళి, షిప్పింగ్ తదితర వాటిల్లో డెరైక్టర్ల నియామకం చేపట్టాల్సి ఉంది. ఈ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. గత ఏడాది నవంబర్‌లో భర్తీ చేయాల్సి ఉన్నా.. కమలనాథులు పోటీ పడుతుండడంతో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ కాలం గడుపుతున్నారు. జిల్లాలో రూ.కోటికిపైగా ఆదాయం వచ్చే ఆలయాలు ఏడు ఉన్నాయి. వీటిలో ప్రధాన ఆలయాలైన సూళ్లూరుపేట చెంగాళమ్మ, నెల్లూరులోని రంగనాయకులస్వామి దేవాలయం, పెంచలకోన నరసింహస్వామి, జొన్నవాడ కామాక్షమ్మ, నర్రవాడ వెంగమాంబ, తూర్పు కనుపూరు ముత్యాలమ్మ, నరసింహస్వామి ఆలయ కమిటీలు ఉన్నాయి. వీటిలో ఐదు కోర్టు పరిధిలో ఉన్నాయి. మిగిలిన రెండు ప్రధాన ఆలయ కమిటీ చైర్మన్ పదవులు బీజేపీకి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. అదేవిధంగా గూడూరు, నాయుడుపేట, రాపూరు, నెల్లూరు, వాకాడు, కోవూరు, ఉదయగిరి, వెంకటగిరి, పొదలకూరు, ఆత్మకూరు, కావలి మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇందులో ఉదయగిరి, కావలి, వెంకటగిరి మార్కెట్ కమిటీలు భర్తీ చేశారు. మిగిలిన ఎనిమిదింటిలో రెండు ప్రధాన కమిటీ చైర్మన్ పదవులు తమకు కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వీటితో పాటు దేవాలయాలు, మార్కెట్ కమిటీ సభ్యుల నియామకాల్లో ప్రతి కమిటీకి ఇద్దరు బీజేపీకి చెందిన వారికి కట్టబెట్టాలని పట్టుబడుతున్నారు. ఒక ఎమ్మెల్సీ మాకు ఇవ్వండి.. జిల్లాకు రెండు ఎమ్మెల్సీలు పదవులు కేటాయించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ రెండింటికీ టీడీపీ నేతల మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు వాటిలో ఒక ఎమ్మెల్సీ తమ వారికి కట్టబెట్టమని తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీలు బీజేపీకి కేటాయిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఒక ఎమ్మెల్సీ నెల్లూరుకు చెందిన బీజేపీ నేతలకు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అదేవిధంగా కార్పొరేషన్లో ‘నూడా’ చైర్మన్ పదవికి పోటీ నెలకొంది. ఈ పదవిని దక్కించుకునేందుకు అటు టీడీపీ, ఇటు బీజేపీ నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీడీపీలో అనూరాధ, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, బీజేపీ నుంచి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుమార్తె దీప నూడా పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇకపోతే జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న బీద రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి ఆ స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. జిల్లా అధ్యక్షపదవికి పలువురు టీడీపీ నేతలు పోటీపడుతున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఫుడ్ కార్పొరేషన్ డెరైక్టర్, షిప్పింగ్, చేనేత, జౌళి, మహిళా కమిషన్ పదవులన్నింటినీ బీజేపీ నేతలే దక్కించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య నామినేటెడ్ పదవుల కోసం అంతర్గత యుద్ధం జరుగుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. -
టేస్ట్ హైట్
చార్మినార్‌లోని నాలుగు మినార్లు మనకు తెలుసు. నగరంలో మరో ఏక్‌మినార్ వెలిసింది. 423 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయాలను మరింత ‘ఎత్తుకు’ తీసుకెళ్తూ ఏర్పాటైనదే ‘ద మినార్’ హైదరాబాద్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్. వంద అడుగుల ఎత్తులో కూర్చుని నగర అందాలతో పాటు సంప్రదాయ వంటకాల రుచి చూడాలనుకుంటే గండిపేట సమీపంలోని గోల్కొండ రిసార్ట్స్‌కు వెళ్లాల్సిందే... హైదరాబాద్ సంప్రదాయ వంటకాలను ప్రత్యేకంగా వడ్డిస్తోందీ రెస్టారెంట్. లోపలికి ప్రవేశించగానే నవాబీ తరహాలో ముత్యాల హారాన్ని మెడలో వేస్తూ స్వాగతం పలుకుతుంది. లిఫ్ట్‌లో పైన ఉన్న రెస్టారెంట్‌కు చేరుకోగానే... కుర్తాపైజమాల్లో ఉన్న వెయిటర్స్ చిరునవ్వుతో ఆహ్వానిస్తారు. లోపల హైదరాబాద్ చరిత్రను కనులకు కట్టే ఇంటీరియర్స్. చుట్టూ గ్లాస్ విండోస్. అందులోంచి నగర అందాలు మనకు కనువిందు చేస్తాయి. ఓవైపు పల్లె వాతావరణాన్ని తలపించే గండిపేట చెరువు, మరోవైపు హైటెక్ సొగసులద్దుకున్న గచ్చిబౌలి... మొత్తానికి గాల్లో తేలుతున్న అనుభూతి. రాత్రి సమయాల్లో విద్యుత్ కాంతుల వెలుగుల్లో నగరం... కార్తీక మాసంలో వేల దీపాలను దాచుకున్న కొలనును తలపిస్తోంది. హైదరాబాదీలు ఎంత ఫుడ్ లవర్సో... అంతే ఇన్నోవేటివ్ కూడా. అందుకే ఇటీవలే ఏర్పాటైన ఈ మినార్‌లో భోజనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వీకెండ్స్‌లో రద్దీ ఉంటోంది. ఇక కుటుంబ సమేత పార్టీలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. పసందైన విందుతో విదేశీయులను సైతం విస్తుపోయేలా చేస్తుందీ రెస్టారెంట్. ఒకేసారి 77 మంది కూర్చుని భోజనం చేసే సౌకర్యం ఇక్కడ ఉంది. మినార్... ఎక్స్‌క్లూజివ్ ఫర్ హైదరాబాదీ ఫుడ్. వెజ్, నాన్‌వెజ్, సీఫుడ్ మూడు ప్యాకేజీలను వడ్డిస్తోంది. హైదరాబాదీ రుచుల్లో బాగమైన బార్కాస్ పత్తర్‌కా గోష్, హైదరాబాద్ దమ్కా ముర్గా, ముర్గా దమ్ బిర్యానీ, హలీమ్, హైదరాబాద్ దమ్ కా మటన్ బిర్యానీ, కబాబ్‌లు తదితర వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. - ఎ.రాజేందర్‌రెడ్డి, మణికొండ -
జడ్జిలను ఫూల్స్ అన్నందుకు.. 4 వారాల జైలు
న్యూఢిల్లీ: కేరళకు చెందిన సీపీఎం నాయకుడు జడ్జిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుపాలయ్యాడు. మాజీ ఎమ్మెల్యే అయిన ఎంవీ జయరాజన్ హైకోర్టు జడ్జిలీను ఫూల్స్ అంటూ నిందించాడు. రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశ్యంతో కేరళ హైకోర్టు.. రోడ్లు, రోడ్డ పక్కన బహిరంగ సభలను నిషేధించింది. జయరాజన్ ఈ తీర్పుపై మండిపడుతూ తీర్పు చెప్పిన జడ్జిలను పరుష పదజాలంతో (ఫూల్/ఇడియట్) దూషించారు. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు జయరాజన్‌కు నాలుగు వారాల జైలు శిక్ష విధించింది. జస్టిస్ విక్రమ్ జీత్ సేన్, జస్టిస్ నాగప్పన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. తీర్పులపై విమర్శలు చేస్తే సమస్య లేదని, అయితే న్యాయాధికారులపై అనాగరిక, పరుష పదజాలం వాడితే సహించేదిలేదని హెచ్చరించింది. -
ఈ భోజనం.. తినలేం
⇒ ట్రిపుల్ ఐటీ మెస్‌లో నాసిరకం ఆహారం ⇒ వడ్డనలో గంటలతరబడి జాప్యం ⇒ తరగతులను కోల్పోతున్న విద్యార్థులు ⇒ అధ్వానంగా మార్వెల్ మెస్ నిర్వహణ ⇒ కొరవడిన పర్యవేక్షణ ⇒ ఎమ్మెల్యే పరిశీలనతో వెలుగులోకి నూజివీడు : ఉడికీ ఉడకని అన్నం.. రుచిలేని కూరలు.. నీళ్ల సాంబారు.. నలగని చపాతీలు.. సరిగా కడగని ప్లేట్లు.. నీళ్లలా పెరుగు.. ట్రిపుల్ఐటీ విద్యార్థులు గత నాలుగు రోజులుగా తింటున్న ఆహార పదార్థాలు ఇవి. ఆదివారం ట్రిపుల్‌ఐటీని సందర్శించిన ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు, మున్సిపల్ చైర్పర్సన్ బసవా రేవతి వద్ద విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకోగా వెలుగులోకి వచ్చిన విషయాలు. ఇంత దారుణంగా పెడుతున్నా మెస్ సూపర్వైజర్ గాని, ట్రిపుల్ఐటీ అధికారులు గాని ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ట్రిపుల్‌ఐటీలో గతంలో వెయ్యిమందికి భోజనం తయారుచేసి పెడుతున్న మార్వెల్ మెస్‌కు మరో మూడువేల మంది విద్యార్థులను అప్పగించడం వల్ల నిర్వహణ సరిగా ఉండటం లేదని, దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు తెలిపారు. నాలుగు వేల మందికి ఒకేసారి భోజనం పెట్టాలంటే మధ్యాహ్నం 12 గంటలకు మొదలు పెడితే రెండు గంటలు దాటుతోందని వివరించారు. దీంతో చాలా మంది తరగతులకు కూడా వెళ్లలేకపోతున్నామని వాపోయారు. సామర్థ్యం 2 వేలు.. కాంట్రాక్టు 4 వేలు మార్వెల్ సంస్థ నూజివీడు ట్రిపుల్‌ఐటీలో నాలుగువేల మందికి భోజనం అందించేందుకు కాంట్రాక్టును సొంతం చేసుకుంది. రెండువేల మంది సామర్థ్యం కలిగిన మెస్‌లో నాలుగువేల మందికి భోజనం పెడుతుండటం వల్లే విద్యార్థులందరికీ సకాలంలో అందించడం లేదని తెలుస్తోంది. దీంతో విద్యార్థులు తరగతులకు దూరమవ్వాల్సి వస్తోంది. నాసిరకంగా ఆహార పదార్థాలు... తమకు భోజనంలో వడ్డిస్తున్న ఆహార పదార్థాలు కూడా నాసిరకంగా ఉంటున్నాయని విద్యార్థులు ఎమ్మెల్యే ప్రతాప్, చైర్పర్సన్ రేవతి ఎదుట వివరించారు. సరిగా కడగని ప్లేట్లు, ఉడగని అన్నం, నాసిరకం కూరలు, నీళ్లను తలపిస్తున్న సాంబారు, పెరుగు.. అన్నీ నాసిరకంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నివేల మందికి ఒకేచోట వడ్డిస్తుండటంతో గంటల తరబడి లైన్లో నిలుచుని ఉండాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల తరగతులకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని, ఆలస్యం వెళ్లినందుకు ఫైన్లు కట్టాల్సి వస్తోందని వాపోయారు. మెస్ నిర్వాహకులు పనివారిని సరిపడా ఏర్పాటు చేయకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు తెలిపారు. సెలవులకు ముందు మెస్ నిర్వహణ బాగానే ఉందని, సంక్రాంతి సెలవుల తరువాతే అధ్వానంగా తయారైందని వివరించారు. జీవితాలతో ఆడుకుంటే ఎలా : ఎమ్మెల్యే ప్రతాప్ విద్యార్థుల ఇబ్బందులపై ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు స్పందిస్తూ.. మెస్ నిర్వహణ ఎందుకు సరిగా చేయడం లేదని డెరైక్టర్ హనుమంతరావును ప్రశ్నించారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటే ఎలా అని నిలదీశారు. ట్రిపుల్ ఐటీని నూజివీడుకు తీసుకొచ్చింది తానేనని, ప్రతి చిన్నదానికీ జోక్యం చేసుకోవడం ఎందుకులే అని ఊరుకుంటున్నానని తెలిపారు. లోపల నిర్వహణ ఇంత దారుణంగా ఉందని ఇప్పుడే తెలిసిందని చెప్పారు. గత ఆరేళ్లుగా లేని సమస్యలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. దీనికి డెరైక్టర్ హనుమంతరావు స్పందిస్తూ మార్వెల్ మెస్ నిర్వాహకుడికి ఇంకొక మెస్‌ను కూడా ఇవ్వడానికి సిద్ధం చేశామని, రేపటి నుంచి రెండుచోట్ల రెండు వేల మందికి చొప్పున భోజనం అందించడం జరుగుతుందని వివరించారు. నాణ్యమైన భోజనం వడ్డించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మూడు సంవత్సరాలుగా యూనిఫాం ఇవ్వడం లేదని, పీయూసీ-1లో ఇచ్చిన యూనిఫాంనే ఈ-1కు వచ్చినా వేసుకోవాల్సి వస్తోందని విద్యార్థినీ విద్యార్థులు ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆలస్యంగా తరగతులకు వెళితే ఫైన్లు వేస్తున్నారని, వాటి రూపంలో వచ్చిన లక్షలాది రూపాయలు ఏం చేస్తున్నారో అంతుబట్టడం లేదని విద్యార్థులు పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రిపుల్ఐటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ వైస్‌చాన్సలర్, చాన్సలర్ల దృష్టికి తీసుకెళతానని స్పష్టం చేశారు. దీంతో పాటు అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని విద్యార్థులకు తెలిపారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు బసవా భాస్కరరావు ఉన్నారు. వద్దన్న సంస్థకే కాంట్రాక్టు ఇచ్చారు మార్వెల్ సంస్థ గత ఏడాది బాసర ట్రిపుల్‌ఐటీలో మెస్ కాంట్రాక్టు నిర్వహించింది. గత ఏడాది ఏప్రిల్ 23న అప్పటి ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్య కమిషనర్‌గా ఉన్న అజయ్‌జైన్ బాసర ట్రిపుల్ఐటీకి వెళ్లిన సందర్భంలో మార్వెల్ సంస్థ నిర్వహిస్తున్న మెస్‌ను పరిశీలించారు. ఆ తరువాత అప్పటి వైస్ చాన్సలర్ ఆర్వీ రాజ్‌కుమార్‌కు దీనిపై నివేదిక ఇచ్చారు. అందులో ‘మార్వెల్ మెస్ నిర్వహణ అధ్వానంగా ఉంది. ఆహార పదార్థాల నాణ్యత ఏమాత్రం బాగోలేదు. ఇలాంటి అపరిశుభ్రంగా, అధ్వానంగా ఉన్న మెస్‌ను ఎక్కడా చూడలేదు. ఆహార పదార్థాల నాణ్యత ఏమాత్రం బాగోలేదు. విద్యార్థుల నుంచి అనేక ఫిర్యాదులు ఉన్నందున మార్వెల్ సంస్థ కాంట్రాక్టును వెంటనే రద్దుచేసి పీనల్ యాక్షన్ తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. కానీ దీనిని ఏమాత్రం పట్టించుకోకుండా వీసీ రాజ్‌కుమార్ మళ్లీ తన హయాంలోని నూజివీడు ట్రిపుల్‌ఐటీలో మూడువేల మందికి సంబంధించిన భోజనం కాంట్రాక్టును నెలరోజుల క్రితం అప్పగించడం గమనార్హం. -
రైల్వే స్టేషన్లలో కొత్త ‘ఫుడ్’
సాక్షి, ముంబై: సబర్బన్ రైల్వే స్టేషన్లలో ఉన్న ఫుడ్ స్టాళ్లను కూల్చేయాలని పశ్చిమ రైల్వే యోచిస్తోంది. వీటిస్థానంలో కొత్త హంగులతో నూతన స్టాళ్లను ఏర్పాటుచేయాలని పథకం రూపొందిస్తోంది. అయితే ప్రస్తుతం ఫుడ్ స్టాళ్ల వల్ల రద్దీ సమయంలో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ మేరకు పశ్చిమ రైల్వేకు చాలాకాలంగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో తన పరిధిలోని స్టేషన్లలో ఉన్న ఫుడ్‌స్టాళ్లను తొలగించాలని పరిపాలనా విభాగం నిర్ణయించింది. అయితే వాటిబదులు గుర్తించిన ప్రాంతాల్లో కొత్త స్టాళ్లను నిర్మించాలని యోచిస్తోంది. పాతస్టాళ్లను తొలగించడం ద్వారా ప్లాట్‌ఫాంలు మరింత విశాలంగా మారి ప్రయాణికులు ప్రశాంతంగా నడిచి వెళ్లేందుకు వీలుపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఫుడ్ స్టాళ్లను కాంట్రాక్ట్ పద్ధతిలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారు. కాగా, మొదటి విడతగా 30 రైల్వేస్టేషన్లలోని పాత స్టాళ్లను తొలగించనున్నారు. దీనికోసం ఆయా స్టేషన్లలో ఉన్న పురాతన స్టాళ్ల వివరాలను సేకరిస్తున్నారు. వీటిలో చాలా స్టాళ్లు ఏర్పాటుచేసిన గదులు 40 యేళ్ల కిందటే నిర్మించినవని గుర్తించామని ఒక అధికారి తెలిపారు. వీటిని తొలగించి కొత్త భవనాలను నిర్మించేందుకు త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఆయన చెప్పారు. మున్ముందు స్టేషన్లలో ఆహార పదార్థాల నాణ్యతను కూడా పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్య స్టేషన్లలో ఫుట్ఓవర్ బ్రిడ్జికి 20 మీటర్ల దగ్గర్లో గాని, లేదా వాటి కిందగాని కొత్త స్టాళ్లను ఏర్పాటుచేయడానికి యోచిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు. కాగా, ప్రస్తుతం స్టేషన్లలో సమోసాలు, భేల్, వడాపావ్ వంటి తినుబండారాలను విక్రయిస్తున్నారు. అలాగే బిస్కెట్లు, కూల్‌డ్రింక్‌లను ఎమ్మార్పీ రేట్లతో విక్రయిస్తున్నారన్నారు. అలాగే స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆర్వో ప్యూరిఫైర్లను కూడా స్టాళ్లలో ఏర్పాటుచేశారు. ఇవి కాకుండా ప్రయాణికులకు టైంపాస్ కోసం పుస్తకాలు, పేపర్లు అందుబాటులో ఉంటున్నాయని వివరించారు. -
వ్యోమగాముల ‘గ్యాస్’.. రాకెట్లకు ఇంధనం!
సేంద్రియ పదార్థాలను మురగబెట్టి బయో-గ్యాస్‌ను తయారు చేయడం, ఆహార వ్యర్థాలు, మనుషుల మల వ్యర్థాలతో సైతం మీథేన్‌ను ఉత్పత్తి చేయడమూ మనకు తెలిసిందే. అయితే, అంతరిక్షంలోనూ బయో-గ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఇద్దరు భారత సంతతి పరిశోధకులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఎల్లప్పుడూ ఆరుగురు వ్యోమగాములు ఉండి ప్రయోగాలు నిర్వహిస్తుంటారు. ఐఎస్ఎస్ నుంచి ఆహార వ్యర్థాలతో పాటు వ్యోమగాముల మలాన్ని బయటికి డంపింగ్ చేసేందుకు వీలు కాదు కాబట్టి.. ప్రత్యేక కంటైనర్లలో భద్రపరుస్తున్నారు. అయితే, ఆ వ్యర్థాలను భూమికి తీసుకురావడం కష్టం. అందువల్ల వాటితో అక్కడే మీథేన్‌ను ఉత్పత్తి చేసి ఇంధనంగా వాడుకునేందుకు తగిన పద్ధతులు సూచించాలంటూ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాతో నాసా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పరిశోధనలు మొదలుపెట్టిన వర్సిటీ బయాలజికల్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రతాప్ పుల్లమ్మనప్పల్లిల్, యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయీ పరిశోధక విద్యార్థి అభిషేక్ ధోబ్లేలు.. ఐఎస్ఎస్లో మీథేన్ ఉత్పత్తికి ‘ఎనోరోబిక్(ఆక్సిజన్ లేని) డెజైస్టర్’ పద్ధతిని అభివృద్ధిపర్చారు. ఈ పద్ధతిలో ఐఎస్ఎస్లో రోజుకు 290 లీటర్ల మీథేన్‌ను ఉత్పత్తి చేయొచ్చట. అదనంగా ఏడాదికి 200 గ్యాలన్ల నీరూ వస్తుందని, ఆ నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్లుగా విడగొట్టి తిరిగి ఉపయోగించుకోవచ్చని వీరు వివరించారు. -
‘కొండ’పై కోల్డ్‌వార్
ఫుడ్ టెండర్ల విషయంలో కుమ్ములాట కాంట్రాక్టర్ల మధ్య నలుగుతున్న అధికారులు కోర్టులకు వెళ్లడానికీ వెనుకాడని వైనం సబ్ కలెక్టర్ దృష్టికి వివాదం సాక్షి, విజయవాడ : దుర్గగుడిపై కాంట్రాక్టర్ల మధ్య కోల్ట్‌వార్ ముదిరింది. ఇది అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. అంగ, అర్థబలం పుష్కలంగా ఉన్న కాంట్రాక్టర్లు అధికారుల్ని శాసించే స్థాయికి వెళ్లడమే కాకుండా దేవస్థానం ప్రతిష్టను రోడ్డున పడేయడానికీ వెనుకాడటం లేదు. అమ్మవారికి సేవచేస్తున్నామంటూ హడావుడి చేస్తూ లక్షల రూపాయలను వెనుకేసుకుంటున్నారు. ఒక్కొక్క కాంట్రాక్టులోనూ లక్షలు రూపాయలు మిగులుతూ ఉండటంతో వాటిలో కొంత అధికారులకు ముట్టచెప్పి వారిని తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడమో లేక ప్రజాప్రతినిధుల చేత ఫోన్లు చేయించి ఆదేశాలు ఇప్పించడమో చేస్తున్నారు. ఇవేమీ సాధ్యపడకపోతే చివరకు కోర్టులకు వెళ్లి అధికారుల్ని ఇబ్బందులకు గురిచేయడం, వారిపై కేసులు పెట్టడానికీ కాంట్రాక్టర్లు వెనుకాడం లేదు. కాంట్రాక్ట‘రింగ్’ దుర్గగుడిలో దుకాణాలు, కొబ్బరిచిప్పలు ఏరుకోవడం, తలనీలాలు సేకరణ, టోల్గేట్, క్లోక్‌రూమ్ తదితర వాటికి టెండర్లు పిలుస్తారు. దసరా ఉత్సవాల్లో క్యూలైన్ల ఏర్పాటు, ఫుడ్ ప్యాకింగ్ సప్లయి, శానిటేషన్ తదితర పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఇస్తారు. కొన్నేళ్లుగా ఈ టెండర్లు కేవలం 10 మంది కాంట్రాక్టర్ల చేతిలోనే ఉంటున్నాయి. ఈ టెండర్లు ద్వారా వచ్చే ఆదాయం లక్షలకు చేరుకుంది. దీంతో రాజకీయ నాయకులు ఈ రంగంలోకి దిగారు. పాత కాంట్రాక్టులు గ్రూపులుగా విడిపోయి ఒక్కొక్క టెండర్లో ఒక్కొక్కరు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. అదికాస్తా కోల్డ్‌వార్‌గా మారి ఒకరినొకరు నిరోధించుకునే వరకు వచ్చింది. అలాగే రింగైపోయి ఎదుటివార్ని దెబ్బతీసేందుకూ యత్నిస్తున్నారు. తమకు టెండరు దక్కకపోతే ఎదుటివారికి దక్కకూడదనే సూత్రాన్ని వీరు తూ.చ. తప్పకుండా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. గతేడాది ఫుడ్ టెండర్లు, చీరల కాంట్రాక్టు, దుకాణాలు కేటాయింపులో కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకువచ్చారు. అందరి దృష్టి ‘ఫుడ్’పైనే దసరా ఉత్సవాలు సందర్భంగా ఇతర శాఖల నుంచి వచ్చే అధికారులకు ఫుడ్ ప్యాకెట్లు అందజేయాల్సి ఉంటుంది. వీటి సంఖ్య దాదాపు ఆరువేల వరకూ ఉంటుంది. ఇందుకోసం దేవస్థానం టెండర్లు పిలించింది. దీంతో కొండపై ఉన్న కాంట్రాక్టర్లు రింగై టెండర్లు దాఖలు చేశారు. ఇంకో వర్గం ఈ టెండర్లలో తలదూర్చకుండా ఉండేందుకు అధికారులతో కుమ్మక్కై నిబంధనలు విధించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఒకసారి ఫుడ్ టెండర్లు రద్దు చేశారు. సోమవారం రెండో దఫా పిలవనున్నారు. ఇప్పటి వరకూ ఆరుగురు టెండర్లు దాఖలు చేశారు. అన్ని అర్హతలు ఉన్నా.. తమకు టెండరు ఫారాలు విక్రయించలేదని సాయితేజ ఫుడ్ అండ్ బ్రేవరీస్ అధినేత సీహెచ్. వెంకటరత్నం ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో సబ్ కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకొచ్చారు. తొలి విడత టెండర్లలో రోజుకు ఒక్కొక్కరికి రూ.150 చొప్పున చెల్లించేందుకు అధికారులు ముందుకు వచ్చారని తాను రూ.110కే భోజనం అందిస్తానని ఆయన చెబుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్సవాల ప్రారంభానికి మూడు రోజుల వ్యవధే ఉండటంతో ప్రస్తుతం ఫుడ్ టెండర్ల బాగోతం అధికారులకు తలనొప్పిగా మారింది. అయితే రాబోయే రోజుల్లో దేవస్థానమే తమ సొంత సిబ్బందితో పనులు చేయించి కాంట్రాక్టర్ల వ్యవస్థకు చెక్ పెట్టాలని, అధికారులు కూడా కాసుల వేటలో పడకుండా వారిని కట్టడి చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ఫుడ్ టెండర్లు రద్దు..? కాంట్రాక్టర్ల మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి వివాదం అధికార పార్టీ అగ్రనేతల వద్దకు చేరింది. సాయి తేజ పుడ్ అండ్ బ్రేవరీస్‌కు టెండర్ ఇవ్వకపోవడంతో అధికారుల్ని ఒక ముఖ్య ప్రజాప్రతినిధి నిలదీసినట్లు సమాచారం. దీంతో మొత్తం ఫుడ్ టెండర్లను రద్దు చేసి సిబ్బందికి ఒకొక్కరికి రోజుకు రూ.150 చొప్పున ఇవ్వాలని ఈవో త్రినాథరావు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పోలీసులకు రూ.150 చొప్పున ఇస్తే వారే టిఫిన్లు, భోజన ఏర్పాట్లు చేసుకుంటారని సీపీ ఏబీ వెంకటేశ్వరరావు ఈవో త్రినాథరావుకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
పరిణీతి ఇంట్లో ఆదిత్య ఫ్యాన్స్!
కామన్ ప్రేక్షకుడైతే సరేగానీ.. సినిమా ఫ్యామిలీస్ కూడా హీరో వెనకాల పడతాయని ఇప్పుడే తెలిసింది. తమ చిత్రం ప్రమోషన్లో భాగంగా హీరో ఆదిత్యారాయ్ కపూర్, అందాల తార పరిణీతి చోప్రా చేపట్టిన ‘ఫుడ్ యాత్ర’ అంబాలాలో ఆగింది. అక్కడ పరిణీతి ఇంట్లో బస చేసింది. ఆదిత్యకు ఘన స్వాగతం పలికిని పరిణీతి ఫ్యామిలీ మెంబర్స్... అతడిని చుట్టుముట్టేశారు. పరిణీతి ఆంటీలు, ఇతర పరివారం, ఫ్రెండ్స్ వదలకుండా, చుట్టూ తిరుగుతూ, వందల కొద్దీ ఫొటోలు దిగుతూ తెగ ముచ్చటపడ్డారు. సో... పిచ్చి ఫ్యాన్స్‌కే కాదన్నమాట. -
ఆహార యాత్రకు ఛలో ఛలో
విహార యాత్రలు తెలుసు కానీ, ఆహార యాత్ర గురించి విని ఉండరు. ఈ విచిత్రమైన యాత్రతో ఆదిత్యరాయ్ కపూర్, పరిణీతి చోప్రా బిజీ కానున్నారు. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘దావత్-ఇ-ఇష్క్’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ‘ఫుడ్’కి ప్రాధాన్యం ఉంది. అందుకని, ప్రచార కార్యక్రమాలను ఆహారం నేపథ్యంలో ప్లాన్ చేశారు చిత్రదర్శకుడు హబీబ్ ఫైసల్. దర్శకునిగా ఆయనకిది తొలి చిత్రం. సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేయడానికి గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున ప్రచార కార్యమ్రాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘ముంబయ్ టు చంఢీగడ్’ ఆహార యాత్ర ప్లాన్ చేశారు. ముంబయ్ నుంచి చంఢీగడ్ వరకు కారులో ప్రయాణిస్తారు ఆదిత్య, పరిణీతి. ఆ మార్గ మధ్యంలో కాకా హోటల్స్ మొదలుకుని స్టార్ హోటల్స్ వరకూ వెళ్లి, అక్కడ ప్రాచుర్యంలో ఉన్న వంటకాల్ని రుచి చూస్తుంది ఈ జంట. పనిలో పనిగా అక్కడివాళ్లకి ‘దావత్-ఇ-ఇష్క్’ సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెబుతారు. -
35 క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం
-
ఎన్టీఆర్ క్యాంటీన్లో నిత్యం లక్ష మందికి భోజనం
ఏపీలోని 4 జిల్లాల్లో త్వరలోనే ప్రారంభిస్తామన్న మంత్రివర్గ ఉపసంఘం ఏటా రూ.160 కోట్ల వ్యయ భారం పడుతున్నప్పటికీ భరిస్తామని వెల్లడి 35 క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి చపాతీ సాక్షి, హైదరాబాద్: తమిళనాడులోని ‘అమ్మ క్యాంటీన్’ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎన్టీఆర్ క్యాంటీన్’లకు ప్రభుత్వం రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. వీటికి సంబంధించి విస్తృత పరిశీలన అనంతరం.. క్యాంటీన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. పేదలకు అతి తక్కువ ధరలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి చపాతీ అందించేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ‘ఎన్టీఆర్ క్యాంటీన్’లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు పి. నారాయణ, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం సచివాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయా వివరాలను మీడియాకు వెల్లడించారు. క్యాంటీన్ల నిర్వహణకు ఏటా 160 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతుందని అంచనా వేసినట్టు చెప్పారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ క్యాంటీన్ల ద్వారా నిత్యం లక్ష మంది పేదలకు అతి తక్కువ ధరలకే అల్పాహారం, భోజనాలను అందించనున్నట్టు తెలిపారు. ప్రయోగాత్మకంగా తొలుత 4 జిల్లాల్లో 35 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంలో 15, గుంటూరులో 10, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 5 చొప్పున వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. క్యాంటీన్లలో ఉదయం ఇడ్లీ, పొంగల్, ఉప్మా మధ్యాహ్నం పులిహోర, సాంబారు, పెరుగన్నం, రాత్రికి చపాతీలు, వె జ్ కర్రీ ఉంటాయని తెలిపారు. వీటి నిర్వహణను స్వయం సహాయక బృందాలు, ఇస్కాన్, నంది, ఎన్జీఓలకు అప్పగించాలన్న విషయంపై ఆలోచిస్తున్నామని, సోమవారం జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. -
‘గ్రాండ్ ట్రంక్ రోడ్’
ఇదో మెనూ..! అలాగని రోడ్లకు సంబంధించిందో... వాటి వెరైటీల లిస్టో కాదు. పసందైన వంటకాల విందు ఇది. కాబూల్ నుంచి చిట్టగాంగ్ వరకు ఉన్న జీటీ రోడ్డు వెంట ధాబాల్లో వడ్డించే ఫుడ్ వెరైటీస్‌తో బంజారాహిల్స్ బార్బిక్యూ నేషన్ వేడివేడిగా అందిస్తోంది. అందుకు తగ్గట్టుగా... కస్టవుర్లకు రోడ్ సైడ్ కూర్చుని తిన్న ఫీలింగ్ కల్పిస్తోంది. పంజాబీ, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్, బెంగాలీ రెసిపీలతో బుధవారం ‘గ్రాండ్ ట్రంక్ రోడ్’ సెలబ్రేషన్స్ ప్రారంభించింది. జింగా పాస్తా, వులాయ్ కర్రీ, అఫ్ఘనీ పులావ్ తదితర 40 రుచులను అందిస్తోంది. జూబ్లీహిల్స్‌లోని బార్బిక్యూ రెస్టారెంట్లో కూడా ఈ నెల 17 వరకు ఈ ‘టేస్ట్’ చూడవచ్చు. - సాక్షి, సిటీ ప్లస్ -
ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 105 లక్షల టన్నులు
2014-15 వ్యవసాయ ప్రణాళిక సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లు కలుపుకొని మొత్తం 105.04 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పండించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. 2014-15 వ్యవసాయ ప్రణాళికలో ఈ లక్ష్యాన్ని పొందుపరిచింది. ఖరీఫ్‌లో 66.37 లక్షల టన్నులు, రబీలో 38.55 లక్షల టన్నులు ఆహారధాన్యాలు పండించాలని పేర్కొంది. రెండు సీజన్లలోనూ 64.75 లక్షల టన్నుల బియ్యం, 32.38 లక్షల టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి సాధించాలని నిర్ణయించారు. మొత్తంగా గతేడాది కంటే ఆహారధాన్యాల ఉత్పత్తి 10 లక్షల టన్నులు అధికంగా ఉంది. ఎస్ఎల్బీసీ ఇంకా నిర్ణయించనప్పటికీ విభజనకు ముందు తెలంగాణకు నాబార్డు ప్రతిపాదించిన మేరకు రూ. 23,397.63 కోట్ల పంట రుణాలు, రూ. 4,565.58 కోట్ల టర్మ్ రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే లక్షలోపు వడ్డీ రుణాలు రూ. 200 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా విడుదల చేశారు. తెలంగాణలో సాగయిన భూమి 14 లక్షల హెక్టార్లే... ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఈ సీజన్లో మొత్తం 40.37 లక్షల హెక్టార్లలో భూమి సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 14 లక్షల హెక్టార్లు మాత్రమే సాగయినట్లు వెల్లడైంది. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా వ్యవసాయధికారులు ఈ మేరకు తెలిపారు. ఏపీలో ఇప్పటికి సాగయ్యింది పదిశాతమే! రుతుపవనాల జాప్యంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సాగుబడి మందకొడిగా సాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ భూమిలో ఇప్పటికి పది శాతం విస్తీర్ణంలోనే సాగు మొదలైంది. కర్నూలు మినహా మరెక్కడా పొలాలు పదును కాలేదు. -
శ్రీసూర్యనారాయణా...
‘దేవుడున్నాడా, లేడా?’ అని అనుమానం వస్తే, తొలిసంజెలో తూర్పుదిక్కు చూడండి. ప్రతిరోజూ ఈ విశ్వాన్ని నియంత్రిస్తూ, రక్షిస్తూ, క్రమం తప్పక ‘ఉదయించే’, ఊహకు కూడా అందనంత అమేయశక్తి శాలి అయిన ఒక అరుణగోళం ఆ సందేహానికి సమాధానం ఇస్తుంది. ఈ చరాచర ప్రాణికోటికీ సాక్షాత్తూ ప్రాణదాత అయిన భువనేశ్వరుడు భాస్కర రూపంలో ఆ అనుమానాన్ని నివృత్తి చేస్తాడు. సూర్యుడు లేకపోతే ప్రకాశం లేదు. అది లేకపోతే నీరు కానీ, ఆహార చక్రం గానీ సాధ్యం కావు. అవి లేకపోతే జీవనం లేదు. కనుకనే సూర్యుడు చరాచర ప్రాణికోటికి ప్రాణదాత. సృష్టి స్థితిలయాలకు మూలం. ప్రాణికోటిని సృష్టించి, పోషించి, పెంచి, నియంత్రించి, రక్షించే అమే యమైన అచింత్యమైన, అనూహ్యమైన, సర్వసమర్థతగల శక్తినే గదా దేవు డంటాం. అందుకే సూర్యుడు, నిజానికి సూర్య భగవానుడు! ఆదిత్య హృదయం సూర్యుడిని, ఏషః- బ్రహ్మ చ, విష్ణుశ్చ, శివః, స్కందః ప్రజాపతిః మహేంద్రః-, ధనదః-, కాలః -, యమః-, సోమః- (హి) అపాంపతిః॥ (ఈయనే బ్రహ్మ, విష్ణువు, శివుడు, కార్తికేయుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, కాలదేవత, దక్షిణ దిక్పాలకుడయిన యమధర్మరాజు, చంద్రుడు, జలాధిపతి అయిన వరుణ దేవుడు) అని కొనియాడటం చాలా వరకు స్వభావోక్తి. మయూరుడనే మహాకవి ఉన్నాడు. ఈయన హర్షవర్ధన చక్రవర్తి ఆస్థానంలో ఉండేవాడు. అంటే క్రీ.శ. ఏడవ శతాబ్దంలో. ఈయనకు ఏ కార ణం చేతో కుష్ఠువ్యాధి సంక్రమించిందట. సూర్యుడు ఆరోగ్య ప్రదాత కదా, రోగవిముక్తికి సూర్యుడిని ఆరాధించాలని జనశ్రుతి. ఆరోగ్యం భాస్కరాత్ - ఇచ్ఛేత్, శ్రీయం-ఇచ్ఛేత-హుతాశనాత్ జ్ఞానం మహేశ్వరాత్ ఇచ్ఛేత్, మోక్షం - ఇచ్ఛేత్ - జనార్దనాత్॥ (ఆరోగ్యం సూర్యుడి నుంచి, సంపద అగ్నిదేవుడి నుంచి, జ్ఞానం శివుడి నుంచీ, మోక్షం జనార్దనుడి నుంచి కోరాలి). అందువల్ల మయూరుడు సూర్యుడిని నూరు ప్రౌఢమైన శ్లోకాల సూర్య శతకంతో స్తుతించాడు. ఆరోగ్యమూ, దాంతోపాటు సంస్కృత సాహిత్యంలో చిరస్థాయి అయిన కీర్తీ కూడా సంపాదించుకున్నాడు. సూర్యదేవుడి ఆరాధకులకు పరమ పవిత్రమైన రథసప్తమి సందర్భంగా మయూరుడి సూర్యశతకంలో ఒక్క శ్లోకం అన్నా గుర్తు చేసుకోవటం సంద ర్భోచితంగా ఉంటుంది. దాదాపు నలభై శ్లోకాలలో సూర్యకాంతినీ, ముప్ఫయి శ్లోకాలలో సూర్యుడి రథాన్నీ, పాతిక శ్లోకాలలో సూర్యుడి మహత్మ్యాన్నీ వర్ణించిన మయూరుడు, శతకానికి ముక్తాయింపుగా మనోహరమైన ఈ నూరో శ్లోకం అందించాడు. ‘దేవః కిం? బాంధవః స్యాత్? ప్రియ సుహృస్పిత్, అథ వా- (ఆ) ,ఆనకచః ఝ - ఆహోస్పిత్, - అర్యః? రక్షా? చక్షుః ను? దీపంః ? గురుః? - ఉత జనకః? జీవితం? బీజం? - ఓజంః?’ ఏవం నిర్ణీయతే యః కః యివ న; జగతాం సర్వధా, సర్వదా - అ సౌ సర్వాకారోపకారీ; దిశతు దశ శత- (అ) భీషుః అభ్యర్థితం వః! ప్రౌఢంగా ఉన్నా, శ్రద్ధగా చదువుకొంటే అర్థమయ్యే శ్లోకమే. ‘ఈయన దేవుడా? లోకబాంధవుడా? ప్రియమిత్రుడా? లేక ఆచా ర్యుడా? అదీ కాకుంటే (ఆహోస్విత్), ప్రభువా? రక్షకుడా? నేత్రమా? శక్తా?’ - యిలా ఫలానా అని ఎవరు నిర్ణయించబడజాలడో, ఆ సూర్యుడు లోకాలకు అన్నివిధాలా, అన్నివేళలా, అన్ని దేవతల రూపాలలోనూ ఉపకారాలు చేస్తాడు. ఆ సహస్ర కిరణుడు మీరు అభ్యర్థించినవన్నీ ఇచ్చుగాక!’ తథాస్తు! - ఎం. మారుతిశాస్త్రి (నేడు రథసప్తమి, సూర్యజయంతి) -
వేస్ట్‌లో ఫస్ట్..!
* బెంగళూరు నగరంలో 35 శాతం వృథా అవుతున్న ఆహార పదార్థాలు * ‘ఎమర్సన్’ సర్వేలో వెల్లడి * కోల్డ్ స్టోరేజ్‌ల కొరతే ప్రధాన కారణమంటూ నివేదిక సాక్షి, బెంగళూరు : ఉద్యాన నగరిగా ప్రఖ్యాతిగాంచిన బెంగళూరు నగరం ఫుడ్ వేస్టేజ్‌లో కూడా ఖ్యాతినార్జించింది. ఒకపూట పచ్చడి మెతుకులు దొరకక ఎంతో మంది అల్లాడుతుంటే న గరంలోని మార్కెట్లకు చేరుతున్న కూరగాయలు, పండ్లు కలిపి 35 శాతం చెత్తకుండీ పాలవుతున్నాయి. నగరానికి చెందిన ఎమర్సన్ స్వచ్ఛంద సంస్థ ‘ఫుడ్ వేస్టేజ్ అండ్ కోల్డ్ స్టోరేజ్’ అనే అంశంపై నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెలుగుచూశాయి. ఈ సర్వే నివేదిక ప్రకారం న గరంలోని వివిధ మార్కెట్లకు చేరుతున్న కూరగాయల్లో 20 శాతం, పండ్లలో 15 శాతం ప్రతి రోజూ చెత్తకుండీలోకి చేరిపోతున్నాయి. కూరగాయలు, పండ్లు ఇలా వృథా అవడానికి కోల్డ్ స్టోరేజ్‌ల కొరత కూడా ప్రధాన కారణమని ఎమర్సన్ తన నివేదికలో వెల్లడించింది. ఇక నగరంలోని ప్రధాన మార్కెట్లలో ఒకటైన శివాజీన గర రసల్ మార్కెట్‌కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఒక్కో నెలకు 400 టన్నుల పండ్లు, 3,600 టన్నుల ఆకుకూరలు, కూరగాయలు వస్తుంటాయని మార్కెట్ ప్రతినిధి ఇద్రీస్ వెల్లడించారు. అయితే ఇందులో దాదాపు 50 టన్నుల పండ్లు, 800 టన్నుల ఆకుకూరలు, కూరగాయలు ప్రతి నెలా వృథా అవుతుంటాయని చెప్పారు. ఇందులో ముఖ్యంగా ఆకుకూరలు, తొందరగా పాడయ్యే అరటి, కమలా, సపోటా పండ్లు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. వేధిస్తున్న కోల్డ్ స్టోరేజ్‌ల కొరత... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్ యార్డ్‌లతో పాటు నగరంలోని మార్కెట్లలో సరైన కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు లేకపోవడంతోనే పండ్లు, కూరగాయలను నిల్వ చేసే అవకాశం లేకుండా పోతోందని ఎమర్సన్ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 4.07 లక్షల టన్నుల కెపాసిటీ ఉన్న కోల్డ్ స్టోరేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వివిధ పంటలు, కూరగాయలు, పండ్ల నిల్వకుగాను దాదాపు 24.04 లక్షల టన్నుల కెపాసిటీ ఉన్న కోల్డ్‌స్టోరేజ్‌ల ఆవ శ్యకత ఉంది. అంటే రాష్ట్రంలో ప్రస్తుతం 19.97 లక్షల టన్నుల కెపాసిటీ కోల్డ్‌స్టోరేజ్‌ల కొరత ఉంది. ఈ కారణంగా రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లోని రైతులు కూరగాయలు, పండ్లు ఉత్పత్తి అయిన తరువాత నగరంలోని మార్కెట్లకు చేరవేయడంలోనే ఎక్కువ శాతం చెడిపోతున్నాయి. ఇక నగరానికి చేరిన ఒకటి రెండు రోజుల్లోనే అవి పూర్తిగా చెడిపోయి చెత్తకుప్పల్లోకి చేరిపోతున్నాయని ఎమర్సన్ తన నివేదికలో పేర్కొంది. వివాహ సమయాల్లో మరింత వృథా... ఆహార పదార్థాల వృథా అనేది కేవలం మార్కెట్లలోనే కాకుండా వివాహ సమయాల్లో కూడా ఎక్కువగా ఉంటోందని ఎమర్సన్ సర్వేలో వెల్లడైంది. నగరంలో దాదాపు 531 కల్యాణమండపాలున్నాయి. వీటిల్లో ఏడాదికి దాదాపు 84,960 వివాహాలు జరుగుతున్నాయి. ఈ వివాహాలన్నింటిలో కలిపి ఏడాదికి 943 టన్నుల ఆహార పదార్థాలు వృథా అవుతున్నాయి. ఇదే ఆహారం కనుక సద్వినియోగం అయితే కొన్ని లక్షల మంది అన్నార్తుల ఆకలి తీరుతుంది. వివాహ సమయాల్లో ఆహార పదార్థాల వృథా ఎక్కువగా ఉండడానికి ప్రధాన కారణం ప్రస్తుతం నగరంలో జరుగుతున్న అన్ని వివాహ వేడుకల్లోనూ బఫే విధానాన్ని అనుసరించడమేన ంటున్నారు నిపుణులు. ఈ బఫేలో పాల్గొన్న చా లా మంది తాము తినే పదార్థాలకన్నా ఎక్కువ పదార్థాలను తీసుకొని చివరికి వాటిని వృథా చేస్తున్నారు. అందుకే తమకెంత మేర అవసరమో అంతే ఆహార పదార్థాలను ప్లేట్లోకి తీసుకోవాలని, ఆహారపదార్థాల వృథాపై ప్రతి ఒక్కరూ జాగృతితో వ్యవహరించినపుడు మాత్రమే ఆహార వృథాను అడ్డుకోవడానికి వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. -
హైస్పీడ్ రైళ్లలో ఆహారం ప్రియం
సాక్షి, హైదరాబాద్: హైస్పీడ్ రైళ్లుగా పేరుగాంచిన శతాబ్ది, దురంతో, రాజధాని రైళ్లలో భోజనం ధర మరింత ఖరీదు కానుంది. తరగతుల వారీగా భోజనం ధరలను రైల్వే బోర్డు తాజాగా సవరించింది. గురువారం నుంచే కొత్త ధరలు అమల్లోకి రానున్నట్టు రైల్వేవర్గాలు తెలిపాయి. మొదటి తరగతి ఏసీ, ఎగ్జిక్యూటివ్ కోచ్‌లో బ్రేక్‌ఫాస్ట్ ధర 35 శాతం, లంచ్, డిన్నర్ రేట్లు 15 శాతం పెరగనున్నాయి. రెండవ తరగతి ఏసీ, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్లో బ్రేక్‌ఫాస్ట్ 60 శాతం, లంచ్, డిన్నర్ 50 శాతం మేర పెరగనున్నాయి. పెరిగిన భోజనం ధరలు పాత ధరలతో పోల్చితే ఒక్కొక్క దానికి రూ.25 నుంచి రూ. 27 వరకు ఉంటుందని అంచనా. అయితే, టీ ధరలను మాత్రం తగ్గించారు. రెండవ తరగతి ఏసీ, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్లలో ఉదయం టీ ధర 40 శాతం, సాయంత్రం టీ ధర 10 శాతం మేర తగ్గించారు. రైల్వే బోర్డు అఖరిగా 1999లో భోజనం ధరలను పెంచింది. -
ఆహార అభద్రత
ఖలీల్‌వాడి, న్యూస్‌లైన్ : ఆహార పదార్థాల కల్తీని నిరోధించడంలో ఆహా ర భద్రత శాఖ అధికారులు విఫలమవుతున్నారు. జిల్లాలో ఈ శాఖ ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియదు. గతంలో ఈ శాఖను ఆహార కల్తీ నిరోధక శాఖ అని పిలిచేవారు. 2011 ఆగస్టు 8వ తేదీన ఆహార భద్రత శాఖగా పేరు మార్చారు. అయితే ఈ విషయం శాఖ అధికారులకు తెలియదో, లేదా పట్టించుకోలేదో.. బోర్డు మాత్రం మార్చలేదు. ఇటీవల ఈ విషయమై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు బోర్డుపై పేరు మార్పించారు. సీమాంధ్ర నుంచి అప్ అండ్ డౌన్.. ఆహార భద్రత శాఖ అధికారులు ఎప్పుడు వస్తారో ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. మూడు నెలల క్రితం జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి గంగాధర్ వైఎస్సార్ కడప జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానం రెండు నెల ల పాటు ఖాళీగా ఉంది. ఇన్చార్జి బాధ్యతలు సైతం ఎవరికీ అప్పగించ లేదు. నెలక్రితం ఆహార కల్తీ నిరోధక శాఖ జిల్లా అధికారిగా అమృతశ్రీ వచ్చారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రసాద్, ప్రహ్లాద్‌లు స్థానికంగా ఉండరు. ప్రసాద్ అనే అధికారి విజయవాడనుంచి వచ్చి వెళుతుంటారు. ప్రహ్లాద్ అనే అధికారి కర్నూలునుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. దీంతో వీరు ఎ ప్పుడు వస్తున్నారో ఎంతసేపు ఉంటున్నారో తెలియని పరిస్థితి. గతంలో జిల్లా ఉన్నతాధికారి లేనందున తనిఖీలు చేయడం లేదని తప్పించుకున్నారు. జిల్లా అధికారి వచ్చిన తర్వాత కూడా వీరు ఎలాంటి తనిఖీలు నిర్వహించలేదు. ఏప్రిల్‌నుంచి ఇప్పటివరకు 48 కేసులే నమోదు కావడం గమనార్హం. అందులో జూలై 15 నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కాగా వంద కేసులు నమోదు చేశామని శాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఫిర్యాదు వస్తే స్పందిస్తాం -అమృతశ్రీ, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి గతంలో జిల్లాలో ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి లేకపోవడంతో తనిఖీలు నిర్వహించలేదు. ఫిర్యాదులు వస్తే స్పందిస్తాం. తనిఖీలు నిర్వహించి, కేసులు నమోదు చేస్తాం. మొద్దు నిద్ర జిల్లాలో కల్తీ వ్యా పారం జోరుగా సాగుతోంది. హోటళ్లలో నాసిరకం పదార్థాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. పప్పులు, ఉప్పులు, నూ నెలు ఎందులో చూసినా కల్తీ సరుకులను విచ్చల విడిగా అమ్ముతున్నారు. ఫలితంగా వినియోగదారులు వ్యాపారుల చేతిలో మోసపోవడమే కా కుండా, రోగాల పాలవుతున్నారు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాల్సిన ఆహార భద్రత శాఖ మొద్దు నిద్రపోతోంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి కల్తీ ని నిరోధించాల్సిన అధికారులు ‘మామూలు’గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో నకిలీ సరుకుల వ్యాపారం జోరుగా సాగుతోంది.