లండన్ : బరువు తగ్గి నాజూగ్గా కనిపించాలంటే భిన్న రకాలైన ఆహార పదార్ధాలను తీసుకోవాలని చెబుతుంటారు. అయితే పలు రకాల ఐటెమ్స్‌ను ముందుంచుకుని భోజనానికి సిద్ధమైతే ఎక్కువగా లాగించేసి బరువు పెరిగే ప్రమాదం తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పలు ఆహార పదార్ధాలను ఒకే మీల్‌లో తీసుకోవడం ద్వారా ఎక్కువ కేలరీలు శరీరంలోకి చేరతాయని హోస్టన్‌కు చెందిన టెక్సాస్ హెల్త్ సైన్స్ సెంటర్ నివేదిక వెల్లడించింది.
ఎక్కువ వెరైటీలను కోరుకుంటే డోనట్స్, కుకీస్, సోడాలు వంటి అనారోగ్యకర ఆహారాన్ని తీసుకుంటామని ఇది ఆరోగ్యానికి ఇబ్బందికరమని నివేదిక స్పష్టం చేసింది. విభిన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉందనేందుకు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పరిశోధకులు పేర్కొన్నారు.
ఒకే మీల్‌లో పలు రకాల ఆహార పదార్థాలను ఆరగిస్తే త్వరగా కడుపునిండిన భావన కలగదని, ఫలితంగా అధిక కేలరీలను తీసుకుంటామని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ సర్కులేషన్‌లో ప్రచురితమైన అథ్యయనం పేర్కొంది. భిన్న రుచులను ఆస్వాదించే వారిలో ఒబెసిటీ రిస్క్ పొంచిఉందని కూడా అథ్యయనం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment