
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కులం పేరుతో దూషించిన కంచ ఐలయ్య ఒక మూర్ఖుడు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌రావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అమిత్ షాను కించపరిచేలా కంచ ఐలయ్య చేసిన వ్యాఖ్యలపై కోర్టులో కేసు వేస్తామన్నారు.
సీఎం కేసీఆర్‌కు ఆర్యవైశ్యులంటే చులకన భావముందని, అందుకే ఆర్యవైశ్యులను అవమానించినా పట్టించుకోవడంలేదని కృష్ణసాగర్‌రావు విమర్శించారు. ఐలయ్యపై ప్రభుత్వమే క్రిమినల్ కేసును ఎందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీలకు సిద్ధాంతాల్లేవని.. ఉనికిని కాపాడుకోవడానికే హింసకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment