
నేడు ఢిల్లీకి సోనియా రాక
న్యూఢిల్లీ: వైద్య పరీక్షలకుఈ నెల 2న అమెరికా వెళ్లిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బుధవారం ఢిల్లీ చేరుకోనున్నారు. సోనియాకు 2011, ఆగస్టు 5న అమెరికాలో శస్త్ర చికిత్స జరగడం తెలిసిందే. అయితే, గత నెల ఆగస్టులో ఆహార బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగిన సందర్భంలో తీవ్ర అలసట, ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురైన సోనియాను ఎయిమ్స్‌కు తరలించారు. తర్వాత, సెప్టెంబర్ 2న ఆమె వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు.