ఆ హీరోయిన్‌ను భరించటం వల్ల కావట్లేదు! | Actress Urvashi Rautela Behaviour on Sets | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 3 2018 8:58 PM | Last Updated on Fri, Oct 5 2018 6:36 PM

Actress Urvashi Rautela Behaviour on Sets - Sakshi

ఊర్వశి రౌతెలా (తాజా చిత్రం)

సాక్షి, సినిమా : మోడల్‌ కమ్‌ హీరోయిన్‌ ఊర్వశి రౌతెలా వ్యవహారం ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. షూటింగ్‌ సమయంలో ఆమె నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందట. ఆమె మెయింటెనెన్స్‌ బిల్లు తడిసి మోపెడవుతుండటంతో భరించటం మా వల్ల కాదు బాబోయ్‌ అని గగ్గోలు పెడుతున్నారు.

స్పోర్ట్‌బాయే కథనం ప్రకారం... ‘సనమ్‌ రే’ ఫేమ్‌ ఊర్వశి ప్రస్తుతం భానుప్రియా అనే ఓ చిత్రంలో నటిస్తోంది. షూటింగ్‌ ప్రారంభమై కొద్ది రోజులే అవుతోంది. అయినప్పటికీ అప్పుడే ఆమె వ్యవహారంతో యూనిట్‌ సభ్యులు విసిగిపోతున్నారంట. షూటింగ్‌ కోసం ఇంటి నుంచి బయలుదేరిన సమయంలోనే ఆమె అసిస్టెంట్లు ఫోన్‌ ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల నుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారంట. అది అంతా ఇంతా కాదు. దాదాపు యూనిట్‌ సభ్యులకు సరిపడేంత. 

అందులో ఆమె, సహయక సిబ్బంది కాస్త మాత్రమే తిని.. మిగతాది ఆమె ఇంటికి పంపిచేస్తున్నారంట. ఊర్వశి వ్యవహారం రోజు రోజుకీ శృతి మించిపోతోందని.. షూటింగ్‌ మీరా రోడ్‌లో జరిగితే.. ఎక్కడో జూహులో ఉన్న కాస్ట్‌ లీ రెస్టారెంట్‌ నుంచి భోజనం ఆర్డర్‌ చేస్తోందని.. ఈ వ్యవహారంలో ప్రొడక్షన్‌ మేనేజర్‌తో ఆమె గొడవ పడినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆమెపై ఇలాంటి విమర్శలే వచ్చాయి. మరీ ఆరోపణలపై హేట్‌ స్టోరీ-4 బ్యూటీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement