
జడ్జిలను ఫూల్స్ అన్నందుకు.. 4 వారాల జైలు
న్యూఢిల్లీ: కేరళకు చెందిన సీపీఎం నాయకుడు జడ్జిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుపాలయ్యాడు. మాజీ ఎమ్మెల్యే అయిన ఎంవీ జయరాజన్ హైకోర్టు జడ్జిలీను ఫూల్స్ అంటూ నిందించాడు. రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశ్యంతో కేరళ హైకోర్టు.. రోడ్లు, రోడ్డ పక్కన బహిరంగ సభలను నిషేధించింది. జయరాజన్ ఈ తీర్పుపై మండిపడుతూ తీర్పు చెప్పిన జడ్జిలను పరుష పదజాలంతో (ఫూల్/ఇడియట్) దూషించారు. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు జయరాజన్కు నాలుగు వారాల జైలు శిక్ష విధించింది. జస్టిస్ విక్రమ్ జీత్ సేన్, జస్టిస్ నాగప్పన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. తీర్పులపై విమర్శలు చేస్తే సమస్య లేదని, అయితే న్యాయాధికారులపై అనాగరిక, పరుష పదజాలం వాడితే సహించేదిలేదని హెచ్చరించింది.