ఢాకా : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న 50 మంది బంగ్లాదేశ్ న్యాయమూర్తులు, న్యాయాధికారులకు జరగాల్సిన శిక్షణా కార్యక్రమాన్ని రద్దు చేశారు.
ఈ ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ కేంద్రంగా నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో బంగ్లాదేశ్‌కు చెందిన న్యాయమూర్తులకు,న్యాయాధికారులకు శిక్షణ కార్యక్రమం జరగనుంది. అయితే, ఈ తరుణంలో ఈ ట్రైనింగ్‌ను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
దూరం పెరిగిందా?
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ 16 ఏళ్ల పాలనకు అక్కడి విద్యార్థులు ముగింపు పలికారు. హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న భారత్‌కు వచ్చారు. నాటి నుంచి భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య సంబధాలు క్షీణించాయి.
ఆగస్టు 8న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హిందవులపై,ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరిగాయి. ఆ తర్వాత దేశద్రోహం కేసులో అరెస్టయిన హిందూ గురువు, ఇస్కాన్ మాజీ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు మార్లు బెయిల్ కోసం అప్లయి చేసినా ఆయనకు ఊరట దక్కలేదు. ఇలా నాటి నుంచి భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య దూరం పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment