Judicial
-
‘కారుణ్యం’ శాపం కారాదు!
వైద్య కారణాల రీత్యా ఎప్పటికీ కోలుకోలేని అచేతన స్థితికి చేరుకుని, మరణం తప్ప మరో దారిలేని రోగులకు ‘కారుణ్య మరణం’ ప్రసాదించే నిబంధనలు దేశంలోనే తొలిసారి కర్ణాటకలో అమల్లో కొచ్చాయి. వాస్తవానికి కేరళ, గోవా, మహారాష్ట్రలు ఇప్పటికే ఇందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే కర్ణాటక మరో అడుగు ముందుకేసి సవివరమైన న్యాయ నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఈ విషయంలో 2018లోనూ, 2023లోనూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. ప్రభుత్వాలు తగిన చట్టాలు చేసేవరకూ ఇవి అమల్లో వుంటాయని ప్రకటించింది. ప్రపంచంలో ఇప్పటికే చాలా దేశాలు ఇందుకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చాయి. సమస్య చాలా జటిలమైనది. మంచానికి పరిమితమైపోయిన రోగులు లోలోపల ఎంత నరకం చవి చూస్తున్నారో బయటి ప్రపంచానికి తెలియదు. నిత్యం సేవలందించే వైద్య సిబ్బందికి, నిరంతరం కనిపెట్టుకుని వుండే కుటుంబ సభ్యులకు సైతం ఆ రోగుల అంతరంగం, వారు పడుతున్న యాతనలు అర్థంకావు. వ్యాధి నయమయ్యే అవకాశం ఎంతమాత్రం లేదని, వైద్య ఉపకరణాల సాయంతో కోమాలో మంచంపై వెళ్లదీయటం తప్ప మరో మార్గం లేదని తెలిశాక వారిని ఆ స్థితి లోనే ఉంచటం సరికాదన్న వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. అందుకు విరుద్ధంగా ప్రాణం పోసే శక్తిలేని మనిషికి ప్రాణం తీసే హక్కు ఎక్కడిదన్న వాదనలూ ఉన్నాయి. ఒక మానవ మృగం సాగించిన లైంగిక హింస పర్యవసానంగా కోమాలోకి వెళ్లి ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆసుపత్రి బెడ్‌పై దాదాపు 42 ఏళ్లపాటు జీవచ్ఛవంలా బతికి 2015లో కన్నుమూసిన అరుణా రామచంద్ర శాన్‌బాగ్ కేసు ఉదంతంలో తొలిసారి ఈ కారుణ్య మరణం అంశం చర్చ కొచ్చింది. ఆమె దశాబ్దాల తరబడి జీవచ్ఛవంలా రోజులు వెళ్లదీయటం చూడలేకపోతున్నానని,ఇంకా ఎన్నాళ్లపాటు ఆమె ఇలా కొనసాగాల్సి వస్తుందో వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారని జర్న లిస్టు పింకీ విరానీ సుప్రీంకోర్టు ముందు 2009లో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె ప్రశాంత మరణా నికి అవసరమైన ఆదేశాలివ్వాలని విరానీ విన్నవించుకున్నారు. కానీ ఆమె శాన్‌బాగ్ కుటుంబ సభ్యు రాలు కాకపోవటంతో సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇలాంటి స్థితికి చేరుకున్న రోగుల కారుణ్య మరణానికి చట్టబద్ధతను కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించింది. అయితే ఆ తీర్పు అరుణకు ‘పునర్జన్మ’నిచ్చిందంటూ ఆమెకు సేవలు చేస్తున్న నర్సులంతా మిఠాయిలు పంచుకుని పండుగ చేసుకున్నారు. రిటైరవుతున్నవారి స్థానంలో వచ్చే కొత్త నర్సులు సైతం ఆమెను కంటికి రెప్పలా చూసుకునేవారు. కారుణ్య మరణంపైనే కామన్ కాజ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 2018లో తొలిసారి మార్గదర్శకాలు రూపొందించింది. ఆ మార్గదర్శకాలను మరింత సరళం చేస్తూ 2023లో మరో తీర్పునిచ్చింది. హుందాగా జీవించటం మాత్రమే కాదు... హుందాగా మరణించటం కూడా రాజ్యాంగంలోని 21వ అధికరణం పరిధిలోకి వస్తుందని చెప్పింది. అయితే కారుణ్య మరణం కేసుల్లో ఇమిడివుండే జటిల సమస్యలేమిటో, వాటిని స్వప్రయోజన పరులు ఎలా ఉపయోగించుకునే ప్రమాదమున్నదో న్యాయమూర్తులు గుర్తించే వుంటారు. అందుకే ఆ మార్గదర్శకాలు అత్యంత జాగ్రత్తగా రూపొందించారు. తిరిగి కోలుకునే అవకాశం లేదని, కేవలం వైద్య సాయంతో జీవచ్ఛవాల్లా బతుకీడ్చక తప్పదని గుర్తించిన రోగులకు ఇది వర్తిస్తుందని ధర్మా సనం తెలిపింది. అలాగే చికిత్స తీసుకునేముందే రోగి ఆ ప్రక్రియలో ఎదురుకాగల ప్రమాదాన్ని గుర్తించి, ఆ పరిస్థితి ఏర్పడిన పక్షంలో వైద్యాన్ని నిలిపేయటానికి అంగీకారం తెలిపే ముందస్తు ఆదేశం(ఏఎండీ)పై సంతకం చేసి ఇవ్వొచ్చు. దాన్ని ‘లివింగ్ విల్’గా పరిగణించాల్సి వుంటుంది. ఒకవేళ అది రోగి ఇవ్వలేని పక్షంలో వైద్యానికి ముందు ఆయన తరఫున కుటుంబంలోని పెద్ద ఎవరైనా ఏఎండీని అందజేయొచ్చు. దాని ఆధారంగా రోగికి అమర్చే ఆక్సిజన్ మాస్క్, వెంటిలేటర్, ఇతరేతర ఉపకరణాల వంటి ప్రాణావసర వ్యవస్థల్ని తొలగిస్తారు. అయితే ఈ ప్రక్రియ సవ్యంగా సాగడానికీ, ఎలాంటి లొసుగులకూ ఆస్కారం లేకుండా ఉండటానికీ ప్రతి ఆసుపత్రిలోనూ ముగ్గు రేసి సీనియర్ డాక్టర్లతో రెండు బోర్డులు ఏర్పాటుచేయాలి. ప్రాథమిక స్థాయి బోర్డు తన అభిప్రాయం చెప్పాక, సెకండరీ బోర్డు మరోసారి పరిశీలించాలి. జిల్లా వైద్యాధికారి ఈ నిర్ణయ ప్రక్రియలో పాలుపంచుకోవాలి. దీన్ని ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పరిశీలించాలి. ఆమోదించిన పక్షంలో ఆ సంగతిని హైకోర్టు రిజిస్ట్రార్‌కి తెలపాలి. ఇలాంటి అంశాల్లో కుటుంబ సభ్యుల మధ్యే ఏకాభిప్రాయం కుదరక పోవచ్చు. అందుకే విడివిడిగా అందరితో మాట్లాడటం, వారిఅంగీకారం విషయంలో ఇమిడి వున్న సమస్యలేమిటో చెప్పటం ఎంతో అవసరం.ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ ప్రక్రియ దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. డబ్బు కోసం, ఆస్తుల కోసం ఆరాటపడుతూ ఎంతకైనా తెగించే లోకంలో స్వపరభేదాలుండవు. ఇది గాక వైద్యానికి తడిసి మోపెడవుతుందన్న భయంవల్ల లేదా త్వరగా ‘వదుల్చుకోవాలన్న’ తొందర వల్ల వైద్యులను పక్కదోవ పట్టించే ప్రబుద్ధులుంటారు. కనుక ఈ సమస్య చుట్టూ అల్లుకుని వుండే చట్టపరమైన అంశాలు సరే... నైతిక, సామాజిక, ఆర్థిక అంశాలను సైతం తరచి చూడక తప్పదు. సమాజ పోకడలు ఎలా వుంటున్నాయో గమనించుకోక తప్పదు. ‘హుందాగా మరణించటం’ హక్కే కావొచ్చు... కానీ అది ‘మరణించటానికి గల హక్కు’గా పరిణమించకూడదు. ఈ ‘హక్కు’ నిస్సహాయ రోగుల పాలిట శాపంగా మారకూడదు. -
భారత్‌లో బంగ్లా న్యాయమూర్తులకు శిక్షణ.. రద్దు చేసిన మహమ్మద్ యూనస్
ఢాకా : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో భారత్‌లో జరగనున్న 50 మంది బంగ్లాదేశ్ న్యాయమూర్తులు, న్యాయాధికారులకు జరగాల్సిన శిక్షణా కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్ కేంద్రంగా నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ, స్టేట్ జ్యుడీషియల్ అకాడమీలో బంగ్లాదేశ్‌కు చెందిన న్యాయమూర్తులకు,న్యాయాధికారులకు శిక్షణ కార్యక్రమం జరగనుంది. అయితే, ఈ తరుణంలో ఈ ట్రైనింగ్‌ను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ న్యాయ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. దూరం పెరిగిందా?బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ 16 ఏళ్ల పాలనకు అక్కడి విద్యార్థులు ముగింపు పలికారు. హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న భారత్‌కు వచ్చారు. నాటి నుంచి భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య సంబధాలు క్షీణించాయి. ఆగస్టు 8న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హిందవులపై,ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరిగాయి. ఆ తర్వాత దేశద్రోహం కేసులో అరెస్టయిన హిందూ గురువు, ఇస్కాన్ మాజీ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు మార్లు బెయిల్ కోసం అప్లయి చేసినా ఆయనకు ఊరట దక్కలేదు. ఇలా నాటి నుంచి భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య దూరం పెరిగిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
దోపిడీకి అడ్డొస్తుందనే.. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు!
సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్ధతిలో 2014–19 మధ్య ఖజానాను దోచేసిన కూటమి ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు దోపిడీకి అడ్డొస్తున్న జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థను రద్దు చేసి, పాత విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఉపక్రమించారు. ప్రజా ధనం దోపిడీకి కుటంత్రం పన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) చట్టం–2019ను రద్దు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు.ఆ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత రూ.వంద కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థ ఉంటే టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే అడ్డగోలుగా అంచనాలు పెంచినా, కోరుకున్న కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలు పెట్టినా ప్రజలు ఎత్తిచూపే అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వ పెద్దల భయం. వివిధ వర్గాల ప్రజలు, మేధావులు, ఇంజినీర్ల నుంచివచ్చిన ఫిర్యాదులు, సూచనల ఆధారంగా జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి టెండర్ షెడ్యూలులో మార్పులు సూచిస్తే ఆ మేరకు మార్చి టెండర్ నోటిఫికేషన్ మళ్లీ జారీ చేయాలి. అప్పుడు కమీషన్లు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్‌కు పనులు దక్కవన్నది ప్రభుత్వ పెద్దల భయం. అందుకే తమ అడ్డగోలు దోపిడీకి అడ్డుగా ఉండే జ్యుడిషియల్ ప్రివ్యూను లేకుండా చేసేందుకు సిద్ధమయ్యారని అధికారవర్గాలు చెబుతున్నాయి. అంచనాల్లో వంచనకు, దోపిడీకి అవకాశం ఉండదనే.. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. కోట్ల రూపాయలు వెదజల్లి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చేందుకు పెట్టిన పెట్టుబడికి వంద రెట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టేందుకు టెండర్ విధానాన్ని ఓ అస్త్రంగా మల్చుకున్నారు. పనుల ప్రతిపాదన దశలోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి.. అంచనా వ్యయాన్ని పెంచేయించడం, అధికంగా కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా నిబంధనలు పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం, అధిక ధరలకు పనులను కట్టబెట్టి.. ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం.. ఆ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి మొబిలైజేషన్ అడ్వాన్సుగా అప్పగించిన మొత్తాన్నే కమీషన్‌గా జేబులో వేసుకోవడం నిత్యకృత్యంగా చంద్రబాబు మార్చుకున్నారు.ఆనాటి దోపిడీకి సాక్ష్యాలు ఇవిగో..» గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశలో 27వ ప్యాకేజీలో 2014 నాటికి రూ.11 కోట్ల విలువైన పని మాత్రమే మిగిలింది. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై 60–సి నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని రూ.112.83 కోట్లకు పెంచేసి.. దొడ్డిదారిన సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్‌కు అప్పగించారు. » హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో 2–బీ ప్యాకేజీలో 2014 నాటికి రూ.99 లక్షల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై 60–సి నిబంధన కింద వేటు వేసి, వాటి వ్యయాన్ని రూ.115.08 కోట్లకు పెంచేసి.. సీఎం రమేష్ కు అప్పగించారు. అంటే పెంచిన మొత్తం రూ.114.09 కోట్లు సీఎం రమేష్ కు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. » హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో 3–బీ ప్యాకేజీలో 2014 నాటికి కేవలం రూ.8.69 కోట్ల విలువైన పని మాత్రమే మిగింది. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పైనా 60–సి నిబంధన కింద వేటు వేసిన చంద్రబాబు.. ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.149.14 కోట్లకు పెంచేశారు. అంటే పెంచిన రూ.140.45 కోట్లు సీఎం రమే‹Ùకు చెల్లించారు. » హంద్రీ–నీవా రెండో దశలో 2014 నాటికి 4–బి ప్యాకేజీలో రూ.1.34 కోట్లు, 5–బి ప్యాకేజీలో రూ.11.87 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సి నిబంధన కింద వేటు వేసిన చంద్రబాబు.. 4–బి ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.73.26 కోట్లకు, 5–బి ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.97.40 కోట్లకు పెంచేసి, వాటిని తన సన్నిహితుడైన ఆర్. మహేశ్వరనాయుడు, ఎస్సార్ కన్స్ట్రక్షన్స్కు అప్పగించారు. ఆ మేరకు బిల్లులు చెల్లించి కమీషన్లు వసూలు చేసుకున్నారు. » వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్లో 2014 నాటికి రూ.299.48 కోట్ల విలువైన పనులే మిగిలాయి. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పైనా 60–సి నిబంధన కింద వేటు వేసినచంద్రబాబు.. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి.. అంచనా వ్యయాన్ని రూ.597.11 కోట్లకు పెంచేశారు. ఆ పనులను సీఎం రమేష్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పనులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించి.. సీఎం రమేష్ సంస్థకంటే రూ.61.76 కోట్లకు తక్కువ ధరకు మరో కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. ఆ టన్నెల్ పనిని పూర్తి చేయించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను తనిఖీ చేసిన కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) జీవో 22, జీవో 63లను వర్తింపజేయడం ద్వారా కాంట్రాక్టర్లకు రూ.630.57 కోట్లను దోచిపెట్టినట్లు తేల్చడం టీడీపీ ప్రభుత్వ అవినీతికి తార్కాణం. » వంశధార స్టేజ్–2 ఫేజ్–2, తోటపల్లి, మడ్డువలస, గుండ్లకమ్మ నుంచి హంద్రీ–నీవా, మిడ్ పెన్నార్ ఆధునికీకరణ పనుల్లోనూ చంద్రబాబుది ఇదే తీరు. » 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రకాశం బ్యారేజ్‌కు 21 కిలోమీటర్ల ఎగువన కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజి నిర్మాణానికి 2018లో తొలుత రూ.801.88 కోట్లతో చంద్రబాబు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసి అంచనా వ్యయాన్ని రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే.. అంచనాల్లోనే రూ.574.12 కోట్లు పెంచేశారు. ఈ పనులను రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగకు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ పనులను నిబంధనలకు విరుద్ధంగా 13.19 శాతం అధిక ధరకు రూ.1,554.88 కోట్లకు నవయుగకు అప్పగించారు. అంటే.. అంచనాలు పెంచడం ద్వారా, అధిక ధరకు పనులు అప్పగించడం ద్వారా నవయుగకు ప్రభుత్వ ఖజానా నుంచి ఉత్తినే రూ.753 కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను 2019లో ప్రభుత్వం రద్దు చేసింది. » మళ్లీ ఇప్పుడూ అదే రీతిలో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. అక్రమాలకు అడ్డొస్తుందనే నెపంతోనే జ్యుడిషియల్ ప్రివ్యూను రద్దు చేయాలని నిర్ణయించారు.ఆదర్శవంతమైన జ్యుడిషియల్ ప్రివ్యూ రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చిన టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చుతూ 2019 ఆగస్టు 20న ఆంధ్రప్రదేశ్ ఇన్్రఫ్టాస్టక్చర్ యాక్ట్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) – 2019 చట్టాన్ని నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తిని జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జిగా నియమించింది. ఈ చట్టం ప్రకారం.. రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను ముందుగా జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపుతారు. ఆ ముసాయిదాపై జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆన్లైన్లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకుని జడ్జి మార్పులు సూచిస్తారు. ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తే.. దానిని యధాతథంగా ఆమోదిస్తారు. ఇలా జ్యూడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన టెండర్ ముసాయిదా షెడ్యూల్‌తోనే రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. వంద కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులన్నింటినీ ఇదే విధానంలో నిర్వహించారు. ఈ విధానంలో టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించడం వల్లే కాంట్రాక్టర్లు భారీ సంఖ్యలో పోటీ పడి.. కాంట్రాక్టు విలువకంటే తక్కువకే పనులు చేయడానికి ముందుకొచ్చారు. దీని వల్ల రూ.7,500 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదా అయ్యింది. జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. ఈ విధానాన్ని అమలు చేయడాన్ని పరిశీలించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. -
నేరం అంగీకరించిన జానీ మాస్టర్
-
ధిక్కార ‘స్వర’ భాస్కరం!
స్వర భాస్కర్... బాలీవుడ్ హీరోయిన్, నటిగా కొందరికి తెలుసు. హిందుత్వ వ్యతిరేకిగా... తప్పును తప్పు అని ఎత్తిచూపగల వ్యక్తిగా మరికొందరికి పరిచయం! ముస్లిం స్నేహితుడిని పెళ్లాడి.. ఇటీవలే తల్లిఅయిన స్వర భాస్కర్ తాజాగా మళ్లీ తన ధిక్కార స్వరంతో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. న్యాయస్థానాలు, న్యాయమూర్తుల తీరును నేరుగా ప్రశ్నించారు. ఏళ్లుగా నిర్బంధంలో మగ్గుతున్న జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్, గుజరాత్ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ వంటి వారికి మద్దతుగా ఏర్పాటైన ఒక కార్యక్రమంలో స్వర భాస్కర్ మాట్లాడుతూ... ‘‘నేను ఈ రోజు న్యాయవ్యవస్థను ఒక ప్రశ్న అడగదలిచాను. దేనికి మీకు భయం? సామాన్య ప్రజలకైతే బతుకు సాగాలన్న భయం ఉంటుంది. ఎవరైనా దాడి చేసి కొడతారన్న భయం ఉంటుంది. దేశంలో ముస్లింలను ఎక్కడపడితే అక్కడ దాడి చేసి కొట్టేస్తున్నారు. పాపం ఈ దేశంలో దళితులపై కూడా విచ్చలవిడి దాడులు జరుగుతున్నాయి. మాలాంటి వాళ్లకు కూడా పని దొరకదనో.. కామెడీ షోల్లాంటివి చేయనివ్వరని, నటించిన సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకంటారనో భయాలు ఉండవచ్చు. మరి మీకే రకమైన భయాలు ఉన్నాయి? అధికారం మీ చేతుల్లో ఉంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఉంది. అరవై, డెబ్భై ఏళ్ల వయసు వాళ్లు.. హైకోర్టుల్లో, సుప్రీంకోర్టుల్లోకి చేరిపోతున్నారు. మీ పిల్లలు కూడా పెద్దవాళ్లై పోయి ఉంటారు. ఖరీదైన.. మంచి కాలేజీల్లో, విదేశాల్లో చదువుకుని ఉంటారు. పెళ్లాం పిల్లలతో వాళ్లు జీవితంలో స్థిరపడి పోయి ఉంటారు. అలాంటి మీకు ఈ వృద్ధాప్యంలో ఎందుకు భయం? ఇంకా ఎలాంటి ఆశ మిగిలిపోయింది మీలో? ఏం కావాలి మీకు? రాజ్య సభ సభ్యత్వం, గవర్నర్ పదవుల అవసరం ఏమిటి? ఇన్ని ఆశలు పెట్టుకున్న మీరు మీ పని చేయమని మాత్రమే కదా మేము అడుగుతున్నది? అది కూడా మీరు చేయలేకపోతున్నారు ఎందుకు?’’ అంటూ న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై ప్రశ్నల వర్షం కురిపించారు.Why are you so scared at this age? What is the greed you have at this age? Do you want a Governor or Rajya Sabha post at this age?- @ReallySwara#UmarKhalidpic.twitter.com/2CSyEGWUFL— Mohammed Zubair (@zoo_bear) September 18, 2024 ఉమర్, ఖాలిద్, అతర్, గుష్ఫా, షెర్జీల్ ఇమామ్ వంటి ఎందరో మూడు నాలుగైదేళ్లుగా జైళ్లలో మగ్గిపోతున్నారని గుర్తు చేసిన స్వర.. ‘‘న్యాయవ్యవస్థ వీరిని పూర్తిగా మరచిపోయినట్లు అనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. బెయిల్ లేకుండా.. విచారణ కూడా మొదలు కాకుండా ఇలాంటి వాళ్లు ఎంతకాలం నుంచి మగ్గిపోతున్నారో కూడా న్యాయవ్యవస్థ పట్టించుకోవడం లేదని అన్నారు. ‘‘అందుకే నేను ఈ వేదికపై నుంచి నాలుగేళ్ల కాలం అనేది ఎంత పెద్ద సమయమో చెప్పదలుచుకున్నాను. ఉమర్ ఖలీద్ 2020 సెప్టెంబరులో ఇరవయ్యవ తేదీ అరెస్ట్ అయ్యాడు. ఆ తరువాత మూడుసార్లు కోవిడ్ వచ్చి పోయింది. వ్యాధి కారక వైరస్ మూడు నాలుగు మార్లు రూపం మార్చుకుంది కూడా. ప్రాణాంతక మహమ్మారి జబ్బుకు చికిత్స కూడా దాదాపుగా అందుబాటులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఫహాద్ (భర్త)ను కలిశా. అప్పట్లో ఇద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉండింది. తరువాత మా దోస్తీ కాస్తా ప్రేమగా మారింది.. రెండు కుటుంబాలు కలిసి మాట్లాడుకున్నాయి. పెళ్లికి నిర్ణయించాం. అదీ పూర్తయ్యింది. కానీ... అప్పుడూ.. ఇప్పుడూ వాళ్లు (ఉమర్ తదితరులు) జైళ్లల్లోనే ఉండిపోయారు. బెయిల్ రాలేదు.. విచారణ మొదలు కాలేదు.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. సీబీఐ కస్టడీ నేటితో ముగియటంతో తీహార్ జైలు అధికారులు ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు కేజ్రీవాల్ సీబీఐ జ్యుడీషియల్ కస్టడీని మరోసారి ఆగస్ట్ 20వరకు పొడిగించింది. ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. లిక్కర్ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సరైన కారణాలు లేకుండా అరెస్ట్ చేసిందని చెప్పలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.చదవండి: కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్ట్ చేస్తారా?.. ఈడీని ప్రశ్నించిన కోర్టు -
నేను అధ్యక్షుడినే కాదు.. తండ్రిని కూడా: జో బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్(54)ను గన్ కోనుగోలు కేసులో మొత్తం మూడు ఆరోపణల్లోనూ కోర్టు దోషిగా తేల్చింది. 2018లో గన్ కొనుగోలు చేసిన సమయంలో డ్రగ్స్‌కు బానిసకాదంటూ ఆయుధ డీలర్‌కు అబద్దం చెప్పారని, ఆ గన్ను 11 రోజుల పాటు అక్రమంగా తన వద్దే ఉంచుకున్నాడని న్యాయమూర్తులు నిర్ధారించారు. తన కుమారుడి కేసుపై తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.‘‘నేను అమెరికాకు అధ్యక్షుడిని. కానీ, నేను కూడా ఒక తండ్రిని. ఈ కేసుకు సంబంధించి హంటర్ ఆప్పీల్‌ను పరిగణలోకి తీసుకున్నందుకు న్యాయపరమైన ప్రక్రియను గౌరవిస్తాను’’ అని జోబైడెన్ అన్నారు. దీంతో క్రిమినల్ కేసులో దోషిగా తేలిన కుమారుడిని కలిగి ఉన్న తొలి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌గా నిలవటం గమనార్హం.ఇక.. ఈ కేసు విచారించిన డెలావెర్‌లోని ఫెడరల్ కోర్టు జడ్జి మేరీ ఎల్లెన్ నొరీకా మాత్రం హంటర్‌కు 120 రోజుల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో పూర్తి తీర్పు అక్టోబర్‌లో వెలువడనుందని చెప్పారు. సాధారణంగా ఇలాంటి నేరాలకు గరిష్టంగా 25 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలు ఉన్నాయి. హంటర్ బైడెన్‌పై మరో కేసు కూడా ఉంది. పన్ను ఎగ్గొట్టిన ఆరోపణలపై కాలిఫోర్నియా కోర్టు సెప్టెంటర్‌లో విచారణ జరపనుంది. -
21 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈనెల 21 వరకు ప్రత్యేక కోర్టు పొడిగించింది. కస్టడీ ముగియడంతో కవితను వర్చువల్‌గా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు.కవిత కస్టడీ పొడిగించాలన్న సీబీఐ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. తదుపరి విచారణను ఈ నెల 21కు వాయిదా వేశారు. మరోవైపు, ఈ కేసులో కవిత పాత్రపై దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషిటును పరిగణనలోకి తీసుకోవాలని సీబీఐ కోరింది. దీనిపై జులై 6న విచారణ చేపడతామని న్యాయమూర్తి పేర్కొన్నారు. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ఎదుట వర్చువల్‌గా హాజరు పరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె కస్టడీ పొడిగించాలని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవా దులు పంకజ్ గుప్తా, జొహెబ్ హొస్సేన్‌లు కోరారు.కవితతో పాటు మరో నలుగురిపై దాఖ లు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. దీనిపై కవిత న్యాయవాది నితీష్ రాణా అభ్యంతరం తెలిపారు. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం రెండు కేసుల్లోనూ జూన్ 3 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. చార్జిషీటుపై ఈడీ వాదనలు: కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన సప్లి మెంటరీ చార్జిషీటును పరి గణనలోకి తీసుకోవ డంపై దర్యాప్తు సంస్థ ప్రత్యే క కోర్టులో వాదనలు వినిపించింది. న్యాయవాది నవీన్ కుమార్ మట్టా వాదనలు వినిపిస్తూ.. కవిత, చారియట్ ప్రొడ క్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్‌కుమార్, చరణ్‌ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్‌ల పాత్ర గురించి చార్జిషీటులో ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుని కవిత కాకుండా మిగిలిన వారి పాత్రపై వాదనలు విన్పించాలని సూచించారు. ఇదే క్రమంలో న్యాయమూర్తి అడి గిన ప్రశ్నలపై సమాధానానికి నవీన్ కుమార్ సమయం కోరారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరా లతో రావాలంటూ న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో ఈ నెల 14వ తేదీ వరకు.. సీబీఐ కేసులో ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుల్లో ఇంతకు ముందు విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో.. అధికారులు కవితను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ మట్టా కోరారు.కుంభకోణంలో కవిత పాత్రపై ఒకట్రెండు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేస్తామని కోర్టుకు వివరించారు. మరోవైపు సీబీఐ కేసులో న్యాయవాది పంకజ్ గుప్తా వాదనలు వినిపిస్తూ.. కవితతో సంబంధాలు ఉన్న మరికొందరిని విచారించాల్సి ఉందని, దర్యాప్తు సజావుగా సాగాలంటే జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలని కోరారు. ఇక ఈడీ కేసులో కవిత తరఫు న్యాయవాది నితీశ్‌రాణా వాదనలు వినిపిస్తూ.. కుటుంబ సభ్యులు కవితతో 15 నిమిషాలు మాట్లాడటానికి అనుమతించాలని కోరారు. కోర్టు లాకప్‌లో పిటిషనర్ భర్త తీసుకొచ్చిన ఆహారాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. జైలుకు పంపుతున్న ఇంటి భోజనాన్ని కూడా జైలు సూపరింటెండెంట్ ఒక్కరే తనిఖీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కవితకు ఇంటి భోజనం నిలిపివేశాక కూడా మళ్లీ ఎందుకు అడుగుతున్నారని, దీనిపై జైలు సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని ఆదేశించారు. తర్వాత కవిత జ్యుడీషి యల్ కస్టడీలను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కవితకు చదువుకోవ డానికి పది పుస్తకా లను అనుమతించాల ని జైలు అధికారులకు సూచించారు. ఈడీ, సీబీఐ కేసులలో ప్రత్యేక కోర్టుకు కవితకు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో.. ఆమె న్యాయవా దులు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది.నా అరెస్టు అన్యాయం: కవితఅధికారులు ప్రత్యేక కోర్టు ప్రాంగణంలోకి కవితను తీసుకువచ్చినప్పుడు.. ‘జైతెలంగాణ.. జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ప్రజ్వల్ రేవణ్ణ వంటి వాళ్లను దేశం దాటించి, తనలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయమని కవిత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. -
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీ వాదనలు వినిపించింది. కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివ రించింది. కవితను అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు. సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పాం.. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్‌టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. అరుణ్ పిళ్లై ద్వారా వాటా కలిగి ఉన్నారు.. ఇండో స్పిరిట్స్‌లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్‌సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్‌గ్రూప్‌నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. -
రూ.450 కోట్ల ఆదాయంతో ఐరన్ ఓర్ మైనింగ్ ప్రాజెక్ట్!
అమరావతి: ప్రకాశం జిల్లాలో ఐరన్ ఓర్ మైనింగ్ ను జాయింట్ వెంచర్ విధానంలో ఎపీఎండీసీ చేపట్టనుంది. ఇందుకు గానూ జాయింట్ వెంచర్ సంస్థ ఎంపిక కోసం నిర్వహించే టెండర్లకు సంబంధించిన డాక్యుమెంట్లను ఎపీఎండీసీ మంగళవారం జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించింది. ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్లానింగ్, ఇంజనీరింగ్, ఫైనాన్సింగ్, కనస్ట్రక్షన్, డెవలప్ మెంట్, ఆపరేషన్ కమ్ మైయింటెనెన్స్ కోసం జేవీ సంస్థను టెండర్ల ద్వారా ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఎపీఎండీసీ ప్రకాశం జిల్లా కొణిజేడు మర్లపాడు ప్రాంతం పరిధిలో మొత్తం 1307.26 ఎకరాల్లో లో-గ్రేడ్ మ్యాగ్నెటైట్ ఐరన్ ఓర్ మైనింగ్ లీజులను పొందింది. ఇంటిగ్రేటెడ్ ఐరన్ ఓర్ ప్రాజెక్ట్ ద్వారా లోగ్రేడ్ ఖనిజాన్ని మైనింగ్ చేయడం, బెనిఫికేషన్ ద్వారా నాణ్యతను పెంచడం ద్వారా ఏడాదికి సుమారు రూ.450 కోట్ల మేర సంస్థకు రెవెన్యూ లభిస్తుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.100 కోట్ల కన్నా ఎక్కువ వ్యయం అయ్యే ప్రాజెక్ట్ లకు నిర్వహించే టెండర్ల ప్రక్రియను ముందుగా జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించాలని చట్టం చేసింది. దానిలో భాగంగా ఐరన్ ఓర్ టెండర్ డాక్యుమెంట్ లను ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ కమిషన్ కు సమర్పించడం జరిగిందని ఏపీఎండీసీ వీసీ&ఎండీ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. కమిషన్ వెబ్ సైట్ లో పొందుపరిచిన ఈ టెండర్ డాక్యుమెంట్లపై ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఈ నెల 14వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం కమిషన్ ఈ-మెయిల్ judge-jpp@ap.gov.in ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చునని కోరారు. -
అందుబాటులో ఉచిత న్యాయ సేవలు.. సద్వినియోగ పరుచుకోండి
గద్వాల క్రైం: ప్రతి పౌరుడికి ఉచిత న్యాయ సేవలను అందించాలనే లక్ష్యంతో లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ అమల్లోకి వచ్చిందని జిల్లా జడ్జి కుషా అన్నారు. గురువారం లీగల్ సర్వీస్ డే సందర్భంగా కోర్టు ఆవరణలో జాతీయ లీగల్ సర్వీస్ డే కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. సమస్యలు వచ్చినప్పుడు కోర్టు ద్వారా పరిష్కారం చేసుకునే క్రమంలో లాయర్లకు ఫీజులు చెల్లించలేని వారికి లీగల్ సర్వీస్ చేయూత అందిస్తుందన్నారు. ఉచితంగా న్యాయం పొందగలిగే విధానాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, మహిళలు, పిల్లలు, లైంగిక దాడులు, కిడ్నాప్, వరకట్న వేధింపులు, మానసిక – శారీరక హింస మొదలైన వాటి నుంచి న్యాయం పొందడానికి లీగల్ సర్వీస్ సెల్‌ను ఆశ్రయించవచన్నారు. ప్రస్తుతం యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులవుతున్నారని, ఈ క్రమంలో పాఠశాల, కళాశాల యాజమాన్యులతో లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలు సైతం చేపట్టామన్నారు. చట్ట పరిధిలోని ప్రతి సమస్యలకు ఉచితంగా న్యాయం అందించడమే లీగల్ సర్వీస్ డే ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో జడ్జిలు కవిత, ఉదయ్‌నాయక్ కోర్టు సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. చట్టాలపై అవగాహన అవసరం అలంపూర్: అట్టడుగు, వెనకబడిన పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే నేష్నల్ లీగల్ సర్వీస్ అధారిటీ లక్ష్యమని, ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జీ కమలాపురం కవిత అన్నారు. అలంపూర్‌లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డే గురువారం నిర్వహించారు.ఈ సమావేశానికి జడ్జీ కమలాపురం కవిత ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఏడాది నవంబర్ 9వ తేదిన నేషనల్ లీగల్ సర్వీసెస్ డేను నిర్వహించడం జరుగుతుందన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీతో వెనకబడిన పేద, అట్టడుగు వర్గాలకు ఉచిత న్యాయం, న్యాయ సేవలను అందించడం ముఖ్య ఉద్దేశమన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన సమానత్వం, సామాజిక న్యాయం ప్రాథమిక సూత్రాలను సమర్థిస్తుందన్నారు. కొందరికి న్యాయం ప్రత్యేక హక్కుగా కాకుండా అందరికి సమానమైన హక్కుగా వర్తిస్తోందన్నారు. కార్యక్రమంలో ఏజీపీ నరసింహులు, న్యాయవాదులు రాజేశ్వరి, సురేష్ కుమార్, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, ఆంజనేయులు, కిషన్ రావు, సాయితేజ ఉన్నారు. -
హార్వర్డ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకున్న సీజేఐ
మసాచుసెట్స్: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శనివారం అమెరికాలో హార్వర్డ్ లా స్కూల్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకున్నారు. ఆయన హార్వర్డ్ లా స్కూల్లోనే 1982–83లో ఎల్ఎల్ఎం డిగ్రీ చేశారు. 1983–86 మధ్య జ్యుడీషియల్ సైన్సెస్‌లో డాక్టరేట్ పూర్తి చేశారు. గత జనవరిలో ఆయనకు ఈ అవార్డును ప్రకటించడం తెలిసిందే. సుప్రీంకోర్టులో టెక్నాలజీ వినియోగం మరింత పెంచడంసహా సీజేఐగా తొలి ఏడాది తాను చేపట్టిన పలు చర్యలను అవార్డ్ అందుకున్న సందర్భంగా ఆయన వివరించారు. లాయర్ల మానసిక ఆరోగ్యం తదితర అంశాలను స్పృశిస్తూ ప్రసంగించారు. -
ఇసుక టెండర్లు జ్యుడిషియల్ ప్రివ్యూ పరిధిలోకి రావు
సాక్షి, అమరావతి: ఇసుక టెండర్లు జ్యుడిషియల్ ప్రివ్యూ పరిధిలోకి రావని రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇసుక టెండర్లపై న్యాయ సమీక్ష ఏదంటూ ఈనాడు పత్రికలో రాసిన కథనం పూర్తిగా అవగాహనా రాహిత్యంతో కూడుకున్నదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ వక్రీకరణ వార్తను ప్రచురించారని ఆగ్రహం వ్యక్తం చే శారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూకు సంబంధించిన నిబంధనలు అందరూ తెలుసుకునేందుకు వీలుగా ఆన్లైన్లో ఉన్నాయని, కనీసం వాటిని పరి శీలించకుండా ఈనాడు కథనాలు రాయడం బాధ్యాతా రాహిత్యమని పేర్కొన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదనే ఉన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టాన్ని తీసుకువచ్చారని తెలిపారు. రూ.100 కోట్లు దాటితేనే.. ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు కోసం రూ.100 కోట్లకుపైగా వ్యయం చేస్తే.. అలాంటి ప్రాజెక్టులకు నిర్వహించే టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, ఆమోదం తీసుకోవాలని చట్టంలో ఉందని పేర్కొన్నారు. తాజాగా గనుల శాఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం టెండర్ల ప్రక్రియను నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఆ టెండర్ల ప్రక్రియకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఎందుకు కోరలేదంటూ ఈనాడు అవగాహనా రాహిత్యంతో వార్త రాసిందన్నారు. ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదించే ప్రయత్నం చేయడం కోసమే ఈ కథనం రాశారని తెలిపారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం కాంట్రాక్టింగ్ ఏజెన్సీని టెండర్ల ద్వారా ప్రభుత్వం ఎంపిక చేస్తోందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం చేసే వ్య యం చాలా స్వల్పమని తెలిపారు. ఈ టెండర్లలో ఎంపికైన కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ఇసుక తవ్వకాలు, విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని తెలిపారు. ఆ సంస్థ ప్రభుత్వం నిర్ధేశించిన మొత్తానికి ఇసుకను వినియోగదారులకు విక్రయించి, టెండర్లలో ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తానని కోట్ చేసిందో ఆ మొత్తాన్ని చెల్లిస్తుందని వివరించారు. ఈ ప్రక్రియలో ప్రభుత్వం రూ.100 కోట్ల మేర ఎక్కడ వ్యయం చేస్తోందని ప్రశ్నించారు. అలాంటప్పుడు న్యాయసమీక్షకు పంపలేదని ఎలా ఆరోపిస్తారని నిలదీశారు. బీచ్ శాండ్‌లో ఏపీఎండీసీ చెల్లింపులు జరుపుతుంది కాబట్టే ప్రివ్యూకి బీచ్ శాండ్ టెండర్లను న్యాయ సమీక్షకు పంపి, ఇసుక టెండర్లను పంపలేదంటూ బోడిగుండుకు, మోకాలికి ముడి వేసేలా కథనంలో వాదించడం విడ్డూరంగా ఉందన్నారు. బీచ్ శాండ్ ఆపరేషన్స్ చేసే కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ఏపీఎండీసీ రూ.100 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉండటం వల్లే ఆ టెండర్లను న్యాయ సమీక్షకు పంపామని తెలిపారు. కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి ప్రభుత్వం ఎటువంటి చెల్లింపులు చేయడం లేదని వెల్లడించారు. దీనిని అర్థం చేసుకోకుండా సందేహాలు అంటూ ఈనాడు పత్రిక అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. -
కర్నూలులో జ్యుడీషియల్ సిటీ
కర్నూలు(సెంట్రల్): కర్నూలులోని జగన్నాథగట్టులో 250 ఎకరాలలో ప్రభుత్వం జ్యుడీషియల్ సిటీ నిర్మించనుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. కర్నూలులో రూ.17 కోట్లతో నిర్మించిన హరిత భవన్‌ను మంత్రి బుగ్గన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జ్యుడీషియల్ సిటీలో హైకోర్టుతో పాటు నేషనల్ లా యూనివర్సిటీ, జ్యుడీషియల్ అకాడమీ, వివిధ ట్రిబ్యునళ్లకు సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో నేషనల్ లా యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమలు కీలకమని.. వాటి ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను నిబంధనల మేరకు నిర్దేశిత సమయంలోగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో వరుసగా ఏపీ మొదటి స్థానంలో నిలుస్తోందన్నారు. కాలుష్య నియంత్రణ మండలికి అవసరమైన కార్యాలయాలను సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. తిరుపతి, గుంటూరు, విజయవాడతో పాటు ఇప్పుడు కర్నూలులో నూతన భవనాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. త్వరలోనే నెల్లూరు, అనంతపురంలో కూడా నూతన భవనాలు అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ శ్రీధర్, ఎంపీలు సంజీవ్‌కుమార్, పోచా బ్రహా్మనందరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూలు మేయర్ బీవై రామయ్య, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సృజన, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎంవీ రావు, బీవై మునిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త కోర్టులతో సత్వర న్యాయం అందాలి
విజయనగరం లీగల్: విజయనగరం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన న్యాయస్థానాల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు అభిలషించారు. ఈ దిశగా న్యాయాధికారులు, న్యాయవాదులు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. విజయనగరంలోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో కొత్తగా మంజూరైన అదనపు సీనియర్ సివిల్ కోర్టుని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ ఉపమాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ దుప్పల వెంకటరమణ ప్రారంభించారు. న్యాయసేవా సదన్‌లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని జస్టిస్ ఏవీ శేషసాయి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువ న్యాయవాదులకు తగిన శిక్షణ ఇచ్చి మెరికల్లాంటి న్యాయవాదులను అందించాలని సీనియర్ న్యాయవాదులకు సూచించారు. న్యాయవాదులు, న్యాయాధికారులు పరస్పరం గౌరవించుకోవడం ద్వారా సమాజానికి మేలు చేయగలమన్నారు. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ జిల్లా కోర్టు భవన సముదాయాలకు రూ.99 కోట్లతో మంజూరైన కొత్త భవనాలను నాణ్యతగా నిరి్మంచేలా బార్ కౌన్సిల్, యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా జడ్జి బి.సాయి కళ్యాణచక్రవర్తి, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు తదితరులు పాల్గొన్నారు. -
డీజీపీ బదిలీ.. మణిపూర్ అల్లర్ల వెనుక ఎవ్వరున్నా వదలం: అమిత్ షా
ఇంఫాల్: మే 3న దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ఇక్కడ శాంతిని నెలకొల్పేందుకు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. మణిపూర్‌లో మూడు రోజుల పర్యటన ముగిసిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు కారణమైన వారిని వదలబోయేది లేదని అన్నారు. అలాగే విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో అల్లర్లకు కారణమైన వారిని పట్టుకునేందుకు ఒక కమిటీని, ప్రజల్లో భయాందోళనలు పోగొట్టడానికి ఒక కమిటీని, శాంతిని నెలకొల్పేందుకు మరో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు ధైర్యం చెప్పి... అమిత్ షా అల్లర్ల నేపథ్యంలో భయబ్రాంతులకు గురైన ప్రజలకు ధైర్యం చెప్పారు. చెప్పుడు మాటలను గానీ, ఎటువంటి వదంతులను గానీ నమ్మవద్దని అన్నారు. ఈ సందర్బంగా మెయితేయి, కుకీ వర్గాలవారు తొందరపడొద్దన్నారు. ప్రజాసంఘాల వారు కూడా సంయమనం పాటించాలని కోరారు. డీజీపీ బదిలీ... ప్రస్తుత డీజీపీ పి.దౌన్గల్‌ను హోంశాఖకు బదిలీ చేసి ఆయన స్థానంలో CRPF ఐజీగా వ్యవహరించిన త్రిపుర ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన రాజీవ్ సింగ్ ను నూతన డీజీపీగా నియమించారు. ఇక్కడ ఉన్న గిరిజన తెగలకు ఎటువంటి సంబంధం లేని తటస్థ వర్గానికి చెందిన వారిని డీజీపీగా నియమిస్తే శాంతిభద్రతలను తొందరగా అదుపులోకి తేవచ్చనే ఉద్దేశ్యంతోనే డీజీపీని బదిలీ చేశారు. అల్లర్లకు కారణమైనవారిని వదిలే ప్రసక్తే లేదు... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయి కలిగిన విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని వేసి అల్లర్ల వెనుక ప్రధాన సూత్రధారులను కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వమే దర్యాప్తు చేస్తుందన్నారు హోంమంత్రి. ఎవరి దగ్గరైనా ఆయుధాలు ఉన్నట్లయితే వారు వాటిని వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలన్నారు.లేదంటే చాలా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు. శాంతిని నెలకొల్పేందుకు కమిటీ... అలాగే మణిపూర్ ప్రజల్లో భయాందోళనలను తొలగించి శాంతిని నెలకొల్పేందుకు గవర్నర్ అనసూయ ఉయికే నేతృత్వంలో మరో కమిటీని నియమించనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మెయితేయి, కుకీ వర్గాల ప్రతినిధులతో పాటు ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారన్నారు. చదవండి: మణిపూర్‌లో అమిత్ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం -
ప్రజల ఇష్టానుసారమే నిర్ణయం తీసుకుంటాం! : నెతాన్యాహు
నిరసనలు, ఆందోళనలు సమ్మెలతో ఇజ్రాయెల్ అట్టుడుకుపోయిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు పట్ల ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షడు జో బైడెన్ సైతం మరింత ఆజ్యం పోసేలా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బైడెన్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు నెతాన్యాహు బైడెన్ వ్యాఖ్యలకు బదులిస్తూ..ఇజ్రాయెల్ సార్వభౌమాధికారం కలిగిన దేశం. విదేశాల నుంచి వచ్చే ఒత్తిళ్లపై ఆధారపడి ఇజ్రాయెల్ నిర్ణయాలు తీసుకోదని సూటిగా కౌంటరిచ్చారు. తన ప్రజల ఇష్టానుసారమే ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంటుందని కరాఖండీగా చెప్పారు. కాగా బైడెన్ ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయపరమైన సంస్కరణలు రాజకీయ సంక్షోభానికి దారితీసింది కాబట్టి నెతాన్యాహుల వాటిని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నా అని అన్నారు. (చదవండి: డోక్లామ్‌పై భూటాన్ ప్రధాని షాకింగ్ వ్యాఖ్యలు! టెన్షన్లో భారత్) -
ఏపీ జ్యూడిషియల్ అకాడమీని ప్రారంభించిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఏపీ జ్యుడీషియల్ అకాడమీని ప్రారంభించిన సీజేఐ చంద్రచూడ్
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రారంభించారు. మంగళగిరి మండలం ఖాజాలో శుక్రవారం రోజున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. అనంతరం సీజేఐ మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వాడకం పెరిగింది. సాంకేతికతను అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలి. కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. న్యాయవాదులు నల్లకోటు ధరించి తిరగడం చూస్తుంటాం. అందులోని తెలుపు, నలుపు రంగులను ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణగా పరిగణిస్తారు. న్యాయమూర్తులు నిత్య విద్యార్థులుగా ఉంటూ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టులు వివాదాల పరిష్కారమే కాదు, న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలి. కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించాలి. న్యాయవ్యవస్థను పరిరక్షించడానికి అందరి సహకారం అవసరం. పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కరించాలి. జడ్జిలకు సొంత సామర్ధ్యాలపై విశ్వాసం ఉండాలి. ముఖ్యమైన కేసుల్లో త్వరగా న్యాయం జరిగేలా చూడాలి. న్యాయవ్యవస్థలో కేసుల సంఖ్య కంటే తీర్పుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి అని సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు. -
గన్ షాట్ : చంద్రబాబుకు సీమ నేర్పిన పాఠం ఏంటి ..?
-
కర్నూలులో న్యాయరాజధానిను కోరుతూ భారీ ర్యాలీ
-
శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలంటూ మిలియన్ మార్చ్
సాక్షి, కర్నూలు: న్యాయ రాజధానికి మద్దతుగా రాయలసీమ జేఏసీ(నాన్ పొలిటికల్) ఆధ్వర్యంలో మంగళవారం కర్నూలులో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలంటూ రాజ్‌విహార్ నుంచి కలెక్టరేట్ వరకు కొనసాగిన ఈ మిలియన్ మార్చిలో మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజా, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, రాయలసీమ ఉద్యమకారులు పాల్గొన్నారు. కాగా సీమ ముఖద్వారం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కోసం ఉద్యమం ఉధృతమవుతోంది. రాయలసీమ ఉద్యమకారులు, న్యాయవాదులు, రాజకీయ పార్టీల నేతలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు ఒక్కటై నినదిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సాధించుకోలేమని ఉద్యమబాట పడుతున్నారు. రాయలసీమకు 70 ఏళ్లుగా జరుగుతున్న అన్యాయానికి న్యాయ రాజధానే సరైన పరిష్కారమని నమ్ముతున్నారు. కర్నూలును న్యాయ రాజధాని చేయాల్సిందే శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం వెనుకబడిన రాయలసీమకు న్యాయం చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకొచ్చారు. రాజధానుల వికేంద్రీకరణలో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. అందులో భాగంగా కర్నూలులో హైకోర్టుతోపాటు న్యాయ సంబంధిత సంస్థలన్నింటీని స్థాపించి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. అయితే కోర్టు కేసుల కారణంగా ప్రభుత్వం రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వికేంద్రీకరణ నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రాయలసీమ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా సెప్టెంబర్ 18 నుంచి 23వ తేదీ వరకు న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కర్నూలులో తక్షణమే హైకోర్టును ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. అలాగే వారం రోజుల క్రితం వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ‘న్యాయ’ గళాన్ని వినిపించారు. అక్టోబర్ 30వ తేదీన రాయలసీమ జేఏసీ(నాన్ పొలిటికల్) ఆధ్వర్యంలో 129 ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి కర్నూలులో వెంటనే హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల్లో వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు జరిగాయి. ప్రతి రోజూ ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక చోటా న్యాయ రాజధాని కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. సీఎం వైఎస్ జగన్‌పై సంపూర్ణ నమ్మకం మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ టీడీపీ అమరావతికి జై కొట్టింది. దీంతో రాయలసీమ ప్రజల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు అడ్డుపడుతున్న టీడీపీ నాయకులపై ఉద్యమకారులు ఆగ్రహంతో ఉన్నారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం 2014లో రాయలసీమలో రా జధాని ఏర్పాటు చేయాలని, లేదంటే హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరితే చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు. ప్రస్తుతం కర్నూలును న్యాయ రాజధాని చేయాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రిపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని, త్వరలోనే తమ ఆకాంక్ష నెరవేరుతుందన్న ఆశాభావాన్ని రాయలసీమ వాసులు వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు రాయలసీమ ద్రోహి: ఎమ్మెల్యే భూమన
-
'రాయలసీమను రతనాలసీమగా మార్చే సత్తా సీఎం జగన్‌కే'
సాక్షి, తిరుపతి: వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని, రాయలసీమ హక్కులు కాపాడాలని కోరుతూ ప్రజలు ఏకమవుతున్నారు. శనివారం తిరుపతి వేదికగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ గర్జన, వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ ఆత్మగౌరవ మహా ర్యాలీ నిర్వహించారు. ఈ మహా ప్రదర్శనలో విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులతోపాటు విద్యాసంస్థల యాజమాన్యాలు, ప్రజసంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాయలసీమను రతనాలసీమగా మార్చే సత్తా సీఎం జగన్‌కే ఉందంటూ నినాదాలు చేశారు. మహాప్రదర్శనతో తిరుపతి జనసంద్రంగా మారింది. మహార్యాలీలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాయలసీమ ద్రోహి. రాయలసీమకు బాబు చేసిందేమీ లేదు. కర్నూలును న్యాయరాజధాని చేయడం ద్వారా మరింత ప్రగతి సాధించవచ్చు. మూడు రాజధానులను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారు. వికేంద్రీకరణతోనే అని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే భూమన పేర్కొన్నారు. -
కర్నూలులో రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చే రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీని శాశ్వత ప్రాతిపదికన కర్నూలులో ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీని ప్రస్తుతానికి మంగళగిరిలో అద్దె భవనంలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటివరకు రాష్ట్రంలో జ్యుడిషియల్ అకాడమీ లేదు. దీంతో రాష్ట్రంలో జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సిఫారసులు పంపింది. ఈ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో అకాడమీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకర్ పేరు మీద జీవో జారీ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీలో ఉన్న సిబ్బందిలో 58.32 శాతం మించకుండా సిబ్బందిని మంజూరు చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సిబ్బంది మంజూరు, మౌలిక సదుపాయాల కల్పన వివరాలతో తగిన ఉత్తర్వులను వేరుగా జారీ చేస్తామంది. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను కోరింది. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే అక్కడ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
ముఖ్యమంత్రులు-న్యాయమూర్తుల సంయుక్త సదస్సు 2022 (ఫొటోలు)
-
కోర్టుల్లో స్థానిక భాషలకు ఊతం
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తద్వారా ప్రజలు న్యాయ ప్రక్రియతో అనుసంధానమైనట్లు భావిస్తారని, వారిలో విశ్వాసం పెరుగుతుందని అన్నారు. అంతిమంగా న్యాయ ప్రక్రియపై ప్రజల హక్కు బలపడుతుందని తెలిపారు. ఇప్పటికే సాంకేతిక విద్యలో స్థానిక భాషలను ప్రోత్సహిస్తున్నట్లు గుర్తుచేశారు. చట్టాల గురించి సులభమైన భాషలో అర్థమయ్యేలా వివరించాలన్నారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. అండర్ ట్రయల్ ఖైదీల కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సూచించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... సదస్సుకు చాలా సీనియర్ని ‘‘దేశంలో న్యాయ వ్యవస్థ రాజ్యాంగ సంరక్షకుడి పాత్ర పోషిస్తోంది. సీఎంలు, సీజేల సంయుక్త సదస్సు రాజ్యాంగ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం. నేను చాలాకాలంగా ఈ సదస్సుకు వస్తున్నా. మొదట ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా సదస్సుకు హాజరవుతున్నా. ఒకరకంగా చెప్పాలంటే ఈ సదస్సు విషయంలో నేను చాలా సీనియర్ని. డిజిటల్ ఇండియా మిషన్ డిజిటల్ ఇండియా మిషన్‌లో భాగంగా న్యాయ వ్యవస్థలో సాంకేతికతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని సీఎంలు, ప్రధాన న్యాయమూర్తులు మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఈ–కోర్టుల ప్రాజెక్టును మిషన్ మోడ్‌లో అమలు చేస్తున్నాం. న్యాయ వ్యవస్థతో డిజిటల్ ఇండియాను అనుసంధానించాలి. బ్లాక్‌చెయిన్‌లు, ఎలక్ట్రానిక్ డిస్కవరీ, సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోఎథిక్స్ వంటి సబ్జెక్టులను అనేక దేశాల్లో న్యాయ విశ్వవిద్యాలయాల్లో బోధిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్‌లోనూ న్యాయ విద్యను అందించడం మన బాధ్యత. చట్టాల్లో సంక్లిష్టతలు, వాడుకలో లేని చట్టాలు చాలా ఉన్నాయి. 2015లో ప్రభుత్వం 1,800 చట్టాలను అప్రస్తుతంగా గుర్తించి ంది. ఇప్పటికే 1,450 చట్టాలను రద్దు చేశాం. పెండింగ్ కేసులకు మధ్యవర్తిత్వం స్థానిక కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన సాధనం. మన సమాజంలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వేల సంవత్సరాలుగా ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మధ్యవర్తిత్వ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఖాళీల భర్తీకి కృషి చేస్తున్నాం మన దేశం స్వాతంత్య్రం పొంది 2047 నాటికి 100 ఏళ్లు పూర్తవుతుంది. అప్పుడు దేశంలో ఎలాంటి న్యాయ వ్యవస్థను చూడాలనుకుంటున్నాం? 2047 నాటికి దేశ ఆకాంక్షలను నెరవేర్చగలిగేలా మన న్యాయ వ్యవస్థను ఎలా సమర్థంగా తీర్చిదిద్దాలి? ఈ ప్రశ్నలే ఈ రోజు ప్రాధాన్యతగా ఉండాలి. అమృత్ కాల్లో మన విజన్(దార్శనికత) అంతా సులభ న్యాయం, సత్వర న్యాయం, సమ న్యాయం కల్పించే న్యాయ వ్యవస్థపై ఉండాలి. న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ స్థాయిల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నాం. Delhi | PM Narendra Modi, Union Minister of Law & Justice Kiren Rijiju and Chief Justice of India NV Ramana attend the Joint Conference of CMs of States & Chief Justices of High Courts at Vigyan Bhawan pic.twitter.com/cmawTEOWOl — ANI (@ANI) April 30, 2022 న్యాయ వ్యవస్థ బలోపేతమే లక్ష్యం ♦ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ♦ ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని ♦ అందరూ గౌరవించాల్సిందే ♦ కోర్టుల నిర్ణయాలను ప్రభుత్వాలు ♦ ఏళ్ల తరబడి అమలు చేయట్లేదు ♦ అందుకే వ్యాజ్యాలు పెరుగుతున్నాయ్ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని, అందుకు మరిన్ని చర్యలు అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొన్న ప్రతినిధులను అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. కోర్టుల నిర్ణయాలు ఏళ్ల తరబడి అమలు కాకపోవడం వల్లే ప్రభుత్వాలపై ధిక్కరణ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాల విధి నిర్వహణ వైఫల్యం వల్ల కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. శనివారం ఢిల్లీలో రాష్ట్రాల సీఎంలు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సులో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. దేశవ్యాప్తంగా కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయిలో స్పెషల్ పర్సస్ వెహికల్స్ ఏర్పాటు చేయాలన్నారు. సీఎంలు లేదా వారి తరపు ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ఇందుకు ముఖ్యమంత్రులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలున్న ప్రజాప్రతినిధుల నుంచి ఎంతో నేర్చుకొనే అవకాశం వచ్చిందని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. న్యాయ వ్యవస్థ పనితీరును మెరుగుపర్చడానికి, ప్రస్తుతం ఉన్న సవాళ్లను గుర్తించి, పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని వివరించారు. సదస్సులో ఆయన ఇంకా ఏం చెప్పారంటే... పెండింగ్ కేసులు 4.11 కోట్లు: న్యాయ వ్యవస్థలో ఖాళీలను త్వరగా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తులు–జనాభా నిష్పత్తిని పెంచేందుకు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కృషి చేయాలి. అన్ని హైకోర్టుల్లో 1,104 జడ్జీల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయగా, ప్రభుత్వం 388 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీల భర్తీకి నేను పదవిలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రయత్నిస్తున్నా. మరోవైపు ఈ ఆరేళ్లలో పెండింగ్ కేసుల సంఖ్య 2.65 కోట్ల నుంచి 4.11 కోట్లకు పెరిగింది. ‘పిల్’ దుర్వినియోగం కోర్టుల్లో అనవసరమైన వ్యాజ్యాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్) కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనాల వ్యాజ్యాలుగా మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజా ప్రయోజనాలను కాపాడాల్సిన ‘పిల్’ను కొన్నిసార్లు ప్రాజెక్టులను నిలిపివేయడానికి, ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి దుర్వినియోగం చేస్తున్నారు. రాజకీయ అవసరాలు నెరవేర్చుకోవడానికి, కార్పొరేట్లపై కక్ష తీర్చుకోవడానికి ‘పిల్’ ఓ సాధనంగా మారడం విచారకరం. కోర్టుల్లో భాషాపరమైన అడ్డంకులు తొలగించడం, సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఖాళీల భర్తీ, న్యాయ వ్యవస్థ బలాన్ని పెంపొందించడం వంటివి తక్షణావసరం’’ అని జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. కోర్టుల్లో స్థానిక భాషలు.. ఒక్కరోజులో సాధ్యం కాదు కోర్టుల్లో స్థానిక భాషను ప్రవేశపెట్టడం వంటిసంస్కరణలను అమలు చేయడం ఒక్కరోజులో సాధ్యం కాదని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. కొన్ని ప్రతికూలతలు ఉన్నందువల్ల దాన్ని అమలు చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. -
వ్యవస్థల్లో విపరీత ధోరణులు
ప్రజలు ఎన్నుకొనే ప్రభుత్వాలకు రాజకీయపరమైన నిర్ణయాలు చేయగల హక్కు ఉన్నప్పుడు, వాటి పరిష్కారానికి ప్రజలు ఎన్నుకున్న శాసన వేదికలకు నివేదించకుండా సుప్రీంకోర్టు వైపు ఎందుకు చూస్తున్నట్టు.. అని ఇటీవల సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.. రాష్ట్ర రాజధాని సమస్యపై అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయాల్ని తప్పుపడుతూ ‘రాజధానిని మార్చే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదని’ ప్రకటించడం న్యాయసమ్మతమేనా అనే ప్రశ్నకు గౌరవప్రదమైన సమాధానం రావలసి ఉంది. మరోవైపు.. న్యాయస్థానాల్ని ఇరకాటంలోకి నెట్టి తమాషా చూడగల ‘రాజకీయ పక్షుల’ చేతుల్లో రాజ్యాంగ వ్యవస్థలు ఆటవస్తువులుగా మిగిలిపోతున్నాయన్నది వర్తమాన చరిత్ర. ఈ సరికొత్త వినాశకర ధోరణే దేశంలోనూ, రాష్ట్రాలలోనూ రాజ్యాంగ నిర్మాతలు విస్పష్టంగా నిర్దేశించిన నియమ నిబంధనలు ఒక్కొక్కటిగా కూలిపోతూండటానికి తార్కాణమని గమనించాలి. వెనకటికి పల్నాటి నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడితో పోరు సందర్భంగా ‘నీ మూతికి మీసాలుంటే నా ముంజేతికి వెంట్రుకలున్నవి తెలుసా’ అని ఎద్దేవా చేసిందట. నేడు దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు కూడా పరస్పరం ‘నీవెంతంటే, నీవెంత’ అన్నట్టు కుమ్ములాడుకుంటున్నాయి. సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ తన అధ్యక్షతన సమావేశమైన ప్రత్యేక బెంచ్‌లో (8.4.2022) మాట్లాడుతూ, ప్రభుత్వ పాలనా వ్యవస్థ న్యాయమూర్తులను ఆడిపోసుకుంటూ ఉండటం కొత్తగా బయల్దేరిన ధోరణి అనీ, ఇది ‘అత్యంత దురదృష్టకర పరిణామ’మనీ వ్యాఖ్యా నించారు. అందునా, అవినీతి నిరోధక చట్టం కింద, ప్రజా ప్రయో జనాల రక్షణ చట్టం కింద కోర్టు ముందుకు విచారణ కోసం వచ్చే ప్రస్తావనలను న్యాయస్థానం పరిశీలించాల్సి ఉంటుంది. ప్రజలు ఎన్నుకొనే ప్రభుత్వాలకు రాజకీయపరమైన నిర్ణయాలు చేయగల హక్కు ఉన్నప్పుడు, వాటి పరిష్కారానికి ప్రజలు ఎన్నుకున్న శాసన వేదికలకు నివేదించకుండా సుప్రీంకోర్టు వైపు ఎందుకు చూస్తున్నట్టు? అలాంటి పరిస్థితుల్లో అన్ని సమస్యల్ని కోర్టే పరిష్క రించాల్సి వస్తే, శాసన వేదికలు (పార్లమెంటు/రాష్ట్రాల శాసన సభ/శాసనమండలి) ఉన్నదెందుకు అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ సకాలంలో సంధించగలిగారు. అయితే ఇదే సమయంలో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా నియమితులైన ప్రధాన న్యాయమూర్తి రాజ్యాంగబద్ధంగా, అఖండ మెజారిటీతో ప్రజలు ఎన్నుకున్న జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర రాజధాని సమస్యపై అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయాల్ని తారుమారు చేస్తూ ‘రాజధానిని మార్చే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదని’ ప్రకటించడం న్యాయ సమ్మతమైనదా? అన్న ప్రశ్నకు గౌరవప్రదమైన సమాధానం రావలసే ఉంది. సరికొత్త వినాశకర ధోరణి! నిజానికి న్యాయమూర్తులపై ‘ప్రభుత్వాలే దుష్ప్రచారం ప్రారంభిం చడం దురదృష్టకరమన్న’ జస్టిస్ రమణ విమర్శ సబబైనది. ఈ సరికొత్త దుష్ప్రచారానికి తెరతీసిన వాళ్లు కూడా కేంద్ర పాలకులేనన్నది మరచిపోరాదు. కోర్టుల్ని ఇరకాటంలోకి నెట్టి తమాషా చూడగల పాలకులు, ప్రభుత్వాలు ఉన్నచోట... పార్లమెంట్లు, శాసనసభ వేది కలు, న్యాయవ్యవస్థలు అధికార స్థానాల్లో ఉన్న ‘రాజకీయ పక్షుల’ చేతుల్లో ఆటవస్తువులుగా మిగిలిపోతున్నాయన్నది వర్తమాన చరిత్ర. ఈ సరికొత్త వినాశకర ధోరణే దేశంలోనూ, రాష్ట్రాలలోనూ రాజ్యాంగ నిర్మాతలు విస్పష్టంగా నిర్దేశించిపోయిన లిఖితపూర్వక నియమ నిబం ధనలు ఒక్కొక్కటిగా కూలిపోతూ ఉండటానికి తార్కాణమని గమ నించాలి. ఈ ధోరణిలో భాగమే పాలకులు ఉత్తర–దక్షిణ భారతాల మధ్య విభేదాల గండికొట్టి శాశ్వత శత్రుత్వాన్ని నర్మగర్భంగా పెంచి పోషిస్తూ రావడం! ఉత్తరప్రదేశ్‌కు చెందిన 80 పార్లమెంట్ స్థానాలను ముందు కాంగ్రెస్, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ–ఆరెస్సెస్ కూటమి గట్టిగా నిలుపుకొంటూ వస్తున్నాయి. పార్టీలకు లభిస్తున్న ఈ ‘ప్రాణ దానం’లో మెట్టు వాటా ఎన్నికల సమయాల్లోనూ, ఆ పిమ్మట రాజ కీయ అధికారాన్ని నిలబెట్టుకోడానికి కార్పొరేట్ డొనేషన్లు కీలక పాత్ర వహిస్తూన్నాయి. 2019–20 నాటి లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు కార్పొరేట్ డొనేషన్ల రూపంలో ‘విరాళాల’ ముసుగులో ఐదు జాతీయ పార్టీలకు అందిన మొత్తం రూ. 920 కోట్లని ‘ప్రజాస్వామ్య సంస్కరణల పరిరక్షణా సంస్థ’ సాధికార పరిశోధనా పత్రం బయట పెట్టింది. ఆ పార్టీలు: బీజేపీ, కాంగ్రెస్, ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్, మార్క్సిస్టు పార్టీలు. బీజేపీ 2020 నుంచీ భారీ స్థాయిలో కార్పొరేట్ డొనేషన్ల ‘రుచి’ మరిగిన పార్టీగా పరిగణనలోకి వచ్చింది. ఆ పార్టీకి అత్యంత అధిక ‘విరాళాలు’ సమకూర్చే పెద్ద కార్పొరేట్ సంస్థ ‘ప్రూడెంట్ ఎలొక్టరల్ ట్రస్ట్’! ఇదే కాంగ్రెస్‌నూ సాకుతోంది. ఇవిగాక దొంగచాటుగా పార్టీల కరప్షన్‌కు తోడ్పడేవి మరికొన్ని సంస్థలూ! ఇలాంటి సందర్భాలలోనే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ సూటిగా పై ప్రశ్నను రాజకీయులకు సంధించాల్సి వచ్చిం దనుకోవాలి. ‘ప్రజాప్రయోజన వ్యాజ్యాలను న్యాయస్థానాలు విచా రణకు స్వీకరించాల్సి వస్తే ఇక ప్రజలు ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్ను కున్నట్టో, చట్టాలు చేసే పేరుతో శాసన వేదికలు ఉన్నదెందుకో...’ చెప్పాలన్న ప్రశ్నకు ప్రస్తుత పార్లమెంట్‌గానీ, పలు శాసన వేదికలు గానీ సమాధానాలతో స్పందించి తీరాలి. కానీ ఆ సంకల్పం ఎక్కడా ఇప్పుడు జరుగుతున్న ‘అమృత మహోత్సవాల’ సంబరాల ముంగిట కానరావడం లేదు. తక్షణ విచారణకు నివేదిక ఆ మాటకొస్తే నేడు జరుపుకుంటున్నది ‘అమృత మహోత్స’వాలేనా, అప్పుడే 75 సంవత్సరాలు మనకు తెలియకుండానే వృథా అయి పోయాయా అన్న ఆశ్చర్యమే మిగులుతుంది. అమృత మహోత్సవం అన్న పదం వినబడుతున్న సమయంలోనే దేశ రాజకీయ వేత్తలపై గత ఐదేళ్లకు పైగా నానుతూ వస్తున్న 2,000 అవినీతి కేసులను ముందు తక్షణం విచారించి శిక్షించాలని కోరుతూ జస్టిస్ రమణ అధ్యక్షతన ఉన్న బెంచ్ ముందుకు వచ్చింది. ఈ శిక్షను వెంటనే విధిగా డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తూ సుప్రీం సీనియర్ న్యాయవాది, సుప్రీంకు న్యాయ సలహాదారుగా ఉన్న (ఎమికస్ క్యూరే) విజయ్ హన్సారియా. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా... దేశంలో గత ఐదేళ్లుగా పెండింగ్‌లో పడిపోయిన అవినీతి కేసులకు సంబంధించిన 16వ నివేదికను కూడా ఆయన త్వరలో సమర్పించనున్నారు. ఆ ధర్మా సనంలో జస్టిస్ కృష్ణ మురారి, ముక్కుసూటి మనిషి హిమాకోహ్లీ కూడా ఉండబోవడం విశేషం. పెండింగులో ఉన్న అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వారిలో మాజీ శాసనకర్తలే (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు)గాక ప్రస్తుతం కొనసాగుతున్న శాసన కర్తలు కూడా ఉండటం విశేషం! పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ, శాసనమండలి సభ్యులపై మొత్తం 4,984 కేసులుండగా, వాటిల్లో 1,899 కేసులు ఐదేళ్లకు పైగా నానుతున్నాయి. 2018 నాటికి నమోదై ఉన్న కేసులు 4,110 కాగా, అవి 2020 అక్టోబర్ నాటికి 4,859 దాకా పెరిగి పోయాయి. ప్రశ్నలోనే ఉందా సమాధానం?! పార్లమెంట్‌కు, రాష్ట్రాల శాసన వేదికలకు నేర చరిత్ర గలవాళ్లూ పార్టీల తరఫున ఎన్నికవుతున్నారని, సాధికార నివేదికలు తెల్పుతున్నందువల్ల ఇక జాప్యం చేయరాదని ఎమికస్ క్యూరే హన్సారియా సుప్రీంకు ఇలా తాజాగా నివేదించడం ఆసక్తికరం! ఎందుకంటే, త్యాగరాజు ‘నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా’ అని ప్రశ్నించుకోవడంలోనే తెలివైన సమాధానం ఉంది. ‘నిధి’ సుఖమనుకున్నవారు, ధన సుఖం చూసుకునేవారు, జన సుఖానికి చెల్లుచీటీ ఇస్తారు. ఒక సామెత ఉంది – ‘న్యాయం చెప్పవయ్యా నాగిరెడ్డీ అంటే, నాకూ ఇద్దరు పెళ్లాలే, ఏం చెప్పేది’ అన్నాడట! ఈనాటి పరిస్థితులూ ఇందుకు భిన్నంగా లేవంటే బాధపడీ లాభం లేదు. ఈ సందర్భంలో ఎందుకనో దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆశావహమైన మాటలు గుర్తుకొస్తున్నాయి: ‘‘మంచో చెడో నువ్వు ఎవరితో పోతావు అని నన్నడిగితే, గోతిలోనికి తీసుకుపోయినా యువజనంతోనే పోతాను అంటాను. మనిషి నిత్యపథికుడు. అందుకే శీతవేళ రానీయకు/ శిశిరానికి చోటీయకు/ పూలకారు ఏనాటికీ పోనీయకు’’!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కోర్టు ఆదేశాలు ‘ఫాస్టర్’గా..
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయ ఆదేశాలు జాప్యం కాకుండా వేగంగా కక్షిదారులకు చేరడానికి రూపొందించిన ఫాస్ట్, సెక్యూర్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్(ఫాస్టర్) సాఫ్ట్‌వేర్‌ను గురువారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. కోర్టు ఉత్తర్వులు ఎలక్ట్రానిక్ మోడ్ ద్వారా వేగంగా, సురక్షితంగా చేరేలా రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ప్రారంభోత్సవ ఆన్లైన్ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్‌గుప్తా, పలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. వేగంగా సాఫ్ట్వేర్ రూపొందించిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులు, కోర్టు రిజిస్ట్రీని అభినందించారు. ఈ వ్యవస్థ నిమిత్తం దేశవ్యాప్తంగా 1887 ఈ–మెయిల్ ఐడీలు సృష్టించారని, సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో ఫాస్టర్ సెల్ ప్రారంభించారని తెలిపారు. కోర్టు ఆమోదించిన బెయిల్, విడుదలకు సంబంధించిన ప్రోసీడింగ్స్, ఆదేశాలను ఈ–మెయిళ్ల ద్వారా వెంటనే సంబంధిత నోడల్ అధికారులకు చేరేలా ఈ సాఫ్ట్వేర్ చేస్తుందన్నారు. ధ్రువీకరణ నిమిత్తం డిజిటల్ సంతకాలు, సంస్థాగత డిజిటల్ సంతకాలు ఉంటాయన్నారు. సమీప భవిష్యత్తులో హార్డ్‌కాపీలు అవసరం ఉన్న అన్ని రికార్డులు పూర్తిగా ఫాస్టర్ ద్వారా చేరవేయొచ్చని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. 16.7.2021న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆగ్రా సెంట్రల్ జైలులో నిందితుల్ని మూడు రోజుల తర్వాత కూడా విడుదల చేయలేదంటూ పత్రికల్లో వచ్చిన కథనాన్ని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. న్యాయ ఆదేశాలు త్వరగా చేరకపోవడం వల్ల దోషుల విడుదలలో జాప్యాన్ని గ్రహించిన సీజేఐ జస్టిస్ రమణ ఈ సాఫ్ట్వేర్ రూపకల్పనకు సూచనలు చేశారు. -
ఓటరు నమోదుకు ఏడాదిలో 4 కటాఫ్ తేదీలు
న్యూఢిల్లీ: కొత్త ఓటర్ల నమోదుకు ఏడాదిలో నాలుగు కటాఫ్ తేదీలను అందుబాటులోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల చట్టంలో సవరణలు చేయనుంది. దీనివల్ల దేశంలో జరిగే స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఉపయోగపడే ఉమ్మడి ఓటరు జాబితా రూపకల్పనకు వీలవుతుంది. యువజన ఓటర్లు మరింత మందిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయడానికి కూడా ఈ ప్రయత్నం తోడ్పడుతుందని పార్లమెంటరీ కమిటీకి కేంద్ర న్యాయశాఖ తెలిపింది. ప్రస్తుతం జనవరి ఒకటో తేదీన, అంతకంటే ముందు 18 ఏళ్లు నిండిన వారు మాత్రమే ఆ ఏడాది తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవచ్చు. ఆ ఏడాదిలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే, జనవరి 2 జన్మించినా వారు మళ్లీ ఏడాదిదాకా ఆగాల్సిందే. అందుకే, ఏడాదిలో నాలుగు కటాఫ్ తేదీలను జత చేస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 14(బి)ని సవరించాలని యోచిస్తున్నట్లు న్యాయశాఖ తెలిపింది. సంవత్సరంలో.. జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1లను కటాఫ్ తేదీలుగా మార్చే ప్రతిపాదనలను ఎన్నికల సంఘం పరిశీలిస్తోందని కేంద్రం తెలిపింది. -
AP: న్యాయమూర్తి నుంచి న్యాయవాదిగా..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తిగా పనిచేసి ఇటీవల రాజీనామా చేసిన జస్టిస్ దామా శేషాద్రినాయుడు మళ్లీ న్యాయవాది వృత్తిలోకి అడుగుపెట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన జస్టిస్ శేషాద్రినాయుడు 1997లో ఏపీ బార్ కౌన్సిల్లో సభ్యునిగా చేరారు. హైకోర్టులో సివిల్, క్రిమినల్ కేసులు వాదించారు. 2013లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం కేరళ, ముంబై హైకోర్టుల్లో విధులు నిర్వర్తించారు. 2021 ఆగస్టు 12న హైకోర్టు న్యాయమూర్తిగా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మళ్లీ న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జస్టిస్ నాయుడు సుప్రీంకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. సోమవారం ఓ కేసులో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. -
న్యాయవ్యవస్థలో ఖాళీల సత్వర భర్తీ!
సాక్షి, న్యూఢిల్లీ: జ్యుడీషియల్లో ఖాళీలు భారీగా పెరిగిపోవడం దేశీయ న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో ఒకటని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఈ సవాలును ఎదుర్కొనే క్రమంలో కొలిజయం సిఫార్సులను కేంద్రం వేగంగా ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. జాతీయ జ్యుడీషియల్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన సిద్ధమవుతోందని, దీనిపై త్వరలో కేంద్రానికి నివేదికనిస్తామని చెప్పారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన సత్కార సభలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టుకు ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను వేగంగా ఆమోదించినందుకు ప్రధానికి, న్యాయమంత్రికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. సుప్రీంకోర్టులో ఖాళీల భర్తీని సత్వరమే పూర్తిచేయాలని తాను భావించానని, ఈ భావన నెరవేరడం ఆనందంగా ఉందని చెప్పారు. అదేవిధంగా ఇటీవలే కొలీజియం పలు హైకోర్టులకు పలువురు జడ్జిల పేర్లను సిఫార్సు చేసిందని, ప్రభుత్వం వీలయినంత త్వరగా వీటికి ఆమోదముద్ర వేస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. అన్ని హైకోర్టుల్లో కలిపి దాదాపు 41 శాతం పదవులు ఖాళీగా ఉన్నాయని, వచ్చే నెలలోపు వీటిలో 90 శాతం నియామకాలు జరగవచ్చని అంచనా వేశారు. ఖాళీల భర్తీలో సహకరించిన కొలీజియం సభ్యులను అభినందించారు. మౌలిక వసతుల కల్పన దేశ న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరతను తీర్చేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రతిపాదన సిద్ధమవుతోందని జస్టిస్ రమణ చెప్పారు. చాలా కాలంగా మౌలిక సదుపాయాల పెంపుపై తాను దృష్టి పెట్టానని, ఈ సమస్యను ఒక కాలపరిమితితో పరిష్కరించేందుకు నేషనల్ జ్యుడీషియల్ ఇ్రన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉపయోగపడుతుందని వివరించారు. ఈ విషయంపై దేశవ్యాప్త నివేదిక సేకరణ పూర్తయిందని, త్వరలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదన కేంద్ర న్యాయశాఖ మంత్రికి చేరుతుందని తెలిపారు. కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం అందుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం అందేలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అధిక వ్యయప్రయాసల వల్ల లక్షలాది మంది ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించలేకపోతున్నారన్నారు. మహిళలను స్వాగతించాలి పలువురు మహిళలు న్యాయవాదులుగా కొనసాగుతున్నా, వీరిలో చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నతస్థానాలకు చేరుకుంటున్నారని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచి్చన 75 ఏళ్ల తర్వాత, అన్ని స్థాయిలలో మహిళలకు కనీసం 50% ప్రాతినిథ్యం లభిస్తుందని ప్రతి ఒక్కరు ఆశించారని, కానీ ఎంతో కష్టం తరువాత సుప్రీంకోర్టులో మహిళా జడ్జీల సంఖ్య 11 శాతానికి పెరిగిందన్నారు. న్యాయవాద వృత్తిలోకి మహిళలను మరింత ఎక్కువగా స్వాగతించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా సహోద్యోగులను గౌరవించడంతో పాటు వారి పట్ల హుందాగా వ్యవహరించాలని సూచించారు. పేదలు, మహిళలు, రైతులు, కారి్మకులు, వెనుకబడినవారు తమ చట్టపరమైన హక్కులను వినియోగించుకొనేందుకు సహాయం చేయాలని, సాధ్యమైనప్పుడల్లా ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని చెప్పారు. న్యాయవాద వృత్తిలోకి ఆహా్వనం సామాజిక పరిస్థితుల్లో మార్పు కారణంగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయవాదులు, న్యాయమూర్తులు అయ్యేందుకు అవకాశాలు వస్తున్నాయని సీజేఐ చెప్పారు. కానీ ఇప్పటికీ గ్రామీణ, బలహీన వర్గాల నుంచి ఎక్కువ మంది ఔత్సాహికులు న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టట్లేదని భావిస్తున్నానన్నారు. న్యాయవాద వృత్తి ఇంకా పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని, మరింత మంది ఈ వృత్తిలోకి రావాలని ఆయన స్వాగతించారు. సభలో సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, వైస్ చైర్మన్ రామజోగేశ్వరరావు, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వైవీ రవిప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ జీఎల్ నాగేశ్వరరావు, తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహా రెడ్డి, వైస్‌చైర్మన్ కె.సునీల్ గౌడ్, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
జ్యుడిషియల్ ప్రివ్యూకు భూ రీసర్వే టెండర్
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం’ కింద చేపట్టిన భూ రీసర్వే పనులకు సంబంధించిన టెండర్‌ను జ్యుడిషియల్ ప్రివ్యూకు సమర్పించినట్లు సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. డ్రోన్లు, ఏరియల్ ఫొటోగ్రఫీ ద్వారా సర్వే చేసేందుకు అవసరమైన పరికరాల కోసం ఈ టెండర్లను పిలుస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని లక్షా 26 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని అన్ని రకాల భూములను, వాటి విస్తీర్ణ ప్రాంతాలను హైబ్రిడ్ మెథడాలజీ విధానంలో డ్రోన్లు, కార్స్ నెట్వర్క్, జీఎన్ఎస్ఎస్ రిసీవర్లతో రీసర్వే చేస్తామని తెలిపారు. సర్వీస్ ప్రొవైడర్లు, ఆసక్తి కలిగిన బిడ్డర్లు, సాధారణ ప్రజలకు వీటికి సంబంధించి సూచనలు, సలహాలు, రిమార్కులు, అభ్యంతరాలు ఏమైనా ఉంటే జ్యుడిషియల్ ప్రివ్యూకు సెప్టెంబర్ 7వ తేదీలోపు సమర్పించాలని కోరారు. -
దేశంలోనే విశిష్ట ప్రాంతం కర్నూలు
సాక్షి, అమరావతి: కర్నూలును రాష్ట్ర న్యాయ రాజధానిగా కేంద్ర పౌరవిమానయాన శాఖ గుర్తించింది. ఉడాన్ పథకం కింద మార్చి 28 నుంచి కర్నూలు నుంచి విమాన సర్వీసులను ప్రారంభించడంతోపాటు రాష్ట్రంలో ఆరో ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రావడంపై కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి హరిదీప్‌సింగ్ పురి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో కర్నూలును ఆంధ్రప్రదేశ్ న్యాయ రాజధానిగా పేర్కొనడంతోపాటు చారిత్రాత్మకంగా దేశంలో విశిష్టత కలిగిన ప్రాంతంగా అభివరి్ణంచారు. కర్నూలులో గురువారం జరిగిన ప్రారం¿ోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి వర్చువల్ విధానంలో పాల్గొన్నట్లు తెలిపారు. అడవులు, గుహలు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన కర్నూలు.. విమానయాన సర్వీసులు అందుబాటులోకి రావడం ద్వారా పర్యాటకంగా అభివృద్ధి చెంది స్థానికులకు ఉపాధి లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒక పక్క తుంగభద్ర నది, మరోపక్క నల్లమల కొండలు సమాంతరంగా ఉండే ఇక్కడ నల్లమల అడవి, అహోబిలం, బెలూం గుహలు, మహానంది, మంత్రాలయం, ఓర్వకల్లు, సంగమేశ్వరం, కేతవరం, కాల్వబుగ్గ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని వివరించారు. ఈ విమానాశ్రయం నుంచి ఉడాన్ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద 80:20 నిష్పత్తిలో విశాఖ, బెంగళూరు, చెన్నై నగరాలకు విమాన సరీ్వసులను ఈ నెల 28 నుంచి నడపనున్నట్లు తెలిపారు. దేశంలో మొత్తం 325 విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 56 చోట్ల కొత్తగా విమాన సర్వీసులను అందుబాటులోకి తెచి్చనట్లు ఆయన పేర్కొన్నారు. -
జ్యుడీషియల్ ప్రివ్యూకు రామాయపట్నం టెండర్లు
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు టెండర్‌ను మారిటైమ్ బోర్డు జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. రూ.2,169.62 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన కొత్త ఓడరేవు పనులు చేపట్టేందుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి టెండర్లను పిలిచేందుకు న్యాయ పరిశీలన కోసం జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కాంట్రాక్టు (ఈపీసీ) విధానంలో నిర్మించే ఈ ఓడరేవు కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లు(ఆర్ఎఫ్క్యూ) పిలవాలని మారిటైమ్ బోర్డు నిర్ణయించింది. 5.05 కిలోమీటర్ల బ్యాక్ వాటర్‌తోపాటు 3 అధునాతన బెర్తుల నిర్మాణం కోసం టెండర్లకు పిలవనుంది. 15.52 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుకను డ్రెడ్జింగ్ చేసి లోతు తవ్వేలా ప్రణాళికలు రూపొందించింది. రామాయపట్నం పోర్టును తొలిదశలో మొత్తం 900 మీటర్ల పొడవు, 34.5 మీటర్ల లోతు ఉండే విధంగా మూడు బెర్తులతో నిర్మించనున్నారు. ప్రాజెక్టును 36 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ అంశాలతో కూడిన టెండర్లను ఏపీ మారిటైమ్ బోర్డు జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. (రామాయపట్నానికి గ్లోబల్ టెండర్లు) -
టెండర్లలో గోల్ మాల్‌కు తెర
సాక్షి, అమరావతి: టెండర్ల ప్రక్రియలో అనుసరిస్తున్న పారదర్శక విధానాలతో పెద్ద ఎత్తున ప్రజాధనం ఆదా అవుతోంది. రివర్స్ టెండర్లు, గత సర్కారు నిర్ణయాలపై పునఃసమీక్షల ద్వారా గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు రూ.4 వేలకు కోట్లకుపైగా ఆదా కావడం దీన్ని రుజువు చేస్తోంది. గత సర్కారు హయాంలో ఏ టెండర్ ఎవరికి ఇవ్వాలో ముందుగానే నిర్ణయించుకుని వారికే దక్కేలా నిబంధనలు రూపొందించారు. కొన్నిసార్లు ఎలాంటి టెండర్లు పిలవకుండానే నామినేషన్‌పై అప్పగించారు. పరిపాలన అనుమతులు లేకుండానే నోటి మాటతో నామినేషన్‌పై ఆర్టీజీఎస్లో టెండర్‌ను అప్పగించారు. వీటికి పూర్తి భిన్నంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టెండర్ విధానాలను ప్రక్షాళన చేయడమే కాకుండా జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పూర్తి పారదర్శక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రివ్యూకు 45 ప్రాజెక్టులు.. ► టెండర్ల ప్రక్రియలో ఇన్సైడర్ ట్రేడింగ్ నిరోధం, పోటీతత్వం పెంపు, బిడ్డింగ్‌లో పారదర్శకంగా ప్రజాధనాన్ని సద్వినియోగం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టాన్ని తెచ్చింది. ► గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు 45 ప్రాజెక్టులకు సంబంధించి రూ.14,286 కోట్ల విలువైన పనుల టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు ప్రభుత్వం పంపింది. రూ.100 కోట్లు, అంతకు మించిన పనులన్నీ జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్తున్నాయి. ► రివర్స్ టెండరింగ్తోపాటు గత సర్కారు నిర్ణయాలను సమీక్ష చేయడం ద్వారా ఇప్పటివరకు రూ.4,000 కోట్లకుపైగా ప్రజాధనాన్ని ఆదా చేయగలిగారు. సాధారణ టెండర్లో 7.7 శాతం ప్రజాధనం ఆదా కాగా రివర్స్ టెండర్లకు వెళ్లడంతో 15.01 శాతం ఆదా కావడం గమనార్హం. (చదవండి: కూలీల ‘ఉపాధి’నీ అడ్డుకుంటున్నారు..) గత సర్కారు హయాంలో నామినేషన్‌పై రూ.13 వేల కోట్ల పనులు.. ► గత ప్రభుత్వం నీరుచెట్టు పేరుతో అస్మదీయులకు ఏకంగా రూ.13 వేల కోట్ల విలువైన పనులను నామినేషన్‌పై పందేరం చేసింది. ఇందులో 90 శాతం నిధులను టీడీపీ నేతలు తమ జేబుల్లో వేసుకున్నారు. పోలవరం ఎడమ కాలువ 5వ ప్యాకేజీకి చెందిన రూ.180 కోట్ల విలువైన పనులను చంద్రబాబు చెప్పారంటూ మాజీ ఆర్థిక మంత్రి బంధువుకు నామినేషన్‌పై ఇచ్చేశారు. ► ఆర్టీజీఎస్లో పరిపాలన అనుమతి లేకుండా రూ.185 కోట్ల విలువైన పనులను నామినేషన్‌పై కట్టబెట్టారు. ► సీఆర్డీఏలో టెండర్లలో గోల్‌మాల్‌కు అంతే లేదు. ఐదారుగురు కాంట్రాక్టర్లకు భారీగా అంచనాలు పెంచి అప్పగించారు. ఇప్పుడు పారదర్శకంగా టెండర్లు, పనులు.. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫర్నీచర్‌తోపాటు సెల్ఫోన్లు, సిమ్ కార్డులకు కూడా టెండర్లను పిలవడమే కాకుండా రివర్స్ టెండరింగ్‌ను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ► మన బడి నాడు–నేడు కార్యక్రమానికి సంబంధించి స్కూళ్లలో ఫర్నీచర్‌తో పాటు గ్రీన్‌బోర్డులు, అల్మారాలకు కూడా టెండర్లను పిలవడమేగాక రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. రాజకీయ జోక్యం లేకుండా పూర్తి పారదర్శకంగా టెండర్ల ప్రక్రియను చేపట్టారు. రూ.కోటి విలువైన పనులతోపాటు కొనుగోళ్లు, సేవలకు కూడా రివర్స్ టెండరింగ్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. (చదవండి: శ్రీకాంత్‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది) -
సీమకు న్యాయం.. కర్నూలులో న్యాయ రాజధాని
ప్రజాకాంక్ష నెరవేరింది. కర్నూలులో న్యాయ రాజధాని నిశ్చయమైంది. రాయలసీమకు మణిహారమై వెలుగొందనుంది. ప్రగతి వీచికలు ఇక్కడి నుంచే మొదలయ్యాయి. ఏళ్ల నాటి కల సాకారం అవుతుండడంతో ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎన్నో ఏళ్ల కల సాకారం రాయలసీమ గతంలో రాజధానిని త్యాగం చేసింది. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కనీసం హైకోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోయింది. పైగా కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చి మోసం చేశారు. ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవిస్తూ కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం అభినందనీయం. ఎన్నో ఏళ్ల కల సాకారం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. –పి.రవిగువేరా, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం వికేంద్రీకరణపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం చేస్తే మరోసారి రాçష్ట్ర విభజన ఉద్యమం తెరపైకి వచ్చే అవకాశముంది. ఇప్పటికే రాజధానిగా కర్నూలు, హైదరాబాద్ కోల్పోయి తీవ్రంగా నష్టపోయాం. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తోంది. – ప్రొఫెసర్ శ్రీనివాసరావు, రాయలసీమ విశ్వవిద్యాలయం మహానందిలో బైక్‌ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం.. ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధానిగా ఎంపికైన ప్రాంతం.. శ్రీబాగ్ ఒడంబడికను తుంగలో తొక్కి రాజధాని మార్చడంతో దగాకు గురైన ప్రాంతం.. దశాబ్దాల తరబడి పాలకుల నిర్లక్ష్యంతో కునారిల్లిన ప్రాంతం.. అభివృద్ధి లేమితో కొట్టుమిట్టాడిన ప్రాంతం.. నిత్యం త్యాగాలతో కన్నీటి ‘సీమ’గా మిగిలిపోయిన ప్రాంతం.. ఇలాంటి ప్రాంతానికి ఇన్నేళ్ల తర్వాత సరైన ‘న్యాయం’ జరిగింది. రాయలసీమ ముఖద్వారంగా పేరుగాంచిన కర్నూలులో ‘న్యాయ రాజధాని’ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సోమవారం ఉదయం మంత్రివర్గ ఆమోదం లభించగా..రాత్రి అసెంబ్లీలోనూ బిల్లు పాసయ్యింది. కర్నూలులో హైకోర్టుతో పాటు న్యాయ సంబంధ సంస్థలను నెలకొల్పి.. ‘న్యాయ రాజధాని’గా ఏర్పాటు చేసే బిల్లు ఆమోదం పొందడంపై జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిõÙకం చేశారు. న్యాయవాదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి ►ఆ దిశగా కృషి చేస్తున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు ►సీమాభివృద్ధికి టీడీపీ అడ్డుపడడం సిగ్గుచేటు ►వైఎస్సార్సీపీ నేత బీవై రామయ్య దశాబ్దాల తర్వాత న్యాయం ఆరు దశాబ్దాల కిందట కర్నూలు ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉండేది. ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడు న్యాయ రాజధాని అవుతోంది. ఇన్నేళ్లలో ఎంతోమంది నేతలు కర్నూలుపైన, రాయలసీమపైన వల్లమాలిన ప్రేమ ఒలకబోశారు. బీజేపీ అధికారంలోకి వస్తే హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించారు. కర్నూలులో హైకోర్టు ఉండాలని, మరో అడుగు ముందుకేసి రాజధానే కర్నూలులో ఉండాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన తర్వాత వీరంతా మాటమార్చారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకునేలా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కాకూడదనేలా 20–30 రోజులుగా రోజూ ప్రకటనలు చేస్తూ, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. చివరకు జిల్లావాసి అయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపి సీమకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తీరును స్వయాన సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. చదవండి: మూడు రాజధానులకే ప్రజల మొగ్గు చంద్రబాబుతో అంటకాగుతూ, తమ మనోభావాలు దెబ్బతినేలా రామకృష్ణ ప్రవర్తిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలన్నది సీపీఐ పాలసీ అని, కానీ రామకృష్ణ జిల్లా అభివృద్ధి కంటే చంద్రబాబుతో దోస్తీకే ప్రాధాన్యమిచ్చారని ఆ పార్టీ శ్రేణులే ఆక్షేపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ నేతలు జయనాగేశ్వరరెడ్డి, అఖిలప్రియ, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డితో పాటు పలువురు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ ఒకేచోట ఉండాలని, వికేంద్రీకరణ వద్దని ప్రకటనలు చేశారు. జిల్లాకు హైకోర్టు వస్తుంది..తద్వారా అభివృద్ధికి బాటలు పడతాయనే కనీస బాధ్యత కూడా లేకుండా ప్రవర్తించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు నగరంలో దాదాపు 100 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేసి తమ డిమాండ్‌ను ప్రభుత్వానికి తెలిపారు. అయినప్పటికీ విపక్షాలు మాత్రం హైకోర్టు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశాయి. జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు బిల్లును అసెంబ్లీ ఆమోదించడంపై జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. డోన్ పట్టణంలో టీటీసీ కాలేజీ ప్రిన్సిపాల్ చంద్ర ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు స్థానిక విఘ్నేశ్వర ఆలయంలో 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు కోర్టు ఆవరణలో న్యాయవాదులు మిఠాయిలు పంచుకున్నారు. రాయలసీమ విద్యార్థి సంఘం నాయకులు, విద్యార్థులు, న్యాయవాదులు భారీగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న గాందీజీ విగ్రహం వద్దకు చేరుకుని బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. చదవండి: అమరావతి.. బాబు అవినీతి కలల రాజధాని వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రరెడ్డి, నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజ్‌విహార్ సర్కిల్లో వైఎస్సార్, సీఎం జగన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కొండారెడ్డి బురుజు వద్ద స్థానికులు మిఠాయిలు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఆలూరులో మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణస్వామి ఆధ్వర్యంలో సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శిల్పా భువనేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు మహానంది నుంచి గాజులపల్లె వరకూ ర్యాలీ నిర్వహించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు జరిగాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ ర్యాలీలతో హోరెత్తించారు. ‘సీమ’ అభివృద్ధికి బాటలు వేసేలా.. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణపై విపక్షాలు ఎంత యాగీ చేసినా ప్రభుత్వం మాత్రం ‘న్యాయమైన’ నిర్ణయం వైపు మొగ్గు చూపింది. భవిష్యత్తులో ప్రాంతీయ అసమానతలకు చోటు లేకుండా, అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరగాలన్న బాధ్యతాయుతమైన దృక్పథంతో మూడు రాజధానుల వైపు మొగ్గు చూపింది. అందులో భాగంగా న్యాయరాజధానిగా కర్నూలును నిర్ణయించింది. రాయలసీమ అభివృద్ధి బాటలో పయనించాలన్న సంకల్పంతో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. -
కర్నూలులో న్యాయవాదులు భారీ ర్యాలీ
-
‘ఆ పని చేయమని లోకేష్‌ను కోరుతున్నా’
సాక్షి, కర్నూలు : నగరాన్ని జ్యుడీషియల్ క్యాపిటల్‌గా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే కర్నూలుకు న్యాయం జరిగిందని ఆయన వెల్లడించారు. దశాబ్దాల క్రితం జరిగిన అన్యాయాన్ని ఇప్పుడు సవరించారని ఆనందం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల వల్ల వికేంద్రీకరణ జరిగి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో అమరావతిలో పథకం ప్రకారం ఇన్సైడర్ ట్రేడింగ్ జరిపి బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేశారని మండిపడ్డారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కి ఏర్పాటు చేసిన అమరావతిలో 40 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అభివృద్దిపథంలో దూసుకుపోతున్న జగన్‌ను చూసి చంద్రబాబు కడుపు రగిలిపోతోందనీ, ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారోనని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బాబుకు మతిభ్రమించి అసెంబ్లీలో అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ఆయనను వెంటనే ఆసుపత్రిలో చూపించాలని లోకేష్‌బాబును కోరారు. మరోవైపు సర్పంచ్‌కు కూడా అర్హత లేని జనసేన అధినేత గురించి మాట్లాడుకోవడం వృథా అని తేల్చి చెప్పారు. -
ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో టెండర్లు
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో 104, 108, ఈఆర్సీ (ఆపరేషన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్స్)ల ఏర్పాటుకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ ప్రివ్యూ వెబ్సైట్లో ఉంచినట్లు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి.శివశంకరరావు తెలిపారు. గుంటూరులోని ఆర్అండ్బీ కార్యాలయంలో ఉన్న ప్రభుత్వ జ్యుడీషియల్ ప్రివ్యూ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జ్యుడీషియల్ ప్రివ్యూ ‘లోగో’ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా బాధ్యత గల పౌరులుగా ప్రజలు, కాంట్రాక్టర్లు, నిష్ణాతులు.. టెండర్లపై తమ అభ్యంతరాలు, సూచనలను ఈ నెల 31వ తేదీలోగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఉచితంగా బోర్లు వేసేందుకు ప్రభుత్వం కొనుగోలు చేయనున్న 200 రిగ్గుల యంత్రాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను పరిశీలించి, అందులోని లోపాలను సవరించాలని చెప్పామన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంత ప్రజలకు తాగునీరు అందించేందుకు వీలుగా రూ.600 కోట్లతో టెండర్లు పిలుస్తున్నారని, ఆ టెండరును పరిశీలించి లోపాలను సవరించాలని అధికారులకు సూచించామని తెలిపారు. తర్వాత వాటిని వెబ్సైట్లో అప్లోడ్ చేసి.. అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. గాలేరు నగరి – సుజల స్రవంతి పనులకు సంబంధించిన టెండర్ జ్యుడీషియల్ ప్రివ్యూకు వచ్చిందని, దానిని పరిశీలించాల్సి ఉందన్నారు. -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ఆదిలాబాద్‌టౌన్: ప్రతీ విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జీవన్‌కుమార్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ము ఖ్యం గా విద్యార్థినులు మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చాలా మంది వీటిపై అవగాహన లేకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు తోటి విద్యార్థినులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన కేసులు నమోదు చేస్తారని, దీంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా నిలిచే ప్రమాదం ఉందన్నారు. మహిళల పట్ల గౌరవంగా మెలగాల ని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పల్ జాకిర్ హుస్సేన్, వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్, అధ్యాపకులు మంజుల, శ్రావణి, విజయ్‌కుమార్, జగ్రాం, రమేశ్‌రెడ్డి, నర్సింగ్‌రావు, ప్రతాప్‌సింగ్, తిరుపతి, విద్యార్థులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలి జైనథ్: ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సిటిజన్ ఫోరం మండల ఇన్చార్జి కొం గర్ల గణేశ్ అన్నారు. బుధవారం ఆయన మండలకేంద్రంలో సిటిజన్ ఫోరం సభ్యులు, స్థానిక నా యకులతో కలిసి ఏక్‌సాల్ మే పరివర్తన్ గోడ ప్రతులను విడుదల చేశారు. ఆయన మాట్లాడు తూ ప్రజలంతా ఏకమై గ్రామాలను హరితవనా లుగా తీర్చిదిద్దాలన్నారు. స్వచ్ఛభారత్ స్ఫూర్తి తో పరిశుభ్రమైన గ్రామాలను తయారు చేయాలన్నా రు. చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెం చుకొని, నేరరహిత సమాజ స్థాపనకు నడుం బిగిం చాలన్నారు. కుల,మత, రాజకీయ, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగాన్ని బలోపేతం చేసి, ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించాలని కోరారు. నాయకులు సర్సన్ లింగారెడ్డి, కిష్ఠారెడ్డి, వెంకట్‌రెడ్డి, గణేశ్‌యాదవ్, రమేశ్, గంగన్న పాల్గొన్నారు. -
బినామీ కేసులకు అప్పిలేట్ ట్రిబ్యునల్
న్యూఢిల్లీ: బినామీ లావాదేవీల కేసుల సత్వర విచారణకు అపిలేట్ ట్రిబ్యునల్, న్యాయ నిర్ణాయక ప్రాధికార సంస్థల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా అప్పిలేట్ ట్రిబ్యునల్, న్యాయ నిర్ణాయక ప్రాధికార సంస్థలు విధులు నిర్వర్తించనున్నాయి. కోల్‌కతా, ముంబై, చెన్నైలలో ప్రాధికార సంస్థకు అనుబంధ బెంచ్‌లు ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటన జారీ అయింది. ఈ సంస్థ చైర్మన్‌ను సంప్రదించిన తరువాత బెంచ్‌ల ఏర్పాటుపై నోటిఫికేషన్ వెలువడుతుంది. ఈ రెండు సంస్థల ఏర్పాటుతో బినామీ కేసులు వేగంగా, సమర్థవంతంగా పరిష్కారమవుతాయని ప్రకటనలో పేర్కొన్నారు. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం కింద తీసుకున్న చర్యలకు న్యాయ నిర్ణాయక ప్రాధికార సంస్థ తొలి సమీక్ష వేదికగా పనిచేస్తుంది. ప్రాధికార సంస్థ ఆదేశాలను అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాలు చేయొచ్చు. ఆశా సమన్వయకర్తల భత్యాల పెంపు: ఆశా సమన్వయకర్తల పర్యవేక్షణ భత్యాలను పెంచడానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పచ్చజెండా ఊపింది. అక్టోబర్ నుంచి ఒక్కో క్షేత్రస్థాయి పర్యవేక్షణ పర్యటనకు రూ.250కి బదులు రూ.300 చెల్లిస్తారు. ఫలితంగా ఆశా సమన్వయకర్తలు నెలకు పొందే మొత్తం వేతనం రూ.5 వేల నుంచి రూ.6 వేలకు పెరగనుంది. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 41 వేల ఆశా సమన్వకర్తలను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయం పట్ల ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా హర్షం వ్యక్తం చేశారు. సాధారణంగా ఆశా కార్యకర్తల నుంచే సమన్వయకర్తలను ఎంపికచేస్తారు. ∙ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో దేశవ్యాప్తంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ (ఐఐఎస్ఎస్) ఏర్పాటుకు ఆమోదం. -
వ్యవస్థ విలువ
ఏ రోజు పేపరు తెరిచినా ఈనాటి దేశ పాలన ఆయా ప్రభుత్వాలు కాక సుప్రీం కోర్టు, చాలాచోట్ల హైకో ర్టులు నిర్వహిస్తున్నాయనిపి స్తుంది. తెల్లవారి లేస్తే ఫలానా పరీక్షలలో అయిదు మార్కులు కలపాలా వద్దా, గవర్నరుగారు ఇచ్చిన తాఖీదు ఫైలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఎంత కాలం ఉండవచ్చు, కలిసి ఒక గదిలో బతికే అమ్మాయి, అబ్బాయి ఎంత కాలానికి భార్యాభర్తలనిపించు కుంటారు, అరెస్టయిన ఫలానా వ్యక్తి నేరస్తుడు అవునా? కాదా? చిన్న పిల్లల పునరావాసాలపైన నిబంధనలు సబబా, కాదా? ఫలానా నీటి పారుదల కాలువ పక్కన మరుగుదొడ్డిని నిర్మించవచ్చా, కూడదా?– ఈ విషయాలన్నింటిపై న్యాయం చెప్పా లని సుప్రీంకోర్టును వ్యాజ్యాల ద్వారా అభ్యర్థించారు. ఈ మధ్య డీఎంకే నేత ఎం.కరుణానిధి తమిళ నాడులో కన్నుమూశారు. ఆయన వయస్సు 94 ఏళ్లు. దేశమంతా నివాళులర్పించింది. ఆయన 13 సార్లు శాసనసభకి ఎన్నికై, అయిదుసార్లు రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా సేవ చేశారు. ఒక పక్క శవం ఉండగా ఆయన పార్థివ శరీరానికి మెరీనా బీచ్‌లో అంత్య క్రియలు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆయన పార్టీ నాయకులు ముఖ్యమంత్రిని అర్థించారు. ముఖ్యమంత్రి కారణాలు చెప్పి కాదన్నారు. రాత్రికి రాత్రే మద్రాసు హైకోర్టు విచారణ జరిపి, మెరీనాలో కరుణానిధి అంత్యక్రియలు జరపడానికి అనుమతిని ఇచ్చింది. బయటవారికి కనిపించేది పాలకవర్గం వ్యతి రేకతో, చట్టపరమైన అభ్యంతరం మాత్రమే కాదు, ఒక పక్క దేశ రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులు, విదేశీ ప్రముఖులు నివాళులర్పిస్తుండగా, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏఐడీఎంకే ప్రభుత్వం న్యాయస్థా నంలాగా పెద్దరికం చూపలేకపోయిందే అని. ఒక అనూహ్యమైన, అద్భుతమైన విషయం. సాలీనా 160 లక్షల పోలీసు కేసులున్న బిహార్ దక్షిణ ప్రాంతంలోని ‘పాడియా’ అనే గ్రామవాసులు ఇంత వరకూ న్యాయస్థానం ముఖం చూడలేదు. గత 100 సంవత్సరాలలో ఒక్కటి ఒక్కటంటే ఒక్క పోలీసు కేసు లేదట. ఇది ఈనాటి భారతదేశంలో తగాదాలు లేని, మధ్యవర్తి అవసరం రాని జీవితం గొప్ప సంస్కారం. ఇది ఒక గ్రామం ఒక శతాబ్దంగా పాటిం చడం, అదిన్నీ మన దేశంలో గొప్ప విడ్డూరం. న్యాయ వ్యవస్థ మనకు మనం ఏర్పాటు చేసు కున్న ‘నియతి’. ఆ వ్యవస్థ మన సంస్కారానికీ, పరి ణతికీ సూచిక. అయితే ఆ వ్యవస్థ తప్ప మన నిర్ణ యాలకీ, జీవన విధానానికీ గతిలేని స్థితిని తెచ్చు కోవడం ఆ వ్యవస్థ పతనానికి నిదర్శనం. మనం ఏర్పరచుకున్న న్యాయస్థానం గొప్ప విచక్షణ, నిష్పక్ష పాత వైఖరి గల వ్యవస్థ. మన తలకు మించిన సమ స్యలకి దాన్ని ఆశ్రయించడం మన లక్ష్యం. ఏ రామ మందిరం తగాదానో, ఏ ముస్లిం విడాకుల సంప్రదా యమో, కశ్మీరులో 370 అధికరణ ఆవశ్యకతో– ఇలాంటివి సుప్రీంకోర్టు నిర్ణయించి తీర్పు ఇవ్వాల్సిన గంభీరమైన సమస్యలు. ఫలానా పరీక్షలో అయిదు మార్కులు కల పాలా? రహదారి బంగళా పక్క సారా దుకాణం ఉండాలా? వంటి అతి సామాన్య సమస్యల పరిష్కా రానికి కాదు. మరి ఇప్పుడాపనే జరుగుతోంది. ఈ దేశాన్ని పాలక వ్యవస్థ కాక అతి ముఖ్యమైన కొండ కచో నవ్వు పుట్టించే, చాలాసార్లు నవ్వులపాలు చేసే సమస్యల పరిష్కారం ఈ వ్యవస్థ మీద పడింది. ఫలానా జాతీయ గీతం ఫలానా చోట వెయ్యాలా వద్దా? అప్పుడు మనం నిలబడాలా, అక్కరలేదా? ఇది వ్యవస్థలో చిత్తశుద్ధి, విచక్షణ లేకపోవడానికి నిద ర్శనమని నాకనిపిస్తుంది. కాళీపట్నం రామారావుగారి ‘యజ్ఞం’ గొప్ప కథ. వివరాలు అలా ఉండగా స్థానికులు అంగీక రించిన ఊరిపెద్ద శ్రీరాములు నాయుడు ఆ ఊరిలో చిన్న రైతు అప్పలరాముడు అప్పు గురించి నిర్ణ యాన్ని చెప్తాడు. కథంతా ఆ నిర్ణయం పర్యవ సానాన్ని గురించి. ఆ నిర్ణయానికి తలొంచడం ఆ గ్రామం ‘కట్టుబాటు’. నాయుడి తీర్పు విన్నాక పర్య వసానం కథ. అలా కాక అప్పలరాముడు రొమ్ము విరిచి ‘ఇలా నిర్ణయించడానికి నువ్వెవరయ్యా?’ అన్నా, ‘ముందు పట్నంలో నీ మూడో పెళ్లాం సంగతి తేల్చు’ అని బోర విరిస్తే అది మరొక కథ. ఓ గొప్ప విలువ పతనం. ఏమిటీ ఈ విపరీతం? ఏమయింది ఈ వ్యవ స్థకి? ఒకరిపట్ల ఒకరికి, ఒక వ్యవస్థపట్ల గౌరవం, నమ్మకం, మర్యాద లుప్తమవడమే ఇందుకు నిద ర్శనం. ప్రతీ విషయానికీ సుప్రీంకోర్టుని ఆశ్రయిం చడం, క్లిష్ట సమస్యపై తీర్పు చెప్పాలని అభ్యర్థిం చడం గడుసైన వ్యవహారం. వ్యవస్థను బెదిరించి నడి పించడమే. మనం ఏర్పరచుకున్న గొప్ప వ్యవస్థ మన విశ్వాస రాహిత్యం, విచక్షణా రాహిత్యం, దుర్విని యోగం, నవ్వు పుట్టించే ఆకతాయి వ్యాజ్యాల కార ణంగా మరుగుదొడ్లు, దెయ్యాల స్థాయికి తీసుకువస్తే ఏమవుతుంది? ఏ రోజు పేపరు తెరిచినా అందుకు వంద సమాధానాలు దొరుకుతాయి. గొల్లపూడి మారుతీరావు -
జస్టిస్ గొగోయ్‌కి అన్ని అర్హతలున్నాయి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యేందుకు జస్టిస్ రంజన్ గొగోయ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని శుక్రవారం పదవీవిరమణ చేసిన జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. పదవీవిరమణ అనంతరం ఆయన పలు మీడియా సంస్థలతో మాట్లాడారు. ధర్మాసనాల కేటాయింపు సహా పలు అంశాలపై సీజేఐ తీరును తప్పుబడుతూ జనవరి 12న తనతో పాటు మరో ముగ్గురు జడ్జిలు కలిసి పెట్టిన ప్రెస్‌మీట్‌పై స్పందిస్తూ.. తాను తప్పు చేశానని భావించడం లేదని స్పష్టం చేశారు. తన నిర్ణయాన్ని పలువురు మాజీ సీజేఐలు కూడా ప్రశంసించారని గుర్తు చేశారు. న్యాయవ్యవస్థలో లోపాలున్నాయని, వాటిని సరిదిద్దేందుకు సరైన దిశలో ఆలోచించే వారంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కేసుల కేటాయింపు విషయంలో సుప్రీంకోర్టులో సమస్య ఉందని పునరుద్ఘాటించారు. న్యాయవ్యవస్థలోని అన్ని విభాగాల్లో మరింత పారదర్శకత రావాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవ్యవస్థలో నెలకొన్న అవినీతిపై మరింత తీవ్ర స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్ పెట్టిన రోజు తన ఇంటికి సీపీఐ నేత రాజా రావడంపై స్పందిస్తూ.. రాజా తనకు చాన్నాళ్ల నుంచి మిత్రుడని, తామిద్దరమూ మద్రాస్ యూనివర్సిటీ విద్యార్థులమేనని తెలిపారు. ఆ రోజు(ప్రెస్ మీట్ పెట్టిన రోజు) తన ఇంటి ముందు భారీగా మీడియా ఉండటంతో.. ఏం జరిగిందనే ఆందోళనతో ఆయన వచ్చారని వివరించారు. ‘అయితే, అప్పటికి మరికొన్ని వారాల్లో నేను రిటైర్ అవబోతున్నా. అప్పుడు నా ఇంటికి ఎవరొచ్చారనే విషయం కన్నా.. అధికారంలో ఉన్నవారితో ఎవరు(న్యాయమూర్తులు) సమావేశమవుతున్నారనేది మరింత కీలకమైన అంశం’ అని చలమేశ్వర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘న్యాయవ్యవస్థలో, న్యాయపరమైన అంశాల్లో సీనియర్ మోస్ట్ జడ్జి, అత్యంత జూనియర్ జడ్జి సమానమే. అయితే, ప్రధాన న్యాయమూర్తిగా సీజేఐకి కొన్ని అదనపు పరిపాలనాపరమైన అధికారాలుంటాయి’ అని వివరించారు. సీజేఐకి వ్యతిరేకంగా విచారణకు వచ్చిన ఒక కేసుకు సంబంధించి తాను ఏర్పాటు చేసిన ఐదుగురు సీనియర్ జడ్జిల ధర్మాసనాన్ని మారుస్తూ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. జస్టిస్ జోసెఫ్ సమర్ధుడు ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించే విషయంలో కేంద్రం తీరును ఆయన తప్పుబట్టారు. సమర్ధుడైన న్యాయమూర్తి అయిన జస్టిస్ జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించేందుకు, ఆయన పేరును కొలీజియం మరోసారి సిఫారసు చేయాలన్నారు. జస్టిస్ జోసెఫ్ తన ప్రాంతంవాడో, తన భాషవాడో, తన మతం వాడో కాదని, అయినా ఆయన పదోన్నతి కోసం పోరాడానని వివరించారు. కొలీజియంలోకి జస్టిస్ ఏకే సిక్రీ! సీనియర్ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ రిటైర్మెంట్తో సుప్రీంకోర్టు కొలీజియంలో మార్పులు జరగనున్నాయి. చలమేశ్వర్ స్థానంలో జస్టిస్ ఏకే సిక్రీ ఐదుగురు సభ్యుల బృందంలో చోటు దక్కించుకోనున్నారు. -
న్యాయ వ్యవస్థ పయనం ఎటు?
‘న్యాయస్థానం న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టు ఆచరణలో కనిపించాలి. ఉన్నత న్యాయస్థానంలో ఆసీనులైన న్యాయమూర్తుల నడత కూడా న్యాయవ్యవస్థ నిష్పాక్షికతలో ప్రజల విశ్వాసం పాదుకొనేలా, దానిని రూఢి పరిచేలా ఉండాలి. ఈ విశ్వసనీయతను తుడిచిపెట్టేసే విధంగా సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల చర్యలు ఉండరాదు.’ – (‘న్యాయమూర్తుల జీవన విలువల పునరుద్ఘాటన’ పేరుతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంయుక్త సమావేశం చర్చించి ఆమోదించి మే 7,1997న విడుదల చేసిన ప్రకటన పత్రం) ‘జ్ఞానం కత్తి వంటిది. దాని విలువ ఆ జ్ఞానాన్ని వినియోగించుకునేవాడి చేతులలో ఉంటుంది. చదువులేని వాడు ఎదుటివారిని వంచించగల శక్తి గల వాడు కాదు. ఎవరినీ మోసగించే ‘కళ’ అతనికి తెలియదు. కానీ చదువుకున్న వాడు మాత్రం నిజాన్ని అబద్ధంగానూ, అబద్ధాన్ని నిజంగానూ తన వాదనా బలం చేత తారుమారు చేయగలడు. ఈ వంచనా శిల్పంతోనే చదువుకున్నవాళ్లు ప్రజలను మోసగిస్తూ ఉంటారు.’ – డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికీ, సుప్రీంకోర్టుకూ మధ్య ఇటీవల తరచూ కొన్ని అంశాల మీద ఘర్షణ వాతావరణం కనిపిస్తున్నది. అది భారత రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు, ప్రజలు తమకు తాము అంకితం చేసు కుంటూ ఆమోదించిన సెక్యులర్, సోషలిస్ట్, గణతంత్ర ప్రజాస్వామ్య సూత్రాల ద్వారా అవతరించిన రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించే వాతావరణం అనిపించదు. వివిధ సవరణల ద్వారా (ప్రగతిశీలమైనవీ, అలా అనిపించుకో లేనివీ) చొచ్చుకు వచ్చిన భావాలతో న్యాయస్థానాలకు, పాలకపక్షాలకు మధ్య అవాంఛనీయ వాతావరణం నెలకొంటున్నది. డాక్టర్ అంబేడ్కర్ తది తరులు రూపొందించిన రాజ్యాంగానికి తరువాతి కాలాలలో తూట్లు పడడా నికి కారణం ఇదే. ప్రభుత్వాన్ని నిర్వహించే పాలకపక్షానికీ (బ్రాండ్ ఏదైనా) శాసన వేదికలకూ న్యాయస్థానాలకూ రాజ్యాంగం బాధ్యతలను విభజిం చింది. అయితే న్యాయస్థానాలకు మరొక అదనపు బాధ్యతను కూడా అప్ప గించింది. అదే– ప్రభుత్వ నిర్ణయాలను, చట్టసభ సభ్యుల నిర్ణయాలను పరిశీ లించి, వాటిలోని తప్పొప్పులను కనిపెట్టి వాత పెట్టడమే. రాజ్యాంగం మార్చే కుట్ర బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలకూ వీటి మీద పౌర సమాజం నుంచి వెల్లువె త్తుతున్న రిట్ల ఆధారంగా కోర్టులకు ఉన్న సర్కారును ప్రశ్నించే అధికారానికీ మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణ జరుగుతోంది. ఇందుకు మూలాలు అత్యవసర పరిస్థితి కాలంలో లభిస్తాయి. తన ఇష్టానుసారం జరిగిన నిర్ణయాలకు రాజ్యాంగ విరుద్ధంగా ఆమోదముద్ర వేయించడానికి నాటి కాంగ్రెస్ పార్టీ ప్రధాని న్యాయవ్యవస్థను వినియోగించుకున్నారు. ఇప్పుడు రాజ్యాంగాన్నీ, అందులోని ప్రజాస్వామిక నిబంధనలనీ మత ప్రాతిపదికపైన మార్చేందుకు లేదా సవరించేందుకు బీజేపీ పాలనలో ప్రయత్నం జరుగుతున్నది. న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి విఘాతం కలిగించే విధంగా పావులు కదపడం ఇందుకు తొలిమెట్టు. న్యాయవ్యవస్థ ప్రత్యేకంగా నెలకొల్పుకున్న కొలీజి యంకు విరుద్ధంగా నేషనల్ జ్యుడీషియల్ కొలీజియంను నెలకొల్పాలని ప్రభుత్వం ప్రయత్నించింది. ఇది న్యాయ వ్యవహారాలలో ప్రభుత్వ జోక్యంగా భావించిన న్యాయవ్యవస్థ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఇదే చినికి చినికి గాలివాన అయింది. సుప్రీంకోర్టు కొలీజియం (సమష్టి వ్యవస్థ) నిర్మాణంలో కూడా లొసు గులు ఉన్నాయనీ, ముందు వాటిని సవరించుకోవాలనీ సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ చలమేశ్వర్ సూచించారు. అంతేగాని మోదీ ప్రభుత్వం నేషనల్ కొలీజియం ప్రతిపాదనను ఆయన సమర్థించలేదు. అయితే అత్యున్నత న్యాయస్థానం నిర్మాణ సూత్రాల మేరకు ప్రధాన న్యాయమూర్తిని ‘సమాను లలో సమానుడు’గానే భావిస్తూ, న్యాయస్థానం అధిపతిగా గుర్తించారు. కోర్టు పరిశీలనకు వచ్చిన కేసులను ధర్మాసనాలకు కేటాయించే అధికారం అప్పగించారు. ఈ కేటాయింపులలో పక్షపాతం లేకుండా సీనియారిటీని కూడా దృష్టిలో పెట్టుకుని వ్యాజ్యాలను ధర్మాసనాలకు కేటాయించాలన్నది వ్యవహార న్యాయం. ఈ న్యాయం ఎక్కడో దారి తప్పినందునే జస్టిస్ చల మేశ్వర్ సహా నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యవస్థను గాడిలో పెట్టడానికి సాహసించి పత్రికా గోష్టిని నిర్వహించవలసి వచ్చింది. సుప్రీం లోని నడవడికను బహిర్గతం చేస్తూ దేశాన్నీ ప్రజలనూ జాగరూకం చేయ వలసి వచ్చింది. చలమేశ్వర్ ప్రభృతుల నిర్ణయం సబబా కాదా అన్నది ఆ తరువాత కొలది రోజుల్లోనే జరిగిన పరిణామం నిరూపిస్తోంది. సంఘర్షణ, సర్దుబాటు న్యాయస్థానం పరిధిలోకి చొరబడే పాలకులకు హెచ్చరికగా 17వ శతాబ్దపు ఇంగ్లండ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోక్ ఉదంతాన్ని చెప్పుకోవచ్చు. ఆయన కోర్టు పరువును కాపాడిన తీరు ప్రశంసనీయం. జస్టిస్ కోక్‌ను నియ మించింది జేమ్స్ రాజే, అయినా కోక్‌ను నియంత్రించడానికి ప్రయత్నిం చాడు. ‘నీవు ప్రధాన న్యాయమూర్తివే అయినా పాలకుడిని కాబట్టి కోర్టుల్లో జోక్యం చేసుకుని నేను ఏ కేసునైనా సరే కోర్టుల పరిధి నుంచి తప్పిం చేయగలను’ అని ప్రకటించాడు. అప్పుడు జస్టిస్ సి.జె. కోక్ ‘పాలకుడికి ఆ అధికారం లేదు, ఇంగ్లండ్ చట్టం ప్రకారమే న్యాయస్థాన నిబంధనల ప్రకా రమే, న్యాయచట్టం ప్రకారమే కేసులు పరిష్కారమవుతాయి’ అని ప్రకటిం చాడు. ఈ మాటను అవమానంగా భావించిన జేమ్స్, ‘అంటే, మీ ఉద్దేశం నేను చట్టానికి లొంగి ఉండాలా? ఇది దేశద్రోహం’ అన్నాడు. అందుకు జస్టిస్ కోక్, ‘మీరు పాలకులు, మీరు ఏ వ్యక్తికీ లోబడి ఉండొద్దు. కానీ, చట్టానికి మాత్రం లోబడి ఉండాల్సిందే!’ అన్నాడు. కానీ ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న లార్డ్ మాన్స్ఫీల్డ్ (18వ శతాబ్దం) తన సోదర జడ్జీలతో ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇంగ్లిష్ ధర్మాసనం కలకలా నికి గురయింది. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హ్యూవర్ట్ (1922–40) తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అభాసుపాలైనాడు. ఇలా రెండు రకాల ఉదాహరణలున్నాయి. మన దేశ తాజా పరిణామాలు కూడా మరొకలా లేవు. కొన్ని కేసుల విషయంలో జరుగుతున్న అవకతవకలను ప్రస్తావిస్తూ, ప్రజల దృష్టికి తెస్తూ జస్టిస్ చలమేశ్వర్ ప్రభృతులు (నలుగురు)చేసిన విన్నపం ఒక ఆలోచనా ధార విజయమని చెప్పకపోయినా, ప్రతిఫలమా అన్నట్టు తాజాగా ఐదుగురు సుప్రీం న్యాయమూర్తులు కూడా (ఎస్.ఎ. బాబ్డే/ ఎన్.వి. రమణ/ యు.వి. లలిత్/ డి.వై. చంద్రచూడ్/ ఎ.కె. సిక్రీ) రంగంలోకి దిగి వివిధ ధర్మాసనాలకు కేసుల కేటాయింపు గురించి ప్రధాన న్యాయమూర్తితో పాటు, నలుగురు (చలమేశ్వర్ ఆధ్వర్యంలో) న్యాయమూర్తులతోనూ చర్చలు జరపడం శుభసూచకమే. కేసుల కేటాయింపు విషయంలో నిర్ణయానికి కమి టీని వేయాలన్న ఐదుగురు న్యాయమూర్తుల ఆలోచన మంచిదే. అయితే– చల మేశ్వర్ ఆధ్వర్యంలో ఆవేదన వెలిబుచ్చిన నలుగురు న్యాయమూర్తులు కేసుల పరిశీలనలో జరుగుతున్న అస్తవ్యస్త వ్యవహారాలను సరిదిద్దడానికి, పాలక రాజ కీయ పెద్దలకు సంబంధం ఉన్న లేదా వారు ఇరుక్కున్నట్లు భావిస్తున్న కేసుల విచారణలో జరుగుతున్న జాప్యానికి, ధర్మాసనానికి కేసుల (తీవ్రమైన ఫిర్యా దులున్న కేసులు)ను విచారణకు నివేదించడంలో జరుగుతున్న తడబాటు గురించి అన్యాపదేశంగా కొన్ని ఉదాహరణలు పేర్కొన్నారని సమాచారం. ఉదా హరణకు సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు. ఇందులో బీజేపీ నేత అమిత్ షా జైలు పాలైనా కేసు కొట్టివేయడంతో విడుదలయ్యారు. పాత కేసు తిరిగి సీబీఐ స్పెషల్ జడ్జి లోయా కోర్టులో విచారణకు వచ్చింది. ఆ వెంటనే లోయా ఆకస్మి కంగా మరణించారు. జస్టిస్ లోయా మృతి కేసు నేను, ఇతర పాత్రికేయులు వేసిన ‘పిల్’ ఆధారంగా సుప్రీంలో విచారణకు వచ్చింది. ఈ కేసు పర్య వసానాన్ని ఇప్పట్లో ఊహించలేం. ముందుకు వెళ్లిన చర్చ ఈ సమయంలోనే ఐదుగురు గౌరవ న్యాయమూర్తులు సుప్రీం ధర్మాసనాలకు ప్రధాన న్యాయమూర్తి కేటాయించాల్సిన కేసులపై ప్రతిపాదనలు చేశారు. కానీ నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన కేసుల కేటాయింపు పరిష్కారా నికి, ఐదుగురు న్యాయమూర్తులు కొత్తగా ప్రతిపాదించిన పరిష్కారానికి మౌలికమైన తేడా కనిపిస్తోంది. ఎందుకంటే, మధ్యవర్తులలో(ఐదుగురు) ఒక రైన గౌరవ జస్టిస్ చంద్రచూడ్ ఏప్రిల్ 11న ఒక తీర్పు చెప్పారు: ‘కేసులను వివిధ ధర్మాసనాలకు కేటాయించి, బెంచ్‌లను ఏర్పాటు చేసే ప్రత్యేక విశి ష్టాధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉంది’ అని స్పష్టం చేశారు. అంటే కేసులు ఏ బెంచ్‌కి నివేదించాలో నిర్ణయించే విశేషాధికారం (మాస్టర్ ఆఫ్ రోస్టర్) ప్రధాన న్యాయమూర్తికే ఉంటుందని పునరుద్ఘాటించారు. అసలు ప్రశ్న ప్రధాన న్యాయమూర్తి ఏ బెంచ్‌కి ఏ కేసును పరిశీలనార్థం నివేదించాలో నిర్ణ యించే అధికారం ఆయనకు ఉన్నా, ఆయన రాజ్యాంగ ధర్మాసన న్యాయ మూర్తులలో సమానుల మధ్య సరిసమానుడైన వ్యక్తి కాబట్టి, కేసుల కేటా యింపులు సహ న్యాయమూర్తులతో చర్చించిన తరువాతనే కేటాయించాలని జస్టిస్ చలమేశ్వర్, మిగిలిన నలుగురి వాదన. అందుకనే, భావితరాల భద్రత కోసం న్యాయ వ్యవస్థ హుందాతనాన్ని రక్షించుకోవాలని చలమేశ్వర్ కోరు కుంటున్నారు. అంతేగాదు, పౌర స్వేచ్ఛ, పౌరుడి తిండీ తిప్పల గురించి, మత స్వేచ్ఛ గురించీ పత్రికా స్వేచ్ఛ గురించీ ఆంక్షలు విధించే పాలకులను ప్రభుత్వాలను దృష్టిలో పెట్టుకునే హ్యూగో బ్లాక్ లాంటి మహా మహా అమె రికన్ న్యాయమూర్తులు, అత్యున్నత న్యాయస్థానం ద్వారా సేవలు అందిం చిన గజేంద్ర గాడ్కర్, సవ్యసాచి, వి.ఆర్. కృష్ణయ్యర్, చిన్నప్పరెడ్డి లాంటి ఉద్దండులు భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇచ్చిన ప్రాధాన్యం అసాధారణం. అందుకే జస్టిస్ హ్యూగో బ్లాక్ ఇలా ప్రకటించాడు: ‘భావ ప్రకటనా స్వేచ్ఛకు అసలైన అర్థం– ఎదుటివారు అభిప్రాయాల్ని ప్రకటించినందుకు, వారు ఉచ్చ రించే మాటలకు లేదా రాసే రాతలకు నీవు వారిపట్ల హాని తలపెట్టడం కాదు. అదే నా నిశ్చితాభిప్రాయం, ఇందులో మినహాయింపులు లేవు. ఇదే, నా అభిప్రాయం’. ‘మన అధికారాల్ని మన సొంత గౌరవ, మర్యాదల్ని రక్షించు కోడానికి వినియోగించరాద’న్నాడు జస్టిస్ డెన్నింగ్ (ఇంగ్లండ్)! అవును కదా– ‘‘క్షేమం అవిభాజ్యం అన్నందుకే/జైళ్లు నోళ్లు తెరిచే భూమిలో న్యాయం నాలుగు పాదాల నడుస్తుందనుకోవడం అత్యాశే’’! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మళ్లీ అదే చర్చ
న్యాయ, పరిపాలనా విభాగాల అధికారాల పరిధులకు సంబంధించిన వివాదం కొత్తదేం కాదు. కాకపోతే జాతీయ న్యాయ దినోత్సవ కార్యక్రమం అందుకు వేదిక కావడం, న్యాయవ్యవస్థ క్రియాశీలత (జ్యుడిషియల్ యాక్టివిజం) పేరిట దాని పరిధులను అతిక్రమిస్తున్నదని కేంద్ర మంత్రులే ఆరోపించడం విశేషం. ప్రజాస్వామ్య సౌధానికి మూడు మూలస్తంభాలుగా శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలను మన రాజ్యాంగకర్తలు నిర్వచించారు. వాటి అధికారాల పరిధులను స్థూలంగానే నిర్వచించి, అవి మూడూ ఒకే వ్యవస్థలోని సజీవ అంగాలుగా పనిచేయాలని భావించారు. అవి ఒకే కుటుంబంలోని భాగాలని, ఒకదానినొకటి బలోపేతం చేయ డానికి కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాటలు ఆ స్ఫూర్తినే ప్రతి ధ్వనించాయి. అయితే, కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ.. క్రియాశీలత పేరిట న్యాయవ్యవస్థ తన అధికారాల పరిధులను అతిక్రమిస్తోందని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్) సహాయంతో విధాన రూపకల్పనా విధులను చేపట్టాలనే తాపత్ర యాన్ని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య ఉన్న విభేదాలు అనుకోని విధంగా ఇలా రచ్చకెక్కాయి. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా స్వయంగా తమ వాదాన్ని వినిపించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలోని మూడు అంగాల మధ్య అధికారాల విభజన సుస్పష్టంగా గిరి గీసినట్టు ఉండాలనే కోరిక మంచిదే గానీ ఆచరణ సాధ్యమైనది కాదు. రాజ్యాంగం పౌరులందరికీ హామీనిచ్చిన ప్రాథమిక హక్కులను పరిరక్షించే బాధ్యత న్యాయవ్యవస్థదే. ఆ క్రమంలో అది ప్రభుత్వానికి, చట్టసభలకు పలు నిర్దేశాలను చేయాల్సి వస్తుంది. అవసరమైతే కొత్త విధానాలను, చట్టాలను తేవాలని కోరాల్సి ఉంటుంది. ‘‘శాసన, పరిపాలనా విభాగాలు తాకకుండా వదిలేసిన వివిధ అంశాలు ప్రజాప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నప్పుడు న్యాయవ్యవస్థ వాటిని పట్టించు కుంటుంది’’ అంటూ 2008లోనే కేంద్రానికి వ్యతిరేకంగా దాఖలైన ఒక వ్యాజ్యంలో జస్టిస్ హెచ్‌కే సేన్ స్పష్టం చేశారు. పిల్లకు, న్యాయవ్యవస్థ క్రియాశీలతకు వ్యతి రేకంగా వాదించే వారు అసలు వాటి పుట్టుకకు కారణమే శాసన, పరిపాలనా విభా గాల వైఫల్యాలనే విషయాన్ని విస్మరిస్తున్నారు. కాలుష్యం వంటి సమస్యల్లో కోర్టుల జోక్యాన్ని ఈ విమర్శకులు తరచుగా ప్రస్తావిస్తుంటారు. నిబంధనలను గాలికి వదలి పారిశ్రామిక వేత్తలు, సంస్థలు, వ్యక్తులు జీవనదులను, గాలిని, వాతావర ణాన్ని కాలుష్య కాసారాలుగా మారుస్తుంటే పట్టించుకోని ప్రభుత్వాల, చట్టసభల క్రియారాహిత్యమే కోర్టుల జోక్యాన్ని అవసరం చేస్తోంది. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్నా కోర్టులను ఆశ్రయించాల్సిన దుస్థితి రోజూ కళ్లకు కడుతూనే ఉంది. పార్టీలకు అతీతంగా వివిధ స్థాయిల్లోని ప్రభుత్వాలు, చట్ట సంస్థలు ప్రజలకు గౌరవప్రదంగా జీవించే హక్కును కల్పించలేని పరిస్థితుల్లోనే పిల్ అనే భావన పుట్టింది. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఉపయోగపడే ముఖ్య సాధనం అయింది. స్వాతంత్య్రానంతరపు తొలినాళ్లలో చట్టసభలు, ప్రభుత్వాలు తమ ఆకాంక్ష లను నెరవేర్చగలవనే దృఢ విశ్వాసం ఉండేది. గత ఏడు దశాబ్దాలుగా అది సడ లుతూ వస్తోంది. కారణం మన చట్టసభల, ప్రభుత్వాల పనితీరు నానాటికీ తీసి కట్టుగా దిగజారుతుండటమే. 2–జీ స్పెక్ట్రమ్ వ్యవహారంలో సుప్రీం కోర్టు 122 లైసెన్స్‌లను రద్దు చేసింది. అంతేకాదు, ఆ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు వివరా లను ప్రధానికే వెల్లడించరాదని ఆదేశించింది. ఈ జోక్యాన్ని, క్రియాశీలతను నాడు యావద్భారతం ప్రశంసించింది. దాన్ని అధికారాల పరిధి అతిక్రమణగా నాటి ప్రతిపక్షాలు విమర్శించలేదు. అవసరమైనప్పుడు ఇతర రెండు వ్యవస్థలను సరిదిద్దే పనిని న్యాయవ్యవస్థకు అప్పగించిన రాజ్యాంగమే.. న్యాయ వ్యవస్థలోని తప్పు లను సరిదిద్దే హక్కును పార్లమెంటుకు ఇచ్చింది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవైనా న్యాయ క్రియాశీలతను అతిక్రమణగా విమర్శించడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వ అంగాలేవీ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడానికి వీల్లేదు, అలాంటి సందర్భాల్లో వాటిని పరిర క్షించే బాధ్యత న్యాయవ్యవస్థదే. ‘‘ప్రాథమిక హక్కులు స్థిరాంకాలేమీ కావు. వాటిలో చాలా వరకు ఖాళీ పాత్రల వంటివి. ప్రతి తరమూ తమ అనుభవాల వెలుగులో వాటిలో సారాన్ని నింపాల్సి ఉంటుంది’’ అని కేశవానంద భారతి కేసులో జస్టిస్ కేకే మాథ్యూ చేసిన వ్యాఖ్య రాజ్యాంగం నిజస్ఫూర్తికి అద్దం పడుతుంది. ప్రజల ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరింపజేస్తూ, వాటికి జవసత్వాలను సమకూర్చడం అనే లక్ష్యంతో మూడు వ్యవ స్థలూ కలసి పరస్పర విశ్వాసంతో పనిచేయడం అవసరం. అయితే న్యాయవ్యవస్థ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేసే కీలక అంశాలూ ఉన్నాయి. అన్ని వ్యవస్థల నుంచి జవాబుదారీతనాన్ని కోరే న్యాయవ్యవస్థకు జవాబు దారీతనం అక్కర్లేదా? న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే అది పారదర్శకతకు అతీ తమైనదని అర్థమా? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేని స్థితి తరచుగా న్యాయవ్యవస్థను ఇరకాటంలో పెడుతోంది. న్యాయ నియామకాలలో సహేతుకతను, పారదర్శకతను తేవడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టం చేస్తే సుప్రీంకోర్టు కొట్టివేసింది. చట్టంతో న్యాయవ్యవస్థపై ఆధిపత్యం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్న మాట నిజమే అనుకున్నా.. తన స్వతంత్రతకు భంగకరంకాని మరో ప్రత్యామ్నాయాన్ని çసూచిం చకపోగా కొలీజియం వ్యవస్థనే అది కొనసాగించడం ఎవరికీ మింగుడుపడేది కాదు. న్యాయవ్యవస్థ ప్రజల అన్ని సమస్యలను పరిష్కరించలేదు, ప్రభుత్వాల నిష్క్రియా పరత్వాన్ని లేదా బాధ్యతారాహిత్యాన్ని అదే వదిలించలేదు. నిజానికి పిల్ల ఉచితా నుచితాలు, న్యాయవ్యవస్థ క్రియాశీలత చుట్టూ తిరుగుతున్న చర్చంతా.. పై నుంచి కింది వరకు చట్టసభలు, ప్రభుత్వాలు విశాల ప్రజానీకం ఆకాంక్షను నెరవేర్చే దిశగా, గౌరవప్రదంగా, ఆరోగ్యకరంగా జీవించే హక్కు సహా అన్ని హక్కులను పరి రక్షిస్తూ సాగేలా చేసేదెలా? అనే అతి పెద్ద సమçస్య నుంచి పుట్టుకొచ్చినవే. అ దిశగా అంతా దృష్టిని కేంద్రీకరించడం ఉత్తమం. -
టీడీపీ ఆగడాలపై న్యాయపోరాటం
♦ కోమటిలంకలో చెరువుల తవ్వకంపై ఫిర్యాదు ♦ లోక్ అదాలత్‌లో కోమటిలంక వాసుల పిటీషన్ ♦ కలెక్టర్‌తో సహా పలువురు ♦ జిల్లా అధికారులు ప్రతివాదులు ఏలూరు రూరల్: ఏలూరు మండలం కోమటిలంక వాసులు న్యాయపోరాటం మొదలుపెట్టారు. అధి కారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు కొల్లేరులో చేపట్టిన అక్రమ చెరువుల తవ్వకాలను అడ్డుకునేందుకు లోక్ అదాలత్ తలుపు తట్టారు. గ్రామానికి చెందిన జైభీమ్ సంక్షేమ సంఘం సభ్యులు ఈనెల 21న లోక్ అదాలత్‌లో పిటీషన్ వేశారు. కలెక్టర్ భాస్కర్‌తో పాటు ఏలూరు ఆర్డీఓ జి.చక్రధరరావు, ఏలూరు తహసీల్దార్ కేవీ చంద్రశేఖర్‌తో పాటు అటవీ, మైన్స్, ఫిషరీస్, విజిలెన్స్ జిల్లా అధికారులను సైతం ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఏలూరు మం డల టీడీపీ అధ్యక్షుడు నేతల రవి, టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గుత్తా కాశీబాబు, శ్రీపర్రు టీడీపీ నాయకుడు సైదు గోవర్దన్ అక్రమ చెరువుల తవ్వకాలకు సూత్రధారులని వివరిం చారు. నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా తమ భూముల్లో చెరువులు తవ్వుతున్నారని న్యాయమూర్తి కె.శైలజ వద్ద ఆవేదన వెళ్లగక్కారు. ఇదేమని ప్రశ్నిస్తే తప్పుడు పోలీసు కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు కోమటిలంక పరిధిలో సుమారు 1,000 ఎకరాల రెవెన్యూ పోరంబోకు భూమి ఉంది. ఎన్నోఏళ్లుగా గ్రామస్తులు ఈ భూమిలో చేపల సాగు చేసుకుని జీవిస్తూ పట్టాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు రంగప్రవేశం చేసి పట్టాలు ఇప్పిస్తామని నమ్మిం చారు. దీనికి బదులుగా గతంలో గ్రామస్తులు సాగుచేసిన సర్వే నంబర్ 16 నుంచి 30 వరకూ ఉన్న సుమారు 36 ఎకరాల గ్రామంలోని రెవెన్యూ భూమిని తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకు సర్పంచ్, ఎంపీటీసీతో పాటు పలువురిని ఒప్పించారు. దీనిని భూమిలేని జై భీమ్ దళిత సంఘం సభ్యులు వ్యతిరేకించారు. ఇవేమీ పట్టించుకోని టీడీపీ నాయకులు యథేచ్ఛగా చెరువు తవ్వకాలు మొ దలుపెట్టారు. అ డ్డుపడ్డ సభ్యులపై టీడీపీ నా యకులు పోలీసు కేసులు పెట్టించారు. గత్య ంతరం లేక సంఘం సభ్యులు రెవెన్యూ, పో లీసు, అటవీ అధికారులతో పాటు కలెక్టర్ భా స్కర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పం దించిన కలెక్టర్ రెవెన్యూ భూమిలో తవ్వకాలు అడ్డుకోవాలంటూ ఆదేశించారు. అయినా పనులు సాగిపోయాయి. కొద్దిరోజుల్లో చెరువులో నీ రుపెట్టి చేపల సాగు ప్రారంభించనున్నారు. దీం తో దళితులు లోక్ అదాలత్‌ను ఆశ్రయించారు. పట్టాలు ఇప్పిస్తామన్నారు ఎంతోకాలంగా చేపల సాగు చేసుకుని బతుకుతున్నాం. మా భూములకు పట్టాలు ఇప్పిస్తామని నాయకులు చెప్పారు. దీనికి బదులుగా భూమి తీసుకున్నారు. ఇప్పటివరకూ పట్టాలు ఇప్పించలేదు సరికదా పేదలకు చెందిన భూమి తీసుకున్నారు. దీనిని మేం వ్యతిరేకిస్తున్నాం. – తెనాలి దానియేలు, సంఘం సభ్యుడు టీడీపీ నాయకుల కుట్ర టీడీపీ నాయకులు పేదలను మోసం చేసి భూమి కాజేశారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేశారు. పోలీసు కేసులు బనాయించారు. రెవెన్యూ, అటవీ, పోలీసుశాఖ అధికారులతో పాటు చివరగా జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశాం. అందరూ న్యాయం మా పక్షాన్నే ఉందన్నారు. చర్యలు మాత్రం తీసుకోలేదు. అందుకే లోక్ అదాలత్ ఆశ్రయించాం. – మద్దుల రత్నయ్య, జైభీమ్ సంఘం అధ్యక్షుడు -
హైకోర్టు రిజిస్ట్రార్‌గా వెంకటేశ్వరరెడ్డి
రంగారెడ్డి జిల్లా జడ్జిగా రేణుక సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా ఎ.వెంకటేశ్వరరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు. ఇటీవల వరకు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా ఉన్న షమీమ్ అక్తర్ పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. వెంకటేశ్వరరెడ్డిని రిజిస్ట్రార్‌గా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటేశ్వరరెడ్డి నియామకంతో ఖాళీ అయిన రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి స్థానాన్ని వై.రేణుకతో భర్తీ చేశారు. ప్రస్తుతం ఆమె కరీంనగర్ ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె స్థానంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మొదటి అదనపు చీఫ్ జడ్జిగా పనిచేస్తున్న ఎ.వి.పార్థసారథి ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. -
న్యాయవిచారణ జరపాలి
టెండర్లు, చెల్లింపులపై పొంగులేటి డిమాండ్ సాక్షి, హైదరాబాద్: దుమ్ముగూడెం టెయిల్‌పాండ్, రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్, శివన్న సాగర్ ప్రాజెక్టుల టెండర్లు, చెల్లింపులపై న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ బిల్లుల విషయంలో అదనపు చెల్లింపులు జరిగాయని, వీటిపై విజిలెన్సుతో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సోమవారం లేఖ రాశారు. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ సర్వే కోసం రూ.520 కోట్లు ఇచ్చారని, 10 ఏజెన్సీలకు రూ.395 కోట్లు అదనంగా ఇచ్చారని ఆరోపించారు. చేయని పనులకు, రద్దయిన పనులకు భారీగా కేటాయింపులు చేశారని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టు టెండర్లలోనూ అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. శివన్న సాగర్ అంచనాల్లో పెరుగుదలపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అధిక వర్షాలకు నష్టపోయిన రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. -
అసెంబ్లీ సీట్ల పెంపులేదు
-
అసెంబ్లీ సీట్ల పెంపులేదు
విభజన చట్టాన్ని సవరించినా పెంపు కుదరదు.. రాజ్యసభలో తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం - తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ప్రతిపాదన ఏదీ మా పరిశీలనలో లేదు - రాజ్యాంగంలోని నిబంధనలే చెల్లుబాటవుతాయి - దేవేందర్‌గౌడ్ ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ జవాబు - 2026 తరువాతే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు అవకాశం సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఎన్నికల నాటికి శాసనసభ స్థానాల సంఖ్య పెరుగుతుందనే భరోసాతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు తమ పార్టీ కండువాలు కప్పుతున్న అధికార పక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించడం ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సీట్ల పెంపు ప్రతిపాదన ప్రస్తుతం తమ పరిశీలనలోనే లేదని తేల్చి చెప్పింది. దీనిపై రాజ్యసభలో బుధవారం టీడీపీ ఎంపీ టి.దేవేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహీర్ సవివరంగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆర్టికల్ 170ని సవరిస్తేనే పెంపు సాధ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో కేంద్ర హోం శాఖ కేంద్ర న్యాయ శాఖ అభిప్రాయాన్ని కోరిం దా? కోరితే ఆ వివరాలేంటి? అటార్నీ జనరల్ అభిప్రాయం ఏమైనా కోరారా? కోరితే అటార్నీ జనరల్ ఏం చెప్పారు? రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపు కుదరదన్న ఎన్నికల కమిషన్ అభిప్రాయాన్ని హోం మంత్రిత్వ శాఖ ఎలా స్వీకరిస్తోంది? వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ దిశగా ముందుకు వెళ్లేందుకు హోం మంత్రిత్వ శాఖ వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటి? అంటూ దేవేందర్‌గౌడ్ సుదీర్ఘమైన ప్రశ్నను సంధించారు. దీనికి మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహీర్ సమాధానం ఇచ్చారు. ‘‘ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై అభిప్రాయం చెప్పాలని కేంద్ర న్యాయ శాఖను కోరాం. మూడు ప్రశ్నలు అడిగాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించకుండా.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26ను సవరించి సెక్షన్ 26(1)ను అమలు చేయవచ్చా? ఒకవేళ సెక్షన్ 26ను సవరించాల్సి వస్తే.. అప్పుడు సెక్షన్ 26లో ఒకరకంగా, రాజ్యాం గంలోని ఆర్టికల్ 170లో ఒక రకంగా ఉంటే.. ఈ రెండూ ఒకదానికి ఒకటి సంఘర్షించుకుంటే అప్పుడు ఏది చెల్లుబాటవుతుంది? ఒకవేళ సెక్షన్ 26లో పొందుపరిచిన ‘ఆర్టికల్ 170లో పొందుపరిచిన నిబంధనలకు లోబడి’ అన్న వాక్యానికి బదులుగా ‘ఆర్టికల్ 170లోని నిబంధనలకు సంబంధం లేకుం డా’ అనే వాక్యం చేర్చి సవరిస్తే సరిపోతుందా? అన్న మూడు ప్రశ్నలపై న్యాయశాఖ సలహాను కోరాం. ఇవే ప్రశ్నలపై న్యాయశాఖ భారత అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. ఇందుకు వారు ఇచ్చిన సలహా ఏమిటంటే.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించకుండా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26ను సవరించి సెక్షన్ 26(1)ను అమలు చేయలేం అని చెప్పారు. ఒకవేళ సెక్షన్ 26ను సవరించాల్సి వస్తే.. అప్పుడు సెక్షన్ 26లో ఒకరకంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఒక రకంగా ఉంటే .. ఈ రెండూ ఒకదానికి ఒకటి సంఘర్షించుకుంటే అప్పుడు ఏది చెల్లుబాటవుతుందని అడిగినప్పుడు నిస్సందేహంగా పార్లమెంట్ ఏ చట్ట సవరణ చేసినా రాజ్యాంగంలోని నిబంధనలే చెల్లుబాటు అవుతాయని, రాజ్యాంగంలోని నిబంధనలదే పైచేయి అవుతుందని చెప్పారు’’ అని ఆయన వివరించారు. అలా కూడా కుదరదు ‘‘ఒకవేళ సెక్షన్ 26లో పొందుపరిచిన ‘ఆర్టికల్ 170లో పొందుపరిచిన నిబంధనలకు లోబడి’ అన్న వాక్యానికి బదులుగా ‘ఆర్టికల్ 170లోని నిబంధనలకు సంబంధం లేకుండా’ అనే వాక్యం చేర్చి సవరిస్తే సరిపోతుందా? అని మేం అడిగిన ప్రశ్నకు... అలా కుదరదు అని అటార్నీ జనరల్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న తరువాత ప్రస్తుతానికి అసెంబ్లీ సీట్ల పెంపు విషయంలో ఎలాంటి ప్రతిపాదన మా పరిశీలనలో లేదు’’ అని హన్స్‌రాజ్ గంగారాం స్పష్టం చేశారు. విభజన చట్టంలో ఏముంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో పొందుపరిచిన నిబంధనలకు లోబడి శాసనసభ స్థానాల పునర్వ్యవస్థీకరణ చేపట్టవచ్చని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్ 26లో పొందుపరిచా రు. ఆర్టికల్ 170లోని నిబంధనల ప్రకారం... 2026 తరువాత వచ్చే జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాల్సి ఉంటుం దన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెక్షన్ 26ను సవరించినా అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని కేంద్రం చెబుతోంది. -
‘ముఖ్య’తంత్రం!
రాజధాని పనుల్లో సింగపూర్ వ్యవహారాలన్నీ సీఎం కనుసన్నల్లోనే... ఆర్థిక అంశాలన్నీ ఆయనే మాట్లాడుతున్నారు.. సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ఏదో జరగరానిది జరుగుతోంది... గూడుపుఠాణి నడుస్తోంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ కంపెనీల వెంటబడడం వెనక ఏదో ఉంది. అధికారులు, మంత్రులకు ఎలాంటి ప్రమేయం లేకుండా అన్నీ తానే అయి నడిపిస్తుండడం అనుమానాస్పదంగా ఉంది.. తరచూ వినిపిస్తున్న మాటలివి. చాలాకాలంగా ఇవి అటు ప్రజల్లోనూ, ఇటు రాజకీయ పక్షాలలోనూ తీవ్ర చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటి వరకు సందేహాలే... మంత్రుల కమిటీ సిఫార్సులను చూస్తే ముఖ్యమంత్రి గారి అదనపు ‘చొరవ’ స్పష్టంగా బైటపడిపోయింది. అంతేకాదు మంత్రుల కమిటీ సిఫార్సులకు ముఖ్యమంత్రి ముందే ఆమోదముద్ర వేసేయడం, ఆ తర్వాత ఫైలు అధికారుల వద్దకు వెళ్లడం, దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు వ్యాఖ్యలు చేయడం చూస్తే ఈ వ్యవహారంలో ఏదో తప్పు జరుగుతోందని అర్ధమౌతోంది.. అవును.. అన్నీ ఆయనే చూస్తున్నారు... సింగపూర్ కంపెనీలతో ముఖ్యమంత్రే నేరుగా ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారని, ఆర్థిక అంశాలన్నీ ఆయనే చూస్తున్నారని మంత్రుల కమిటీ సిఫార్సులలో స్పష్టంగా ఉంది. వాటితో పాటు పరిష్కారం కాని ఇతర అంశాలపై చంద్రబాబు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో ఫోన్లో సంప్రదింపులు జరిపినట్లు మంత్రుల కమిటీ సిఫార్సులలో పేర్కొన్నారు. ఆ సిఫార్సులకు ఆమోదం తెలుపుతూ ముఖ్యమంత్రి సంతకం కూడా చేశారు. అయితే ముఖ్యమంత్రి ఆమోదించిన.. స్వయంగా సంతకం చేసిన మంత్రుల కమిటీ సిఫార్సులను యథాతథంగా ఆమోదించడానికి మౌలిక వసతుల అథారిటీ సమావేశం అంగీకరించలేదు. శుక్రవారం సచివాలయంలో ఈ అథారిటీ సమావేశం జరిగిన సంగతి తెల్సిందే. ఈ సమావేశంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. ఇదేం తీరు... మండిపడ్డ సీఎస్ మంత్రుల కమిటీ సిఫార్సులను ముఖ్యమంత్రి ఆమోదించిన తరువాత అధికారులతో కూడిన అథారిటీ సమావేశానికి పంపించడమేమిటని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ మండిపడ్డారు. మంత్రుల సిఫార్సులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపిన తరువాత అధికారులతో కూడిన అధారిటీ ఏ విధంగా ఆమోదం తెలుపుతుందో చెప్పాలని సీఆర్డీఏ అధికారులను సీఎస్ నిలదీశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం సీఆర్డీఏ చైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉన్నందున ఆయన ఆమోదించిన అంశాలను అధారిటీ ముందుకు ఎలా తీసుకువస్తారని సీఎస్ ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు అధారిటీ ముందుకు తీసుకువచ్చి కేబినెట్‌కు వెళ్లాలి, ఆమోదించాలని పీకలమీద కూర్చుంటే కుదరదని సీఎస్ స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు మంత్రివర్గ సమావేశం ముందుకు తీసుకు వెళ్లాలంటే సీఎస్‌తో సంబంధం లేకుండా నేరుగా సీఆర్డీఏనే కేబినెట్ ముందుకు తీసుకువెళితే మంచిదని సీఎస్ చురక అంటించారు. సంబంధిత శాఖల అభిప్రాయాలను తీసుకోకుండా అధారిటీ సమావేశం ముందుకు ఎలా తెస్తారని సీఎస్ ప్రశ్నించారు. సీఎం ఆమోదించిన అంశాలపై అభిప్రాయసేకరణా? సీఎస్ సీరియస్ అవడంతో ఏం చేయాలో సీఆర్డీఏ అధికారులకు తోచలేదు. చివరకు సంబంధిత శాఖలకు ఫైలు సర్క్యులేట్ చేసి అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారని సమాచారం. దీనిపై సీఎస్ స్పందిస్తూ సంబంధిత శాఖలు ఫైలుపై ముఖ్యమంత్రి ఆమోదించిన అంశాలకు వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తే ఏమి చేస్తారంటూ సీఆర్డీఏ అధికారులను ప్రశ్నించారు. మంత్రుల కమిటీ, సీఆర్డీఏ సమావేశంలో పాల్గొని ఆ నిర్ణయాలకు అనుగుణంగా సంతకాలు చేసి ఇప్పుడు ఫైలు సర్క్యులేట్ చేస్తే గతంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తారా అని సీఎస్ ప్రశ్నించారు. సీఎస్ ప్రస్తావించిన అంశాలపై సీఆర్డీఏ అధికారులు నీళ్లునమిలారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి-2001 చట్టం ఏమి చెబుతోంది.. అందుకు అనుగుణంగా నిబంధనలు పాటించారా? లేదా? అనే అంశాలను పరిశీలించాల్సి ఉందని, అంతే కాకుండా న్యాయ సలహా తీసుకోవాల్సి ఉందని సీఎస్ స్పష్టం చేశారు. న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయం... సీఎం ఆమోదించిన మంత్రుల కమిటీ సిఫార్సులతో పాటు సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన రాయితీ, అభివృద్ధి అగ్రిమెంట్ ముసాయిదాపై సీఎస్ పలు సందేహాలను వ్యక్తం చేశారు. ఆ సందేహాలను నివృత్తి చేసే బాధ్యతలను కొంత మంది అధికారులకు సీఎస్ అప్పగించారు. అంతే కాకుండా న్యాయ శాఖ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా సీఎస్ కోరారు. దీనిపై న్యాయ శాఖ స్పందిస్తూ తొలుత అడ్వకేట్ జనరల్ అభిప్రాయం తీసుకోవాలని, అనంతరం న్యాయ శాఖ అభిప్రాయాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఇష్టానుసారం వ్యవహారాలకు ఆమోదం తెలపడానికి సిద్ధంగా లేనని సీఎస్ స్పష్టం చేశారు. -
కోర్టు బయట సెటిల్మెంట్లకు ఓకే
ప్రభుత్వ ప్రతిపాదనకు న్యాయ సంస్కరణల కమిటీ మద్దతు న్యూఢిల్లీ: కోర్టు బయట సెటిల్మెంట్లకు చట్టబద్దత కల్పించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు న్యాయ సంస్కరణల కమిటీ మద్దతు తెలిపింది. న్యాయ సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి ‘న్యాయ సేవ, సంస్కరణల జాతీయ సలహా మండలి’ ముందు న్యాయ శాఖ ఈ ప్రతిపాదన ఉంచింది. కొన్ని రకాల కేసులను కోర్టు బయట పరిష్కరించడం ద్వారా న్యాయస్థానాలకు కొంత భారం తగ్గుతుందని శాఖ భావిస్తోంది.ఈ క్రమంలోనే మధ్యవర్తిత్వానికి శాసన సహకారంతో చట్టబద్దత కల్పించాలనే ఆలోచనను తెరపైకి తెచ్చింది. మధ్యవర్తిత్వానికి చట్టబద్దత లేనందున చాలామంది కేసుల పరిష్కారానికి ఆసక్తి చూపట్లేదని భావిస్తోంది. న్యాయ మంత్రి అధ్యక్షతన ఉన్న ఈ కౌన్సిల్లో సుప్రీంకోర్టు, బార్‌కౌన్సిల్, హోం, న్యాయ శాఖ సహాయ మంత్రులు, అటార్నీ జనరల్ సభ్యులుగా ఉన్నారు. -
ఎన్నికల చట్టాన్ని సవరించండి: ఈసీ
న్యూఢిల్లీ: ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బును ఉపయోగిస్తున్నారన్న సాక్ష్యాలు లభిస్తే.. ఎన్నికల సంఘానికి సంబంధిత ఎన్నికను రద్దు చేయడం కానీ, వాయిదా వేయడం కానీ చేసే అధికారం కల్పించేందుకు ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలని ఈసీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అందుకు గానూ ప్రజా ప్రాతనిధ్య చట్టంలో కొత్తగా 58బీ నిబంధనను చేర్చాలని న్యాయశాఖ కు లేఖ రాసింది. సంబంధిత అధికారాన్ని ఈసీకి కల్పించే నిబంధన రాజ్యాంగంలో(324వ అధికరణం) ఉన్నప్పటికీ.. రాజ్యాంగం కల్పించిన ఆ అధికారాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేకుండా, ఎన్నికల చట్టంలోనే ఆ నిబంధనను పొందుపరిస్తే బావుంటుందని ఆ లేఖలో ఈసీ పేర్కొంది. -
భార్యను చంపిన కేసులో భర్తకు జీవితఖైదు
మదనపల్లి (చిత్తూరు): చిత్తూరు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి భార్యను చంపిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. వివరాలు.. చిత్తూరు జిల్లా రామసముద్రం మండలానికి చెందిన రవికుమార్ (38) తాగుడుకు బానిసై భార్యను చిత్ర హింసలకు గురిచేసి 2013లో గొంతు కోసి చంపేశాడు. అప్పట్లో ఈ కేసు పూర్తిస్థాయి విచారణకు ధర్మాసనం ఆదేశించింది. తాజాగా శుక్రవారం నాడు అదనపు జిల్లాకోర్టు న్యాయమూర్తి నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువడించారు. ఈ తీర్పుతో మృతురాలి తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేశారు. -
యాసిడ్ దాడి డ్రామా!
అనంతపురం, న్యూస్‌లైన్ : అనంతపురంలో సంచలనం రేపిన బీకామ్ విద్యార్థిని వాణిపై జరిగిన యాసిడ్ దాడి కేసు మిస్టరీగా మారింది. ప్రియుడిపై కసితో ఆమే యాసిడ్ పోసుకుందని జిల్లా ఎస్పీ మీడియాకు వెల్లడించగా, కేసును పోలీసులు తప్పుదారి పట్టిస్తున్నారని బాధితురాలు కలెక్టర్‌కు విన్నవించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపిస్తామని కలెక్టర్ లోకేష్‌కుమార్ బాధితురాలికి హామీ ఇచ్చారు. ‘ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన వాణి అనం తపురంలోని ఓ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. చిన్ననాటి మిత్రుడైన పయ్యావుల రాఘవతో ప్రేమలో పడింది. కొద్ది రోజుల తర్వాత విభేదాలు రావడంతో రాఘవ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో వాణి.. మహేష్ అనే మిత్రుని సాయంతో రాఘవపై పగ తీర్చుకునేందుకు కుట్ర పన్నింది. ఈనెల 2న కళాశాల నుంచి బస్సు దిగి కాలి నడకన ఇంటికి వెళుతూ తనవద్ద ఉన్న యాసిడ్‌ను ఒంటిపై పోసుకుని, గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి యాసిడ్ చల్లారని స్థానికులను నమ్మించింది. వారు వెంటనే ఆమెను ఆస్పత్రికి చేర్చారు. ప్రియుడు పయ్యావుల రాఘవ, అతని సోదరుడు రామకృష్ణ తనపై యాసిడ్ దాడి చేశారంటూ వాణి ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో భాగంగా బాధితురాలి సెల్‌ఫోన్ కాల్స్ జాబితాలో మహేష్ అనే యువకుడితో ఆమె ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించాం. మొదట వాణి ఫిర్యాదు మేరకు రాఘవ, రామకృష్ణలపై కేసు నమోదు చేశాం. పోలీసులను తప్పుడు ఫిర్యాదుతో పక్కదారి పట్టించిన వాణిపై కూడా చట్టరీత్యా కేసు నమోదు చేస్తాం..’ అని ఎస్పీ చెప్పారు. యాసిడ్‌ను వాణికి ఇచ్చింది తానేనని ఆమె మిత్రుడు మహేష్ మీడియాకు చెప్పారు. ఆమె తనకు తాను యాసిడ్ దాడి చేసుకుంటానని చెప్పిందని, తాను భయపడి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని తెలిపారు. ‘పోలీ సులు ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నారు’ అంటూ వాణి మీడియా ఎదుట కంటనీరు పెట్టారు.