ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. సీబీఐ కస్టడీ నేటితో ముగియటంతో తీహార్ జైలు అధికారులు ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు కేజ్రీవాల్ సీబీఐ జ్యుడీషియల్ కస్టడీని మరోసారి ఆగస్ట్ 20వరకు పొడిగించింది.
ఈ కేసులో సీబీఐ అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. లిక్కర్ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ సరైన కారణాలు లేకుండా అరెస్ట్ చేసిందని చెప్పలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
చదవండి: కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్ట్ చేస్తారా?.. ఈడీని ప్రశ్నించిన కోర్టు
Comments
Please login to add a commentAdd a comment