
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తిగా పనిచేసి ఇటీవల రాజీనామా చేసిన జస్టిస్ దామా శేషాద్రినాయుడు మళ్లీ న్యాయవాది వృత్తిలోకి అడుగుపెట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన జస్టిస్ శేషాద్రినాయుడు 1997లో ఏపీ బార్ కౌన్సిల్‌లో సభ్యునిగా చేరారు. హైకోర్టులో సివిల్, క్రిమినల్ కేసులు వాదించారు. 2013లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
అనంతరం కేరళ, ముంబై హైకోర్టుల్లో విధులు నిర్వర్తించారు. 2021 ఆగస్టు 12న హైకోర్టు న్యాయమూర్తిగా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మళ్లీ న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జస్టిస్ నాయుడు సుప్రీంకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. సోమవారం ఓ కేసులో జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment