న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్(54)ను గన్ కోనుగోలు కేసులో మొత్తం మూడు ఆరోపణల్లోనూ కోర్టు దోషిగా తేల్చింది. 2018లో గన్ కొనుగోలు చేసిన సమయంలో డ్రగ్స్‌కు బానిసకాదంటూ ఆయుధ డీలర్‌కు అబద్దం చెప్పారని, ఆ గన్‌ను 11 రోజుల పాటు అక్రమంగా తన వద్దే ఉంచుకున్నాడని న్యాయమూర్తులు నిర్ధారించారు. తన కుమారుడి కేసుపై తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు.
‘‘నేను అమెరికాకు అధ్యక్షుడిని. కానీ, నేను కూడా ఒక తండ్రిని. ఈ కేసుకు సంబంధించి హంటర్ ఆప్పీల్‌ను పరిగణలోకి తీసుకున్నందుకు న్యాయపరమైన ప్రక్రియను గౌరవిస్తాను’’ అని జోబైడెన్ అన్నారు. దీంతో క్రిమినల్ కేసులో దోషిగా తేలిన కుమారుడిని కలిగి ఉన్న తొలి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌గా నిలవటం గమనార్హం.
ఇక.. ఈ కేసు విచారించిన డెలావెర్‌లోని ఫెడరల్ కోర్టు జడ్జి మేరీ ఎల్లెన్ నొరీకా మాత్రం హంటర్‌కు 120 రోజుల జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులో పూర్తి తీర్పు అక్టోబర్‌లో వెలువడనుందని చెప్పారు. సాధారణంగా ఇలాంటి నేరాలకు గరిష్టంగా 25 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలు ఉన్నాయి. హంటర్ బైడెన్‌పై మరో కేసు కూడా ఉంది. పన్ను ఎగ్గొట్టిన ఆరోపణలపై కాలిఫోర్నియా కోర్టు సెప్టెంటర్‌లో విచారణ జరపనుంది.
Comments
Please login to add a commentAdd a comment