ప్రజాధనం దోపిడీకి కూటమి పెద్దల కుతంత్రం
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్–2019 చట్టం రద్దుకు తీర్మానం
పాత విధానంలోనే టెండర్లకు సన్నాహాలు
తద్వారా అంచనాలు అడ్డగోలుగా పెంచుకోవచ్చు
నచ్చిన వారికి కాంట్రాక్టులిచ్చి కమీషన్లు దండుకోవచ్చు
జగన్ ప్రవేశపెట్టిన జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థలో ఈ కుతంత్రాలు కుదరవు
అడ్డగోలు అంచనాలను, నిబంధనలను ప్రజలు ఎత్తిచూపే అవకాశం
ప్రజల సూచనలతో నోటిఫికేషన్‌లో మార్పులకు జడ్జి సిఫార్సులు
వాటి ప్రకారం మళ్లీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాల్సిందే
ఇలా గత ఐదేళ్లలో వేల కోట్ల ప్రజాధనం ఆదా చేసిన జగన్ సర్కారు
జ్యుడిషియల్ ప్రివ్యూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శమన్న నీతి ఆయోగ్
సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో (డీపీటీ) పద్ధతిలో 2014–19 మధ్య ఖజానాను దోచేసిన కూటమి ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు దోపిడీకి అడ్డొస్తున్న జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థను రద్దు చేసి, పాత విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఉపక్రమించారు. ప్రజా ధనం దోపిడీకి కుటంత్రం పన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) చట్టం–2019ను రద్దు చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు.
ఆ చట్టాన్ని రద్దు చేసిన తర్వాత రూ.వంద కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థ ఉంటే టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే అడ్డగోలుగా అంచనాలు పెంచినా, కోరుకున్న కాంట్రాక్టర్‌కే పనులు దక్కేలా నిబంధనలు పెట్టినా ప్రజలు ఎత్తిచూపే అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వ పెద్దల భయం.
వివిధ వర్గాల ప్రజలు, మేధావులు, ఇంజినీర్ల నుంచివచ్చిన ఫిర్యాదులు, సూచనల ఆధారంగా జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి టెండర్ షెడ్యూలులో మార్పులు సూచిస్తే ఆ మేరకు మార్చి టెండర్ నోటిఫికేషన్ మళ్లీ జారీ చేయాలి. అప్పుడు కమీషన్లు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న కాంట్రాక్టర్‌కు పనులు దక్కవన్నది ప్రభుత్వ పెద్దల భయం. అందుకే తమ అడ్డగోలు దోపిడీకి అడ్డుగా ఉండే జ్యుడిషియల్ ప్రివ్యూను లేకుండా చేసేందుకు సిద్ధమయ్యారని అధికారవర్గాలు చెబుతున్నాయి.
అంచనాల్లో వంచనకు, దోపిడీకి అవకాశం ఉండదనే..
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. కోట్ల రూపాయలు వెదజల్లి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చేందుకు పెట్టిన పెట్టుబడికి వంద రెట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కొల్లగొట్టేందుకు టెండర్ విధానాన్ని ఓ అస్త్రంగా మల్చుకున్నారు.
పనుల ప్రతిపాదన దశలోనే అధికారులపై ఒత్తిడి తెచ్చి.. అంచనా వ్యయాన్ని పెంచేయించడం, అధికంగా కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్‌కు పనులు దక్కేలా నిబంధనలు పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం, అధిక ధరలకు పనులను కట్టబెట్టి.. ప్రభుత్వ ఖజానాకు కన్నం వేసి కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం.. ఆ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానా నుంచి మొబిలైజేషన్ అడ్వాన్సుగా అప్పగించిన మొత్తాన్నే కమీషన్‌గా జేబులో వేసుకోవడం నిత్యకృత్యంగా చంద్రబాబు మార్చుకున్నారు.
ఆనాటి దోపిడీకి సాక్ష్యాలు ఇవిగో..
» గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశలో 27వ ప్యాకేజీలో 2014 నాటికి రూ.11 కోట్ల విలువైన పని మాత్రమే మిగిలింది. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై 60–సి నిబంధన కింద వేటు వేసి.. అంచనా వ్యయాన్ని రూ.112.83 కోట్లకు పెంచేసి.. దొడ్డిదారిన సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్‌కు అప్పగించారు.
» హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో 2–బీ ప్యాకేజీలో 2014 నాటికి రూ.99 లక్షల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై 60–సి నిబంధన కింద వేటు వేసి, వాటి వ్యయాన్ని రూ.115.08 కోట్లకు పెంచేసి.. సీఎం రమేష్ కు అప్పగించారు. అంటే పెంచిన మొత్తం రూ.114.09 కోట్లు సీఎం రమేష్ కు చెల్లించినట్లు స్పష్టమవుతోంది.
» హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో 3–బీ ప్యాకేజీలో 2014 నాటికి కేవలం రూ.8.69 కోట్ల విలువైన పని మాత్రమే మిగింది. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పైనా 60–సి నిబంధన కింద వేటు వేసిన చంద్రబాబు.. ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.149.14 కోట్లకు పెంచేశారు. అంటే పెంచిన రూ.140.45 కోట్లు సీఎం రమే‹Ùకు చెల్లించారు.
» హంద్రీ–నీవా రెండో దశలో 2014 నాటికి 4–బి ప్యాకేజీలో రూ.1.34 కోట్లు, 5–బి ప్యాకేజీలో రూ.11.87 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై 60–సి నిబంధన కింద వేటు వేసిన చంద్రబాబు.. 4–బి ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.73.26 కోట్లకు, 5–బి ప్యాకేజీ పనుల అంచనా వ్యయాన్ని రూ.97.40 కోట్లకు పెంచేసి, వాటిని తన సన్నిహితుడైన ఆర్. మహేశ్వరనాయుడు, ఎస్సార్ కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించారు. ఆ మేరకు బిల్లులు చెల్లించి కమీషన్లు వసూలు చేసుకున్నారు.
» వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌లో 2014 నాటికి రూ.299.48 కోట్ల విలువైన పనులే మిగిలాయి. ఆ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పైనా 60–సి నిబంధన కింద వేటు వేసిన
చంద్రబాబు.. జీవో 22, జీవో 63లను వర్తింపజేసి.. అంచనా వ్యయాన్ని రూ.597.11 కోట్లకు పెంచేశారు. ఆ పనులను సీఎం రమేష్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పనులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించి.. సీఎం రమేష్ సంస్థకంటే రూ.61.76 కోట్లకు తక్కువ ధరకు మరో కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు.
ఆ టన్నెల్ పనిని పూర్తి చేయించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను తనిఖీ చేసిన కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) జీవో 22, జీవో 63లను వర్తింపజేయడం ద్వారా కాంట్రాక్టర్లకు రూ.630.57 కోట్లను దోచిపెట్టినట్లు తేల్చడం టీడీపీ ప్రభుత్వ అవినీతికి తార్కాణం.
» వంశధార స్టేజ్–2 ఫేజ్–2, తోటపల్లి, మడ్డువలస, గుండ్లకమ్మ నుంచి హంద్రీ–నీవా, మిడ్ పెన్నార్ ఆధునికీకరణ పనుల్లోనూ చంద్రబాబుది ఇదే తీరు.
» 2019 ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రకాశం బ్యారేజ్‌కు 21 కిలోమీటర్ల ఎగువన కృష్ణా నదిపై వైకుంఠపురం వద్ద బ్యారేజి నిర్మాణానికి 2018లో తొలుత రూ.801.88 కోట్లతో చంద్రబాబు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసి అంచనా వ్యయాన్ని రూ.1,376 కోట్లకు పెంచేసి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే.. అంచనాల్లోనే రూ.574.12 కోట్లు పెంచేశారు.
ఈ పనులను రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగకు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ పనులను నిబంధనలకు విరుద్ధంగా 13.19 శాతం అధిక ధరకు రూ.1,554.88 కోట్లకు నవయుగకు అప్పగించారు. అంటే.. అంచనాలు పెంచడం ద్వారా, అధిక ధరకు పనులు అప్పగించడం ద్వారా నవయుగకు ప్రభుత్వ ఖజానా నుంచి ఉత్తినే రూ.753 కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను 2019లో ప్రభుత్వం రద్దు చేసింది.
» మళ్లీ ఇప్పుడూ అదే రీతిలో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టేందుకు సిద్ధమైన ప్రభుత్వం.. అక్రమాలకు అడ్డొస్తుందనే నెపంతోనే జ్యుడిషియల్ ప్రివ్యూను రద్దు చేయాలని నిర్ణయించారు.
ఆదర్శవంతమైన జ్యుడిషియల్ ప్రివ్యూ
రాష్ట్రంలో 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చిన టెండర్ల వ్యవస్థకు జవసత్వాలు చేకూర్చుతూ 2019 ఆగస్టు 20న ఆంధ్రప్రదేశ్ ఇన్‌్రఫ్టాస్టక్చర్ యాక్ట్ (జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా పారదర్శకత) – 2019 చట్టాన్ని నాటి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తిని జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జిగా నియమించింది. ఈ చట్టం ప్రకారం.. రూ.వంద కోట్లు అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనుల టెండర్ ముసాయిదా షెడ్యూల్‌ను ముందుగా జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి పరిశీలనకు పంపుతారు.
ఆ ముసాయిదాపై జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆన్‌లైన్‌లో అన్ని వర్గాల ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వాటిని పరిగణనలోకి తీసుకుని జడ్జి మార్పులు సూచిస్తారు. ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తే.. దానిని యధాతథంగా ఆమోదిస్తారు. ఇలా జ్యూడిషియల్ ప్రివ్యూ జడ్జి ఆమోదించిన టెండర్ ముసాయిదా షెడ్యూల్‌తోనే రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ. వంద కోట్లు, అంతకంటే ఎక్కువ వ్యయం ఉన్న పనులన్నింటినీ ఇదే విధానంలో నిర్వహించారు.
ఈ విధానంలో టెండర్ల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించడం వల్లే కాంట్రాక్టర్లు భారీ సంఖ్యలో పోటీ పడి.. కాంట్రాక్టు విలువకంటే తక్కువకే పనులు చేయడానికి ముందుకొచ్చారు. దీని వల్ల రూ.7,500 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదా అయ్యింది. జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. ఈ విధానాన్ని అమలు చేయడాన్ని పరిశీలించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment