![Israel PM Netanyahu Hits Back At Biden Remarks On Judicial Reforms - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/29/benjmen.jpg.webp?itok=3w8nEyMJ)
నిరసనలు, ఆందోళనలు సమ్మెలతో ఇజ్రాయెల్ అట్టుడుకుపోయిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు పట్ల ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షడు జో బైడెన్ సైతం మరింత ఆజ్యం పోసేలా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బైడెన్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు ఘాటుగా స్పందించారు.
ఈ మేరకు నెతాన్యాహు బైడెన్ వ్యాఖ్యలకు బదులిస్తూ..ఇజ్రాయెల్ సార్వభౌమాధికారం కలిగిన దేశం. విదేశాల నుంచి వచ్చే ఒత్తిళ్లపై ఆధారపడి ఇజ్రాయెల్ నిర్ణయాలు తీసుకోదని సూటిగా కౌంటరిచ్చారు. తన ప్రజల ఇష్టానుసారమే ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంటుందని కరాఖండీగా చెప్పారు. కాగా బైడెన్ ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయపరమైన సంస్కరణలు రాజకీయ సంక్షోభానికి దారితీసింది కాబట్టి నెతాన్యాహుల వాటిని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నా అని అన్నారు.
(చదవండి: డోక్లామ్‌పై భూటాన్ ప్రధాని షాకింగ్ వ్యాఖ్యలు! టెన్షన్‌లో భారత్)
Comments
Please login to add a commentAdd a comment