న్యూయార్క్: ఆరుగరు బంధీలను మిలిటెంట్ సంస్థ హమాస్ హత్య చేయటంపై ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఎయిర్‌పోర్టులు, ఆస్పత్రులు, బ్యాంకుల్లో సిబ్బంది సమ్మె చేస్తున్నారు. కాల్పులు విరమణకు ప్రధాని నెతన్యాహు ఒప్పుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షడు జో బైడెన్ సైతం నెతన్యాహు వ్యవహిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గాజాలో హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి తుది ఒప్పందం చాలా దగ్గరలో ఉందని అన్నారు. అయితే ఈ ఒప్పందంలో విషయంలో నెతన్యాహు మాత్రం తగినంత కృషి చేయటం లేదని బైడెన్ ఆరోపణలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment