Hits
-
రైలు ప్రమాదం.. ఒకరు మృతి
కైరో: ఈజిప్ట్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలును వెనుక నుంచి మరో రైలు ఇంజన్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మృతిచెందాడు. 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. రైల్వే అధికారులు గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.ఈ ప్యాసింజర్ రైలు కైరోకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు ఇంజిన్ ఢీకొనడంతో పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో ప్యాసింజర్ రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అనంతరం రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.ఉత్తరాఫ్రికా దేశమైన ఈజిప్టులో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం. కైరోకు దక్షిణాన 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినాయా ప్రావిన్స్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించిందని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి -
జనవరి టు మార్చి టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్
-
ప్రజల ఇష్టానుసారమే నిర్ణయం తీసుకుంటాం! : నెతాన్యాహు
నిరసనలు, ఆందోళనలు సమ్మెలతో ఇజ్రాయెల్ అట్టుడుకుపోయిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు పట్ల ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షడు జో బైడెన్ సైతం మరింత ఆజ్యం పోసేలా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బైడెన్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు నెతాన్యాహు బైడెన్ వ్యాఖ్యలకు బదులిస్తూ..ఇజ్రాయెల్ సార్వభౌమాధికారం కలిగిన దేశం. విదేశాల నుంచి వచ్చే ఒత్తిళ్లపై ఆధారపడి ఇజ్రాయెల్ నిర్ణయాలు తీసుకోదని సూటిగా కౌంటరిచ్చారు. తన ప్రజల ఇష్టానుసారమే ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంటుందని కరాఖండీగా చెప్పారు. కాగా బైడెన్ ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయపరమైన సంస్కరణలు రాజకీయ సంక్షోభానికి దారితీసింది కాబట్టి నెతాన్యాహుల వాటిని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నా అని అన్నారు. (చదవండి: డోక్లామ్‌పై భూటాన్ ప్రధాని షాకింగ్ వ్యాఖ్యలు! టెన్షన్లో భారత్) -
మాస్క్ లేదని చితక్కొట్టిన ఆర్టీసీ బస్ డ్రైవర్
తిరువనంతపురం: ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. కరోనా జాగ్రత్తలు పాటించేలా పోలీసులు, ప్రభుత్వ అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అయినా కూడా కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మాస్క్ ధరించకుండా ఉండడంతో అతడిని చితకబాదిన సంఘటన కేరళలో జరిగింది. కేరళ ఆర్టీసీలో పని చేసే బస్ డ్రైవర్ అంగమలి బస్టాండ్‌లో మాస్క్ లేకుండా ఓ వ్యక్తి నిలబడడాన్ని గుర్తించాడు. వెంటనే కర్ర అందుకుని మాస్క్ ధరించని పెద్దాయనను చితక్కొట్టాడు. కాళ్లు, చేతులపై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అతడి దాడితో తీవ్రగాయాలై ముసలాయన కిందపడిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో నెటిజన్లు ఆర్టీసీ బస్ డ్రైవర్ తీరుపై మండిపడుతున్నారు. పెద్దాయనను మానవత్వం లేకుండా దాడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్క్ లేకుంటే చెప్పాలి కానీ అలా విచక్షణ రహితంగా దాడి చేయడం సరికాదని చెబుతున్నారు. చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు చదవండి: మా రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టబోం -
ఆల్ టైం గరిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీ అదే జోరు
సాక్షి, ముంబై: దలాల్ స్ట్రీట్‌లో లాభాల జోరు కొనసాగుతోంది. ఇన్వెస్టర్ల బలమైన సెంటిమెంటుతో సెన్సెక్స్ 347 పాయింట్లు జంప్ చేసి 40, 816 వద్ద ఆల్ టైం గరిష్టానికి చేరింది. అటు నిఫ్టీ కూడా 12000 ఎగువన హుషారుగా కొనసాగుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్లు ఎగిసి 40770 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు ఎగిసి 12025 వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా హెవీ వెయిట్ రిలయన్స్‌తో పాటు బ్యాంకింగ్ రంగ షేర్ల లాభాలు మార్కెట్లను సరి కొత్త గరిష్టాల దిశగా తీసుకెళ్తున్నాయి. దీనికి టెలికం కంపెనీల షేర్లలో కొనుగోళ్లు మరింత ఊతమిస్తున్నాయి. రిలయన్స్ టాప్ విన్నర్‌గా కొనసాగుతుండగా, వొడాఫోన్ ఐడియా ఈ రోజు మరో 22 శాతం ఎగిసింది. భారతి ఎయిర్టెల్ కూడా 2 శాతం ఎగిసింది. జీ,ఇండస్ ఇండ్ బ్యాంకు, సన్‌ఫార్మ, కోల్ ఇండియా. యస్ బ్యాంకు, టాటా స్టీల్, మారుతి సుజుకి లాభపడుతుండగా, భారతి ఇన్ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్, కోటక్ మహీంద్ర, ఎస్బీఐ, ఐవోసీ, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో నష్టపోతున్నాయి. మరోవైపు దేశీయ కరెన్సీ ఆరంభంలో డాలరు మారకంలో బలహీనంగా ఉన్నా, అనంతరం పుంజుకుంది. 9 పైసలు నష్టపోయినా ప్రస్తుతం స్వల్ప లాభంతో 71.69 వద్ద వుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ ఫ్యూచర్స్ 0.31 శాతం క్షీణించి బ్యారెల్ 60.72 డాలర్లకు చేరుకుంది. -
ఏడాది గరిష్టానికి పసిడి ధరలు
సాక్షి, ముంబై: పండుగ సీజన్ సందర్భంగా కొనుగోళ్లు పెరగడంతో పసిడి మిసమిసలాడుతోంది. అంతర్జాతీయ సంకేతాలతో బంగారం ధరలు బుధవారం సంవత్సర గరిష్టానికి చేరాయి. 10 గ్రాముల బంగారం రూ. 150 పెరిగి రూ. 32,500కు చేరింది. అయితే వెండి కిలో మీద స్వల్పంగా.. అంటే రూ. 20 తగ్గి రూ. 39,730గా పలుకుతోంది. ప్రపంచ మార్కెట్లో కొనసాగుతున్న కొనుగోళ్లతో పాటు స్థానిక జువెల్లర్స్ జరుపుతున్న ట్రేడింగ్స్ తో పుత్తడి ధరలు నింగివైపు చూస్తున్నాయి. విదేశీ మార్కెట్లో ధోరణి, పండుగ, పెళ్లిళ్ల సీజన్ కారణంగా స్థానిక నగలవారి కొనుగోలుతో ఈ ఏడాది అత్యధికంగా బంగారం ధరలను పెంచింది. జాతీయ రాజధానిలో, 99.9% బంగారం మరియు 99.5% స్వచ్చత బంగారం 10 గ్రా.150 రూపాయలు పెరిగి వరుసగా రూ.32,500, రూ.32,350గా ఉంది. సావరిన్ చాలా ఎనిమిది గ్రాములు ధర రూ. 100పెరిగా 24,800ని తాకింది. మరోవైపు ధంతేరస్, దీపావళి పర్వదినాలు సమీపిస్తున్న దృష్ట్యా కొనుగోళ్లు పుంజుకుని, ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ట్రేడర్ల అంచనా. -
నాలుగేళ్ల గరిష్టానికి చమురు ధర
సాక్షి,న్యూఢిల్లీ: చమురు ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. ఇరాన్ పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్‌ధర నాలుగేళ్ల గరిష్టానికి చేరింది. లండన్ మార్కెట్లో తాజాగా బ్రెంట్ చమురు బ్యారల్ తాజాగా 83 డాలర్లనూ దాటేసింది. ఇదే విధంగా నైమెక్స్ చమురు సైతం 73 డాలర్లను అధిగమించింది. ప్రస్తుతం బ్రెంట్ బ్యారల్ 0.57 శాతం ఎగసి 83.21 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు బ్యారల్ 0.43 శాతం పెరిగి 73.56 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నవంబరు 4 నుంచి ఇరాన్‌పై ఆంక్షలు అమలుకానున్న నేపథ్యంలోఆయిల్ ధరలకు 100 డాలర్ల చేరనుందనే అంచనా మరింత ఊపందుకుంది. మరోవైపు డాలరుతో మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి సోమవారం క్షీణించింది. శుక్రవారం కొంతమేర బలపడినప్పటికీ ప్రస్తుతం 33 పైసలు నష్టంతో 72.82 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా పెట్రో ధరలు మరింత మండుతున్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ చమురు మార్కెట్లోని పరిస్థితుల కారణంగా ఇప్పటికే ముంబైలో పెట్రోల్ లీటరు ధర రూ.91 ల మార్క్‌ను అధిగమించింది. అంతేకాదు ఈ చమురు సెగ ఏవియేషన్ కంపెనీలను మరింత బలంగా తాకనుంది. విమానయాన ఇంధన ఏటీఫ్ ధరలు మరింత పెరగనున్నాయనే అంచనాలతో ఏవియేషన్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. స్పైస్‌జెట్ దాదాపు 5 శాతం, జెట్ ఎయిర్వేస్ దాదాపు 5 శాతం, ఇంటర్‌గ్లోబ్ 2 శాతం నష్టపోతున్నాయి. అటు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీ షేర్లు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. -
ఐదేళ్ల చిన్నారిని ఢీకొన్న ఆటో
-
14 నెలల గరిష్టానికి డబ్ల్యుపీఐ
సాక్షి, న్యూఢిల్లీ: డబ్ల్యుపీఐ మరోసారి పెరిగింది. మే నెల టోకు ధరల ద్రవ్యోల్బణం 4.45 శాతానికి పెరిగింది. దాదాపు14 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. కొన్ని ఆహార పదార్థాలు, ఇంధన ధరలు పెరడంతో డబ్ల్యూపీఐ కూడా గరిష్టానికి చేరింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో డబ్ల్యుపిఐ 3.18 శాతం పెరగ్గా , గత ఏడాది మే నెలలో 2.26 శాతం పెరుగుదల నమోదైంది. ఏప్రిల్ నెలలో 0.89 శాతంతో పోలిస్తే మే నెలలో కూరగాయల ధరలు 2.51 శాతం పెరిగాయి. మొత్తం టోకు ధరల సూచీలో ఐదో స్థానంలో ఉన్న ప్రాథమిక వస్తువులు మే నెలలో 3.16 శాతం పెరిగింది. మే నెలలో పప్పు ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం కూడా పెరిగి 13.15 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ఇది 7.85 శాతంగా ఉండగా, గత ఏడాది 11.81 శాతం పెరిగింది. ఏప్రిల్ నెల9.45 శాతందనుంచి పెట్రోల్ ధరలు మేనెలలో 13.90 శాతం మేర పెరిగాయి. గత ఏప్రిల్‌లో 13.01 శాతంతో పోలిస్తే డీజిల్ ధరలు 17. 34 శాతం పెరిగాయి. -
నిడదవోలు శివారులో రోడ్డు ప్రమాదం
-
మృత్యు శకటాలు
-
సొంత నగరాన్ని పేల్చేసుకున్న కిమ్
వరుస అణు, క్షిపణి ప్రయోగాలతో ప్రపంచాన్ని భయపెడుతున్న ఉత్తర కొరియాకు దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. కిమ్ ప్రయోగించిన ఒక క్షిపణి.. విఫలమై సొంత నగరమే సర్వనాశనమైంది. ఈ విషయాన్ని అమెరికా ఉన్నతాధికారులు తాజాగా ప్రకటించారు. నియంతాధ్యక్షుడు కిమ్ గత ఏడాది ఏప్రిల్ 28న హస్వాంగ్-12 అనే మధ్య తరహా క్షిపణిని పరీక్షించారు. అయితే ఇది విఫలం కావడంతో ప్యాంగ్యాంగ్కు 150 కిలో మీటర్ల దూరంలోని టోక్చాన్ అనే పట్టణంపై కూలిపోయింది. టోక్చాన్ నగరంలో దాదాపు రెండు లక్షల మంది నివసిస్తున్నారు. కిమ్ క్షిపణి అక్కడి పారిశ్రామిక లేదా వ్యవసాయానికి సంబంధించిన భవనాలతో ఉన్న ప్రాంగణం మీద కూలినట్లు తెలుస్తోంది. శాటిలైట్ చిత్రాల ద్వారా అమెరికా ఈ మేరకు నిర్ధారణకు వచ్చింది. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయి ఉంటారన్నదానిపై స్పష్టత లేదు. -
దూసుకుపోతున్న రూపాయి
సాక్షి, ముంబై: 2018 కొత్త ఏడాది ఆరంభంలోనే అదరగొట్టిన దేశీయ కరెన్సీ రూపాయి మరింత దూసుకుపోతోంది. జనవరి 1న డాలర్ మారకంలో 5నెలల గరిష్టాన్ని నమోదు చేసిన రూపాయి మంగళవారం కూడా తన హవా కొనసాగించింది. వరుసగా రెండో రోజూకూడా బాగా పుంజుకుని 63.48 డాలర్ల వద్ద జూన్22, 2015నాటి (రెండున్నరేళ్ల)అత్యధిక స్థాయిని నమోదు చేసింది. 15పైసలు లాభపడి 63.54 వద్ద ఉంది. ఫెడ్ వడ్డీ రేట్లపెంపు అంచనాలతో డాలర్‌కు డిమాండ్ క్షీణించినట్టు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
అసలు చెప్పినట్లే ఉండదు నాకు నిడివి - 3 ని. 41 సె. హిట్స్ - 3,79,78,758 ట్వైస్ ‘లైకీ’: మ్యూజిక్ వీడియో తొమ్మిది మంది అందమైన దక్షిణ కొరియా అమ్మాయిల పాప్ బ్యాండ్ ‘ట్వైస్’. ఫ్రెష్‌గా రిలీజ్ చేసిన ‘లైకీ’ మ్యూజిక్ వీడియో.. అబ్బాయిల్ని స్థిమితంగా నిలవనివ్వడం లేదు! ‘నీ ఆలోచనలతో నిద్రను కోల్పోడం కోసమే నా మనసు మేల్కొని సీతాకోక చిలుకలా రెక్కలు ఆడిస్తోంది’ అని అమ్మాయిలు డాన్స్ చేస్తూ కనిపిస్తే.. ‘హృదయం ఎక్కడున్నదీ’ అని సెర్చ్ చేసుకోవలసిందే. ఏ అమ్మాౖయెనా.. ‘ఐ లైక్ యు అని చెప్పేస్తే.. అసలు చెప్పినట్లే ఉండదు నాకు. ఇంకో విధంగా నీ హృదయాన్ని తాకేట్టుగా చెప్పడం ఎలాగా అని ఆలోచిస్తున్నా..’ అంటూ తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తే బాయ్‌ఫ్రెండ్ బతికి బట్టకట్టగలడా?! ఈ బబ్లీ సాంగ్‌లో మొదట మీకు వీడియో కెమెరాతో కనిపించే అమ్మాయి జియో. ఈ గ్రూప్ ఫన్నీగా రెస్టారెంట్లలో, ఇరుకు వీధుల్లో అల్లరి చేస్తుంటే భలే చూడబుద్దేస్తుంది. ఎడారిలో కన్నీటి అలలు నిడివి - 2 ని. 43 సె. హిట్స్ - 51,31,729 ట్వైస్ ‘లైకీ’: మ్యూజిక్ వీడియో గాలిలో మార్పొస్తే మనిషి శరీరం దీపంలా కొట్టుకుంటుంది. ఆ గాలి ‘కద్వీ హవా’ (చెడు గాలి) అయితే జీవితాలు అల్లకల్లోలమే. ఉత్తరప్రదేశ్‌కి, మధ్యప్రదేశ్‌కి మధ్య బుందేల్‌ఖండ్ ఉంది. అక్కడి గాలి స్థిమితం లేనిది. ఒడిశాలో, చంబల్‌లోయ చుట్టూ, రాజస్థాన్‌లోని ధోల్పూర్లో వాతావరణం ఇలాగే ఉంటుంది. ఏడాది అంతా కరువు! మంచి గాలికి, మంచి నీటికి కరవు. ఉన్నచోట ఉన్నట్టుగానైనా నెట్టుకొద్దామంటే ఎప్పుడు ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. ప్రతి ఇంట్లో ఒక కన్నీటి సముద్రం. ఆ కన్నీటి కథల్లోంచి ‘కద్వీ హవా’ చిత్రాన్ని తీసింది ‘దృశ్యం ఫిల్మ్స్’. ఇది సోషల్ డ్రామా. నీల్ మాధబ్ పాండా డైరెక్ట్ చేశారు. సంజయ్ మిశ్రా, రణ్వీర్ శోరీ ముఖ్య నటులు. చిత్రంలో మిశ్రా అంధుడు. శోరీ సముద్ర ప్రాంతం నుంచి వచ్చి మిశ్రాతో పాటు ఎడారి ప్రదేశంలో ఉంటుంటాడు. ‘‘మీకు నీళ్లెక్కువ కదా. అదృష్టవంతులు’’ అంటాడు మిశ్రా! ‘‘అవును, ఎక్కువే’’ అంటాడు శోరీ విరక్తిగా. బహుశా 1999 నాటి ఒడిశా జలప్రళయాన్ని అతడు గుర్తుచేసుకుని ఉండాలి. క్లయిమేట్ ఛేంజస్ భూగోళాన్ని ఎంత దుర్భరం చేయబోతున్నదీ ‘కద్వీ హవా’లో చూడొచ్చు. చిత్రం నవంబర్ 24న రిలీజ్ అవుతోంది. (జర్మనీలోని బాన్‌లో నేటి నుంచి ఈ నెల 17 వరకు యు.ఎన్. క్లైయిమేట్ మీట్ జరుగుతోంది). మధువును గ్రోలకనే మత్తులోకి నిడివి - 4 ని. 9 సె. హిట్స్ - 46,71,551 సురూర్: పంజాబీ లవ్ సాంగ్ నేహా కక్కర్, బిలాల్ సయీద్ ఆలపించిన న్యూ పంజాబీ డ్యూయెట్ సాంగ్ యూట్యూబ్‌లో మంచి ట్రెండింగ్‌లో ఉంది. పాటకు సాహిత్యం, సంగీతం కూడా బిలాలే. 28 ఏళ్ల ఈ పాకిస్థానీ సింగర్‌కు, అతడి కన్నా ఒక్క ఏడాదే పెద్దదైన ఉత్తరాఖండ్ గాయని నేహా కక్కర్కూ గాత్రంలో చక్కగా జత కుదిరింది. ‘సాయం సమయం నీ కోసం సిద్ధమై ఉంది. వచ్చేయ్.. నీ కళ్లల్లో నాకు వెలుగు కనిపిస్తోంది. మధువును గ్రోలకుండానే మత్తులోకి వెళ్లిపోతున్నాను’ అంటూ బిలాల్ మొదలు పెడతాడు. సేమ్.. ఆ మత్తులోకి వెళ్లడం అనే ఎక్స్ప్రెషన్తోనే నేహా కక్కర్ స్వరం కలుపుతుంది. ‘లోకంలోని ఈ దుఃఖంతో నా పట్టింపు లేకుండా నేను నీ ఆలోచనల్లో మునిగి తేలుతున్నాను’ అంటుంది. ప్రేమికులు ప్రపంచంతో ఎంత నిర్దయగా ఉన్నప్పటికీ పాపం వాళ్లను అర్థం చేసుకోవాలనిపిస్తుంది. ‘దేశీ మ్యూజిక్ ఫ్యాక్టరీ’ ఈ బ్లాక్ అండ్ వైట్ వీడియో సాంగ్‌ను అప్లోడ్ చేసింది. తల్లిని వదిలిపోని బిడ్డ నిడివి - 1 ని. 39 సె. హిట్స్ - 7,82,871 బేబీ హార్స్ రెఫ్యూజెస్ టు లీవ్ తల్లి గుర్రానికి దెబ్బ తగిలింది. పిల్ల గుర్రం తల్లిని వదల్లేక చుట్టూ తిరిగింది. కఠిన హృదయుల్ని కూడా జంతు ప్రేమికుల్లా మార్చే ఈ దృశ్యాన్ని ‘డూడో’ అనే వెబ్సైట్ చిత్రీకరించింది. తల్లి గుర్రం పడుకుని లేస్తున్నప్పుడో, పరుగెత్తుతున్నప్పుడో ఎలాగో కాలి గిట్ట ఒకటి, దాని జుట్టులోకి చిక్కుకుపోయింది. దాంతో ఆ గుర్రం కిందపడి లేవలేకపోతోంది. తల్లి బాధను పిల్ల గుర్తించింది. తనేం చేయగలదు? దిక్కుతోచని స్థితిలో తల్లి చుట్టూ తిరుగుతూ ఉండిపోయింది. కొంతసేపటికి అక్కడికి చేరుకున్న రెస్క్యూయర్ తల్లి గుర్రం గిట్టను దాని జుట్టు నుంచి విడిపించడానికి ప్రయత్నించాడు కానీ, కుదర్లేదు. దాంతో కత్తెరతో జుట్టును కత్తిరించాడు, గిట్ట బయటికి వచ్చేసింది. అయినా గుర్రం లేవలేకపోయింది. తన గిట్ట ఇంకా తన జుట్టులోనే ఉందన్న ఫీలింగ్. పిల్ల గుర్రం కూడా అలాగే అనుకున్నట్లుంది.. ‘అమ్మకి ఇంకా నయం కాలేదేమో’ అని! చివరికి తల్లి లేచాక, రెండూ కలిసి హ్యాపీగా ఇంటికి వెళ్లిపోయాయి! రోడ్డు సైడు ఫుడ్డుకు స్టార్ స్టేటస్ నిడివి - 3 ని. 1 సె. హిట్స్ - 4,86,097 మిషోలిన్–స్టార్డ్ మీల్ ప్రపంచంలో ఎక్కడైనా మిషోలిన్ స్టార్ ఉన్న రెస్టారెంట్ ఉందీ అంటే అది చాలా గ్రేట్ అని! ఫైన్ డైనింగ్, ఫుడ్ క్వాలిటీ ఉన్న వాటికే ఆ ‘స్టార్’ స్టేటస్ దక్కుతుంది. తేడా వస్తే మళ్లీ ఆ స్టార్‌ను లాగేసుకుంటుంది మిషోలిన్. (మిషోలిన్ అనేది ఐరోపాలో ప్రసిద్ధ టైర్ల కంపెనీ. ఆ కంపెనీకి రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అది ఏటా మంచి మంచి రెస్టారెంట్లకు అవార్డులు ఇస్తుంటుంది). సెలబ్రిటీ చెఫ్ గోర్డాన్ రామ్సే అయితే ఒకసారి తనకు వచ్చిన స్టార్‌ను, చిన్న పొరపాటు వల్ల పోగొట్టుకున్నందు వలవల ఏడ్చేశాడు కూడా. అంత ప్రతిష్ఠాత్మకమైన మిషోలిన్ స్టార్స్ సింగపూర్‌లోని ఓ రోడ్డు సైడ్ ఫుడ్ బండికి వచ్చాయంట ఆ బండి ఓనర్ ఎంత గ్రేట్ అనుకోవాలి. అతడి పేరు చాన్ హాన్ మెంగ్. వయసు 52 ఏళ్లు. చికెన్‌ని రోస్ట్ చెయ్యడంలో స్పెషలిస్టు. ఏవో రహస్యమైన దినుసులను జోడించి, అత్యంత రుచికరమైన, శుభ్రమైన ఫుడ్ ఐటమ్స్‌ని సర్వ్ చేస్తుంటాడు. మిషోలిన్ అవార్డు వచ్చాక కూడా అదే ధరకు (ఒకటిన్నర డాలర్లు) అంతే క్వాంటిటీ ఫుడ్, అంతే క్వాలిటీతో చాన్ ఇస్తున్నాడు! ‘గ్రేట్ బిగ్ స్టోరీ అనే వెబ్ సైట్ ఈయన స్టోరీని యూట్యూబ్ తెరకు ఎక్కించింది. చూడండి. మీరూ ఇన్స్పైర్ అయి ఓ బండి పెట్టినా పెట్టేస్తారు. భర్త కన్నా భార్యే తెలివైనదా?! నిడివి - 2 ని. 25 సె. హిట్స్ - 1,71,946 డౌన్‌సైజింగ్: ట్రైలర్ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామా మూవీ ‘డైన్సైజింగ్’ రెండో ట్రైలర్ ఇది. జనాభా సమస్య పరిష్కారానికి ప్రపంచ దేశాలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి కదా, ఈ సినిమాలోని నార్వే సైంటిస్టులు ఓ కొత్త రకం విరుగుడును కనిపెడతారు. మనిషిని 5 అంగుళాల ఎత్తుకు కుదించే ప్రయోగం అది. సక్సెస్ అవుతుంది. ఈ భూమండలంపై ఉన్న వాళ్లందరినీ ఇలా కుబ్జాకారులుగా మార్చేస్తే సంభవించబోయే పరిణామాలను ఆర్థిక వేత్తలు, సైకాలజిస్టులు, ఆధ్మాత్మికవాదులు అంచనా వేయడం మొదలౌతుంది. మొత్తానికైతే 200 ఏళ్ల క్రితం నాటి ఆరోగ్యవంతమైన, అతి విశాలమైన ప్రకృతి జీవనానికి అనువైన వసతులతో మెరుగైన జీవితాన్ని పొందవచ్చునని మనుషులందరిలోనూ ఆశ కలుగుతుంది. అలా ఆశపడ్డవాళ్లలో పాల్ సఫ్రానెక్, ఆయన భార్య ఆడ్రే కూడా ఉంటారు. జీవితంలోని స్ట్రెస్‌ని తప్పించుకోడానికి వాళ్లు కూడా ఐదు అంగుళాల మానవులుగా మారిపోడానికి సిద్ధమైపోతారు. అయితే ఆఖరి నిముషంలో ఆడ్రే మనసు మార్చుకుంటుంది. ఎందుకు మార్చుకుంటుందనేది క్రిస్మస్కి మూడు రోజుల ముందు డిసెంబర్ 22న తెలుసుకోవచ్చు. ఆ రోజున ఈ చిత్రం విడుదల అవుతోంది. -
గూగుల్‌కు రికార్డ్ స్థాయిలో భారీ జరిమానా
బ్రస్సెల్స్: ఇంటర్నెట్ సెర్చ్ ఇంజీన్ గూగుల్‌కు యూరోపియన్ యూనియన్ భారీ జరిమానా విధించింది. గూగుల్ అందిస్తోన్న షాపింగ్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ రికార్డ్ స్థాయిలో పెనాల్టీ విధించింది. పలు సంస్థలకు అక్రమంగా లబ్ధిని చేకూర్చుతోందన్న ఆరోపణలపై ఈయూ సుదీర్ఘ విచారణ నిర్వహిణ అనంతరం మంగళవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. గూగుల్ అందిస్తోన్న ఆ సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేల్చిన ఈయూ ఆ సంస్థకి ఏకంగా 2.4 బిలియన్ యూరోల (2.72 బిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. గూగుల్ తమ సెర్చింజన్లో చూపించిన ఆన్లైన్ షాపింగ్ సర్వీస్ సంస్థల పేర్లు ఇతర సంస్థలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని తేల్చింది. గూగుల్ సెర్చ్‌లో తన షాపింగ్ సర్వీస్‌లనే ప్రమోట్ చేసి.. ప్రత్యర్థి కంపెనీల డీమోట్ చేసిందన్న ఆరోపణలు గూగుల్‌పై ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన ఈయూ యాంటీట్రస్ట్ విభాగం.. గూగుల్‌కు 242 కోట్ల యూరోల (సుమారు రూ.17,590 కోట్లు) జరిమానా విధించింది. 90 రోజుల్లోగా సెర్చ్‌లో తన షాపింగ్ సర్వీస్‌లకు ఫేవర్ చేయడాన్ని నిలిపేయాలని ఆదేశించింది. లేనిపక్షంలో ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు వచ్చే టర్నోవర్‌లో 5 శాతం పెనాల్టీ వేస్తామని కూడా హెచ్చరించింది. ఏడేళ్లుగా దీనిపై విచారణ చేస్తున్న కమిషన్ ఈయూ యాంటీట్రస్ట్ నిబంధనల ప్రకారం గూగుల్ చేసింది చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. గూగుల్ చట్ట విరుద్ధమైన చర్య వల్ల యురోపియన్ యూనియన్ కన్జూమర్లు సరైన ఎంపిక చేసుకొనే అవకాశాన్ని కోల్పోయారని కమిషన్ స్పష్టంచేసింది. అలాగే తన ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ప్రత్యర్థులను అణచివేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఏడేళ్లుగా గూగుల్‌పై పదుల సంఖ్యలో కంపెనీలు ఫిర్యాదులు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈయూలో యాంటీట్రస్ట్ కేసులో అతిపెద్ద జరిమానాను ఎదుర్కొన్న కంపెనీగా గూగుల్ నిలిచింది. 2009లో అమెరికా చిప్ మేకర్ ఇంటెల్ కు 1.06 బిలియన్ యూరోల జరిమానా విధించింది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఈ రాత్రికి మళ్లీ వస్తాడు హంతకుడు హ్యాపీ డెత్ డే ట్రైలర్ నిడివి: 2 ని. 30 సె. హిట్స్ 28,28,694 లో–బడ్జెట్ హారర్ చిత్రాలను నిర్మించే ‘బ్లూమ్హౌస్ ప్రొడక్షన్స్’ లేటెస్టుగా ‘హ్యాపీ డెత్ డే’ అనే హాలీవుడ్ మూవీని చిత్రీకరిస్తోంది. ఇది స్లాషర్ మూవీ. ట్రైలర్ రెండు రోజుల క్రితమే విడుదలైంది. అమ్మాయిల్ని కత్తితో కసాబిసా పొడిచి చంపేసే కథాంశంతో ఉన్న చిత్రాలను స్లాషర్ మూవీలు అంటారు. ఇందులో ఇటీవలి ‘లా లా లాండ్’ చిత్రం ఫేమ్ జెస్సికా రోత్ కాలేజ్ స్టూడెంట్. బర్త్‌డే రోజు రాత్రి జెస్సికాను ఎవరో హత్య చేస్తారు. కత్తితో పొడుస్తుండగా పెద్దగా అరుస్తూ లేస్తుంది. ఇలా ఆమె లైఫ్‌లో రిపీటెడ్‌గా జరుగుతూంటుంది. అది వెంటాడే కల. హంతకుడెవరో తెలుసుకోడానికి ఆ అమ్మాయి గతంలోకి వెళుతుంది. ఈ ట్రైలర్‌ను చూస్తున్నంత సేపూ మహేశ్‌బాబు సినిమా ‘నేనొక్కడినే’ గుర్తుకు వస్తుంది. ఫస్ట్ సీన్లో.. మంచం మీద పడుకుని ఉన్న జెస్సికా చప్పుడుకి తలెత్తి చూస్తుంది. ఫోన్ రింగ్, డాడీ కాల్ అది. అలా ఎస్టాబ్లిష్ అయిన జెస్సికా భయం.. ట్రైలర్ చివరి వరకు వెంటాడుతూనే ఉంటుంది. ప్రస్తుతానికైతే కథ ఇదే. కథలో కొత్తగా మార్పులు చేయబోతున్నారట. క్రిస్టఫర్ లాండన్ డైరెక్ట్ చేస్తున్న ‘హ్యాపీ డెత్ డే’ అక్టోబర్ 13న రిలీజ్ అవుతోంది. ఆ రోజు శుక్రవారం! ఫ్రైడే 13 ని ఫారినర్స్ చాలామంది పీడ దినంగా భావిస్తారు! ఈ హారర్ మూవీకి ఇది మంచి రోజు కావచ్చు. ఎందుకంటే బ్లూమ్హౌస్ నిర్మించిన వాటిలో రెండు చిత్రాలు.. బాక్సాఫీస్ దగ్గర వంద మిలియన్ డాలర్లకు పైగా పోగేసుకున్నాయి. ఇది మూడో చిత్రం అవొచ్చు. సడెన్‌గా కనిపించావు.. కానీ నువ్వు కాదు..! సెలెనా గోమెజ్ బ్యాడ్ లయర్ నిడివి : 3 ని. 52 సె. హిట్స్ 2,12,21,9993 ఇరవై నాలుగేళ్ల అమెరికన్ నటి, గాయని సెలీనా గోమెజ్ విడుదల చేసిన కొత్త మ్యూజిక్ వీడియో ‘బ్యాడ్ లయర్’! యూట్యూబ్‌లో అప్లోడ్ అయిన కొన్ని గంటలకే హిట్లు కోట్లు దాటాయి. ఇందులో సెలెనా ఎంత క్యూట్‌గా ఉన్నారంటే.. అబ్బాయిలూ మీరస్సలు కళ్లు తిప్పుకోలేరు. ఇంతవరకు ఆమె చేసిన పాటల్లో ఇది పూర్తిగా పెక్యూలియర్. ఒక మేల్ టీచర్‌గా, ఒక యంగ్ స్టూడెంట్‌గా, ఫ్లర్ట్ చేస్తుండే ఇంకొక మేల్ టీచర్‌గా, ఆఖరికి ఒక అనుమానపు భార్యగా సెలెనా నాలుగు పాత్రలను పోషించారు. ఈ వయసులో ఈ పిల్లకింత కష్టం ఏమిటి? కష్టం కాదు, ప్రయోగం అంటోంది సెలెనా. కానీ ఇది ప్రయోగం కాదు, ప్రేమ వైఫల్యం అని ‘బ్యాడ్ లయర్’ రిలీజ్ అయిన వెంటనే కొన్ని కోళ్లు నోరు చేసుకున్నాయి. భర్తని అనుమానించే భార్య పాత్రకు ఫ్లాష్‌బ్యాక్.. ఆమెకు, ఆమె ప్రియుడు ‘వీకెండ్’ కూ మధ్య జరిగిన నిజ జీవిత ప్రణయ కలహాలేన ట. వీకెండ్.. కెనడియన్ సాంగ రైటర్. అసలు పేరు అబెల్ మక్కోనెన్ తెస్ఫాయీ. అదలా ఉంచితే, బ్యాడ్ లయర్లో అతి సున్నితమైన ఉద్వేగాన్ని గాఢాతిగాఢంగా ప్రదర్శించారు సెలెనా. ఆమె ఘాట్ రోడ్డు మీద సైకిల్ తొక్కుకుంటూ వెళుతుండగా.. ‘ఓ రోజు నేను వీధి వెంబడి నడుచుకుంటూ వెళుతున్నాను. అప్పుడు నాలో నేను లేను. అదాటున నవ్వు కనిపించావు. ఓఫ్.. కానీ నువ్వు కాదు’ అని పాట మొదలౌతుంది. తర్వాత కాలేజ్ కారిడార్ సీన్లో నడుస్తూ సెలెనా ‘ఊవూవూవూవూ’ అని రాగం తియ్యడం మెలోడియస్గా ఉంటుంది. ఆ తర్వాత.. ‘నీ గురించి ఆలోచించకుండా ఉండేందుకు నేను ప్రయత్నిస్తున్నాను’ ఓ పచ్చి అబద్ధం చెబుతుంది. పాట చివర్లో కానీ.. అది అబద్ధం అని తెలీదు. ‘ఇఫ్ యు ఆర్ ద ఆర్ట్.. ఐ విల్ బి ద బ్రష్’ అంటుంది! నా ప్రేమను నీ ఇష్టం వచ్చినట్లు పెయింట్ చేసుకో అంటుంది. సెలెనా మాత్రమే కాదు, సాంVŠ కూడా ఆమెకు దీటుగా లవ్లీగా ఉంది. శ్రద్ధాకపూర్.. సిస్టర్ ఆఫ్ దావూద్ ఇబ్రహీం హసీనా పార్కర్ టీజర్ నిడివి: 1 ని. 5 సె. హిట్స్ 31,78,771 బ్లాక్ ఫ్రైడే, రిస్క్, వన్స్ అప్ ఆన్ ఎ టైమ్ ఇన్ ముంబై, షూటౌట్ ఎట్ లఖాండ్వాలా, కంపెనీ, డి, డి–డే.. ఇవన్నీ.. మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మీద వచ్చిన బాలీవుడ్ చిత్రాలు. ఇప్పుడు ఆయన చెల్లెలు హసీనా పార్కర్ మీద ఆమె పేరుతోనే వస్తున్న బయోపిక్ లాంటి చిత్రం ‘హసీనా పార్కర్’. ముంౖ»ñ నాగ్‌పడా లోని ప్రసిద్ధ ‘గోర్డెన్ హాల్’ అపార్ట్మెంట్లో ఉంటున్న హసీనా (55) 2014లో రంజాన్ ఉపవాసంలో ఉండగా గుండెపోటుతో చనిపోయారు. హసీనాకు కొడుకు, ఇద్దరు కూతుళ్లు. కొడుకు డానిష్ కొన్నేళ్ల క్రితమే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. భర్త ఇబ్రహీం ఇస్మాయిల్ పార్కర్ 1991లో గ్యాంగ్ వార్‌లో చనిపోయాడు. ముంబై నేర ప్రపంచంతో హసీనాకూ సంబంధాలు ఉన్నప్పటికీ ఏనాడూ అరెస్టుకాలేదు! హసీనా బయోపిక్‌లో ఇవన్నీ ఉండొచ్చు. ఉండకపోవచ్చు. ఆమె పాత్రలో శ్రద్ధా కపూర్, దావూద్ ఇబ్రహీంగా సిద్ధాంత్ కపూర్, హసీనా భర్తగా అంకూర్ భాటియా నటిస్తున్నారు. ఆగస్టు 18న మూవీ రిలీజ్ అవుతోంది. నువ్వు చెప్పుకోవలసింది ఏమైనా ఉందా? డాడీ ట్రైలర్ నిడివి: 2 ని. 14 సె. హిట్స్ 53,56,300 1970లలో ముంబైలోని జౌళి మిల్లులు మూత పడ్డాయి. లక్షల మంది కార్మికుల కుటుంబాలు వీధిన పడ్డాయి. ఆకలి, ఆక్రోశం, అరాచకం. దగ్డీ చాల్లో ఉండే కార్మికులు మెల్లిగా అండర్ వరల్డ్ వైపు వెళ్లారు. గ్యాంగ్‌లు ఏర్పరచుకున్నారు. ఆ గ్యాంగ్‌లలో ఖతర్నాక్ గ్యాంగ్ బి.ఆర్.ఎ. ‘బి’ ఫర్ బాబు, ‘ఆర్’ ఫర్ రమ, ‘ఎ’ ఫర్ అరుణ్. ఈ గ్యాంగ్‌లో అరుణ్ డిఫరెంట్. అతడి స్టోరీనే ‘డాడీ’ మూవీ. 2012 నాటికి అరుణ్ దగ్డీ ‘డాడీ’గా అవతరిస్తాడు. రాజకీయ నాయకుడు అవుతాడు. లేని వాళ్లకు డాడీ, దోచుకునేవాళ్లకు డెడ్లీ. పోలీస్ డిపార్ట్మెంట్ వేట ప్రారంభిస్తుంది. ‘నేనిక్కడే ఉంటాను. పారిపోను’ అంటాడు అరుణ్. చివరికి చట్టానికి దొరుకుతాడు. ‘నువ్వు చెప్పుకునేదేమైనా ఉందా?’’అని న్యాయస్థానం అడుగుతుంది. ‘నేను నిర్దోషిని’ అంటాడు అరుణ్. మూవీ రిలీజ్ జూలై 21న. గ్యాంగ్‌స్టర్‌గా ఉండి పొలిటీషియన్‌గా మారిన అరుణ్గావ్లీ జీవితం ఇది. ఆశిమ్ అహ్లువాలియా డైరెక్టర్. అరుణ్గా అర్జున్ రాంపాల్. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
బుజ్జిమేక బుజ్జిమేక.. యు ఆర్ బ్యూటిఫుల్ సైక్లాప్స్ గోట్ బార్న్ ఇన్ ఇండియా: నేషనల్ జియోగ్రఫిక్ నిడివి : 1 ని. 6 సె., హిట్స్ : 13,92,917 అస్సాంలో ఇటీవల కన్ను తెరిచిన ఒక మేకపిల్లను నేషనల్ జియోగ్రఫిక్ చానల్ నిన్న అప్లోడ్ చేసింది. ఈ ఒంటికన్ను మేకపిల్లను ఇప్పుడంతా ఇంతింత కళ్లేసుకుని యూట్యూబ్‌లో తిలకిస్తున్నారు. ‘సైక్లాప్స్’ అనే ఒక అరుదైన శారీరక స్థితితో ఈ మేకపిల్ల పుట్టింది. గర్భంలో ఉండగా రెండుగా విడిపోవలసిన కళ్లు, ఒకటిగానే ఉండిపోవడాన్ని సైక్లోపియా అంటారు. దేవుడా! ఏమిటయ్యా ఇది? ఈ ప్రశ్నకు దేవుడు కాదు, వైద్యులు సమాధానం చెబుతున్నారు. గర్భంలో ఉండగా తల్లి మేక ఆహారంలో విషపదార్థాల మోతాదులు మితిమీరితే బిడ్డ మేక ఇలా పుట్టే అవకాశాలు ఉన్నాయట! ‘సేమ్ రీజనే మానవజన్మకూ వర్తిస్తుంది. గర్భిణులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించండి, సైక్లాప్స్ జననాలను నివారించండి’ అని జియోగ్రఫిక్ చానల్ వారి జీవ జాతుల పరిశోధక బృందం అంటోంది. నన్ను హత్తుకునే ఉండు..వదిలెయ్యకు కమిల్లా కబేల్లో : క్రయింగ్ ఇన్ ద క్లబ్ నిడివి : 5 ని. 20 సె., హిట్స్ : 36,10,540 ఆడపిల్ల దుఃఖాన్ని చూసి తట్టుకోలేని మగధీరులకు ఈ వీడియో నిషిద్ధం. ఆడపిల్ల మనసును అర్థం చేసుకునే ధైర్యవంతులు మాత్రం ముందుకు వచ్చేయండి. ఏంటట.. ఆ అమ్మాయికి అంత బాధ! హార్ట్ బ్రేక్ అయిందా? ‘అతడి ప్రేమ పొందకుండానే చచ్చిపోతానని నువ్వు అనుకుంటున్నావా? నువ్వెప్పటికీ ఒంటరిగానే మిగిలిపోతానని భయపడుతున్నావా? అది నిజం కాదు. అది నిజం కాదు.. అది నిజం కాదు..’ అని మీరెంత అయినా అనునయించండి. తను క్లబ్బులో కూర్చొని ఏడుస్తూనే ఉంటుంది. బట్.. ‘‘లేదు లేదు.. నేను ఏడ్వడం లేదు.. నేడు ఏడ్వవడం లేదు..’’అని పచ్చి అబద్ధం చెబుతుంది! సడన్‌గా మళ్లీ అంటుంది.. ‘ఈ రాత్రికి నన్ను నీ చేతుల్లోకి తీసుకో. నా కోసం నీ హృదయాన్ని తెరిచి ఉంచు. సూర్య కిరణాలు నిన్ను తాకే వరకు, నువ్వు నన్ను హత్తుకునే ఉండు’ అని డీలా పడిపోతుంది. బాస్.. ఎవరీ అమ్మాయి! ఎవరా? క్యూబాలో పుట్టిన అమెరికన్ గాయని కమిల్లా కబెల్లో. ఆ కళ్లను చూస్తే ప్రేమలో పడిపోని వాడెవడు ఈ భూలోకంలో. తను.. స్వయంగా తను పాడుతోంది. ఎవడో నీలాంటి వాడో, నాలాంటి వాడో హర్ట్ చేశాడు. లేదా హర్ట్ అయిన ఏ అమ్మాయి ఆవేదననో తన గొంతులో పలికిస్తోంది. బాయ్స్.. ఈ సాయంత్రం మీ గర్ల్‌ఫ్రెండ్‌ని కలవబోయే ముందు ఈ వీడియోను ఒక్కసారి చూడండి. పద్నాలుగో మమ్మీ.. 9న నిద్ర లేస్తోంది! ది మమ్మీ : ట్రైలర్ నిడివి : 1 ని. 57 సె., హిట్స్ : 26,55,230 జేమ్స్‌బాండ్ 007 టైప్‌లో హాలీవుyŠ మూవీస్‌లో మనకున్న మరొక థ్రిల్లర్.. ‘మమ్మీ’ సీరీస్. 1932లో ‘ది మమ్మీ’ పేరుతో ఫస్ట్ మమ్మీ నిద్రలేచింది. ఈ ఏడాది జూన్ 9న అదే పేరుతో 14వ మమ్మీ సమాధిలోంచి లేస్తోంది. పురాతనకాల సమాధి నుంచి శతాబ్దాల తర్వాత తిరిగి లేచిన ఒక రాకుమారి ఘోస్ట్‌గా మారి ఆధునిక ప్రపంచాన్ని అతలాకుతలం చేసే కథాంశంతో తయారైన ఈ చిత్రంలో మీరు మధ్యప్రాచ్యపు మార్మిక ఎడారి భూములను, పద్మవ్యూహాల్లాంటి సొరంగాలను ఈ ఆధునిక కాలపు థియేటర్లలో కూర్చొని త్రీడీలో వీక్షించవచ్చు. 35 ఏళ్ల హాలీవుడ్ నటి సోఫియా బొటెల్లా ఇందులో మమ్మీగా నటిస్తున్నారు. ఈ ‘టైటిల్ మాన్స్టర్’ సహ నటుడిగా టామ్ క్రూజ్ సీన్లోకి వస్తున్నారు. ఎడారి గుండా ఓ విమానం ప్రయాణించడం ట్రైలర్ తొలి బిట్. అందులో మన హీరో ఉంటాడు. క్షణాల్లో విమానం ముక్కలైపోతుంది. నెక్స్›్టబిట్లో మమ్మీ లండన్‌లో దిగుతుంది. అక్కడి నుండి ప్రతి బిట్లోనూ మమ్మీకి, క్రూజ్‌కి మధ్య ఫైట్. మీరిక సీట్లో స్థిమితంగా కూర్చోలేరు. అది సినిమా అయినా, ట్రైలర్ అయినా! ముద్దొచ్చేస్తారు.. ఏడుపు ముఖం బాయ్స్ లొగాన్ పాల్ : హెల్ప్ మీ హెల్ప్ యు నిడివి : 3 ని. 24 సె., హిట్స్ : 60,10,763 అమ్మాయిలు ఎప్పటికీ అబ్బాయిలకు అర్థం కారు. అవునా! అమ్మాయిలు ఏమంటున్నారో చూడండి. అబ్బాయిలు అమ్మాయిల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరట. ఇదిగో ఈ అర్థం కాకపోవడంలోనే ఉందట అట్రాక్షన్ అంతా! లొగాన్ అలెగ్జాండర్ అంటున్నాడీమాట. ఓ అట్రాక్టివ్ వీడియో చిత్రీకరించుని యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. ఫన్నీ క్లిప్ కేటగిరీలో ఇప్పుడది ట్రెండింగ్‌లో ముందుంది. లొగాన్ యాక్టర్, అమెరికన్ సోషల్ మీడియా ఎంటర్టైనర్. వీడియో ఫన్నీగా స్టార్ట్ అవుతుంది. బట్టల కుప్పల్లోంచి లొగాన్ తల బయటికి వస్తుంది. లోపల గదిలోంచి ఓ పిల్ల వస్తుంది. ‘‘పార్టీకి నేనే డ్రస్ వేసుకోనూ..’’ అని! ఇక పాట మొదలౌతుంది. ‘నీకు పన్నెండుసార్లు చెప్పాను. మొదట చేతికి వచ్చిన డ్రస్ ఏదో అదే బెస్ట్ డ్రస్’ అని. చాకుల్లాంటి కుర్రాళ్లు ఐదుగురిని వెంటేసుకుని ఈ వీడియోను ఫీచరింగ్ చేశాడు లొగాన్. ఆ కుర్రాళ్లూ కన్ఫ్యూజన్లో ‘అమ్మాయిలెందుకు అడిగిన దాన్నే మళ్లీ మళ్లీ అడుగుతుంటారు. అని ఆశ్చర్యపోతుంటారు.. అమాయకంగా! ఐ నీడ్ ఎ బ్రేక్ బేబీ.. అని మొత్తుకుంటుంటారు. ఆడపిల్లల్ని అర్థం చేసుకోలేక ఏడుపుముఖం పెట్టే అబ్బాయిలు ఎంత ముద్దొస్తారో చూడాలని కోరుకునే అమ్మాయిలు దీనిని మిస్ అవకూడదు. -
రిలయన్స్‌కు ఫలితాల కిక్
ముంబై: ఇండస్ట్రీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) దూసుకుపోతోంది. నిన్నటి త్రైమాసిక ఫలితాల ప్రకటనతో మంగళవారం నాటి మార్కెట్లో తన హవాను ప్రదర్శిస్తోంది. మార్కెట్ ఓపెనింగ్ లో 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. రిలయన్స్ షేరు 1478 వద్ద 3.5 శాతానికిపైగా లాభపడి మార్కెట్లో టాప్ లాభాలతో రారాజుగా నిలిచింది. ఈ ప్రభావం స్టాక్‌మార్కెట్లపైనా పడింది. మరోవైపు ఎనలిస్టులు కూడా ఈ షేరు బై కాల్ ఇస్తున్నారు. సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా లాభపడగా, నిఫ్టీ ఆల్ టైం హైని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఊపందుకున్న సెంటిమెంటుకు తోడు రిలయన్స్, ఎంఎం లాంటి దిగ్గజాల లాభాలతో ట్రేడింగ్ ప్రారంభంలోనే కొత్త రికార్డులను అందుకున్నాయి. నిఫ్టీ 9,279ను తాకింది. తద్వారా ఈ నెల 5న సాధించిన లైఫ్‌టైమ్ గరిష్టం 9,274 స్థాయిని నమోదు చేసింది. ఈ బాటలో బ్యాంక్ నిఫ్టీ సైతం నిఫ్టీ బ్యాంక్ కూడా21987 వద్ద ఫ్రెష్ ఆల్ టైం హైని తాకింది. దాదాపు అన్ని రంగాలు గ్రీన్‌గా ట్రేడ్ అవుతుండటం విశేషం. కాగా దేశంలో అత్యంత విలువైన కంపెనీ మరోసారి రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.8,046 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో కంపెనీకి వచ్చిన లాభం రూ.7,167 కోట్లతో పోలిస్తే 12.5 శాతం వృద్ధి నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
20 నెలల గరిష్టానికి రుపీ
ముంబై: ఆర్బీఐ పాలసీ రివ్యూ వచ్చిన కిక్‌తో రూపాయి మరోసారి దూసుకుపోతోంది. ద్రవ్యోల్బణ ఆందోళన నేపథ్యంలో ఈ సంవత్సరానికి వడ్డీరేట్ల కోత ఉండదనే ఆర్బీఐ సంకేతాలతో రూపాయి పాజిటివ్‌గా స్పందించింది. ఇటీవల రూపాయి 17 నెలల గరిష్టంవద్ద కదులుతున్న రూపాయి ఆర్బీఐ నిర్ణయంతో మరోసారి బలపడింది. గురువారం నాటి ముగింపు రూ. 64.52తో పోలిస్తే దాదాపు సంవత్సరన్నర గరిష్టాన్ని తాకింది. గురువారం ర్యాలీని కొనసాగించిన రూపాయి నేడు డాలర్ మారకంలో రూ. 64.32 వద్ద 2015 ఆగస్టునాటి స్థాయిని తాకింది. -
రిలయన్స్ షేర్ రూ.2వేలు దాటుతుందా?
ముంబై: జియో బొనాంజా రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సుదీర్ఘకాలం తరువాత మెరుపులు మెరిపించి చరిత్ర సృష్టించింది. తద్వారా మార్కెట్ వర్గాలను, విశ్లేషకులు విస్మయపర్చింది. సెన్సెక్స్ 0.36 లాభాలతో సరిపెట్టుకుంటే.. రిలయన్స్ఇడస్ట్రీస్ ఏకంగా 11.17 శాతం లాభపడింది. మంగళవారం నాటి అంబానీ ప్రెస్‌మీట్ తరువాత బుధవారం మార్కెట్ లో ఆర్ఐఎల్ టాప్ విన్నర్ గా నిలిచింది. దీంతో ఒక్కసారిగా ఎనలిస్టులు ఈ షేర్ పెర్ఫామెన్స్ గా సానుకూలంగా మారిపోయారు. అంతేకాదు ఆర్ఐఎల్ మార్కెట్ విలువ కూడా భారీగా పుంచుకుంది. రూ. 25,000 కోట్లకుపైగా ఎగసి రూ. 3.91 లక్షల కోట్లను తాకింది. 2009 మే 18 తరువాత ఇండెక్స్ హెవీవెయిట్ ఆర్ఐఎల్ 11 శాతం పైగా జంప్‌చేసి 1,211 వద్ద ఎనిమిదేళ్ల గరిష్టాన్ని నమోదు చేయడం విశేషం. ఆర్ఐఎల్ షేరు1133 స్థాయియిని బ్రేక్ చేసి దూసుకుపోవడంపై విశ్లేషకులు పాజిటివ్‌గా స్పందించారు. గత 5,6 ఏళ్లుగా బలహీనంగా రిలయన్స్ కీలక మద్దతుస్తాయి 1200కి స్థాయికిపైన నిలబడటం, ఎంకేజింగ్ గా ఉండటం సంతోషం దాయకమంటున్నారు. కోటక్ మ్యూచువల్ ఫండ్ ఫండ్ మేనేజర్ హరీష్ కృష్ణన్ జియో కార్యకలాపాల ద్వారా వచ్చిన పెట్టుబడులు రిలయన్స్ ఇండస్ట్రీస్ బాగా లాభపడిందని చెప్పారు. రాబోయే 18-24 నెలలో ఇది రూ.2 వేల స్థాయిని టచ్ చేస్తుందని ఇండస్ ఈక్విటీస్ డైరెక్టర్ సుశీల్ చాక్సీ తెలిపారు. ఉచిత సేవలనుంచి టారిఫ్ ప్లాన్ లోకి జియో మారడంపై ఎనలిస్టులు పాజిటివ్ గా స్పందించారు. అంబానీ మార్పు స్వాగతించిన విశ్లేషకులు ఇది టెలికం రంగానికి మరింత హేతుబద్ధ పోటీని తీసుకొస్తుందన్నారు. ఇకముందు మరింత వేగంగా దూసుకుపోనుందని పాజిటివ్ గ్లోబల్ బ్రోకరేజ్ క్రెడిట్ స్యూజ్ ఒక నోట్ లోతెలిపింది. రిలయన్స్ జియో టెలికాం కార్యకాలాపాలు తన తొలి సంవత్సరం చివరినాటికి అంచనాలకు మించి రికార్డ్ లాభాలను నమోదు చేసే అవకాశం ఉందని మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ఈ కౌంటర్లో గత ఏడేళ్లలోలేని విధంగా భారీ ట్రేడింగ్ పరిమాణం నమోదైంది. దీంతో మార్కెట్ విలువలో తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది ఆర్ఐఎల్. రూ. 25,000 కోట్లకుపైగా ఎగసి రూ. 3.91 లక్షల కోట్లను తాకింది. టీసీఎస్ తరువాత రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా ఇటీవల రెండవ స్థానానికి ఎగబాకిన హెచ్డీఎఫ్సీ బ్యాంకును వెనక్కి నెట్టేసింది. కాగా ఒకపుడు రిలయన్స్ షేర్ ధర స్పందన ఆధారంగా స్టాక్‌మార్కెట్ కదలికలను అంచనా వేసేవారంటే అతిశయోక్తి కాదు. మరి తాజా మార్పులతో మరోసారి ఆక్రెడిట్ నిలబెట్టుకుంటుందా? వేచిచూడాలి. -
ఢిల్లీలో రెచ్చిపోయిన తాగుబోతులు
-
రోడ్డుపాలైన వందల లీటర్ల పాలు
-
మంటల్లో తగలబడ్డ కారు
-
డామినోస్ పిజ్జా ఆపరేటర్‌కు షాక్
ముంబై: దేశంలో డామినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ లాంటి ఔట్ లెట్స్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న జుబిలెంట్ ఫుడ్స్ కు మార్కెట్లో భారీ షాక్ తగిలింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ సీఈవో, హోల్ టైమ్ డైరెక్టర్ అజయ్ కౌల్ రాజీనామాతో ఈ కౌంటర్లో మదుపర్లు అమ్మకాలవైపు మొగ్గు చూపారు. దీంతో మంగళవారం నాటి మార్కెట్లో ఈ షేరు భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. ఒక దశలో 8 శాతానికిపైగా నష్టపోయింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, హోల్ టైం డైరెక్టర్ అజయ్ కౌల్ పదవీ విరమణకు నిర్ణయించుకున్నారని, మార్చి 31 వరకు పదిలో కొనసాగుతారని జూబిలెంట్ ఇండియన్ గ్రూప్ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. కౌల్ స్థానాన్ని భర్తీ చేసే పనిలో ఉన్నామని ప్రకటించింది. ఈ జులైలో ఈ కంపెనీ సీఈవోగా ఉన్న రవిగుప్తా రాజీనామా చేశారు. అయితే ఈ పరిణామాలు జూబిలెంట్ కు ప్రతికూలంగా మారినున్నాయని క్రెడిట్ స్యూజ్ అంచనావేసింది. ఈ అంచనాలకు అనుగుణంగానే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ షేర్లు నష్టాలను నమోదు చేస్తున్నాయి. కాగా కంపెనీ ఈఏడాది ఏప్రిల్ జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాల ప్రకారం నికర లాభాల్లో 31 క్షీణతను రిపోర్టు చేసిన సంగతి తెలిసిందే. -
నెల్లూరులో పోలీస్ వ్యాన్ - స్కార్పియో ఢీ