కైరో: ఈజిప్ట్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలును వెనుక నుంచి మరో రైలు ఇంజన్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మృతిచెందాడు. 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. రైల్వే అధికారులు గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్యాసింజర్ రైలు కైరోకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు ఇంజిన్ ఢీకొనడంతో పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో ప్యాసింజర్ రైలులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అనంతరం రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఉత్తరాఫ్రికా దేశమైన ఈజిప్టులో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో రైలు ప్రమాదం. కైరోకు దక్షిణాన 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినాయా ప్రావిన్స్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించిందని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి
Comments
Please login to add a commentAdd a comment