కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అహ్మదాబాద్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (ఓసీసీ)ను ప్రారంభించింది. కంట్రోల్ సెంటర్ పని తీరును వివరిస్తూ వాటి ఫోటోల్ని విడుదల చేసింది. అయితే ఆ ఫోటోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ముఖ్యంగా రైలు ప్రయాణాల్లో తలెత్తుతున్న అసౌకర్యాలను ఎత్తిచూపుతున్నారు. ఓ నెటిజన్ ఓసీసీ వ్యవస్థపై వెటకారంగా స్పందించాడు. రైళ్లలో ఎలుకలు, బొద్దింకల్ని ఓసీసీ సెంటర్ పర్యవేక్షిస్తుందా? అని ప్రశ్నించాడు. అందుకు కేంద్ర రైల్వే శాఖ ఊహించని విధంగా స్పందించింది.
రైల్వే మంత్రిత్వ శాఖ అహ్మదాబాద్‌లోని 1,506 కి.మీ వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణ పనులను ముమ్మరం చేస్తుంది. దేశవ్యాప్తంగా పారిశ్రామిక కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు నిర్మిస్తున్న కారిడార్‌ల ద్వారా అతివేగంతో ప్రయాణించే గూడ్స్ రైళ్ల కదలికల్ని పర్యవేక్షించేందుకు వీలు కలుగుతుంది.
అయితే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఓసీసీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వాటిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. అనేక మంది ఫేస్‌బుక్ యూజర్లు రైళ్లలో సౌకర్యాలను మెరుగుపరచడం, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడంపై ప్రభుత్వాన్ని ప్రశంసించగా, మరికొందరు భారతదేశంలో రైలు ప్రయాణ అసౌకర్యాలను ఎత్తిచూపారు.
రైళ్లలో కనిపించే ఎలుకలు, బొద్దింకలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుందా? అంటూ ఓ యూజర్ ప్రశ్నించారు. దీంతో రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ఊహించని విధంగా అతని ప్రయాణ వివరాలు, మొబైల్ నంబర్ చెప్పాలని కోరింది.మీ అభ్యంతరాలను నేరుగా railmadad.indianrailways.gov.inలో ఫిర్యాదు చేయోచ్చని లేదంటే సత్వర పరిష్కారం కోసం 139కి డయల్ చేయాలని పేర్కొంది.
‘‘రాకెట్ సెంటర్ లాగా ఉంది. అద్భుతం. గో ఇండియా అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. ఆపరేషన్ కంట్రోల్ సెంటర్.. ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ కమాండ్ సెంటర్’’తో పోల్చారు. కాగా, వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీని, మహారాష్ట్రలోని నవీ ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్టుతో కలుపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment