
దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. గ్రామాలకు వెళ్లేవారితో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లను రద్దీగా మారాయి. ఈ నేపధ్యంలో కొన్నిచోట్ల తొక్కిసలాటలు కూడా చోటుచేసుకుంటున్నాయి. గుజరాత్‌లోని సూరత్ రైల్వే స్టేషన్‌కు సొంతూళ్లకు వెళ్లేందుకు భారీగా ప్రయాణికులు తరలివచ్చారు. వీరంతా రైళ్లు రాగానే ఒక్కసారిగా రైలులోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో టిక్కెట్లు ఉన్న వారు కూడా రైలు ఎక్కలేని పరిస్థితి నెలకొంది.
दीपावली घर जाने को सूरत रेलवे स्टेशन पहुंचे यूपी और बिहार के मजदूर दम घुटने के कारण घायल हो गए। pic.twitter.com/zPMRZ0mpbg
— Rakesh chaudhari (@Rakeshchau58578) November 11, 2023
ఈ సమయంలో తోపులాట జరిగి, పలువురు ప్రయాణికులు ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. కొందరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీనిని గమనించిన రైల్వే పోలీసులు బాధిత ప్రయాణికులకు సీపీఆర్ ఇచ్చి వారిని కాపాడారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ఉపాధి రీత్యా సూరత్‌లో ఉంటున్నారు. వీరంతా దీపావళి పండుగకు తమ ఊళ్లకు వెళ్లాలని రైల్వే స్టేషన్‌కు తరలివస్తున్నారు. ఫలితంగా రైల్వే స్టేషన్‌లో రద్దీ నెలకొంటోంది.
ఇది కూడా చదవండి: ‘గ్రేవ్‌యార్ట్ ఫర్ చిల్డ్రన్’ అంటే ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment