ఐపీఎస్ అధికారికి క్రికెట్ బంతి తగిలిందని..
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ పోలీసు ఉన్నతాధికారి తన బలాన్ని ప్రయోగించాడు. తనకు క్రికెట్ బాల్ తగిలిందనే కారణంతో ఓ ఐదుగురు చిన్నారులను అరెస్టు చేయించి ఆరు గంటలపాటు జైలులో వేశాడు. అనంతరం ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి గోల చేయడంతో వారిని విడిచిపెట్టారు. వారిపై ఎలాంటి ఆరోపణలు పెట్టలేదు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఐజీపీగా ఐపీఎస్ అధికారి బీఆర్ మీనాకు బాధ్యతలు అప్పగించారు.
ఈమె పోలీస్ ట్రైనింగ్ స్కూల్(పీఐఎస్) విధులు నిర్వహిస్తున్నారు. అక్కడే ఉన్న పోలీసు గ్రౌండ్లో చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా అందులో ఓ బాలుడు కొట్టిన బంతి సదరు అధికారికి తగలడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. వారిని పట్టుకొచ్చి జైల్లో వేయండని చెప్పడంతో దాదాపు ఆరుగంటలపాటు స్టేషన్లో బందించారు. పోలీసుల చర్యలను తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఆ పిల్లలను విడిచిపెట్టారు.