Cricket Ball
-
విధి ఆడిన వింత నాటకం: ఇష్టమైన ఆటే ప్రాణం తీసింది!
బళ్లారి రూరల్(బెంగళూరు): మృత్యువు అనేది ఎప్పుడు ఎవరిని పలకరిస్తుందో ఎవరికీ తెలీదు. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ జరగాల్సి ఘోరం జరిగిపోతుంటాయి. ఓ వ్యక్తి తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ ఆడుతుండగా బాల్ తగిలి మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బళ్లారి రూరల్ ఇందిరానగర్‌కు చెందిన విజయ్(32) దుకాణం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. తరచూ క్రికెట్ ఆడుతుండేవాడు. సోమవారం సాయంత్రం ఎప్పటిలానే క్రికెట్ ఆడేందుకు గ్రౌండ్‌కు వెళ్లాడు. ఆట మధ్యలో క్రికెట్ బాల్ అతని చెవికి తగిలి రాయి మీద పడ్డాడు. దీంతో గాయపడిన విజయ్‌ని విమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతు అతను బుధవారం మృతిచెందాడు. బళ్లారి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చదవండి: మరో యువతితో పెళ్లి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు షాకిచ్చిన ప్రియురాలు -
ఈ క్రికెట్ బంతి చాలా స్మార్ట్ గురూ.. సీపీఎల్-2021లో వినియోగం
సెయింట్ కిట్స్: కరీబియన్ గడ్డపై ధనాధన్ సందడి(సీపీఎల్-2021) మొదలైంది. ఐపీఎల్‌ను మరిపించేలా భారీ షాట్లతో కనువిందు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధ్వంసకర యోధులు మన ముందుకు వచ్చేశారు. అయితే, ఈ లీగ్‌కు సంబంధించిన ఓ అంశం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. సీపీఎల్-2021 సీజన్ ద్వారా ఓ సరికొత్త టెక్నాలజీ క్రికెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే స్నికో మీటర్, హాట్ స్పాట్, అల్ట్రా ఎడ్జ్, స్పీడ్ గన్స్, స్టంప్ మైక్రోఫోన్స్ అనే పలు టెక్నాలజీలు ఆటలో భాగం కాగా, తాజాగా ఈ జాబితాలోకి స్మార్ట్ బాల్ వచ్చి చేరింది. ఈ స్మార్ట్ బాల్‌ను సీపీఎల్-2021 లీగ్‌లోనే మొదటి సారిగా ఉపయోగిస్తున్నారు. ప్రముఖ బంతుల తయారీ సంస్థ కూకాబురాతో కలిసి ‘స్పోర్ట్‌కోర్' అనే కంపెనీ దీన్ని రూపొందించింది. చదవండి: వివాదంలో చిక్కుకున్న పంత్.. మందలించి వదిలిపెట్టిన అంపైర్లు ఆకారం, బరువు అన్ని విషయాల్లోనూ ఇది సాధారణ బంతిలానే ఉంటుంది. కాకపోతే ఈ బంతి లోపల కార్క్ స్థానంలో ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చి తయారు చేస్తారు. ఈ చిప్కున్న సెన్సార్ల సాయంతో బంతి నేల మీద పడ్డాక దాని వేగం, స్పిన్(నిమిషానికి ఎన్నిసార్లు తిరుగుతుంది), బౌలర్ శక్తి తదితర విషయాలను బ్లూటూత్ సాంకేతికత ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందించారు. ఈ యాప్‌లో ఓ బటన్ నొక్కితే బంతిలోని సెన్సార్లు సమాచారాన్ని గ్రహించి వాటిని బ్లూటూత్ ద్వారా పంపిస్తాయి. ఆ పంపిన సమాచారం ఫోన్ లేదా కంప్యూటర్ తెరలపై సగటున 5 సెకన్లలో ప్రత్యక్షమవుతుంది. ఈ బంతిలోని చిప్‌లో ఉండే బ్యాటరీ 30 గంటల పాటు పనిచేస్తుంది. కాగా, ప్రస్తుతం ఉన్న సాంకేతికత ఆధారంగా బౌలర్ చేతి నుంచి విడుదలైన బంతి పిచ్‌ను తాకే ముందు ఉన్న వేగాన్ని మాత్రమే కనుక్కోవచ్చు. ఈ స్మార్ట్ బాల్ రాకతో క్రికెట్ కొత్త పుంతలు తొక్కనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రస్తుతానికి ఈ బంతులు అంతర్జాతీయ క్రికెట్లో వాడేందుకు అనుమతి లభించలేదు. పూర్తి స్థాయి టెస్టింగ్ అనంతరం అనుమతి లభించే అవకాశం ఉంది. చదవండి: మనతో ఆట అంటే మజాకా.. రికార్డులు బద్దలవ్వాల్సిందే..! -
ఏనుగు బ్యాటింగ్‌కు ఫిదా.. వారికంటే బాగా ఆడుతుందే..!
లండన్: ఐపీఎల్లో ఆటగాళ్ల బ్యాటింగ్ చూడకపోతే ఏం..ఈ ఏనుగు బ్యాటింగ్ చూడండి అంటూ ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దేశంలో కోవిడ్ సెకండ్‌వేవ్ విజృంభణ నేపథ్యంలో ఐపీఎల్ రద్దు చేసిన విషయం తెలిసిందే. పలు జట్లలోని 9 మంది క్రికెట్లరకు కరోనా సోకడంతో ఐపీఎల్ రద్దు చేస్తూ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ప్రకటన విడుదల చేశారు. దీంతో ఐపీఎల్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.ఈ క్రమంలో మైకేల్ వాన్ ఓ వీడియోను షేర్ చేశారు. ప్రేమ్ అనే నెటిజన్ ఏనుగు బ్యాటింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మీరెప్పుడైనా ఏనుగు క్రికెట్ ఆడడం చూశారా? చూడండి నేషనల్ ప్లేయర్స్ కంటే ఈ ఏనుగే బాగా ఆడుతుందని పోస్ట్ లో పేర్కొన్నాడు. అయితే ఆ పోస్ట్ ను ఇంగ్లండ్ క్రికెటర్ మైఖేల్ వాన్ షేర్ చేస్తూ.. అవును నిజమే! నేషనల్ ప్లేయర్స్ కంటే ఇదే బాగా అడుతుంది. తప్పకుండా ఇంగ్లండ్ పాస్ పోర్ట్ ఇప్పిస్తాం అని రీట్వీట్ చేశారు. అయితే, ఆ వీడియోలో ఓ ఏనుగు బ్యాటింగ్ చేస్తుంటే, దాని యజమాని బౌలింగ్ చేస్తున్నాడు. యజమాని బాల్ ఎలా వేసినా ఏనుగు మాత్రం తన అద్భుతమైన బ్యాటింగ్‌తో నెటిజన్లని కట్టిపడేస్తుంది. కాగా, వాఘన్ వీడియోలపై 'పిచ్ సరిగా లేదు.. ఇంగ్లాండ్ ఆటగాళ్ళు దానిపై ఆడలేరు' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేస్తుంటే.. ఏనుగు బ్యాటింగే దెబ్బకు ఐపీఎల్ పనికిరాదు క్రికెట్ బాగా ఆడుతుందంటూ మరో నెటిజన్ వేశాడు. Surely the Elephant has an English passport !! https://t.co/scXx7CIZPr — Michael Vaughan (@MichaelVaughan) May 8, 2021 చదవండి: IPL 2021: నీ వల్లే ఐపీఎల్ ఆగిపోయిందంటూ నెటిజన్ల ఫైర్! -
‘బంతులు బాగుంటే చాలు’
న్యూఢిల్లీ: బౌలర్లు స్వింగ్ రాబట్టేందుకు బంతి నాణ్యంగా ఉంటే సరిపోతుందని, ఉమ్మి (సలైవా) వాడాల్సిన అవసరమే లేదని డ్యూక్స్ క్రికెట్ బంతుల తయారీదారు, బ్రిటీష్ క్రికెట్ బాల్స్ లిమిటెడ్ యజమాని దిలీప్ జజోడియా అన్నారు. బంతి మెరుపు కోసం సలైవాను వాడకుంటే బౌలర్లు తేలిపోతారనే వాదనల్లో నిజం లేదని చెప్పారు. ‘తొందరగా ఆకారం కోల్పోయే కూకా బుర్రా, ఎస్జీ బంతులు వాడే ఆస్ట్రేలియా, భారత్ లాంటి దేశాలే సలైవాకు ప్రత్యామ్నాయం కోరుతున్నాయి. స్వింగ్ రాబట్టాలంటే బంతికి మెరుపు మాత్రమే సరిపోదు. అది సరైన ఆకారంలో, తగిన సీమ్‌తో, గట్టిగా ఉండటంతో పాటు... బౌలర్‌కు నైపుణ్యం కూడా ఉండాలి. ఇలాంటి లక్షణాలు లేని బంతుల్ని వాడినప్పుడు మాత్రమే స్వింగ్ కోసం లాలాజలం, కృత్రిమ పదార్థాలపై ఆధారపడాల్సి ఉంటుంది’ అని దిలీప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అత్యంత నాణ్యంగా ఉండే డ్యూక్స్ బంతులతో ఉమ్మి వాడకుండానే స్వింగ్ రాబట్టొచ్చని ఆయన తెలిపాడు. ‘మా బంతులకు వాటర్ ప్రూఫ్ లక్షణం కల్పించేందుకు వీలుగా తయారీలో లెదర్‌కు గ్రీజ్‌ను వాడతాం. దీంతో బౌలర్ బంతిని ప్యాంట్‌కు రుద్దినప్పుడు ఏర్పడే ఘర్షణ కారణంగా బంతికి మెరుపు వస్తుంది. ఉమ్మిని వాడటం వల్ల ఈ ప్రక్రియ మరింత వేగంగా జరుగుతుంది తప్ప ఉమ్మి లేకుంటే బంతికి మెరుపు రాదనడం అబద్ధం’ అని ఆయన వివరించారు. ఐసీసీ పేర్కొన్నట్లు స్వింగ్ కోసం బౌలర్లు చెమట ఉపయోగిస్తే సరిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విండీస్‌తో సిరీస్ కోసం ఇంగ్లండ్ బౌలర్లు ప్రస్తుతం డ్యూక్స్ బంతులతోనే ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపారు. -
చెమట సరిపోతుందిగా...
చెన్నై: బంతి మెరుపు పెంచేందుకు బౌలర్లు లాలాజలం (ఉమ్ము)కు బదులు చెమటను ఉపయోగించవచ్చని భారత మాజీ పేసర్, మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ సూచించాడు. కరోనా నేపథ్యంలో కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ కమిటీ బంతి షైనింగ్‌కు లాలాజలం వాడటాన్ని నిషేధించింది. దీంతో కృత్రిమ పదార్థం వాడే వెసులుబాటు ఇవ్వాలని ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దీనిపై శ్రీనాథ్ మాట్లాడుతూ ‘ఉమ్ముకు ప్రత్యామ్నాయంగా చెమటను వినియోగించవచ్చు. నిజానికి ఆటలో లాలాజలానికంటే చెమటనే ఎక్కువగా ఉపయోగిస్తాం. కాబట్టి ఉమ్ము వద్దన్నంత మాత్రాన అదో సమస్య కాదు. తరచూ చేతితో ఉమ్మును అందుకొని బంతికి రాయడమనేది అలవాటైంది. ఇప్పుడు దీన్ని మార్చుకుంటే సరిపోతుంది. కొత్త మార్గదర్శకాలను పాటించాలి. లాలాజలానికి బదులుగా చెమట రాయడాన్నే అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో దీని పాత్రే కీలకమవుతుంది’ అని అన్నాడు. -
‘ఇస్మార్ట్’ క్రికెట్
సిడ్నీ : సాంకేతికత పుణ్యమా అని క్రికెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం నుంచి ప్రస్తుతం డీఆర్ఎస్ వరకు ఆధునిక క్రికెట్ రూపాంతరం చెందుతోంది. టెక్నాలజీ రాకతో అంపైర్ల పని కూడా సులువైంది. అల్ట్రా ఎడ్జ్, హకాయ్, హాట్‌స్పాట్, స్టంప్ మైక్రొఫోన్, బాల్ ట్రాకింగ్ వంటివి క్రికెట్లో అతిసాధారణమైనవిగా మారిపోయాయి. తాజాగా క్రికెట్లో మరో పెను మార్పుకు కూకాబుర్ర సంస్థ శ్రీకారం చుట్టింది. అన్నీ కుదిరితే త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో ఇస్మార్ట్(స్మార్ట్) బంతులను చూస్తాం. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన కూకాబుర్ర సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఈ బంతులను అన్ని విధాల పరీక్షించామని.. త్వరలో బిగ్‌బాష్ లీగ్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలించి అంతర్జాతీయ స్థాయిలో ఫలితాలు ఎలా ఉంటాయో అంచనావేస్తామని పేర్కొంది. ఇస్మార్ట్ బంతులు అంటే? మామూలు కూకాబుర్రా బంతుల్లాగే ఉంటాయి. కానీ ఆ బంతుల్లో మైక్రో చిప్‌లను అమర్చుతారు. అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్లు అత్యంత కచ్చితత్వంతో నిర్ణయాలు ప్రకటించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన కూకాబుర్ర సంస్థ మైక్రో చిప్‌లతో (స్మార్ట్ బంతి) కూడిన క్రికెట్ బంతుల్ని తయారు చేస్తోంది. ఈ ప్రత్యేకమైన బంతులు వేగం, బౌన్స్ తదితర అంశాలను సాధారణ రాడార్ కన్నా మరింత కచ్చితత్వంతో అందిస్తాయని కూకాబుర్ర ప్రకటించింది. ఇక స్పిన్నర్లకు ఎన్ని డిగ్రీల్లో బంతి టర్న్ అవుతోంది?. బంతిని ఎక్కడ విసిరితే ఎలా టర్న్ అవుతుంది? వంటి వివరాల్ని ఇవ్వనుంది. డీఆర్ఎస్, క్యాచ్‌ల విషయంలో ఈ స్మార్ట్ బంతులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ స్మార్ట్ బంతి తయారీ కోసం కూకాబుర్రతో స్పోర్ట్‌కోర్ అనే సంస్థ చేతులు కలిపింది. ఆస్ట్రేలియా మాజీ పేసర్ మైకెల్ కాస్ప్రోవిజ్ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న టీ20 క్రికెట్ లీగుల్లో ఈ బంతిని పరీక్షించాలని ఆ సంస్థలు కోరుకుంటున్నాయి. అందులో భాగంగానే మొదట బీబీఎల్‌లో ప్రయోగించనున్నారు. -
ఐపీఎస్ అధికారికి క్రికెట్ బంతి తగిలిందని..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ పోలీసు ఉన్నతాధికారి తన బలాన్ని ప్రయోగించాడు. తనకు క్రికెట్ బాల్ తగిలిందనే కారణంతో ఓ ఐదుగురు చిన్నారులను అరెస్టు చేయించి ఆరు గంటలపాటు జైలులో వేశాడు. అనంతరం ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి గోల చేయడంతో వారిని విడిచిపెట్టారు. వారిపై ఎలాంటి ఆరోపణలు పెట్టలేదు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఐజీపీగా ఐపీఎస్ అధికారి బీఆర్ మీనాకు బాధ్యతలు అప్పగించారు. ఈమె పోలీస్ ట్రైనింగ్ స్కూల్(పీఐఎస్) విధులు నిర్వహిస్తున్నారు. అక్కడే ఉన్న పోలీసు గ్రౌండ్లో చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకుంటుండగా అందులో ఓ బాలుడు కొట్టిన బంతి సదరు అధికారికి తగలడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. వారిని పట్టుకొచ్చి జైల్లో వేయండని చెప్పడంతో దాదాపు ఆరుగంటలపాటు స్టేషన్లో బందించారు. పోలీసుల చర్యలను తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఆ పిల్లలను విడిచిపెట్టారు. -
క్రికెట్ బంతి కోసం వెళ్లి..
బనగానపల్లి(కర్నూలు): క్రికెట్ బంతి కోసం వెళ్లిన చిన్నారి కుళాయి గుంటలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం యాగంటిపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగరాజు కుటుంబ సభ్యులు ఈ రోజు ఈస్టర్ కావడంతో చర్చికి వెళ్లి వచ్చారు. అనంతరం ఇంట్లో పని చేసుకుంటున్న సమయంలో అతని నాలుగేళ్ల కుమారుడు ప్రశాంత్ ఇంటి ఆవరణలో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బంతి కుళాయి గుంతలో పడటంతో.. దాని కోసం వెళ్లిన చిన్నారి గుంతలో పడిపోయాడు. గుంతలో నీళ్లు ఉండటంతో అందులో మునిగి మృతిచెందాడు. విగతజీవిగా మారిన చిన్నారిని గుర్తించిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
క్రికెట్ బాల్ తగిలి మహిళ మృతి
బహదూర్‌పురా (హైదరాబాద్): క్రికెట్ బాల్ తగిలి ఓ మహిళ మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలాపత్తర్ బిలాల్‌నగర్ ప్రాంతానికి చెందిన ఎంఏ ఖయ్యూం కూతురు సబాన్ తస్లీమీన్ (31) గత నెల 26న మధ్యాహ్నం టెర్రాస్ పైకి వెళ్లింది. ఆ సమయంలో కింద కొందరు క్రికెట్ ఆడుతున్నారు. ఆటగాడు కొట్టిన బంతి టైరాస్పై ఉన్న తస్లీమీన్కు తగలింది. దీంతో ఆమె గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా నిమ్స్‌కు పంపించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తస్లీమీన్ సోమవారం ఉదయం మృతి చెందింది. తస్లీమీన్ సోదరుడు మహ్మద్ డ్యానీస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
క్రికెట్ బంతి కోసం నీట మునిగి ఇద్దరి మృతి
నిర్మల్: ఆదిలాబాద్ జిల్లాలో క్రికెట్ బంతి కోసం వెళ్లి ప్రమాదవశాత్తూ నీట మునిగి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఈ సంఘటన నిర్మల మండలం మంజులాపూర్ గ్రామంలో మోతీ తలాబ్‌లో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మొహమ్మద్ నవ్‌మాన్(14) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతుండగా.. అబుల్(15) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం.. స్నేహితులతో కలిసి గ్రామ శివారును ఉన్న చెరువు వద్ద క్రికెట్ ఆడటానికి వెళ్లారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో బంతి వెళ్లి చెరువులో పడటంతో.. నవ్‌మాన్ బంతి తీసుకురావడానికి చెరువులోకి వెళ్లాడు. చెరువులోతు ఎక్కువగా ఉండటంతో.. నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన అబుల్ అతన్ని రక్షించడానికి చెరువులోకి దిగాడు. ఇతనికి కూడా ఈత రాకపోవడంతో.. ఇద్దరు నీట మునిగి మృతిచెందారు. ఇది గుర్తించిన స్థానికులు వారి మృతదేహాలను బయటకు తీశారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
క్రికెట్ బాల్ కోసం పోయి.. ప్రాణాలొదిలారు
-
క్రికెట్ బాల్ కోసం పోయి.. ప్రాణాలొదిలారు
విశాఖపట్నం(పద్మనాభం): పద్మనాభం మండలం నర్సాపురం గ్రామంలో నలుగురు విద్యార్ధులు ఆదివారం మృతిచెందారు. వివరాలు.. గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు ఊరి పక్కన చెరువు వద్ద క్రికెట్ ఆడటానికి వెళ్లారు. క్రికెట్ ఆడుతుండగా ఓ విద్యార్థి కొట్టిన బాల్ చెరువులో పడింది. బాల్‌ను తీయటానికి చెరువులోకి దిగిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు. ఒకరిని రక్షించటానికి ప్రయత్నించి ఒకరి వెంట మరొకరు చెరువులోకి దిగి మృతిచెందారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన సారిక వినయ్(14), పొలగాని కల్యాణ్(15), పొలగాని మోహన్(13), సింహాచలం(13) అనే విద్యార్థులు చెరువులో మునిగిపోయి మృతిచెందారు. మృతదేహాలను చెరువు నుండి బయటికి తీశారు. విద్యార్థుల మృతి గ్రామంలో విషాదం వాతావరణం నెలకొంది. -
భూమిని దాటిన బాల్!
క్రికెట్ బాల్‌ను మరీ బలంగా బాదితే.. గ్రౌండ్ దాటి పోతుంది. అయితే.. ఇది అంతరిక్షం అంచులదాకా పోయింది. తాజాగా బర్మింగ్‌హాంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ క్లబ్.. హీలియం బెలూన్ సాయంతో ఓ క్రికెట్ బాల్‌ను 1.10 లక్షల అడుగుల ఎత్తుకు.. అంటే అంతరిక్షం అంచులదాకా పంపింది. తర్వాత ప్యారాచూట్ సాయంతో దాన్ని బ్రిటన్‌లోని న్యూబరీ ప్రాంతంలో దించారు.