ఏనుగు బ్యాటింగ్‌కు ఫిదా.. వారికంటే బాగా ఆడుతుందే..! | Michael Vaughan Share A Viral Video Of An Elephant Playing Cricket | Sakshi
Sakshi News home page

ఏనుగు బ్యాటింగ్‌కు ఫిదా.. వారికంటే బాగా ఆడుతుందే..!

Published Sun, May 9 2021 2:21 PM | Last Updated on Sun, May 9 2021 2:42 PM

Michael Vaughan Share A Viral Video Of An Elephant Playing Cricket - Sakshi

లండన్‌: ఐపీఎల్‌లో ఆటగాళ్ల బ్యాటింగ్‌ చూడకపోతే ఏం..ఈ ఏనుగు బ్యాటింగ్‌ చూడండి అంటూ ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ఓ వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దేశంలో కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ విజృంభణ నేపథ్యంలో ఐపీఎల్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. పలు జట్లలోని 9 మంది క్రికెట్లరకు కరోనా సోకడంతో ఐపీఎల్‌ రద్దు చేస్తూ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ప్రకటన విడుదల చేశారు. దీంతో ఐపీఎల్‌ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.ఈ క్రమంలో మైకేల్‌ వాన్‌ ఓ వీడియోను షేర్‌ చేశారు.  

ప్రేమ్‌ అనే నెటిజన్‌ ఏనుగు బ్యాటింగ్‌ చేస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. మీరెప్పుడైనా ఏనుగు క్రికెట్‌ ఆడడం చూశారా? చూడండి నేషనల్‌ ప్లేయర్స్‌ కంటే ఈ ఏనుగే బాగా ఆడుతుందని పోస్ట్‌ లో పేర్కొన్నాడు. అయితే ఆ పోస్ట్‌ ను ఇంగ్లండ్‌ క్రికెటర్‌ మైఖేల్‌ వాన్‌ షేర్‌ చేస్తూ.. అవును నిజమే! నేషనల్‌ ప్లేయర్స్‌ కంటే ఇదే బాగా అడుతుంది. తప్పకుండా ఇంగ్లండ్‌ పాస్‌ పోర్ట్‌ ఇప్పిస్తాం అని రీట్వీట్‌ చేశారు. అయితే, ఆ వీడియోలో ఓ ఏనుగు బ్యాటింగ్‌ చేస్తుంటే, దాని యజమాని బౌలింగ్‌ చేస్తున్నాడు. యజమాని బాల్‌ ఎలా వేసినా ఏనుగు మాత్రం తన అద్భుతమైన బ్యాటింగ్‌తో నెటిజన‍్లని కట్టిపడేస్తుంది. కాగా, వాఘన్‌ వీడియోలపై 'పిచ్ సరిగా లేదు.. ఇంగ్లాండ్ ఆటగాళ్ళు దానిపై ఆడలేరు' అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేస్తుంటే.. ఏనుగు బ్యాటింగే దెబ్బకు ఐపీఎల్‌ పనికిరాదు క్రికెట్‌ బాగా ఆడుతుందంటూ మరో నెటిజన్‌ వేశాడు.

చదవండి: IPL 2021: నీ వల్లే ఐపీఎల్‌ ఆగిపోయిందంటూ నెటిజన్ల ఫైర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement