
క్రికెట్ బాల్ కోసం పోయి.. ప్రాణాలొదిలారు
విశాఖపట్నం(పద్మనాభం): పద్మనాభం మండలం నర్సాపురం గ్రామంలో నలుగురు విద్యార్ధులు ఆదివారం మృతిచెందారు. వివరాలు.. గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు ఊరి పక్కన చెరువు వద్ద క్రికెట్ ఆడటానికి వెళ్లారు. క్రికెట్ ఆడుతుండగా ఓ విద్యార్థి కొట్టిన బాల్ చెరువులో పడింది. బాల్‌ను తీయటానికి చెరువులోకి దిగిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు.
ఒకరిని రక్షించటానికి ప్రయత్నించి ఒకరి వెంట మరొకరు చెరువులోకి దిగి మృతిచెందారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన సారిక వినయ్(14), పొలగాని కల్యాణ్(15), పొలగాని మోహన్(13), సింహాచలం(13) అనే విద్యార్థులు చెరువులో మునిగిపోయి మృతిచెందారు. మృతదేహాలను చెరువు నుండి బయటికి తీశారు. విద్యార్థుల మృతి గ్రామంలో విషాదం వాతావరణం నెలకొంది.