padmanabham
-
చంద్రబాబు బాగు కోసమే పవన్ పార్టీ
తణుకు అర్బన్: చంద్రబాబు బాగుకోసమే పవన్‌కళ్యాణ్ పార్టీ పెట్టారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎస్టేట్‌కు పవన్ కళ్యాణ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కమ్మ కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన తణుకు నియోజకవర్గ కాపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాపు ఉద్యమాన్ని తప్పుపడుతున్న పవన్ కాపులకు ఏం చేశారని నిలదీశారు. ప్రజలను డబ్బులకు అమ్ముడుపోయే వారిలా చిత్రీకరిస్తూ పిఠాపురంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటుకు రూ.లక్ష ఇచ్చి తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారనడం బాధాకరమన్నారు. ‘క్లబ్బులు నడిపే వారితో సోషల్ మీడియాలో నన్ను తిట్టిస్తున్నావు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రెస్‌మీట్ ద్వారా నేరుగా నన్ను తిట్టవచ్చు. అప్పుడు నేనేంటో నీకు చూపిస్తా’ అంటూ ముద్రగడ సవాల్ విసిరారు. 21 అసెంబ్లీ సీట్లకు పరిమితమై త్యాగపురుషుడిగా కీర్తి సాధించావంటూ ఎద్దేవా చేశారు. వాటిలో కూడా టీడీపీ నుంచిజనసేనకు వచ్చినవారి సంఖ్యే అధికమని తెలిపారు. ముద్రగడ భార్య చనిపోయిందని, కొడుకు చనిపోయాడని నీచాతి నీచంగా పోస్టులు పెట్టిస్తున్న నిన్ను చూస్తుంటే అసహ్యమేస్తోందని చెప్పారు. నీచాతినీచంగా నాణ్యమైన లిక్కర్ ఇస్తామంటూ రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకువచ్చారని విమర్శించారు. పవన్‌ను ఇంటికి పంపించండి ఈ ఎన్నికల్లో పవన్‌ను రాజకీయంగా ప్యాక్ చేసి ఇంటికి పంపించాలని కాపు నాయకులకు ముద్రగడ పిలుపునిచ్చారు. పేదల పెన్నిధిగా నిలబడ్డ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి అండగా నిలబడతామని, జగన్ చేసిన మంచే ఆయనకు రక్షగా ఉంటుందని చెప్పారు. ఒక ముఖ్యమంత్రిని నిన్ను తొక్కేస్తా అంటూ ఊగిపోవడం, ఉక్రోషంగా, ఉద్రేకంగా మాట్లాడే పవన్ తీరు ఏ రాజకీయ నాయకుడికీ లేదని, రాజకీయాల్లో గౌరవప్రదమైన భాష వాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, నరసాపురం ఎంపీ అభ్యర్థి ఉమాబాల, ఏలూరు ఎంపీ అభ్యర్థి సునీల్‌కుమార్ పాల్గొన్నారు. -
పద్మనాభం పీఎస్ ఘటన.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు
సాక్షి, విశాఖపట్నం: పద్మనాభం పోలీస్ స్టేషన్ ఘటన పై సీపీ రవి శంకర్ సీరియస్ యాక్షన్‌కి దిగారు. యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భీమిలి పద్మనాభం మండలంలో బాందేవుపురం గ్రామానికి చెందిన వ్యక్తిపై పోలీసులు థర్ద్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి మరీ కాళ్లు విరగొట్టారని.. వాళ్లపై చర్యలు తీసుకోవాలని సోమవారం దళిత కులాల సంక్షేమ సేవా సంఘం ఆందోళన సైతం చేపట్టింది. ఈ విషయం సీపీ రవిశంకర్ దృష్టికి రావడంతో ఆయన చర్యలకు ఉపక్రమించారు. -
పద్మనాభం నన్ను తీసుకుపోదామని చూశాడు..!
-
పద్మనాభం గారికి నేనంటే చాలా ఇష్టం..!
-
7న గవర్నర్ విశాఖ జిల్లా పర్యటన
పద్మనాభం: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 7న విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. పద్మనాభం మండలంలోని పాండ్రంగి పంచాయతీ బర్లపేటలో దివ్యాంగ బాలబాలికల ఉచిత విద్య శిక్షణ కేంద్రం, వృద్ధాశ్రమం, యోగా కేంద్రం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని రాజీవ్‌గాంధీ మానవ సేవ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ గురువారం తెలిపారు. 7న ఉదయం 11.30 గంటలకు గవర్నర్ బర్లపేటకు వచ్చి అక్కడ స్వాతంత్య్ర సమరయోధులు రూపాకుల విశాలాక్షి, రూపాకుల సుబ్రహ్మణ్యం విగ్రహాలకు పూలమాల వేస్తారు. అనంతరం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రసంగిస్తారు. గాయత్రి, వెల్ఫేర్ అండ్ కల్చరల్ యూత్ అకాడమీ, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్యెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాజరుకానున్నట్లు రవికుమార్ తెలిపారు. సభా ప్రాంగణాన్ని, శిలాఫలకం ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని డీసీపీ సునీల్ సుమిత్ గరుడ్, ఆర్డీవో భాస్కరరెడ్డి, సీఐ సన్యాసినాయుడు గురువారం పరిశీలించారు. -
50 ఏళ్లవయస్సులో ఫ్రెంచ్ నేర్చుకుంది..
గళ్ల లుంగీ, బుగ్గ మీద గాటు ఉన్న రౌడీని చూసిన దాని కంటే సూర్యకాంతమ్మను చూస్తే ప్రేక్షకులకు దడుపు ఎక్కువ.ఎవరిని ఏం బాధలు పెడుతుందో. ఎవరిని రాచిరంపాన పెడుతుందో.ఆమె తలుచుకుంటే ఎవరి జీవితమైనా నాశనం అయిపోతుంది.అందుకే తెలుగువారు తమ ఆడ పిల్లలకు‘సూర్యకాంతం’ అనే పేరే పెట్టడం మానేశారు.తెరమీద ఇంతగా నమ్మించగలిగిందంటేఆమె ఎంత గొప్ప నటి అయ్యుండాలి. ఎంతో సౌమ్యురాలు, అమాయకురాలు, స్నేహశీలి అయినసూర్యకాంతం గురించి ఆమె కుమారుడు పద్మనాభమూర్తి పంచుకున్న జ్ఞాపకాలివి. అమ్మకు ఆరేళ్ల వయస్సులోనే మా తాతయ్య చనిపోవడంతో వాళ్ల పెద్దక్క, బావల దగ్గర పెరిగింది. అమ్మ అల్లరిగా ఉండటం వల్లనో ఏమో చదువు పెద్దగా ఒంట పట్టలేదు. సినిమాల మీద మక్కువ కలిగింది. పల్లెటూరి నుంచి కాకినాడకు ఎడ్లబండిలో వచ్చి, పృథ్వీరాజ్ కపూర్ నటించిన హిందీ చిత్రాలు చూసేదట. సినిమాల మీద వ్యామోహంతో, పెద్దక్క ఒప్పుకోకపోయినా అమ్మమ్మతో కలిసి మద్రాసు వచ్చేసిందట. నారదనారది (1946) అమ్మ మొదటి చిత్రం. మొదట్లో నాయిక పాత్రలు ధరించాలనుకుందట. కాని ఒకసారి అమ్మ పడిపోవటంతో, మ¬క్కు మీద మచ్చ పడిందట. క్లోజప్‌లో మచ్చ కనపడుతుంది కాబట్టి ఇక నాయిక పాత్రలకు పనికిరానని నిర్ణయించుకుని, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయిందట. 1962లో విడుదలైన ‘గుండమ్మ కథ’ చిత్రంతో అమ్మ గయ్యాళి పాత్రలకు చిరునామాగా మారిపోయింది. ఒక్కసారి డైలాగ్ వింటే చాలు వెంటనే వచ్చేసేది. ఒకే టేక్‌లో ఓకే అయిపోయేదట. డైలాగ్ పలకడంలో విచిత్రమైన మాట విరుపు, ఎడమ చేతివాటం...ఈ రెండు ప్రత్యేకతలూ అమ్మను గొప్ప నటిని చేశాయి. పది భాషలు వచ్చు.. అమ్మ స్కూల్ చదువులు పెద్దగా చదువుకోలేదన్న మాటే గానీ పది భాషలు అవలీలగా మాట్లాడగలదు. మద్రాసు వచ్చాక ఇంగ్లిషు, 50 ఏళ్లవయస్సులో ఫ్రెంచ్ నేర్చుకుంది. బెంగాలీ అంటే అమ్మకు చాలా ఇష్టం. దిన పత్రికలు, పుస్తకాలు, నవలలు, పురాణేతిహాసాలు బాగా చదివేది. ఆంధ్రపత్రిక పేపరు ఆలస్యం అయితే చాలు పేపరు బాయ్‌ను నిలదీసేది. క్రమశిక్షణతో ఉండేది.. తెల్లవారుజామునే నిద్రలేవడం, పూజ చేసుకోవడం, వంట పూర్తిచేసి, మాకు క్యారేజీలు పెట్టి, తన కోసం సిద్ధం చేసుకున్న క్యారేజీలతో షూటింగ్‌కు వెళ్లడం ఆవిడ దినచర్య. ఇంటికి వచ్చే బంధువుల కోసం నిమిషాల్లో ఏదో ఒక ప్రత్యేక వంటకం తయారు చేసేది. అనారోగ్యంతో బాధపడుతున్న రోజుల్లో కూడా అందరికీ చక్కని ఆతిథ్యం ఇచ్చేది.ఉన్నంతలో దానధర్మాలు చేసింది. చిన్న చిన్నపత్రికలకు ఆర్థికంగా సహాయపడింది. పద్మనాభ మూర్తి చిన్నతనంలోనే.. మా అమ్మ (సూర్యకాంతం) నాకు స్వయానా పిన్ని. నేను రోజుల పిల్లాడిగా ఉన్నప్పుడే దత్తతు తీసుకుని మద్రాసులోనే బారసాల చేసిందట.కాకినాడ సమీపంలో ఉన్న వెంకటరాయపురం అమ్మ పుట్టిల్లు. మా తాతయ్యను నాలో చూసుకునేందుకే నాకు అనంత పద్మనాభమూర్తి అనే పేరు పెట్టి, నన్ను ‘నాన్నా’ ‘నానీ’ అని పిలిచేది. నాన్నగారు పెద్దిభొట్ల వెంకట చలపతిరావు. నన్ను కన్న తల్లి (సత్యవతి) ఇంటి పేరును నిలపడం కోసం ‘దిట్టకవి’ ఇంటి పేరునే కొనసాగించింది. నేను స్కూల్‌కి ప్రతిరోజూ కారులోనే వెళ్లేవాడిని. డ్రైవర్ రాకపోతే ఇంట్లో పనివాళ్లు సైకిల్ మీద స్కూల్లో దింపేవారు. ఆ స్కూల్లో ఒక ల్యాబ్ కట్టడానికి అమ్మ పదిహేను వేల రూపాయలు డొనేషన్ ఇచ్చింది. నేను ఎం. కామ్ చదువుకున్నాను. చదువు పూర్తయ్యాక కెనరా బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. కాని దూరమని పంపలేదు. ఆ తరవాత చెన్నై మైలాపూర్ ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. దగ్గరగా ఉండటంతో అమ్మఅనుమతితో చేరాను. శత్రువు ఇంటికి వచ్చినా వాళ్లని ఆదరించి అన్నం పెట్టేది. లైట్ కలర్స్ బాగా ఇష్టపడేది. నలుపు రంగంటే అస్సలు ఇష్టం లేదు అమ్మకు. ఒకసారి లైట్ బ్లూ కలర్ కారు బుక్ చేస్తే వాళ్లు బ్లాక్ కలర్ ఇచ్చారు. అప్పుడు గొడవ పెట్టి మార్చుకుంది అమ్మ. అమ్మే స్వయంగా కారు డ్రైవ్ చేసేది. 1994లో అమ్మ కన్నుమూసింది. అమ్మ కాలం చేసి పాతికేళ్లు దాటినా సూర్యకాంతం గారి అబ్బాయిగా నేను పొందే ప్రేమాభిమానాలతో కూడిన గౌరవ మర్యాదలు ఎవ్వరూ అపహరించేందుకు వీలులేని తరగని ఆస్తి. అమ్మను పద్మ పురస్కారాలతో సత్కరించకపోయినా, తెలుగు ప్రేక్షకులు అంతకంటే గొప్ప కీర్తిప్రతిష్టలతో ఆమెను వారి గుండెల్లో పదిలంగా ఉంచుకున్నారు. భయస్తురాలు.. అమ్మ ఎవరిని ఏ వరసలో పిలిస్తే, నేనూ అలాగే పిలిచేవాడిని. అమ్మ వాళ్ల అక్కయ్యలను.. దొడ్డమ్మ అనకుండా దొడ్డక్క అని పిలిచేవాడిని. అమ్మ ఎక్కడకు వెళ్లినా తన వెంటే నన్ను తీసుకువెళ్లేది. నాకు ఒంట్లో బాగా లేకపోతే ఎందరో దేవుళ్లకు మొక్కులు మొక్కేది. దేవాలయాలకు వెళ్లినప్పుడు హుండీలో నా చేత డబ్బులు వేయించేది, నా పేరున అర్చనలు చేయించేది. అమ్మ దయ వల్ల చాలా బాగా ఉన్నాను. అమ్మకి ఎవరి మీద అభిమానం, గౌరవం ఉండేవో వాళ్లకి ఏదైనా అవుతుందేమోనని భయం ఎక్కువగా ఉండేది. జగపతి పిక్చర్స్ అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్‌గారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలని మొక్కుకుంది అమ్మ. ఆయనకు తగ్గాక అందరికీ భోజనాలు పెట్టింది. ఎవరికి ఒంట్లో బావుండకపోయినా, వాళ్ల తరపున అర్చనలు చేయించేది, మొక్కులు తీర్చేది. మా పుట్టినరోజు నాడు గుడికి తీసుకెళ్లి, పూజలు చేయించి, ఇంటికి వచ్చిన వాళ్లకి భోజనాలు పెట్టేది. కేక్ కట్ చేయటం అమ్మకు ఇష్టం లేదు. నెయ్యి అంటే చాలా ఇష్టం.. అందరం కలిసి అన్నం తినాలనేది అమ్మ. ఒక్కోసారి అమ్మ వండుకున్న కూర అమ్మకే నచ్చేది కాదు. వెంటనే ‘నాన్నా! నెయ్యి వేసి మాగాయి అన్నం కలిపి పెట్టరా’ అనేది నాతో. అమ్మకు నెయ్యి – మాగాయి, నెయ్యి – ఆవకాయ అంటే చాలా ఇష్టం. జీవితంలో ఒక్కరోజు కూడా నెయ్యి లేకుండా అన్నం తినేది కాదు. ఎన్ని మానేసినా, నెయ్యి మాత్రం మానలేదు అమ్మ. అన్నీ అమ్మే చూసింది.. నా వివాహం అమ్మే కుదిర్చి చేసింది. నా భార్య పేరు ఈశ్వరిరాణి. నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి సూర్య సత్య వెంకట బాల సుబ్రహ్మణ్యం చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అమ్మాయి జయలక్ష్మి ఎంబిఏ చదివి, గీతమ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తోంది. మా ఇంటి మొత్తానికి ఒక్క గదిలోనే ఏసీ ఉండేది. అందరం ఆ గదిలో చేరి కబుర్లు చెప్పుకునేవాళ్లం. అమ్మ చేతి వంట... నోరూరేనంట.. అమ్మ చేతి వంట అమృతంలా ఉండేదనుకునేవారు సినిమా వారంతా. అమ్మకు బయట తిండి తినే అలవాటు లేదు. అందుకే షూటింగులకు వెళ్లేటప్పుడు తనకు మాత్రమే కాకుండా, షూటింగ్లో ఉన్న మిగతా వాళ్ల కోసమూ వంట చేసి తీసుకెళ్లేది. అమ్మ రాక కోసం అందరూ ఎదురు చూసేవారు. ఎన్టిఆర్ ‘అక్కయ్యగారూ! ఏం తెచ్చారు?’ అని అడిగి మరీ తినేవారు. పెరుగన్నమే.. టిఫిన్ లేదు.. పొద్దున్నపూట టిఫిన్ కాకుండా పెరుగన్నమే తినాలి. నేను పదవీ విరమణ చేసేవరకూ ఉదయం పెరుగన్నమే తిన్నాను. ఇంటికి ఎవరు వచ్చినా ‘మజ్జిగ తాగుతారా! అన్నం తింటారా!’ అని అడిగేది. కాఫీ టిఫిన్లు ఇచ్చేది కాదు. ఆవిడ చాలా సింపుల్. జనసమ్మర్దంలోకి వెళ్లాలంటే అమ్మకి చాలా భయం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దేవాలయాలకు, బీచ్‌లకు రద్దీ లేని సమయంలో నన్ను తీసుకుని వెళ్లేది. అమ్మ చాలా రిజర్వ్డ్. అప్పట్లో సినిమా వారంతా టి నగర్లో ఉంటే, మేం మాత్రం సిఐటీ కాలనీలో ఉండేవాళ్లం. అన్నీ చదివి వినిపించాలి.. అమ్మ నాకు తెలుగు నేర్పించింది. అన్ని రకాల పుస్తకాలు కొని తను చదివాక, నా చేత చదివించేది. నేను మూస ధోరణిలో చదువుతుంటే, ‘ఆడ మగ గొంతు మార్చి చదివితేనే బాగుంటుంది, అప్పుడే అర్థమవుతుంది’ అనేది. ఆవిడ మరణించాక అర్థమైంది పుస్తకాలు చదవటం వల్ల లోకజ్ఞానం వస్తుంది కాబట్టే చదివించిందని. అమ్మను ఎన్నటికీ మరువలేను.– కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై – వైజయంతి పురాణపండ -
పద్మనాభంలో టీడీపీ ఖాళీ
విశాఖపట్నం, పద్మనాభం(భీమిలి): పద్మనాభం మండలంలో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు నిన్న కాక మొన్న తమ పార్టీ నాయకులు ఇతర పార్టీలో చేరకుండా ఉండకుండా కాపాడుకునేందుకు విశాఖపట్నంలో సమీక్ష నిర్వహించారు. పద్మనాభంలో భీమునిపట్నం నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి సబ్బం హరి టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయినప్పటికీ టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసల జోరు ఆగలేదు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనకు ఆకర్షితులైన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. పద్మనాభం మండలంలో 21 పంచాయతీల్లో ఎనిమిది పంచాయతీలకు చెందిన టీడీపీ నేతలు, మాజీ సర్పంచ్‌లతో సహా రెండు వేల మంది సోమవారం పద్మనాభంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్సార్ సీలో చేరారు. టీడీపీకి చెందిన భీమునిపట్నం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, అనంతవరం మాజీ ఎంపీటీసీ గొర్రిపాటి పెద ఎర్రినాయుడు, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు, బాందేవుపురం పంచాయతీ మాజీ సర్పంచ్ సాగి కృష్ణమూర్తిరాజు, ఇదే పంచాయతీ మాజీ సర్పంచ్‌లు గంగిరెడ్ల వెంకటరమణ, సింక సూరీడు, కొలుసు అప్పయ్యమ్మ, విలాస్కాన్పాలేనికి చెందిన మండల తెలుగు యువత ఉపాధ్యక్షుడు బాయి వెంకట రమణ, విలాస్కాన్పాలెం మాజీ ఉప సర్పంచ్ బోని వెంకట రమణ తదితరులు పార్టీలో చేరారు. పెంట మాజీ సర్పంచ్ గొర్లె సోములమ్మ, గొర్లె బంగారునాయుడు, మద్ది చెందిన టీడీపీ సీనియర్ నేత బుగత ఎర్రినాయుడు, కాళ్ల ప్రకాష్, కాళ్ల అప్పలనాయుడు, కృష్ణాపురం మాజీ ఉప సర్పంచ్ సురాల పైడిరాజు, పొట్నూరు చెందిన అవనాపు శివ, కిలారి అప్పన్న, రఘుమజ్జి రాంబాబు, చేరిఖండం నుంచి వాడపల్లి రమేష్, బసవ శ్రీనుతో సహా తమ అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పద్మనాభం మండలంలో టీడీపీ పని అయిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కంటుబోతు రాంబాబు, వైఎస్సార్ రాష్ట్ర కార్యదర్శి సుంకర గిరిబాబు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి సుంకర బంగారప్పడు, జిల్లా అధికార ప్రతి«నిధి సిరుగుడి ఆదిబాబు, మండల యువజన విభాగం అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు పాల్గొన్నారు. జగన్ పాలన ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తి సీఎం జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పద్మనాభం జెడ్పీ బంగ్లా వద్ద సోమవారం జరిగిన వైఎస్సార్ సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.పద్మనాభం మండలంలో 5,600 మందికి రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. పాండ్రంగి సమీపాన గోస్తని నదిలో వంతెన నిర్మిస్తామన్నారు. పాండ్రంగిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు మంజూరైన రూ.2కోట్లతో వారం రోజుల్లోగా పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేస్తామన్నారు. రెడ్డిపల్లి శాంతినికేతన్ నుంచి నీలకుండీల జంక్షన్లో వరకు గల ఆర్అండ్బీ రోడ్డును విస్తరిస్తామన్నారు. మంచి నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సంక్షేమ పాలనపై రూపొందించిన ఏపీ 24/7 పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కంటుబోతు రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సుంకర గిరిబాబు, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సుంకర బంగారప్పడు, జిల్లా అధికార ప్రతినిధి సిరుగుడి ఆదినారాయణ, మండల యువజన విభాగం అధ్యక్షుడు కోరాడ లక్ష్మణరావు, నాయకులు మొకర అప్పలనాయుడు, తాలాడ పద్మనాభం, మామిడి శివ రామకృష్ణ, కోండ్రోతు శ్రీనివాసరావు, రామసింగు ముత్యాలనాయుడు, బాయి అప్పలస్వామి, బుగత శ్రీను పాల్గొన్నారు. -
స్టార్‌స్టార్ సూపర్ స్టార్ - పద్మనాభం
-
తిరుమల: గార్డుల దాడిలో గాయపడ్డ పద్మనాభం మృతి
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యురిటీ సిబ్బంది దాడిలో తీవ్రంగా గాయపడ్డ పద్మనాభం(52) కన్నుమూశారు. ఏలూరుకు చెందిన ఆయన.. గడిచిన మూడు నెలలుగా తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ.. ఆదివారం తుదిశ్వాస విడిచారు. మూడు నెలల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన పద్మనాభం పొరపాటున మహిళల క్యూలైన్లోకి రావడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపింది. తీవ్రంగా గాయపడ్డ ఆయనకు స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కాగా, వైద్యులు పట్టించుకోకపోవడం వల్లే తన తండ్రి చనిపోయారని పద్మనాభయ్య కుమారుడు రాము ఆరోపించారు. పద్మనాభం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉద్యోగిగా పనిచేసేవారు. -
కాపుజాతి ఆఖరి పోరు
-
'చంద్రబాబు కాకమ్మ కబుర్లు ఆపండి'
-
ఓ చెమ్మ చెక్క... ఓ మల్లె మొగ్గ
స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ దాకా ప్రేక్షకుడు అవే కళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు... మిస్టరీ ఈజ్ వెరీ గ్రిప్పింగ్... కానీ... ఈ సినిమా చూస్తే ఒక్కటే ప్రాబ్లం... నిద్ర పట్టదని అనుకుంటున్నారా? చీకటంటే భయమేస్తుందనుకుంటున్నారా? డోరు కిర్రుమన్నా, కిటికీ కటక్కుమన్నా పైప్రాణాలు హుష్‌కాకి అనుకుంటున్నారా? అందరి కళ్లల్లో ఒక హంతకుడు కనబడతాడేమో అనుకుంటున్నారా? అనుమానం పెనుభూతమై వెంటాడుతుందని అనుకుంటున్నారా? అబ్బే... అవేవీ కాదండీ.... సినిమా ఎంజాయ్ చేస్తారు... మరి వాటీస్ ద ప్రాబ్లెం? ‘నాకిక్కడే ఇప్పుడే తెలియాలి.’ ఓకే... ఓకే.... గడబిడ అంతా ఏంటంటే... కృష్ణగారిని చూసిన కళ్లతో మహేశ్‌బాబును చూస్తే అంత ముచ్చటగా అనిపించకపోవచ్చు. కావాలంటే కళ్లెట్టి చూడండి... మళ్లీ చూడండి. చిమ్మ చీకట్లో రెపరెపలాడుతున్న దీపంలా ఉంది ఆ బంగళా. ఆ బంగళాలో మిగిలి ఉన్న ప్రాణాలూ కొద్దిరోజులుగా రెప రెపలాడుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రాణం ఆరిపోతుందో తెలియదు. కానీ ఆరిపోక తప్పదని మాత్రం ఆ ఇంట్లోని ఒకరికి ఖాయంగా తెలుసు. ఆ ఒక్కరు కాంచన . కాంచనతో పాటు ఇంకో వ్యక్తికి కూడా... గాలిలో కలవబోయే ఆ ప్రాణాల గురించి తెలుసు. అతడెవరో కాదు, ఆ ఇంటి వాళ్లను ఒక్కొక్కరిగా మట్టుబెడుతున్న హంతకుడు! ఎవరా హంతకుడు? ఎందుకు ఈ హత్యలన్నీ చేస్తున్నాడు. అసలు అతడు ఇంట్లోని వాడా? ఇంటి బయటి వాడా? ఇంటికి వచ్చిపోతున్నవాడా? ఎవరికీ తెలీదు. మరి కాంచనకు ఎలా తెలిసింది? ఈ హత్యల్లో ఆ అమ్మాయి ప్రమేయం ఉందా? భాగస్వామ్యం ఉందా? లేదు. పాపం అసలా అమ్మాయికి ఏ పాపమూ తెలియదు. మద్రాసులో చదువుకుంటూ సెలవులకని ఫ్రెండ్స్ రేణుక, సాధన, విజయ, లక్ష్మిలను వెంటేసుకుని వచ్చింది. వచ్చీరాగానే పిన్నిని వితంతువుగా చూసి నిశ్చేష్టురాలవుతుంది. ఆమె భర్తను ఎవరో హత్య చేశారని తెలిసి చిగురుటాకులా వణికిపోతుంది. ఆ వణుకు అక్కడితో ఆగదు. సినిమా చివరి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. ఆ అజ్ఞాత హంతకుడు ఆమెకు ఫోన్ చేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నాడో చెబుతుంటాడు! సినిమాలోని డ్రామా అంతా ఈ ఫోన్ కాల్స్ మధ్యే సాగుతుంటుంది. మొదటి కాల్... ‘‘సుశీ... ఫోన్ పెట్టేస్తావా!.. కాస్త ఆగమ్మా. శుభవార్త చెబుతాను. అది విని పెట్టేద్దువుగానీ’’ ‘‘ఎవరు నువ్వు... ఎవరు నువ్వు...’’ ‘‘తొందరపడకమ్మా... సమయం వచ్చినప్పుడు తెలుస్తుందిలే నేనెవర్నో. నీ తండ్రి చూశాడు నన్ను... చావడానికి ఒక్క నిమిషం ముందు. నీ బాబాయీ అంతే. నన్ను చూశాకే కన్నుమూశాడు. ఈసారి మీ ఇంట్లో నన్ను చూసే అదృష్టం ఎవరిదో తెలుసా? హా హా హా... హా హా హా...’’ కాంచన భీతహరిణేక్షిణి అవుతుంది. ఏడాది క్రితం- తన తండ్రి కారు యాక్సిడెంట్లో పోలేదని, కారుకు యాక్సిడెంట్ చేసి ఆ హంతకుడే చంపేశాడని ఆమెకు అర్థమౌతుంది. అలాగే తన రెండో బాబాయి ఆత్మహత్య చేసుకోలేదని, అదే హంతకుడు ఆయన్ని హత్య చేసి, ఉరి వేశాడని తెలుసుకుంటుంది. తన బాయ్‌ఫ్రెండ్ కృష్ణ సహాయంతో అతడిని పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆలోపే ఆ హంతకుడు ఆ బాబాయి భార్యనూ చంపేస్తాడు! రెండో కాల్... ‘‘సుశీ... ఏదో అల్లరి పిల్లవులే అనుకున్నాను. చాలా గడుసుదానివి సుమా. నన్ను పట్టుకునే దాకా వచ్చిందా నీ సాహసం. అయితే ఇక నిన్ను విడువకూడదు. పోతావా మీ నాన్న దగ్గరికీ... ఊ! హా హా హా... హాహాహా...’’ గుండె చిక్కబట్టుకుంటుంది కాంచన. తన వారిలో ఎవరిని కాపాడుకోవాలో, ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతం అవుతున్న ఆ అమ్మాయి... హంతకుడు తనను కూడా టార్గెట్ చేశాడని తెలిసి మరింత భయపడిపోతుంది. ఓ రోజు కాంచన, ఆమె ఫ్రెండ్స్ ఇంట్లో ఒంటరిగా ఉంటారు. పెద్దవాళ్లెరూ ఉండరు. రాజనాల పొరుగూరు వెళ్తాడు. ఆయన తమ్ముడు ఊళ్లోనే ఏదో పని మీద వెళ్తాడు. అదే సమయానికి కాంచన కోసం ఇంటికి వస్తాడు కృష్ణ. అప్పుడు వస్తుంది హంతకుడి నుంచి మరో కాల్. మూడో కాల్... ‘‘సుశీ... నీ పెద్ద బాబాయి ఊళ్లోనే లేడు. నీ చిన్న బాబాయి బార్లో ఉన్నాడు. నువ్వు ఈ వేళ ఒంటరిగా ఉన్నావు. పోమ్మా, పోయి ఇష్టమైనవన్నీ తిని, తయారుగా ఉండు. నేను ఇప్పుడే వస్తున్నాను. ఇదే నీ ఆఖరు’’ అని హెచ్చరిస్తాడు హంతకుడు. ఆ రాత్రి కాంచనకు తోడుగా ఉంటాడు కృష్ణ. కానీ అందరి కన్నుకప్పి మరో హత్య చేస్తాడు ఆగంతకుడు. కాంచన రెండో బాబాయి హతుడౌతాడు. హంతకుడు కాపుగాసి మరీ, అతడు ఇంటికి రాగానే కత్తితో పొడిచి, పారిపోతాడు. కృష్ణకు అర్థమైపోతుంది. నెక్ట్స్ టార్గెట్ కాంచనేనని. ఇప్పుడేం చెయ్యాలి? హంతకుడిని ఎలా పట్టుకోవాలి? అప్పుడొస్తుంది మళ్లీ ఇంకొక కాల్. చివరి కాల్... ‘‘సుశీ... తప్పించుకు పోదామనుకున్నావా? ఎలాగైనా విజయం నాదే. ఇవాళ నీకు పెట్టిన గురి తప్పి, నీ బాబాయ్‌కి తగిలింది. హా హాహా...’’ కాంచన గజగజ వణికిపోతుంది. హంతకుడికి ఇంత పగేమిటి? ప్రతీకారం ఏమిటి? అన్నెంపున్నెం ఎరుగని వారందరినీ చంపడం ఏమిటి? ఈ మిస్టరీని ఛేదించే సమయం ఆసన్నమైందని అనుకుంటాడు కృష్ణ. అప్పటికి ఆ బంగళాలో ప్రాణాలతో మిగిలిన వారు రాజనాల, కాంచన మాత్రమే. మిగతావారు ఆ ఇంటివారు కాదు. ఆ ఇంటితో సంబంధం ఉన్నవారు. అప్పటికే రాజనాల పెద్దన్నయ్య, రెండో అన్నయ్య, ఆయన భార్య, రాజనాల తమ్ముడు... ఇలా వరుసగా ఒక్కొక్కర్నీ హంతకుడు చంపేసి ఉంటాడు. ఆ హంతకుడెవరన్నది సస్సెన్స్? ఆ హంతకుడిని అందరికన్న ముందు... కృష్ణ చూస్తాడు! వాడితో పోరాడుతూ.. చురకత్తి పదునున్న, పగతో రగులుతున్న, ప్రతీకారంతో జ్వలిస్తున్న ఆ కళ్లను చాలా దగ్గరగా చూస్తాడు. ఇంతకీ ఆ కళ్లెవరివి? అనేక రహస్యాలు రెండోప్రాణికి తెలియనివ్వని రాజనాలవా? హత్య జరిగిన ప్రతిసారీ అక్కడే ఉంటున్న డాక్టర్ నాగభూషణానివా? తోడబుట్టకపోయినా, సొంత సోదరునిలా మెలిగే రామయ్య తాతవా? కర్కశత్వం మూర్తీభవించిన డ్రైవరువా? ఎప్పుడూ చేత్తో కత్తి పట్టుకుని తిరిగే వంటవాడు రమణారెడ్డివా? కాంచనను ప్రేమించి, ఆ బతుకులో భాగస్వామి కాగోరే కృష్ణవా? లేక... హత్య జరగ్గానే పారిపోయి కనుమరుగయ్యే అజ్ఞాత యువతివా? వీరందరిలో ఆ ‘కళ్లు’ ఎవరివి? క్లైమాక్స్ ఆ కళ్లు ఎవరివో కాంచన పుట్టినరోజు నాడు బయట పడుతుంది. ఓ ఆగంతకుడు బాల్కనీలోకి చొరబడి, హాల్లో కేక్ కట్ చేయబోతున్న కాంచనకు గురిపెట్టి తుపాకీ పేల్చుతాడు. అది మిస్ అవుతుంది. అంతా ఆగంతకుడిని వెంబడిస్తారు. అతడు బంగళా బయటికి పరుగెత్తి అదృశ్యమైపోతాడు. ఈలోపు పొదల్లోంచి రామయ్య తాత మూలుగులు వినిపిస్తుంటాయి. ‘‘ఏమైంది తాతా?’’ అని అనడిగితే ఎవరో తనను తలపై బలంగా కొట్టి అటుగా పారిపోయాడని చెబుతాడు. ఈలోపు ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి చేరుకుంటాడు. కుటుంబ సభ్యులంతా ఒకచోటికి చేరుకుంటారు. ఎందుకా ఆగంతకుడు ఇలా వరస హత్యలకు పాల్పడుతున్నాడని ఆలోచనలో పడతారు. ఎవరైనా శత్రువులున్నారా అని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు రాజనాల ఓ భయంకరమైన నిజాన్ని బయటపెడతాడు. తన తండ్రికి వేరే స్త్రీతో సంబంధం ఉందని, ఆవిడకు ఒక కొడుకు కూడా ఉన్నాడని, పెద్దన్నయ్యకు అది ఇష్టం లేక తల్లీకొడుకులు ఇంట్లో ఉండగా ఆ ఇంటికి పెద్దన్నయ్య నిప్పు పెట్టాడని చెబుతాడు. తండ్రి మరణించినప్పుడు ఆ కుర్రాడి వయసు 10 సంవత్సరాలు. తండ్రి మరణించి పదిహేను సంవత్సరాలయ్యింది. అంటే ఆ వ్యక్తికి ఇప్పుడు పాతిక సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తి బతికి ఉండి (మంటల్లోంచి తప్పించుకుని) పగబట్టి ఉండవచ్చునని అనుకుంటారు. ఈలోగా... పగబట్టిన ఆ కళ్లను నేను చూశాను అంటాడు కృష్ణ. ఆ కళ్లను మళ్లీ ఒక్కసారి చూసినా గుర్తుపడతానంటాడు. ఒక్కొక్కరికి ముసుగు వేస్తూ కళ్లను పోల్చుకుంటూ ఉంటాడు. చివరికి రామయ్య తాత కళ్లు చూడగానే అవే కళ్లని గుర్తు పడతాడు. తన తల్లి మంటల్లో కాలిపోవడం చూసి ప్రతీకారంగా ఈ కుటుంబాన్ని సమూలంగా నాశనం చేస్తానని తల్లికి ప్రమాణం చేశాననీ, ఒక్కొక్కరిగా చంపాననీ, ఇంకా ఇద్దరే మిగిలి ఉన్నారని, ఒకటి రాజనాల, మరొకరు కాంచన అని చెబుతాడు రామయ్య తాత వేషంలో ఉన్న యువకుడు. ఆ తర్వాత ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోతుండగా గుమ్మడి వచ్చి రివాల్వర్‌తో కాల్చేస్తాడు. కృష్ణ సిఐడిగా వచ్చాడని గుమ్మడి చెప్తాడు. కథలో క్రైమ్, సస్సెన్స్ మాత్రమే కాదు, ఎమోషన్ కూడా ఉంది. అది సినిమా మొత్తంలో ఒకే ఒక్కసారి కనిపిస్తుంది. రామయ్య తాత వీణ వాయిస్తూ ఉండగా కాంచన, ఆమె ఫ్రెండ్స్ రాగానే వీణను పక్కన పెడుతూ ‘అమ్మా’ అంటూ అమ్మని తలచుకుంటాడు. లాస్ట్ సీన్లో అతడు ఇన్స్పెక్టర్ తుపాకీ తూటాకు నేల కూలి వీణపై పడ్డప్పుడు ఆ దృశ్యం ఎంతో హృద్యంగా ఉంటుంది. అమ్మ జ్ఞాపకాలను వదల్లేక, అమ్మలోనే ఐక్యమైన ఆ హంతకుడిని తలచుకుంటే అతడెంత హంతకుడైనా సరే జాలేస్తుంది. - సాక్షి ఫ్యామిలీ ► రాజనాల, వెన్నిరాడై నిర్మల మీద ‘చెలిని చెంతకు పిలుచుకో’ పాటను చిత్రీకరించారు. సముద్రపు ఒడ్డున చిత్రీకరించిన ఈ పాటలో వెన్నిరాడై నిర్మల స్విమ్‌సూట్‌లో కనిపిస్తారు. ► కృష్ణ నటించిన తొలి హారర్, సస్పెన్స్ మూవీ. ► ఫస్ట్ రన్లో సినిమా పెద్దగా అనిపించలేదు. క్రమక్రమంగా ఊపు అందుకుంది. ► పాటలన్నీ సూపర్ హిట్. ‘మా ఊళ్లో ఒక పడుచుంది. దయ్యమంటే భలే భయమన్నది’ అనేపాటైతే సూపర్ డూపర్ హిట్. ► కాంచన డాన్స్, కృష్ణ అందం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్. ► పద్మనాభం, గీతాంజలి మధ్య కామెడీని దర్శకుడు సందర్భోచితంగా పండించారు. గీతాంజలి తల్లిగా కనకం చేశారు. ► సంసారం చదరంగం లాంటి చిత్రాలు చేసిన ఎస్.పి.ముత్తురామన్ ఈ చిత్రానికి అసిస్టెంట్ డెరైక్టర్. ► కాంచన పక్కన డాన్స్ చెయ్యడానికి కృష్ణ తడబడ్డాడట. ఆ తడబాటు కనిపించకుండా కాంచన ఆయన్ని కలుపుకునిపోయారట. ► అద్దె ఇల్లు కోసం కృష్ణ, పద్మనాభం భార్యాభర్తల్లా నటిస్తారు. పద్మనాభం ‘రోసీ’గా ఆడవేషంలో కనిపిస్తారు. ► హీరోగా కృష్ణకిది 10వ చిత్రం. (మొత్తం 350కి పైగా చిత్రాలలో నటించారు). ►ప్రతి పాత్ర మీదా ఓ అనుమానం క్రియేట్ చేస్తూ దర్శకుడు చూపిన ప్రతిభ భేష్ అనదగ్గది. -
క్రికెట్ బాల్ కోసం పోయి.. ప్రాణాలొదిలారు
-
క్రికెట్ బాల్ కోసం పోయి.. ప్రాణాలొదిలారు
విశాఖపట్నం(పద్మనాభం): పద్మనాభం మండలం నర్సాపురం గ్రామంలో నలుగురు విద్యార్ధులు ఆదివారం మృతిచెందారు. వివరాలు.. గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు ఊరి పక్కన చెరువు వద్ద క్రికెట్ ఆడటానికి వెళ్లారు. క్రికెట్ ఆడుతుండగా ఓ విద్యార్థి కొట్టిన బాల్ చెరువులో పడింది. బాల్‌ను తీయటానికి చెరువులోకి దిగిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు. ఒకరిని రక్షించటానికి ప్రయత్నించి ఒకరి వెంట మరొకరు చెరువులోకి దిగి మృతిచెందారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన సారిక వినయ్(14), పొలగాని కల్యాణ్(15), పొలగాని మోహన్(13), సింహాచలం(13) అనే విద్యార్థులు చెరువులో మునిగిపోయి మృతిచెందారు. మృతదేహాలను చెరువు నుండి బయటికి తీశారు. విద్యార్థుల మృతి గ్రామంలో విషాదం వాతావరణం నెలకొంది. -
ఆల్‌రౌండర్ గురూ..!
రేలంగిని చూస్తే చాలు... పొట్ట చెక్కలే! కస్తూరి శివరావు, రమణారెడ్డి, బాలకృష్ణ, చదలవాడ, రాజబాబులాంటి వాళ్లను చూస్తే కూడా పెదవులపై నవ్వుల వరదలే! అవును మరి... వాళ్ల ఫేస్‌లు, బాడీ లాంగ్వేజ్ల మాన్యుపాక్చరింగ్లోనే చిన్న కామెడీ టింజ్ ఉంది. మరి పద్మనాభం ఫేస్ చూస్తేనేమో... చాలా నార్మల్. ఇక కామెడీ ఎలా పుడుతుంది? కానీ పుట్టించాడాయన. తన పాత్రలతోనే తెగ కామెడీ సృష్టించాడు. కామెడీకే ‘గురూ’ అయిపోయాడు. ‘పాతాళ భైరవి’తో ‘గురూ’ ఊతపదాన్ని తెలుగునాట తెగ పాపులర్ చేసింది ఇతగాడేగా! పద్మనాభం హాస్యంలో సామాన్యుడి గుండెచప్పుడు వినబడుతుంది. అందుకే మాస్ అంతా ఆయనతో తెగ కనెక్టయిపోయారు. ఇది మామూలు కనెక్టివిటీ కాదు. ఓ 15-20 ఏళ్లు పద్మనాభందే హవా! ప్రేక్షకులు ఆయన నవ్వినా నవ్వారు. ఏడ్చినా నవ్వారు. కూర్చున్నా నవ్వారు. నిలబడ్డా నవ్వారు. కమెడియన్‌గా ఓ రాజభోగం అనుభవించాడాయన. అదో పెద్ద హిస్టరీ. కానీ ఆయన్ను కేవలం కమెడియన్ యాంగిల్లోనే చూడాలంటారా?! ఎందుకంటే - ఆయనలో కథానాయకుడున్నాడు. గాయకుడున్నాడు. నిర్మాత ఉన్నాడు. దర్శకుడున్నాడు. వీటన్నింటినీ మించి గొప్ప రంగస్థల కళాకారుడున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే... పద్మనాభం ఆల్‌రౌండర్. రంగస్థలంపై అదుర్స్!: పద్మనాభం అనబడే బసవరాజు వెంకట పద్మనాభరావుది కడప జిల్లా సింహాద్రిపురం. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా చిన్నప్పటినుంచీ పద్మనాభం అనుకరణలో దిట్ట. పద్యాలు పాడటంలో మేటి. తన ఆరో ఏటే ‘చింతామణి’ నాటకంలో బాలకృష్ణుడిగా చేసి అదరగొట్టాడు. అప్పటి నుంచి లాస్ట్ స్టేజ్ వరకూ స్టేజ్ మీద 2500 పై చిలుకు నాటకాల్లో నటించాడు. ‘చింతామణి’ నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర చేయడంలో అప్పట్లో పద్మనాభం ఫేమస్. కొంచెం ట్రై చేసుంటే: పద్మనాభంది హీరో మెటీరియల్ కాకపోయినా, అంత తీసిపారేయదగ వాడేం కాదు. అందుకేనేమో ప్రసిద్ధ దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం ‘‘నిన్ను హీరోని చేస్తా’’నని ప్రామిస్ చేశారు. కానీ అది జరగలేదు. వాళ్లనీ వీళ్లనీ అనుకరిస్తూ కవ్విస్తూ నవ్విస్తూ ఉండే పద్మనాభంలో అందరికీ కమెడియన్నే కనిపించాడు. ఆయన ఏమాత్రం కొంచెం ట్రై చేసినా హీరో అయ్యేవాడేమో! ఆర్టిస్టుగా ఓ స్థాయికెదిగాక, నిర్మాత అయ్యాక పద్మనాభం హీరోగా కొన్ని సినిమాలు చేశారు. కొన్ని కొన్ని సినిమాలు ఆయనకు టైలర్ మేడ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్... ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’. లక్షల్లోనుంచి వేలల్లోకి: సినిమా తీయడం ఇప్పుడెంత కష్టమో, ఆ రోజుల్లోనూ అంతే కష్టం. పద్మనాభం బాగా సంపాదించాడు. కమెడియన్‌గా స్టార్ రేంజ్. కానీ ఏదో అసంతృప్తి. తన మనసుకి నచ్చే సినిమాలు తీయాలి. అలా పుట్టిందే ‘రేఖ అండ్ మురళి ప్రొడక్షన్స్’. ఫస్ట్ సినిమా ‘దేవత’. ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్ ఫలితం. సూపర్‌హిట్. ఆ తర్వాత పద్మనాభం తొమ్మిది సినిమాలు తీశారు. అన్నీ కంటెంట్ ఓరియెంటెడే. సక్సెస్, ఫెయిల్యూర్ పక్కన పెడితే ఒక్కదాన్ని మించి ఒకటి. కానీ ఫెయిల్యూర్‌కి దాహమెక్కువ. డబ్బులు తాగుతూనే ఉంటుంది. అందుకేనేమో లక్షలు సంపాదించుకున్నవాడు కాస్తా వేలల్లోకి దిగిపోయారు. కానీ నిర్మాతగా కీర్తి మాత్రం మిగిలింది. ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’తో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని ఈ ప్రపంచానికి గాయకునిగా పరిచయం చేసిన ఘనత ఒక్కటి చాలదూ! అనుకోకుండా డెరైక్షన్: కమెడియన్ అవుతానని పద్మనాభం ఎప్పుడు కల కూడా కనలేదట. డైరక్షన్ కూడా అంతే. అంతా యాదృచ్ఛికమే. ‘శ్రీరామ కథ’ సినిమా తీద్దామనుకుని స్క్రిప్ట్ చేసుకున్నారు. అప్పటికి డెరైక్టర్‌గా ఎవర్నీ అనుకోలేదు. ఫైనల్‌గా తానే చేద్దామని డిసైడయ్యారు. ఆ తర్వాత ‘ఆజన్మ బ్రహ్మచారి’, ‘జాతకరత్న మిడతం భొట్లు’, ‘గుండా జోయిస’ (కన్నడం), ‘మాంగల్య భాగ్యం’, ‘పెళ్లి కాని తండ్రి’ ‘కథానాయిక మొల్ల’, ‘మా ఇంటి దేవత’ సినిమాలు డెరైక్ట్ చేశారు. పద్మనాభం తీసిన సినిమాల్లో పాటలూ బాగుంటాయి. ప్రయోగాలు బాగుంటాయి. ‘కథానాయిక మొల్ల’లో ఎల్లారీశ్వరితో తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో పదకొండున్నర నిమిషాల పాట పాడించారు. ‘మాంగల్య భాగ్యం’లో భానుమతితో ఇంగ్లీషు పాట పాడించారు. సూపర్‌స్టార్ కృష్ణకు ప్లేబ్యాక్: పద్మనాభంలో మంచి సింగర్ కూడా ఉన్నాడు. తొలినాళ్లలో బృందగానాల్లో పాలు పంచుకున్న అనుభవం ఉందాయనకు. సినిమా ఫీల్డ్‌లో ఆయన కెరీర్ కోరస్ సింగర్‌గానే మొదలైంది కూడా. నటి కన్నాంబ నిర్మించిన ‘పాదుకా పట్టాభిషేకం’లో ‘పడవెళ్లి పోతోంది...’ పాటలో ‘హైలేసా హైలేసా’ అంటూ కోరస్ పాడారు. ‘దేవత’లో ఆయన పాడిన ‘మావూరు మదరాసు నా పేరు రాందాసు’ పాట అయితే ఎవర్గ్రీన్ హిట్. ‘తేనె మనసులు’ కోసం సూపర్‌స్టార్ కృష్ణకు ‘వన్ టూ త్రీ’ పాటలో ప్లేబ్యాక్ కూడా పాడారు. 1995లో హెచ్.ఎం.వి. సంస్థ అయితే పద్మనాభం పాడిన ‘సుందరకాండ’ హరికథా రూపాన్ని ప్రైవేట్ ఆడియోగా విడుదల చేసింది. - పులగం చిన్నారాయణ -
'వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టండి'
విశాఖ : ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారని విశాఖ వైఎస్ఆర్ సీపీ లోక్‌సభ అభ్యర్థి వైఎస్ విజయమ్మ కొనియాడారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందించిన ఘనత వైఎస్ఆర్దేనని ఆమె అన్నారు. విశాఖ జిల్లా పద్మనాభంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన విజయమ్మ ...... రాబోయే ఎన్నికల్లో సంక్షేమం కోసం పాటుపడే వైఎస్ఆర్ సీపీకి పట్టం కట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మూతపడిన చిట్టివలస జూట్ మిల్లు సమస్యను పరిష్కరిస్తామని విజయమ్మ పద్మనాభం బహిరంగ సభలో హామీ ఇచ్చారు. మత్య్సకారులకు వేట నిషేధ కాలంలో మూడువేలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. చేపల వేటకు వెళ్లే మరపడవల డీజిల్ సబ్సిడీ రూ.6నుంచి రూ.10కి పెంచుతామన్నారు. వ్యవసాయ రైతులకు ఆనందపురంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని, భీమిలిని అందమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న భీమిలి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా నడిపిస్తామని విజయమ్మ తెలిపారు.