తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యురిటీ సిబ్బంది దాడిలో తీవ్రంగా గాయపడ్డ పద్మనాభం(52) కన్నుమూశారు.
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యురిటీ సిబ్బంది దాడిలో తీవ్రంగా గాయపడ్డ పద్మనాభం(52) కన్నుమూశారు. ఏలూరుకు చెందిన ఆయన.. గడిచిన మూడు నెలలుగా తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ.. ఆదివారం తుదిశ్వాస విడిచారు.
మూడు నెలల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన పద్మనాభం పొరపాటున మహిళల క్యూలైన్లోకి రావడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం రేపింది. తీవ్రంగా గాయపడ్డ ఆయనకు స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కాగా, వైద్యులు పట్టించుకోకపోవడం వల్లే తన తండ్రి చనిపోయారని పద్మనాభయ్య కుమారుడు రాము ఆరోపించారు. పద్మనాభం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉద్యోగిగా పనిచేసేవారు.